Jr NTR: ఎన్టీఆర్ హనుమాన్ దీక్ష వెనుక బలమైన రహస్యం… సోషల్ మీడియాలో ప్రచారం?

Akashavani

Jr NTR: సాధారణంగా సినిమా సెలబ్రిటీల గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవడం సర్వసాధారణం. అయితే ఇవన్నీ కేవలం చూసి చూడనట్టుగా సెలబ్రిటీలు వ్యవహరిస్తుంటారు. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లోకి వచ్చి చాలా సంవత్సరాలు అయింది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా కొత్తగా హనుమాన్ దీక్ష చేస్తున్నారు.ఇలా ఎన్టీఆర్ హనుమాన్ దీక్ష చేయడంతో ఈయన ఉన్నఫలంగా హనుమాన్ దీక్ష వేయటానికి కారణం ఏమిటి అంటూ పెద్దఎత్తున ఈ దీక్ష గురించి ఆరా తీస్తున్నారు.

ఈ క్రమంలోని సోషల్ మీడియా వేదికగా ఈ దీక్షకు సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ జాతకంలో ఉన్న దోషం కారణంగానే ఈ దీక్ష చేస్తున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు సృష్టిస్తున్నారు. తన జాతకంలో దోషం తొలగి పోవడానికి ఎన్టీఆర్ త్వరలోనే హోమం కూడా చేయనున్నట్లు ఆయన సన్నిహితుల నుంచి సమాచార అనే వార్తలు షికార్లు చేస్తున్నాయి. అయితే ఎన్టీఆర్ జాతకంలో ఏ విధమైనటువంటి దోషం ఉందనే విషయం గురించి కూడా పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

Jr NTR: ఆ సెంటిమెంట్ బ్రేక్ అవుతుంది…

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో రాజమౌళితో సినిమా చేస్తే ఆ హీరోకి తర్వాత సినిమా ఫ్లాప్ అవుతుందనే సెంటిమెంట్ ఉంది. ఈ క్రమంలోనే ఈ సెంటిమెంట్ తోఎన్టీఆర్ తన తర్వాత సినిమా ఫ్లాప్ కాకుండా ఉండటం కోసం ఆ దోషం తొలగిపోవడానికి హనుమాన్ దీక్ష తీసుకున్నారని పెద్ద ఎత్తున వార్తలు కల్పించారు. ఈ క్రమంలోనే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన RRR సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో రామ్ చరణ్ తదుపరి చిత్రం ఆచార్య సినిమా విజయంపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి ఇలాంటివన్నీ తాను నమ్మనని కచ్చితంగా చరణ్ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తాడు అంటూ ధీమా వ్యక్తం చేశారు. మొత్తానికి ఎన్టీఆర్ ఈ విధంగా హనుమాన్ దీక్ష తీసుకోవడంతో పెద్దఎత్తున ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ విషయంపై ఎన్టీఆర్ స్పందన ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది. 21 రోజుల పాటు ఎన్టీఆర్ తీసుకున్న ఈ దీక్షను ఎంతో నిష్టగా భక్తిశ్రద్ధలతో చేస్తున్నారు.

- Advertisement -