Vaishnav Tej: మెగా హీరోల కు ముద్దుల మేనల్లుడు అయిన వైష్ణవ్ తేజ్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఉప్పెన సినిమాతో హీరో గా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యాడు. మొదటి సినిమా తోనే బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్నాడు. దీంతో అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరో గా మారాడు. మొదటి సినిమాతో నే మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు.
అయితే చిన్నతనం లోనే ఇతడు సినిమా లలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాడు. మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా లో ఒక పిల్లవాడి పాత్రను చేశాడు. మెగాస్టార్ చిరంజీవి కి పవన్ కళ్యాణ్ కి తమ మేనల్లుడు అంటే చాలా ఇష్టం. కానీ ప్రస్తుతం అదే మామయ్య సినిమా ఈ మేనల్లుడు కి నష్టం కలిగిస్తుందని అందరూ అనుకుంటున్నారు.
అయితే విషయం ఏంటి అంటే.. సెప్టెంబర్ 2 న జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆయన పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 1 న ఆయన నటించిన సూపర్ హిట్ సినిమా జల్సా ను ప్రతి షో లో ప్రతి థియేటర్ లలో వేయనున్నారు. అయితే పవన్ ఫ్యాన్స్ ఇప్పటి నుంచే సినిమా కు బుకింగ్స్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే సెప్టెంబర్ 2 న వైష్ణవ్ తేజ్ నటించిన సినిమా రంగ రంగ వైభవంగా కూడా అదే రోజు రిలీజ్ చేయనున్నారు.
Vaishnav Tej: మామయ్య పుట్టినరోజున మేనల్లుడికి పరీక్ష..
అయితే ముందు రోజు సినిమా థియేటర్ లలో జల్సా సినిమా చూసిన ఫ్యాన్స్ మరుసటి రోజు ఈ సినిమా మీద ఫోకస్ చేస్తారా? అని జనాలు అనుకుంటున్నారు. పవన్ బర్త్ డే సెలబ్రేషన్ లో ఉండి ఈ సినిమా మీద దృష్టి పెడతారో లేదో చూడాలి. మామయ్య జన్మదిన సందర్భంగా ఈ మేనల్లుడు తన సినిమా కు మంచి టాక్ ను తెచ్చుకుంటాడో లేదో చూడాలి.