Vijay Devarakonda: సౌత్‌లో హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా యూత్‌లో అతడికి విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ‘అర్జున్ రెడ్డి’, ‘గీతా గోవిందం’తో తెలుగు మాస్ అండ్ క్లాస్ ప్రేక్షకులకు కు బాగా దగ్గరయ్యారు. అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాల తర్వాత వచ్చిన మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇదిలా ఉంటే విజయ్ బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టాడు.
పూరీజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా లైగర్ ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటించారు. ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ ను దేశవ్యాప్తంగా చేశారు. దీంతో ఈ సినిమా పై బాలీవుడ్ , టాలీవుడ్ లో భారీ అంచనాలను నెలకొన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో నిర్మించిన ఈ సినిమా దేశవ్యాప్తంగా ఆగస్ట్ 25 వ తేదీన రిలీజ్ అయ్యింది.
రిలీజ్ అయిన మొదటి రోజే డిజాస్టర్ గా టాక్ తెచ్చుకొని భారీ ఫ్లాప్ అయ్యింది. దీని పై స్పందిస్తూ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి విజయ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే వేణు స్వామి గారు చెప్పిన దాని ప్రకారం విజయ్ జాతకం వల్లే ఇలా ఫ్లాప్ లు వస్తున్నాయని షాకింగ్ కామెంట్స్ చేశారు. విజయ్ కి అష్టమి నడుస్తోందన్నారు.
Vijay Devarakonda: జాతకం వల్లనే పరాజయం పాలవుతున్న విజయ్ దేవరకొండ సినిమాలు..
ఆయన జాతకం ప్రకారం.. అష్టమ శని ప్రారంభం అవ్వడం తో ‘లైగర్’కు ముందు వచ్చిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రం కూడా డిజాస్టర్ అయ్యిందని ఆయన చెప్పారు. కేరీర్ పరంగా చూస్తే మరో రెండు, మూడు చిత్రాలు హిట్ అయిన ఆ తర్వాత కష్టపడాల్సిందే అన్నారు. జాతకరీత్యా ఇప్పుడున్న స్టార్ హీరోలకు సమాంతరంగా విజయ్ కేరీర్ నడిచేలా లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.