Brahmamudi February 1 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో నీ లైఫ్ లోకి సపోజ్ ఇందాక కళావతి అని పేరు పెట్టావు కదా అలాంటి అమ్మాయి వస్తే అని అడుగుతాడు కళ్యాణ్. అలాంటి ఆడది నా లైఫ్ లోకి రావటమా? సూర్యుడు పడమటన ఉదయించాలి అని కోపంగా అనుకుంటాడు రాజ్. మరోవైపు ఇంట్లో టికెట్స్ ని చూసిన కావ్య కంగారులో మర్చిపోయి వెళ్ళిపోయినట్లున్నారు ఇప్పుడు ఎలా అనుకుంటుంది కావ్య.

స్వప్న వాళ్ళకి జరిగిన ఘోర అవమానం..

మరోవైపు ఫంక్షన్ కి వచ్చిన కనకం వాళ్లు నా ముస్తాబు బాగుందా అని ఒకరు నా మేకప్ బాగుందా అని ఒకరు మాట్లాడుకుంటూ ఉంటే ఆపండి మీ ఎదవ సోది ఆటో ఎక్కి దగ్గర నుంచి ఒకటే గోల అడుక్కొని తెచ్చుకున్నవి అంటూ కోప్పడుతుంది అప్పు. ఎవరో పాసులు మర్చిపోతే వాళ్లని చూసి నవ్వుకుంటారు కనకం వాళ్ళు. కానీ వాళ్ళు కూడా పాసులు మర్చిపోయారని తెలుసుకొని కంగారు పడతారు. నేను మేనేజ్ చేస్తాను అంటుంది కనకం.

లోపలికి వెళ్ళిపోబోతున్న కనకం వాళ్లని అడుగుతాడు సెక్యూరిటీ. కార్లో మర్చిపోయాము తర్వాత తెస్తానులే అంటుంది కనకం. మా సెక్యూరిటీ కి తాళాలు ఇవ్వండి తను తీసుకొని వస్తాడు అంటాడు ఇంకో సెక్యూరిటీ. మా కార్లో విలువైన వస్తువులు ఉన్నాయి. అలా ఎలా ఇస్తాము అంటుంది కనకం. అలా అయితే పక్కన ఉంచండి లోపలకి పంపించడం కుదరదు అని వాళ్ళని పక్కకి పంపించేస్తాడు సెక్యూరిటీ.

సెక్యూరిటీతో గొడవ పడుతున్న కనకం..

ఏంటయ్యా నువ్వు మమ్మల్ని ప్రత్యేకించి టిక్కెట్లు ఇచ్చి మరి పిలిపించి టిక్కెట్లు మర్చిపోయినందుకు మమ్మల్ని ఇంత చీప్ గా చూస్తారా, మేమేంటో మా లెవెల్ ఏంటో తెలుసా అంటుంది కనకం. ఆమె మాటల్ని కనీసం సెక్యూరిటీ పట్టించుకోడు. అమ్మ పాతని మర్చిపోవడం మన తప్పు ఇక్కడ గొడవపడితే మన పరువే పోతుంది. అది లోపల ఉన్న రాజ్ కి తెలిసిందంటే మనం కష్టపడి ఇక్కడికి వచ్చినందుకు అలుసైపోతాం అంటుంది స్వప్న.

ఈ తొక్కలో ఫంక్షన్ కి వెళ్లకపోతే ఏమైంది అంటూ కసురుకుంటుంది అప్పు. మళ్లీ లోపలికి వెళ్ళబోతున్న అప్పుని ఆపి పాసులు లేకపోతే లోపలికి పంపించాం అంటూ అప్పుని నెట్టేస్తాడు సెక్యూరిటి. అప్పుడే అక్కడికి వచ్చిన కావ్య తనని పట్టుకొని పాసులు లేకపోతే చెప్పే పద్ధతి ఇదేనా ఇక్కడ ఉన్న అందరికీ పొగరు ఎక్కువే అంటుంది కావ్య. ఏంటి ఆ ఎంట్రన్స్ లో గొడవ అని అడుగుతాడు. పాసులు లేకుండా లోపలికి పంపించమని ఎవరో గొడవ చేస్తున్నారు అంటాడు సెక్యూరిటీ. ఇలాంటి వాళ్లు నడి బజార్లో కూడా గొడవ చేస్తుంటారు అని అక్కడికి వెళ్ళబోతాడు రాజ్.

వాళ్ల సంగతి మేం చూసుకుంటాం అంటున్న సెక్యూరిటీ..

అలాంటి వాళ్లతో మీరు మాట్లాడటం ఏంటి సార్ నేను చూసుకుంటాం లెండి అంటాడు సెక్యూరిటీ. పాసులు లేకుండా ఎవరిని పంపించకండి అసలే మినిస్టర్ గారు వచ్చే టైం అయింది అంటాడు రాజ్. కావ్య టిక్కెట్లు చూపించడంతో వాళ్లని లోపలికి పంపిస్తాడు సెక్యూరిటీ.నాకు మూడు పోయింది నేను ఇంటికి వెళ్ళిపోతాను అంటుంది అప్పు. మనం వెళ్లిపోతే అమ్మ వాళ్లకి ఏమైనా ఇబ్బంది అయితే ఎలా చెప్పు అంటుంది కావ్య. ఇప్పుడు వాళ్ళు ఉన్న పరిస్థితులలో మనమే కాదు ఆ భగవంతుడు కూడా కనిపించడు అంటుంది అప్పు.

నాకు ఈ డబ్బున్న వాళ్ళ ఓవరాక్షన్ అస్సలు నచ్చదు నువ్వు ఇక్కడే ఉండాలి అంటూ రిక్వెస్ట్ చేస్తుంది కావ్య. అప్పు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కావ్య వెళ్ళిపోబోతుంటే ఆమె భుజం మీద ఒక చేయి పడుతుంది. షాక్ అయ్యి వెనక్కి తిరిగేసరికి కళ్యాణ్ కనిపిస్తాడు. భుజం మీద చేయి వేసినందుకు సారీ చెప్పి పిలుద్దామంటే మీ పేరు తెలీదు ఆ పాసులు మీకోసం కాదా ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటాడు కళ్యాణ్.

కావ్యని ఇన్వైట్ చేసిన కళ్యాణ్..

రమ్మంటున్నందుకు థాంక్స్, రాను అంటున్నందుకు సారీ అంటుంది కావ్య. మా అన్నయ్య మీరు అనుకునే అంత ఆరోగెంట్ కాదు పూజ లేట్ అయిపోతుంది అన్న తొందరలో అలాగా బిహేవ్ చేశాడు అంతే అంటాడు కళ్యాణ్. నాకు నెగిటివ్ వైబ్రేషన్స్ అస్సలు పడవు అంటుంది కావ్య. మీరు రాకపోతే మీ వినాయకుడు ఫీలవుతాడు అంటాడు కళ్యాణ్. ఆ వినాయకుడు నన్ను ఇలాగ రప్పిస్తున్నాడన్నమాట అని నవ్వుతూ వస్తుంది కావ్య. రాజ్ ని చూసిన స్వప్న డ్రీమ్స్ లో తేలిపోతుంది స్వప్న.

వెళ్లి పరిచయం చేసుకో అంటుంది కనకం. నాకు ఏం బ్యాగ్రౌండ్ ఉందని పరిచయం చేసుకోమంటావు అంటుంది స్వప్న. మీ నాన్నది ఎగుమతి దిగుమతి వ్యాపారం అని చెప్పు అంటుంది కనకం. ఇంగ్లీషులో చెప్పు అంటూ స్వప్నని ఎంకరేజ్ చేస్తుంది కనకం. రాజకీయం ఎదురుగా వెళ్లి డాష్ ఇస్తుంది స్వప్న. ఫోన్ మాట్లాడుతున్న రాజ్ అదేమీ పట్టించుకోకుండా సారీ చెప్పి వెళ్ళిపోతాడు. అమ్మ నాకు చాలా ఇన్సల్టింగ్ ఉంది కనీసం మొహం కూడా చూడలేదు అంటుంది స్వప్న. అలా గుద్దే ప్రతి అమ్మాయి మొహం చూస్తే ఇప్పుడు ఈ అవకాశం నీకు ఎలా వస్తుంది అంటుంది కనకం.

తొక్కలో ప్లాన్ వేసిన కనకం..

మరి రేపు వాళ్ళిద్దర్నీ వెతుకుతున్న అప్పు వాళ్లు దొరకక పోవడంతో చికాకు పడుతుంది. మరోవైపు కల్చరల్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవుతాయి అంటూ అనౌన్స్ చేస్తుంది అనౌన్సర్. అంటే ఏంటి అని కనకం అడిగితే సాంస్కృతిక కార్యక్రమాలు అని వివరిస్తుంది స్వప్న. మరోవైపు కళ్యాణ్ ఎక్కడ అని రాహుల్ ని అడుగుతాడు రాజ్. ఎవరికో కవిత్వం వినిపించి ఆరోగ్యం పాడు చేయడానికి వెళ్లి ఉంటాడు అని నవ్వుతాడు రాహుల్. ఊరికే అడిగాను కానీ వాడు కనిపిస్తే నాకు చెప్పు అంటాడు రాజ్.

కళ్యాణ్ ని రమ్మని సెక్యూరిటీతో కబురు పెడతాడు రాజ్. అరటిపండు తింటున్న కనకంతో రాజ్ ని పరిచయం చేస్తానని చెప్పి ఇలా అరటిపండు తింటున్నావా అంటుంది స్వప్న. మీ ఇద్దరినీ కలపటానికి ఈ కనకేశ్వరి ఎందుకు ఈ అరటి తొక్క చాలు అంటూ దారికి అడ్డంగా పడేస్తుంది కనకం. అది తొక్కుకొని డాన్సర్ పడిపోతుంది. వీళ్ళిద్దరినీ కలపటానికి మర్డర్ కూడా చేసేటట్లుగా ఉంది అంటుంది అప్పు. చేసిన తప్పులేదు మా ఇద్దరినీ కలిపితే చాలు అంటుంది స్వప్న.

తొక్కలో ప్లాన్ వర్క్ అవుట్ అయిందంటున్న అప్పు..

కాలి నొప్పుతో బాధపడుతున్న డాన్సర్ ని చూసి ఈ కాళ్ళు నొప్పుతో ఎలాగా డాన్స్ చేస్తావమ్మా నీ బాధ తీర్చడానికే నన్ను ఆ దేవుడు పంపించినట్లుగా ఉన్నాడు నీ బదులు మా అమ్మాయి డాన్స్ చేస్తుంది లే కాస్ట్యూమ్స్ ఇస్తావా మరి అని అడుగుతుంది కనకం. సరే అంటుంది ఆ డాన్సర్. తొక్కలో ఐడియా వర్క్ అవుట్ అయింది అంటుంది అప్పు. నేను డాన్స్ చేయడం ఏంటమ్మా అంటుంది స్వప్న.

అప్పుడే కావ్యని చూసిన కనకం అక్కని తీసుకొని రా అంటూ అప్పుని పంపిస్తుంది. డ్రెస్ వేసిన తర్వాత ఈ డ్రెస్ లో సూపర్ గా ఉన్నావు అంటూ స్వప్నని మెచ్చుకుంటుంది కనకం. ఇది ప్రెసిడెంట్ డాన్స్ కాదమ్మా కూచిపూడి నాకు చేతకాదు అంటుంది స్వప్న. నన్ను ఇలా ఇరికించి నా పరువు తీయకమ్మ అంటుంది స్వప్న. పిచ్చిదానా డబ్బున్న మగవాడు కరిగిపోయే సబ్బు లాంటివాడు గుప్పెట్లో బిగించాలని చూస్తే పూసుకునే జారిపోతాడు సబ్బుని బాక్స్ లో పెట్టినట్లుగా అతన్ని నీ గుండెల్లో పెట్టుకోవాలి అంటుంది కనకం.

Brahmamudi February 1 Today Episode కావ్యని బ్రతిమాలుకుంటున్న కనకం..

తొక్కలో సామెతలు ఎందుకు లేదని అక్కని తీసుకొచ్చాను చూడు అంటుంది అప్పు. వచ్చావా బంగారం నిన్ను ఆ దేవుడు మా కోసమే పుట్టించాడు అంటుంది కనకం. స్వప్నని చూసిన కావ్య ఏంటి డ్రెస్ అని అడుగుతుంది. అంతమంది స్వప్నని చూడాలంటే స్వప్న స్టేజ్ మీద డాన్స్ చేయాలి అందుకే ఈ డ్రెస్, నీకు కూచిపూడి వచ్చు కదా నాలుగు స్టెప్పులు నేర్పించు అంటుంది కనకం. ఇప్పుడా నా వల్ల కాదు అని కావ్య అంటే నా వల్ల కూడా కాదు అంటుంది స్వప్న.నన్ను వేయమంటావా నాలుగు తీన్మార్ స్టెప్పులు అంటుంది అప్పు.

మార్మారని అందరూ కొట్టి చంపుతారు అంటూ అప్పు మీద కోప్పడుతుంది కనకం. అక్క రాజు దృష్టిలో పడాలంటే తప్పనిసరిగా ఈ డాన్స్ చేయాలి ఇదిగో డ్రెస్ కూడా వేసేసాను అంటూ కావ్యని రిక్వెస్ట్ చేస్తుంది కనకం. కానీ ఇక్కడ ఎలా అని అంటే ఒక తెర ఏర్పాటు చేస్తుంది కనకం. అప్పటికప్పుడు నాలుగు చెప్పులు నేర్పిస్తుంది కావ్య. తర్వాయి భాగంలో తెర వెనుక డాన్స్ చేస్తున్న నీడని చూసి ఫ్లాట్ అయిపోతాడు రాజ్.