Tollywood: ఈ మధ్యకాలంలో షాపింగ్ మాల్ ఓపెనింగ్ లకు అలాగే ప్రతి ఈవెంట్లకు స్టార్ హీరోయిన్లను ఆహ్వానించడం జరుగుతుంది. అలా వచ్చిన హీరోయిన్ ల మీద అభిమానులు విపరీతంగా మీద మీద పడిపోతుంటారు. తమ అభిమానాన్ని చాలా దారుణంగా తెలుపుకుంటూ ఉంటారు. మీద పడి వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు కొంతమంది అభిమానులు.
అయితే హీరోయిన్లను కొంతమంది వ్యాపారవేత్తలు వారిని అడ్వర్టైజ్మెంట్ కోసం అలాగే ప్రమోషన్ కోసం పిలుస్తూ ఉంటారు. సొంతంగా అడ్వర్టైజ్మెంట్ లు చేస్తే పని కాదని పెద్దపెద్ద హీరోయిన్లను ట్రెండింగ్ లో ఉన్న హీరోయిన్లను పిలిపించి వాళ్లతో అడ్వర్టైజ్మెంట్ చేయించి వాళ్ళ వ్యాపారాన్ని ముందుకు కొనసాగిస్తుంటారు కొంతమంది వ్యాపారస్తులు.
అలాగే ఈవెంట్లలో సినిమా ప్రమోషన్స్లలో హీరోయిన్స్ కు ఇలాంటి కష్టాలు ఎదురొస్తూనే ఉంటాయి. ఏ వేదికైనా ఏ ఓపెనింగ్ అయినా వాళ్ళు వెళ్ళక తప్పదు. అలాగే అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎదుర్కొనే కష్టాలు వాళ్ళు తీసుకునే టెన్షన్, ప్రెషర్ చాలానే ఉంటుంది. అయితే ఇటీవల సమంత ఓ సినిమా ప్రమోషన్స్ కై వచ్చిన సందర్భంగా.. ఆమెను చూడ్డానికని అభిమానులు తరలివచ్చారు.
Tollywood: హీరోయిన్ లను ఇబ్బంది పెడుతున్న అభిమానం..
ఆ సమయంలో సమంత కారు దిగగానే ఆమె మీదకు పడిపోయారు. కానీ సమంత చెప్పాలంటే ధైర్యవంతురాలు. అలాగే ఆమెకి ఇలాంటివన్నీ ఎన్నోసార్లు ఎదురొచ్చింటాయి కాబట్టి ఆమె పెద్దగా పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్ సినిమా ప్రమోషన్స్ కోసం సాయి పల్లవి వస్తుండగా కారు దిగిన వెంటనే తమ అభిమానులు తనకు ఒక గిఫ్ట్ ఇవ్వడానికి దగ్గరకు వచ్చారు.
దీంతో అందరూ అరుపులు కేకలు చేస్తూ ఆమె మీదకు వస్తుండగా సాయి పల్లవి ఏకంగా ఏడ్చేసింది. భయపడి అక్కడి నుంచి త్వరగా నన్ను తీసుకెళ్ళమని తన బాడీగార్డ్ ని కోరింది. ఆ తర్వాత రష్మిక ఓ ఈవెంట్ కోసం వస్తుండగా ఇలాగే ఆమె మీద పడిపోయారు. ఈమె అంతగా పట్టించుకోకపోయినా కాస్త భయభ్రాంతులైంది. ఇలా పిలిచి హీరోయిన్ లను భయ పెట్టేస్తుంటారు కొందరు అభిమానులు.