Brahma Mudi January 25 Today Episode: ఈరోజే ప్రారంభం అయిన ఈ సీరియల్ లో తన భర్త పిల్లలతో కలిసి ఫంక్షన్ కి వస్తుంది కనకం. పరిగెడుతున్న పెద్ద కూతుర్ని పరిగెట్టకు ఆ గౌను చిరిగిపోయిందంటే బాగోదు ఇంకో 100 ఫంక్షన్ల వరకు అదే గౌన్ వాడాలి అంటుంది. పెద్దవాళ్ల ఫంక్షన్ కి కొత్తగౌను అని కొనిపించావు అంటాడు కనకం భర్త. మిగతా ఇద్దరికీ కొంటానికి నీకు చేతులు రాలేదు అంటుంది కనకం. నాకు ఈ గౌను బానే ఉంది నాన్నని ఏమి అనొద్దు అంటుంది రెండో కూతురు కావ్య.

తండ్రిని వెనకేసుకొస్తున్న కావ్య..

నువ్వు ఒక దానివి నాన్నని వెనకేసుకొస్తావు అంటూ కూతుర్ని మందలిస్తుంది కనకం. అప్పుడే కార్లో రాజ్ వాళ్ళ తాతయ్య వస్తారు. ముందుగా వచ్చిన వీళ్ళని కాకుండా కారులో వచ్చిన రాజు వాళ్ళని సాదరంగా ఆహ్వానిస్తారు పార్టీ వాళ్లు. ముందు మనం వచ్చాం కదమ్మా మనల్ని కాకుండా వాళ్ళని ఎందుకు ముందుగా ఆహ్వానించారు అని అడుగుతుంది కావ్య. వాళ్లు డబ్బులు కదమ్మా వీఐపీలు అందుకే వాళ్ళనే అందరూ పట్టించుకుంటారు అంటుంది.

పార్టీలోకి వెళ్లిన తరువాత కావ్య వాళ్ళ అక్క ఐస్ క్రీమ్ ల కోసం పరిగెడుతుంది. కావ్య ఎంత వద్దని చెప్తున్నా వినిపించుకోదు. వస్తున్న సమయంలోనే తన గౌడ్ చిరిగిపోతుంది. అక్కడ ఎక్కువ ఐస్ క్రీములు పట్టుకొని వెళ్ళిపోతుంటే అక్కడికి వచ్చిన రాజ్ తనని ఆపుతాడు.ఆ ప్రక్రియలోనే ఇద్దరు గొడవపడతారు. అప్పుడే అక్కడికి వచ్చిన కావ్య అని రాజ్ తోసేయడంతో తన చేతికి దెబ్బ తగులుతుంది. కావ్య కేకలు వేయటంతో అక్కడికి పరిగెత్తుకొచ్చిన కనకం, రాజ్ మీద కేకలు వేస్తుంది.

అబద్ధం చెప్పిన కనకం పెద్ద కూతురు..

గౌను ఎలా చిరిగిపోయింది అని కనకం అడిగితే నిజం చెప్తే అమ్మ తిడుతుందని ఈ అబ్బాయి చింపేశాడు అంటుంది. ఆ మాటలకి మరింత రెచ్చిపోయిన కనకం రాజ్ ని మరింత తిడుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన వాళ్ళ ఓనర్ ఏమైంది అని అడుగుతుంది. అప్పుడు జరిగిందంతా చెప్తుంది కనకం. వాళ్లు అబద్ధం చెబుతున్నారు నేను గౌను చెంపలేదు ఐస్ క్రీమ్స్ ఎక్కువ తీసుకు వెళ్ళొద్దని చెప్పాను అంతే అంటాడు రాజ్. నేను అందుకే పని వాళ్ళని ఫంక్షన్ కి పిలవద్దన్నాను ఇప్పుడు చూడండి అంటుంది ఓనర్ వాళ్ళ భార్య.

మేము పని వాళ్ళమే గాని అడుక్కునే వాళ్ళం కాదు ముందు చిరిగిపోయిన గౌను సంగతి తేల్చండి అంటుంది కనకం. అలాగా చెప్పు ఇప్పుడు చిరిగిపోయిన గౌన్ కి నీకు డబ్బులు కావాలి అంతే కదా ఎంత పెద్ద గొడవ చేస్తే అంత డబ్బులు వస్తాయి మీ లేకి వాళ్ళ బుద్ధులు మాకు తెలియదా అంటూ ఆమె చేతిలో డబ్బులు పెట్టి పంపించేస్తుంది. రేపటి నుంచి అతన్ని పనిలోకి రావద్దని చెప్పండి అంటూ భర్తకి పురమాయిస్తుంది ఓనర్ భార్య. వస్తూ వస్తూ కాలికి అడ్డువచ్చిన రాయిని తీసి విసిరిస్తుంది కావ్య.

శపధం చేస్తున్న కనకం..

అది నేరుగా వెళ్లి రాజ్ మొహానికి తగులుతుంది.అవమానంగా భావించిన కనకం భర్త బయటకి వస్తూ నీ మాటలతో నాకు ఉద్యోగం కూడా లేకుండా చేశావు అని తిడతాడు. అవును మరి నువ్వు చేసేది పెద్ద కలెక్టర్ ఉద్యోగం పోయిందని బాధపడటానికి అయినా మనకి డబ్బు లేకపోవడం వల్లే ఇన్ని అవమానాలు ఎప్పటికైనా ఇలాంటి ఒక పెద్ద కారు కొని అందులోనే తిరుగుతాను అంటూ శపథం చేస్తుంది కనకం. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత పెద్ద కార్లో రిచ్ మ్యారేజ్ బ్యూరో కి వస్తుంది కనకం.

తన పిఏ కారు డోరు తీసి లోపలికి రమ్మంటే, మేనేజర్ ని బయటికి పిలిపించుకొని తన రిచ్నెస్ ని తెలియజేసేలాగా చేస్తుంది. కనకం బిజినెస్ కి బ్యూరో మేనేజర్ ఫ్లాట్ అయిపోతాడు. ఆవిడకి రకరకాల సంబంధాలు చూపిస్తాడు అయినా కనకానికి ఏవి నచ్చవు. మీరు చూపించే సంబంధాలన్నీ మీరేంజి వాళ్లకి సరిపోతాయి కానీ నా రేంజ్ వాళ్లకి కాదు అంటూ వెళ్ళిపోబోతుంటే ఈసారి చూపించే సంబంధం మీకు కచ్చితంగా నచ్చుతుంది అంటూ దుగ్గిరాల వారి కుటుంబం గురించి చెప్తాడు బ్యూరో మేనేజర్. దుగ్గిరాల పేరు వినగానే గబగబా వెనక్కి తెచ్చి ఆ వివరాలన్నీ వింటుంది కనకం.

దుగ్గిరాల కుటుంబ సభ్యుల ఇంట్రడ్యూసింగ్..

స్వరాజ్ ఫోటో చూపించి ఇతను దుగ్గిరాల సీతారామయ్య గారి మనవడు పేరు స్వరాజ్ అందరూ రాజ్ అని పిలుస్తారు కొన్ని కోట్ల ఆస్తికి వారసుడు అంటూ రాజ్ క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు. కారులో వచ్చిన రాజ్ ఒక పెళ్ళికి వస్తాడు వస్తూనే పెళ్ళికొడుకుని లాగిపెట్టి కొడతాడు. పెళ్లికూతురుతో ఏమని చెప్పాడు వీడు తనకి డబ్బు ఉందని చెప్పాడా కోట్ల ఆస్తి ఉందని చెప్పాడా అని అడుగుతాడు. అవునండి అంటుంది పెళ్లికూతురు. వీడికి చిల్లి గవ్వలేదు జీవితాంతం డబ్బు లేని వాడితో నువ్వు ఉండగలవా అని అడుగుతాడు.

అయినా మీకు ప్రేమే ముఖ్యం అనుకుంటే నీ కర్మ అంటాడు రాజ్. పెళ్లికూతురు, పెళ్ళికొడుకు కాలర్ పట్టుకుని డబ్బు లేకపోతే ఎలా బ్రతుకుతాం అనుకున్నావు అంటుంది. పోనీలే తన దగ్గర లేకపోతే నీ దగ్గర ఉంటుంది కదా అంటాడు రాజ్. నీళ్లు నములుతున్న పెళ్లికూతుర్ని చూసి నాకు తెలుసు నీ దగ్గర డబ్బు లేదని అందుకే డబ్బున్న మా వాడిని వలలో వేసుకున్నావ్ అని అంటాడు రాజ్. నిజమా అని పెళ్లి కొడుకు అడిగితే అవును డబ్బు లేకపోతే నువ్వు పెళ్లి చేసుకోవని తను నాటకం ఆడింది అంటాడు రాజ్. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవాలని చిన్న అబద్ధం ఆడెను అంటుంది పెళ్లికూతురు.

బ్రహ్మముడిని విప్పేసిన రాజ్..

అది చిన్న అబద్ధమా కాదు మోసం.నీ ప్రేమ కూడా మోసమే, మోసంతో ముడిపడిన వివాహ బంధం ఎప్పటికీ నిలబడదు అంటాడు రాజ్. ఇద్దరి మధ్యన ఉన్న బ్రహ్మముడిని విప్పేసి తన ఫ్రెండ్ ని తీసుకొని వెళ్ళిపోతాడు రాజ్. కిందికి వచ్చిన తర్వాత ఎందుకు అలాగా చేసావు తన దగ్గర డబ్బు లేకపోతే ఏమీ నా దగ్గర ఉంది కదా అంటాడు ఆ పెళ్ళి కొడుకు. డబ్బు లేకపోవడం తప్పు కాదు కానీ డబ్బు కోసం ఆమె ఎన్నుకున్న మార్గం తప్పు. ఏదోలే తెలియక చేసింది అని పెళ్లి కొడుకు అంటే ఒకసారి మోసం చేసిన వాళ్ళు ఇంకొకసారి మోసం చేయడానికి గ్యారెంటీ ఏంటి, ఒకసారి మోసం చేసిన వాళ్ళు ఎప్పటికీ మోసం చేస్తూనే ఉంటారు.

చిన్నప్పుడు నీ పుట్టినరోజు నాడు నాకు తగిలిన మోసం తాలూకా గాయం ఇప్పటికీ గుర్తు. నేను చింపని గౌనుని నేనే చింపాను అని చెప్పి డబ్బులు వసూలు చేశారు. ఎప్పుడైనా వాళ్లు చేసిన మోసాన్ని మర్చిపోదాం అనుకున్నా ఈ దెబ్బ నాకు గుర్తు చేస్తూనే ఉంటుంది అంటాడు రాజ్. అప్పుడే కావ్య క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతుంది. వినాయకుని బొమ్మకు మెరుగులు దిద్దుతూ స్వామి విగ్రహం ఎంత బాగా కుదిరిందో చూడండి అంటూ తండ్రికి చెప్తుంది. ఈ కళలో తండ్రి తలెత్తుకునే చూసే ఎత్తులో ఉన్నావు అంటాడు కావ్య తండ్రి. నువ్వే నేర్పావు కదా అని కావ్య అంటే నేర్చుకునే వాళ్ళు ఉండాలి కదా అంటాడు ఆమె తండ్రి.

విగ్రహానికి పెరుగుల దిద్దుతున్న కావ్య..

ఈ విగ్రహానికి టెంపుల్ స్టైల్ నగలు డిజైన్ చేద్దామనుకుంటున్నాను అంటే వద్దు వాళ్లు నగలు లేకుండానే కావాలన్నారు అంటాడు ఆర్డర్ ఇచ్చిన వ్యక్తి. నగలు లేకపోతే దేవుడే దేవుడికి నిలువు దోపిడీ ఇచ్చినట్లుగా ఉంటుంది అంటుంది కావ్య. అవన్నీ నీకెందుకు ఈ విగ్రహం కావాలి అన్న వాళ్ళు కోటీశ్వరులు వాళ్ళు అడిగినట్లుగా ఇచ్చేసేయ్ అంటాడు ఆ వ్యక్తి. వింటున్నావా రిచ్ పీపుల్ నిన్ను పూర్ గా తయారు చేయమన్నారు అంట అంటూ వినాయకుడికి చెప్తుంది కావ్య. దేవుడు కావాలంట అలంకారం వద్దంట అంతా తల తిక్క ఫ్యామిలీ ఎవరు స్వామి అంటుంది కావ్య.

దుగ్గిరాల ఫ్యామిలీని పరిచయం చేస్తున్న ఆ ఇంటి ఆడపిల్ల..

అప్పుడే దుగ్గిరాల ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేస్తున్నట్లుగా ఆ ఇంటి ఆడపిల్ల తన వీడియోలో తన ఫ్యామిలీని పరిచయం చేస్తుంది. ముందుగా వాళ్ళ తాతయ్య సీతారామయ్య ని పరిచయం చేస్తుంది. తర్వాత వాళ్ళ నాన్నమని పరిచయం చేస్తూ మా తాతయ్యకి చేతి కర్ర లాగా ఎప్పుడు తోడుగా ఉంటుంది అంటూ తన వ్యూర్స్ పరిచయం చేస్తుంది. నేరుగా తన పెదనాన్న రూమ్ కి వెళ్లి వాళ్లని పరిచయం చేస్తుంది. మళ్లీ బయటికి వచ్చి తనకి ఎదురైన రాజ్ ని పరిచయం చేస్తుంది. ఈయన మా పెదనాన్న కొడుకు పేరు స్వరాజ్ ఈరోజు మా అన్నయ్యని స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి ఎండిగా చేయబోతున్నారు.

ఈయనకి కొంచెం కోపం ఎక్కువ పేషెంట్స్ తక్కువ అంటే ఆమె చెవి మెలేస్తాడు రాజ్. తాతయ్య వస్తున్నారు అంటూ అమ్మాయి దగ్గర నుంచి తప్పించుకుంటుంది ఆమె. తరువాత నగల పిచ్చి ఉన్న తన తల్లిని పరిచయం చేస్తుంది తండ్రిని పరిచయం చేసి హాయ్ చెప్పమంటే చెప్పడు ఏం జరిగిందని తన దగ్గరికి వెళ్తే చెవిలోంచి దూదులు తీస్తాడు ఆమె తండ్రి ప్రకాశం.మా వ్యూర్స్ కి ఏమైనా చెప్పండి నాన్న అంటే పెళ్లయిన మగవాళ్ళకి ఇదొక మంచి చిట్కా ఉన్నట్టు నటించాలి కానీ ఏమీ వినకూడదు అంటాడు.

ఇప్పుడు తన అన్న కళ్యాణ్ ని పరిచయం చేస్తుంది మా అన్నయ్యకి కవిత్వం పిచ్చి ఎక్కువ అంటూ అతన్ని చూపిస్తుంది. వ్యూర్స్ కోసం ఏమైనా చెప్పు అంటుంది. నా కవిత్వం చెప్తాను అని ఓ పెద్ద కవిత్వం చెప్తాడు కళ్యాణ్. ఇంకొకసారి నీ కవిత్వం వింటే నీ పుస్తకాలతో కొట్టి చంపు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మిమ్మల్ని డేంజర్ జోన్ కి తీసుకువెళ్తాను ఇది మా ఆంటీ రూమ్, దేవుడికి అందరూ ఆంటీ కోపిష్టిదో మంచిదో తెలియదు కానీ పేరు రుద్రాణి అంటూ తనని చూపిస్తుంది. ఆంటీ అంటూ వచ్చిన ఆమెని ఏంటి అని అడుగుతుంది రుద్రాణి.

మొదటి రోజే అతి చేస్తున్న కనకం..

మా వ్యూర్స్ కి ఏమైనా చెప్పు అని అంటే పనికొచ్చే పని చేసుకో పో అంటుంది. ఇంద్రాణి కూతురు రేఖని అడిగితే నేను రెడీ అవ్వాలి టైం లేదు అంటుంది. మీ అన్నయ్య రాహుల్ ఎక్కడ అని అడిగి అతని క్యారెక్టర్ ని కూడా పరిచయం చేస్తుంది. ఫైనల్ గా ఇది మా ఫ్యామిలీ అంటూ వాళ్ళ ఫ్యామిలీ ఫోటోని చూపిస్తుంది. ఈ వీడియో అంతా చూసిన కనకం ఏవేవో లెక్కలు వేసుకుంటూ నా అల్లుడు వాటా కింద 500 కోట్లు రావచ్చు అనుకుంటుంది. అల్లుడా అని ఆ మేనేజర్ ఆశ్చర్యంగా అడిగితే, అతను మా అల్లుడు అయిపోయినట్టే అన్ని విధాలా ఆ సంబంధం నచ్చినట్లే అంటుంది కనకం.

అసలు మీ ఫ్యామిలీ గురించి చెప్పండి మీకు ఎన్ని కోట్లు ఉన్నాయి అని అడుగుతాడు ఆ మేనేజర్. ఏంటి నన్నే అడుగుతున్నావా అంటూ ఎక్స్ట్రాలు చేస్తుంది కనకం. ఆవిడకి కొంప గూడు నగలు, నటరా ఏమీ లేవు అనుకుంటున్నావా, కొంపలకి బొమ్మలుకి రంగులేసుకుని మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనుకుంటున్నావా అంటూ మరింత ఎక్స్ట్రాలు చేస్తుంది ఆమె పిఏ. ఆయన ఏమీ అంతా పొడుగు లిస్టు అడగలేదు నువ్వు ఆవేశ పడకు అంటూ కూల్ చేస్తుంది కనకం.

అది కాదు మేడం వాళ్ళ వివరాలు మీకు ఇచ్చాను కదా మరి వాళ్ళు అడిగినప్పుడు మీ వివరాలు కూడా వాళ్ళకి ఇవ్వాలి కదా అందుకే అడిగాను అంటాడు మేనేజర్. మేము రిచ్ అంటే నీకు నమ్మకం కలగడం లేదా నేను దిగిన కారు చూసి కూడా మా లెవెల్ ఎంతో అడుగుతున్నావా డ్రైవర్ కి 500 టిప్పు ఇవ్వడం చూసి కూడా మా లెవెల్ ఏంటి అని అడుగుతున్నావా అంటుంది కనకం. ఆ మాట ఇటు చూసి చెప్పండి అంటాడు క్యాబ్ డ్రైవర్. వెనక్కి తిరిగి చూసేసరికి క్యాబ్ డ్రైవర్ నేరుగా వాళ్ళ పర్సు తీసి అందులోంచి తన వాచిని తీసుకుంటాడు.

Brahma Mudi January 25 Today Episode: అసలు నిజాలు చెప్పి మేనేజర్ కి షాక్ ఇచ్చిన క్యాబ్ డ్రైవర్..

దొంగ మొహాల్లారా కార్ రెంటు 500 ఇచ్చి 30000 వాచ్ ని దొంగతనం చేస్తారా అని అడుగుతాడు. నాదే కదరా ఎక్కడికి పోతుంది అంటుంది కనకం. ఎప్పుడైనా మొహాన్ని కారు వద్దలో చూసుకున్నావా అంటాడు ఆ డ్రైవర్. ఒక ఓనర్ తో డ్రైవర్ అలా మాట్లాడుతున్నాడు ఏంటి అంటాడు మ్యారేజ్ బ్యూరో మేనేజర్. హలో ఆ కారు ఈవిడిది కాదు, ఇక్కడ దింపి నేను వచ్చేవరకు ఆగితే 500 ఇస్తాను అంటే మా ఓనర్ కి పెట్రోల్ పోయించికి తీసుకువస్తానని చెప్పి వీళ్ళని తీసుకువచ్చాను అంటూ కోపంగా అక్కడ నుంచి వెళ్లిపోతాడు ఆ క్యాబ్ డ్రైవర్.

వీళ్ళని అసహ్యంగా చూస్తాడు ఆ మ్యారేజ్ బ్యూరో మేనేజర్. తరువాయి భాగంలో ఆరు నూరైనా నూరు ఆరైనా మా ఆడపిల్లని ఆ ఇంటి కోడలుగా చేసి తీరుతాను అంటుంది కనకం. మరోవైపు రాజ్ కావ్య బండిని కారుతో గుద్దేస్తాడు. పగిలిపోయిన మట్టి బొమ్మకి డబ్బులు ఇస్తే ఇదే డబ్బులతో నీ ఒంట్లోని కొవ్వు కరిగించుకో అంటుంది కావ్య.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జనవరి 25, 2023 at 12:36 సా.