Brahmamudi February 2 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో కావ్య నేర్పిస్తున్న స్టెప్స్ ని నేర్చుకోలేక పోతుంది. స్వప్న. ఇంత చిన్న స్టెప్పు వేయటానికి ఎందుకలాగా అయిపోతున్నావు అంటుంది కనకం. ఈ డ్రెస్సు ఇస్తాను నువ్వే చెయ్యు అంటూ కోప్పడుతుంది స్వప్న. కోప్పడనులే వెళ్లి నేర్చుకో అంటుంది కనకం. కావ్య డాన్స్ నేర్పిస్తున్న షాడోని చూసి ఇంప్రెస్ అవుతాడు రాజ్.

షాడో చూసి ఇంప్రెస్ అయిన రాజ్..

ముందుకి వచ్చి చూసేసరికి స్వప్న డాన్స్ చేస్తూ ఉంటుంది. స్వప్నని చూసి ఇంప్రెస్ అవుతాడు రాజ్. మినిస్టర్ గారు వచ్చారు తాతయ్య గారు రమ్మంటున్నారు అంటూ రాజుని తీసుకొని వెళ్ళిపోతాడు ఒక వ్యక్తి. అమ్మో మినిస్టర్ గారు వచ్చారంట అని సంబరపడిపోతుంది కనకం. నువ్వు మినిస్టర్ గారి ముందు ఒక డాన్స్ చేయాలో ఏంటో కనుక్కొని వస్తాను ఉండు అంటుంది. నాకు ఇవన్నీ నచ్చడం లేదు అంటుంది కావ్య.

నాకు మాత్రం నచ్చుతుందనుకున్నావా కానీ అటు చూడు, వాళ్లలో మన స్వప్న ఏ పాటిది. ఒక్కసారి మన స్వప్న మా ఇంట్లో కోడలుగా అడుగుపెడితే ఆ తర్వాత మీ భవిష్యత్తు కూడా బాగుపడుతుంది అంటూ కంగారుగా అక్కడినుంచి వెళ్ళిపోతుంది కనకం. మరోవైపు పూజ పూర్తి చేసిన పంతులుగారు పూజ పూర్తయింది మీరు మీ దివ్య హస్తాలతో స్వామివారికి హారతి ఇస్తే అంత మంచే జరుగుతుంది అంటారు.

రాజ్ కి జాగ్రత్తలు చెప్తున్న సీతారామయ్య..

మా కంపెనీ బాధ్యతలు తీసుకోబోతున్న మా మనవడి చేతితోనే హారతి ఇప్పించండి అంటాడు సీతారామయ్య. రాజ్ ఒక్కడే హారతి ఇవ్వకుండా రాహుల్ ని కళ్యాణ్ ని కూడా కలుపుకొని ముగ్గురు హారతి ఇస్తారు. ఇదంతా దూరం నుంచి గమనిస్తుంది కనకం. కంపెనీ బాధ్యతలు తీసుకుంటూ సంతకం పెడుతుంటాడు స్వరాజ్. కంపెనీ బాధ్యతలే కాదు కంపెనీ పరువు ప్రతిష్టలు కూడా నీ చేతిలో పెడుతున్నాను అంటాడు సీతారామయ్య.

నీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను అంటూ నానమ్మ తాతయ్య వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు రాజ్. నా రాజ్ రాజు అయిపోయాడు అంటూ మురిసిపోతుంది స్వప్న. ఈ మిస్టర్ డిఫెక్ట్ మరింత డిఫెక్టు అవుతాడేమో అనుకుంటుంది కావ్య. నువ్వు రాజ్ ని బావగారు అని పిలిస్తే ఎలా ఉంటుందో ఊహించుకుంటున్నావా అంటుంది స్వప్న. నేను జీవితంలో అతన్ని బావ అని పిలవను అంటుంది కావ్య.

జనాలందరూ అమాయకులు అంటున్న కనకం..

పెళ్లయితే నువ్వే చేసినట్లు పిలుస్తావు అనుకుంటుంది స్వప్న. రాజ్ కి కంగ్రాట్స్ చెప్పి విగ్రహాన్ని డిజైన్ చేయించడంలోనే ఫెయిల్ అయ్యావు అలాంటిది అంత పెద్ద కంపెనీని నీ చేతిలో పెట్టారు సరిగ్గా పనిచేసి మంచి పేరు తెచ్చు అంటుంది రుద్రాణి. ఇంక అన్ని పనులు అయిపోయాయి ఒక్క నీ పెళ్లి తప్ప, మహారాణి ఎక్కడ ఉందో అంటాడు ఒక వ్యక్తి. ఎక్కడో ఏంటి ఇక్కడే ఉంది. నా కూతురే ఈ రాజుకి కాబోయే మహారాణి అని ఎవరికి తెలియదు వీళ్లంతా అమాయకులు అని నవ్వుకుంటుంది కనకం.

నాకు ఈ స్టెప్స్ రావటం లేదు అంటుంది స్వప్న. అప్పుడే అక్కడికి వచ్చిన కనకం అదేమైనా బ్రహ్మాండమా చూసిన వాళ్ళకి మాత్రం డాన్స్ వచ్చా కావాలంటే కావ్య ఎక్కడ నుంచి స్టెప్స్ వేసి చూపిస్తుంది నువ్వు స్టేజ్ మీద వేసేద్దువు గానివి అంటుంది. అమ్మ నాకు ఇక్కడ బంగారు సూలాలతో గుచ్చినట్లుగా ఉంది బాగోలేదు అంటుంది కావ్య. ఆ సూలాలు నాకు ఇవ్వు ఆ బంగారంతో మీ ముగ్గురికి నగలు చేయిస్తాను అంటూ మురిసిపోతుంది.

స్వప్న ని చూసి ఇంప్రెస్ అయిన రాజ్..

మిమిక్రీ ప్రోగ్రాం స్టార్ట్ అయిపొయింది తర్వాత మీదేనెమో త్వరగా కానివ్వండి అంటుంది కనకం. ప్రోగ్రాం చూసి నవ్వుతున్న రాజ్ ని చూసిఆ పెద్దవాడు ఎంత బాగా నవ్వుతున్నాడో, స్వప్న డాన్స్ చూసేటంటే తప్పకుండా ప్రేమలో పడిపోతాడు అంటూ నీకు రంగులేసింది మా ఆయన నా కూతురే గుర్తుపెట్టుకో అందుకే ఎలాగైనా నా కూతురు ఈ ఇంటికి కోడలుగా రావాలి ఈ భారం అంతా నీదే అంటూ వినాయకుడికి దండం పెట్టుకుంటుంది కనకం.

టైం అవటంతో స్టేజ్ ఎక్కిన స్వప్న దూరంగా కావ్య చేస్తుండటం చూసి తను కూడా డాన్స్ చేస్తుంది. ఆ డాన్స్ చూసి ఇంప్రెస్ అవుతాడు రాజ్. నీకు కళలు అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు కదా అంటాడు కళ్యాణ్. ఒక్క కళావతిని తప్ప అందరిని గౌరవిస్తాను అంటూ స్టేజ్ దగ్గరికి వెళ్తాడు రాజ్. అది చూసిన అప్పు ఒక్క అరటి తొక్క ఎంత పని చేసింది అంతా బలిసినోడు కూడా ఫిదా అయిపోయాడు అంటూ కావ్య తో చెప్తుంది. డిస్టర్బ్ చేయొద్దు అంటూ మందలిస్తుంది కావ్య. స్వప్న చేతిలో ఉన్న దీపంలో నుంచి కొంచెం నిప్పు కింద పడుతుంది.

నిండు సభలో కావ్య జరిగిన అవమానం..

అది ఎక్కడ మట్టేస్తుందో అని కంగారుపడిన కావ్య వెళ్లి ఆ పాదం కింద చేయి పెడుతుంది. ఆ ఊపుకి పడిపోబోయిన స్వప్నని పట్టుకుంటాడు రాజ్. కావ్యని చూసి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నిన్ను ఎవరు రాణించారు అంటూ కోప్పడతాడు రాజ్ ఇప్పుడు ఏమైంది అని కావ్య అంటే మొత్తం ప్రాబ్లం అంతా కాపీసెట్ అయింది నువ్వు ఎక్కడ కాలు పెడితే అక్కడ ఇలాంటివి జరుగుతూనే ఉంటాయా అంటాడు. అసలు మా ప్రోగ్రామ్ లోకి నువ్వెందుకు దూరావు అంటూ కేకలు వేస్తాడు.

అంతలోనే అక్కడికి వచ్చిన కళ్యాణ్ తను వద్దంటే నేనే బలవంతంగా తీసుకొని వచ్చాను అంటాడు. నీకు పని పాట లేదా ఇది మర్యాదస్తుల ఫంక్షన్ అని నీకు తెలియదా అంటూ కళ్యాణ్ మీద కోప్పడతాడు రాజ్. మాది కూడా మర్యాద వస్తువుల కుటుంబమే ఇలా అవమానిస్తే ఊరుకోను అంటుంది కావ్య. స్టేజ్ మీదే ఇద్దరు గొడవ పడతారు. అసలు ఇదంతా నీ వల్లే ఈ మెంటల్ ది ఇక్కడ అడుగు పెట్టింది మొత్తం ప్రోగ్రాం ని కొలాప్స్ చేసింది అంటాడు రాజ్.

చెల్లెలికి నచ్చ చెప్తున్న స్వప్న..

అది చూసిన స్వప్న మీరు ఉండండి నేను మాట్లాడతాను అంటుంది. కావ్య దగ్గరికి వెళ్లి నువ్వైనా ఊరుకోవచ్చు కదా ఎందుకు ఆర్గ్యుమెంట్ అని అడుగుతుంది. నువ్వు నువ్వు తొక్కుతావని నేను చేత్తో తీయబోయాను నా చేయి కాలింది అంటుంది కావ్య. నేను రావటం కొంచెం ఆలస్యం అయి ఉంటే ఆ నిప్పులు ఈమె మీద పడి చాలా ప్రమాదం జరిగేది అంటాడు రాజ్. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటుంది స్వప్న.

అది కాదు అక్క అని కావ్య అంటే వరస కలుపుతున్నావేంటి అంటూ కోప్పడతాడు రాజ్.అక్క మీద జులుం చేస్తుంది ఏంటి అంటూ స్టేజ్ దగ్గరికి వెళ్ళబోతుంది అప్పు. నువ్వు ఆగవే అంటూ కూతుర్ని ఆపుతుంది కనకం. ఈమె సంగతి నాకు బాగా తెలుసు పొద్దున్న బామ్మర్ది వచ్చి బావ షార్ట్ మీద కూడా రంగు వేసింది అంటుంది రేఖ. నాకు ఎట్టి పరిస్థితుల్లోనే సారీ చెప్పి తీరాలి అంటుంది కావ్య. ఏం మాట్లాడుతున్నావ్ నేను సారీ చెప్పడానికి ఇది నడిరోడ్డు కాదు నా ఇల్లు అంటూ రెచ్చిపోతాడు రాజ్.

Brahmamudi February 2 Today Episode రాజ్ ని బుట్టలో వేసేసిన స్వప్న..

గొడవ పెద్దయ్యేలాగా ఉంది అనుకొని కనకం పరిగెత్తుకుంటూ వెళ్లి కాలికి దెబ్బ తగిలిందా అంటూ స్వప్నని పట్టుకుంటుంది. అవునమ్మా అంటూ నటించేస్తుంది స్వప్న. ఇదంతా నీ వల్లే అంటూ కోప్పడతాడు రాజ్. తనని మీరు ఏమీ అనకండి నా కోసం గొడవ పడకండి కావాలంటే నేను సారి చెప్తాను అంటుంది స్వప్న. మీరు చెప్పడం ఏంటి అని రాజ్ అడిగితే మీ పరువు ప్రతిష్టల కోసం నేను ఏమైనా చేస్తాను అంటూ కావ్య దగ్గరికి వెళ్లి అతనికి నా మీద సాఫ్ట్ కార్నర్ ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ఎక్కువ చేస్తున్నావు అంటూ గట్టిగా సారీ చెప్తుంది.

నువ్వు ఇకనుంచి వెళ్తావా లేకపోతే సెక్యూరిటీని పిలవమంటావా అని రాజ్ అంటే అక్కర్లేదు నేనే వెళ్తాను జీవితంలో మళ్ళీ మీ ఇంట్లో అడుగు పెట్టను ఉంటుంది కావ్య. తరువాయి భాగంలో మీకు లేట్ అయినట్టుంది నేను డ్రాప్ చేస్తాను అంటాడు రాజ్. పర్వాలేదు అంటుంది స్వప్న. త్వరగా రా మనం ఆటోలో వెళ్ళటం ఎవరైనా చూసేస్తారు అని కంగారుగా స్వప్నని తీసుకొని ఆటో ఎక్కిపోతుంది కనకం.ఇదంతా ఇంద్రాణి గమనిస్తుంది.