Vadde Naveen: ప్రముఖ నటుడు వడ్డే నవీన్ అంటే తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమున నటుడు. నిర్మాత వడ్డే రమేష్ గారి తనయుడు నవీన్. కోరుకున్న ప్రియుడు సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేశాడు ఆ సినిమాలు అంతగా విజయం సాధించకపోవడం వల్ల ఇతనికి పెద్దగా గుర్తింపు రాలేదు.
అంత గొప్ప నిర్మాత కొడుకు అయిన ఇతడు సిని ఫ్యూచర్ ని నిలబెట్టుకోలేకపోయాడు ఆ తర్వాత పెళ్లి, ఓ ప్రియా ప్రియా, చాలా బాగుంది లాంటి సినిమాలు
చేసి కాస్త విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత 2010లో శ్రీమతి కళ్యాణం సినిమా లో నటించాడు. ఈ సినిమా దారుణంగా ఫ్లాప్ అయింది. ఇక అప్పటితో ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు వడ్డే నవీన్.
ఆ తర్వాత నుంచి ఎప్పుడు సినిమాలలో గాని ఇండస్ట్రీలో గాని కనిపించలేదు. దీంతో చాలా వరకు ప్రేక్షకులు అతన్ని మర్చిపోయారు. ఇటీవలే రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన అటాక్ సినిమాలో విలన్ గా రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాతో కూడా విఫలం అవ్వగా.. ఇక పూర్తిగా సినిమాలే వద్దనుకున్నాడు. నవీన్ సినిమా కెరీర్ ఇలా పడిపోవడానికి కారణాలు వేరే ఉన్నాయని చాలామంది అనుకుంటున్నారు. అవేంటంటే..
Vadde Naveen: నవీన్ సినీ కెరీర్ పడిపోవడానికి కారణాలు ఇవే..
నవీన్ తీరు సరిగా ఉండేది కాదట. తన వ్యవహార శైలి అందరికీ వ్యతిరేకంగా ఉండేదట. అతని భార్య మరెవరో కాదు సీనియర్ ఎన్టీఆర్ పెద్ద కొడుకు కూతురు. వివాహం తర్వాత నందమూరి ఫ్యామిలీ తమ కూతురును బానే చూసుకుంటాడనే ఉద్దేశంతో అల్లుడుగా స్వీకరించారు. అయినప్పటికీ ఆ నమ్మకాన్ని నవీన్ నిలబెట్టుకోలేకపోయాడు.
నవీన్ వ్యవహారశాలితో వాళ్ళిద్దరి మధ్య వివాదాలు వచ్చాయి. దీంతో మళ్లిద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత సినిమాల్లో కూడా నవీన్ వ్యవహార వ్యవహార శైలిపై మేకర్స్ నిర్మాతలు కూడా సినిమా తీయడానికి దగ్గరకొచ్చే వాళ్ళు కాదు. ఈ కారణాలవల్లే నవీన్ సినీ కెరీర్ పడిపోయిందని అందరూ అనుకుంటున్నారు.