Priyanka : కొంతమంది నటీనటులకు వచ్చిరావడంతోనే స్టార్ హీరోల సరసన ఆఫర్లు వరించినప్పటికీ కెరియర్ లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోతుంటారు. అలాగే అందం, అభినయం, నటన ప్రతిభ వంటివి మెండుగా ఉన్న నటీమణులు కూడా హీరోయిన్ గా ఛాన్సులు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భాలు కూడా లేకపోలేదు.
అయితే నటి కావాలని సినిమా ఇండస్ట్రీకి వచ్చి షార్ట్ ఫిలిమ్స్ లో నటించి ప్రతిభను నిరూపించుకొని వెండి తెరపై కూడా ఆఫర్లు దక్కించుకున్న నటీనటులలో అనంతపురం బ్యూటీ ప్రియాంక జవాల్కర్ ఒకరు. కాగా ఈ అమ్మడు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో షార్ట్ ఫిలిమ్స్ మరియు వెబ్ సిరీస్ లలో నటించింది. ఆ తర్వాత ఏకంగా టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన టాక్సీవాలా చిత్రంలో హీరోయిన్ గా నటించే ఆఫర్ ని కొట్టేసింది. అయితే దురదృష్టవశాత్తు ఈ చిత్రం విడుదలలో కొంతమేర జాప్యం జరగడంతో ఈ బ్యూటీ కి పెద్దగా కలిసి రాలేదని చెప్పవచ్చు.
కానీ ఇండస్ట్రీలో మాత్రం ఈ అమ్మడికంటూ నటన పరంగా ఒక గుర్తింపు లభించింది. అయితే టాక్సీవాలా నటించిన తర్వాత ప్రియాంక జవాల్కర్ తన తదుపరి చిత్ర కథల విషయంలో కూడా సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో ఈ బ్యూటీకి మళ్లీ తిమ్మరుసు చిత్రంతో డిజాస్టర్ వరించింది. కానీ అదృష్టవశాత్తూ అప్పటికే టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఎస్ఆర్ కళ్యాణమండపం చిత్రంలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఉండటం, అలాగే ఈ చిత్రం ఇటు మ్యూజికల్ గా మరియు అటు స్టోరీపరంగా కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకోవడంతో ఈ బ్యూటీ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కింది. అయితే తాజాగా ఈ అమ్మడు మళ్లీ ఈ ఏడాదిలో నటించిన గమనం అనే చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈ బ్యూటీ కి సినిమా ఆఫర్లు కరువైనట్లు సమాచారం.
దాంతో ప్రియాంక జవాల్కర్ కాస్త ఈమధ్య సినిమా ఆఫర్ల కోసం అందాల ఆరబోతున్న నమ్ముకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మధ్యకాలంలో ఈ యంగ్ బ్యూటీ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలను ఒకసారి పరిశీలించినట్లయితే అందాల ఆరబోత స్పష్టంగా తెలుస్తోంది. కాగా తాజాగా ఈ అమ్మడు క్లీవేజ్ షో, స్కిన్ షో చేస్తూ దిగినటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
దీంతో ఒక్కసారిగా ఈ అమ్మడి అందాల ఆరబోతకి నెటిజన్లు ఫీదా అయ్యారు. అలాగే ప్రియాంక జవాల్కర్ కి అందం, అభినయం నటన ప్రతిభ వంటివి మెండుగా ఉన్నాయని కానీ తన ప్రతిభను నిరూపించుకోవడానికి సరైన ఆఫర్ తగలకపోవడం, అలాగే స్టార్ హీరోల చిత్రాలలో నటించే ఆఫర్లు రాకపోవడంతో ఈ బ్యూటీ గుర్తింపుకు నోచుకోలేకపోతుందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. కానీ సరైన హిట్ పడితే మాత్రం ఈ అమ్మడికి ఇండస్ట్రీలో మంచి ఫ్యూచర్ ఉందని మరికొందరు అంటున్నారు.