Laya: ఈమధ్య సోషల్ మీడియా మాధ్యమాలు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండటంతో ఎలాంటి విషయమైనా ఇట్టే తెలిసిపోతుంది. అలాగే ఈ సోషల్ మీడియా మాధ్యమాలలో వైరల్ అయిన వారికి మంచి ఉపాధి అవకాశాలు కూడా ఉంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో యూట్యూబ్ ఛానల్స్ పుణ్యమా అని పాదతరం నటిమనులు అలాగే పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయినటువంటి చాలామంది హీరోయిన్లు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే తెలుగులో దాదాపుగా 50 కి పైగా చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటించి ప్రేక్షకులను బాగానే అలరించిన తెలుగు బ్యూటిఫుల్ హీరోయిన్ లయ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే నటి లయ పెళ్లయిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైపోయింది. ఈ క్రమంలో కుటుంబ బాధ్యతలు మీద పడటం, అలాగే సంతానం కలగడం వంటివాటి కారణంగా ఇండస్ట్రీకి సమయం కేటాయించలేకపోయింది. కానీ ఇప్పుడు పిల్లల పెద్ద వాళ్ళు అవ్వడం అలాగే కుటుంబ బాధ్యతలు చక్కబడటంతో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కాగా తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది.
తన పాత్రకి ప్రాధాన్యత ఉన్నటువంటి అవకాశం వస్తే కచ్చితంగా సినిమాలు నటిస్తానని తెలిపింది. అలాగే తన గురించి నెట్ ఇంట్లో వినిపిస్తున్న పను రూమర్ల గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇందులో భాగంగా ముఖేష్ అంబానీ తనకు బంధువు అవుతాడని అలాగే తనకు వేల కోట్ల రూపాయల ఆస్తిపాస్తులతోపాటు సొంతంగా విమానం, ఖరీదైన బంగళాలో వంటివి ఉన్నాయని ప్రచారాలు జరుగుతున్నాయని అందులో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది. అలాగే తాను ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పుడు టాలీవుడ్ ప్రముఖ హీరో మెగాస్టార్ చిరంజీవి తనకు ఆర్థికంగా సహాయం చేశాడని వినిపించిన వార్తలను కూడా కొట్టి పారేసింది.
తన కుటుంబ సభ్యులు ధనికులు కాకపోయినప్పటికీ తమకు ఉన్నంతలో బాగానే బ్రతుకుతున్నామని, అలాగే తన భర్త కూడా ఇతర దేశాలలో దాదాపుగా మూడు హాస్పిటల్స్ నిర్వహిస్తున్నాడని తెలిపింది. ఇక ఇండస్ట్రీలో కొంతమంది దర్శక నిర్మాతలు తనకి ఇవ్వాల్సినటువంటి రెమ్యూనరేషన్ కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టారని సంచలన వ్యాఖ్యలు చేసింది కానీ తనకు ఇవ్వకుండా వేధించినటువంటి దర్శక నిర్మాతల పేర్లు మాత్రం బయట పెట్టలేదు.