Brahmamudi February 21 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో స్వప్న ఎక్కడుందో చెప్పండి నేను వెళ్లి తీసుకొని వస్తాను అంటాడు రాజ్. వద్దు బాబు మీరు అటు, తను కిట్టు అయితే మళ్లీ పుణ్యకాలం కాస్త అయిపోతుంది మీరు వెళ్లి రిలాక్స్ అవ్వండి అంటుంది కనకం. అది కాదండి మా వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని రాజ్ అంటే లేదు బాబు నేను మళ్ళీ తనకి ఫోన్ చేస్తాను మీరు వెళ్ళండి అంటూ మళ్లీ స్వప్నని తిట్టుకుంటూ ఆమెకి ఫోన్ చేస్తుంది కనకం.

స్వప్నని మెస్మరైజ్ చేస్తున్న రాహుల్..

మరోవైపు స్వప్న,రాహుల్ ఇద్దరు కులాసాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. రాహుల్ పాడుతూ ఉంటే స్వప్న మెస్మరైజ్ అయిపోతుంది. అంతలోనే టీవీలో స్వప్నని చూసిన కావ్య ఆ ప్లేస్ వెతుక్కుంటూ అక్కడికి వస్తుంది. లైవ్ టెలికాస్ట్ కాబట్టి ఇతను ఇక్కడే ఉంటుంది అయినా తను ఎక్కడ ఏం చేస్తుంది అనుకుంటూ అక్కడికి వచ్చిన వాళ్ళని స్వప్న ఫోటో చూపించి ఇతను ఇక్కడ ఉందా అని అడుగుతుంది.

వాళ్లు ఉన్నారు అని చెప్పటంతో అక్కడ పెళ్లి చూపులు పెట్టుకుని ఇక్కడ అక్క ఏం చేస్తుంది అంతా ఇంపార్టెంట్ పని ఏంటా అనుకుంటూ లోపలికి వెళ్తుంది కావ్య. మరోవైపు నడిరోడ్డు మీద బైక్ ఆగిపోవడంతో లిఫ్ట్ అడుగుతుంది అప్పు. ఎవరు లిఫ్ట్ ఇవ్వకపోవడంతో మా అమ్మ కోపంతో నరాలు తెంపుకొని వీణలు మీటుకుంటూ ఉంటుంది అంటూ చిరాకు పడిపోతూ ఉంటుంది. ఇంతలో అటువైపుగా వస్తున్న కళ్యాణ్ కానీ స్లోగా డ్రైవ్ చేస్తున్నందుకు డ్రైవర్ ని తిడుతూ ఉంటాడు.

కళ్యాణ్ ని ఒక ఆట ఆడుకుంటున్న అప్పు..

మామూలుగా ఆపితే ఆగరు అని కార్ కి రాయిచ్చుకొడుతుంది అప్పు. ఏదో సౌండ్ అయింది ఆపు అంటాడు కళ్యాణ్. కిందికి దిగిన ఏం జరిగింది అని డ్రైవర్ని అడుగుతాడు ఏదో జరిగింది అని డ్రైవర్ అంటే నీ భౌతికకాయాన్ని అగ్నికి ఆహుతి చెయ్య అంటూ కోపంతో మళ్లీ కార్ని డ్రైవ్ చేయమంటాడు. డ్రైవ్ చేస్తున్న డ్రైవర్ ఇందాక ఏదో తిట్టారు ఏంటది అని అడుగుతాడు. తిడితే తిప్పించుకో అంతేగాని అర్థం అడక్కు అంటాడు కళ్యాణ్. ఇంతలో వెనక సీట్ లో కూర్చున్న అప్పు ముందుకు వెళ్లి రైట్ తీసుకోమంటూ ఆర్డర్ వేస్తుంది.

సడన్ గా ఆ వాయిస్ విని వెనక్కి తిరిగి చూసి నువ్వెప్పుడు కార్ ఎక్కావ్ బ్రో అంటాడు కళ్యాణ్. నువ్వు కారు ఆపినప్పుడు అసలు ఈ కారు ఆగినట్లుగా చేసింది నేనే అంటూ జరిగిందంతా చెప్తుంది అప్పు. లిఫ్ట్ ఇవ్వకపోతే రాయితో కొడతావా అంటాడు కళ్యాణ్. లిఫ్ట్ ఇవ్వకపోతే ఏం చేయాలి అంటూ తను ఎక్కడికి వెళ్లాలో చెప్తుంది అప్పు. వెళ్లకపోతే ఏం చేస్తావ్ అని కళ్యాణ్ అంటే నా దగ్గర ఇంకా చాలా రాళ్లు ఉన్నాయి అంటుంది అప్పు. కర్మ అనుకుంటూ తను చెప్పిన చోటికి పోనివ్వమంటూ డ్రైవర్ కి చెప్తాడు కళ్యాణ్.

స్వప్న కి గోల్డ్ చైన్ ప్రెసెంట్ చేసిన రాహుల్..

మరోవైపు ఒక గోల్డ్ చైన్ తీసిన రాహుల్ ఇది నా కాబోయే భార్య కోసం చేయించాను అంటాడు. అంటే ఇతనికి నా మీద ఇంట్రెస్ట్ లేదా నాతో టైంపాస్ చేశాడా అనుకుంటుంది స్వప్న. నా కాబోయే భార్య ఎవరో తెలుసా అంటూ స్వప్న మెడలో ఆ నెక్లెస్ వేస్తాడు రాహుల్. మీ మెడలో వెయ్యకముందు వరకు ఈ నెక్లెస్ బాగుండేది మీ మెడలో వేసాక నీ ముందు చిన్నబోతుంది అంటాడు రాహుల్. నీలాంటి వాడికి భార్యగా ఉంటే ఇలాంటివి ఎన్నో గిఫ్ట్ లు వస్తాయి అనుకుంటుంది స్వప్న. నా జీవితంలోకి రాబోయే దేవకన్వి నువ్వే అంటాడు రాహుల్.

ఆ మాటకి షాక్ అవుతుంది స్వప్న. అయ్యో ఏంటి ఇలాగా మాట్లాడేసాను మీరు రాజ్ కి కాబోయే భార్య కదా తొందరపడి నా మనసులో మాట చెప్పేసాను నన్ను క్షమించండి నేను చాలా పెద్ద తప్పు చేశాను అంటూ తెగ నటించేస్తాడు రాహుల్. మీరు ఎందుకిలా ఫీలవుతున్నారు? మీరేమీ తప్పు చేయలేదు నాకు అసలు ఆ పెళ్లి మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అంటుంది స్వప్న. అయితే మీ మనసు దోచుకున్న ఆ అదృష్టవంతుడు ఎవరు అంటాడు రాహుల్. స్వప్న ఏదో చెప్పేంతలో అక్కడికి కావ్య వస్తుంది తనను చూసి ఇద్దరు షాక్ అవుతారు.

కావ్య ని బయటికి పొమ్మన్న రాజ్..

ఇక్కడ ఏం చేస్తున్నావ్ అని కావ్య అంటే పని మీద వచ్చాను అంటుంది స్వప్న. అక్కడ పెళ్లి చూపుల్లో అందరూ నిన్ను అడుగుతుంటే అమ్మ ఎంత కంగారు పడుతుందో నీకు తెలుసా అంటుంది కావ్య. సరే వెళ్దాం అని స్వప్న అంటే ఎలాగో వెళతాం కానీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పు అంటుంది కావ్య. తర్వాత చెప్తాను కానీ అక్కడ అమ్మ కంగారుపడుతుంది కదా అంటూ కావ్య మీద కేకలు వేసి వచ్చేస్తుంది స్వప్న. మరోవైపు కూర్చొని కూర్చొని బోర్ కొడుతుంది దగ్గర ఉన్న బ్యూటీ పార్లర్ లో ఎక్కడైనా ఉందేమో చూసి వస్తాను అంటాడు రాహుల్.

పెళ్లిచూపులు బ్యూటీ పార్లర్ లో జరిగితే బాగోవేమో అంటుంది కావ్య వాళ్ళ పెద్దమ్మ. అంతలోనే గుమ్మంలో కావ్య,స్వప్న కనిపిస్తారు. నా కూతురు వచ్చింది అంటూ రిలాక్స్ అవుతుంది కనకం. మీరు తనతో రావటం ఏంటి అంటాడు రాహుల్. తన కారు ట్రబుల్ ఇచ్చింది నేను క్యాబ్ లో వెళ్తూ తనని చూశాను తను ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది అందుకే నేను తీసుకువచ్చాను అంటూ అబద్ధం చెప్తుంది కావ్య. నీ జీవితంలో ఏదైనా మంచి పని చేసావంటే అది ఇది ఒక్కటే ఇంకా నువ్వు వెళ్ళు అంటాడు రాజ్.

అబద్దాలతో అందర్నీ నమ్మించిన స్వప్న..

వెళ్ళు అన్నట్లుగా బ్రతిమాలుతుంది కనకం. అమ్మ చాలా కోపంగా ఉన్నట్లుంది ఏదో ఒకటి చేసి కూల్ చేయాలి అనుకుంటుంది స్వప్న. గబగబా దంపతుల పాదాల మీద పడి నావల్ల లేట్ అయినందుకు క్షమించండి అంటుంది. నీ కూతురు నిన్ను మించిపోయింది అంటుంది కనకం వాళ్ల అక్క. నేను వచ్చేద్దామనుకొని వెళ్ళాను కానీ అక్కడ ఫేస్ ప్యాక్ లేట్ కావడం ఆ తర్వాత కారు ఆగిపోవడం అంటూ నోటికి వచ్చిన అబద్ధాలు చెప్తుంది స్వప్న. తన అక్క ఏడవడం చూసి ఎందుకు అని అడుగుతుంది కనకం.

ఇంత జాగ్రత్తగా అబద్ధం చెప్తుంది ఇంత బాగా పెంచినందుకు నీ పెంపకాన్ని మెచ్చుకుంటున్నాను అంటుంది కనకం వాళ్ళ అక్క. పాపం ఆ పిల్ల భయపడినట్లుగా ఉంది అంటుంది చిట్టి. ఆలస్యానికి కారణం చెప్పింది కదా ఇకనుంచి మీ మనసులో ఆ మూసుకొని తీసేయండి అంటాడు సీతారామయ్య. నువ్వు అంతా భయపడవలసిన అవసరం లేదు అంటుంది రాజ్ తల్లి. అయితే స్వప్న అందరికీ నచ్చినట్లేనా అంటుంది రుద్రాణి.

ఎంగేజ్మెంట్ చేసేసుకుందామంటున్న రుద్రాణి..

నాకు బాగా నచ్చింది కానీ మమ్మీకి నచ్చితేనే అంటాడు రాజ్. నాకు కూడా అన్ని విధాల నచ్చింది అంటూ గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది రాజ్ తల్లి. అయితే ఆలస్యం ఎందుకు ఈరోజే నిశ్చితార్థం పెట్టుకుందాం అంటుంది రుద్రాణి. ఇది కల నిజమా అంటూ తన ఎమోషన్ ని కంట్రోల్ చేసుకోలేక వాళ్ళ అక్కని గిల్లేస్తుంది కనకం. ఆవేశంలో కంట్రోల్ తప్పకు అంటుంది ఆమె అక్క. నచ్చిన తర్వాత ఆలస్యం ఎందుకు మన పిల్ల అనిపించుకుందాము అంటుంది రుద్రాణి. సీతారామయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో ఇప్పటికిప్పుడు పంతులుగారు ఎక్కడ దొరుకుతారు అంటుంది చిట్టి.

అదంతా నేను చూసుకుంటాను అంటుంది ఆ ప్రయత్నంలో ఉంటుంది రుద్రాణి. ఇప్పటికిప్పుడు ఎంగేజ్మెంట్ అంటే నాకెందుకు సంతోషంగా లేదు అనుకుంటుంది స్వప్న. మరోవైపు కారు దిగిన అప్పుని నీకు అడ్రస్ తెలుసు చెప్తాను అన్నావు కదా అంటాడు కళ్యాణ్. అదే అంటూ ఇల్లు చూపిస్తుంది అప్పు. డ్రాప్ చేసినందుకు థాంక్స్ చెప్పలేదు అని కళ్యాణ్ అంటే ఇల్లు చూపించినందుకు మీరు నాకు థాంక్స్ చెప్పలేదు ముందు మీరు నాకు థాంక్స్ చెప్పండి అంటూ అతను చేత థాంక్స్ చెప్పించుకుంటుంది అప్పు.

Brahmamudi February 21 Today Episodeపంతులు గారి మాటలకి షాక్ అయిన రుద్రాణి, కనకం..

మరోవైపు రాజ్ ని చూస్తే గుండె గుబేలు మంటుంది నా మనసు రాజ్ మీద నుంచి రాహుల్ మీదికి మళ్ళింది ముహూర్తం కుదరకపోతే బాగుండును అనుకుంటుంది స్వప్న. ఇద్దరి పేర్లు మీద చూస్తే మరొక మూడు నెలల వరకు ముహూర్తాలు లేవు అంటారు పంతులుగారు. ఆ మాటలకి స్వప్న రిలాక్స్ అవుతుంది కానీ రుద్రాణి,కనకం ఇద్దరు టెన్షన్ పడతారు. ఈ లోపుగా వాళ్లకి మా పూర్ బతుకులు తెలిసిపోతాయి అనుకుంటూ కుదరదు అంటూ కేక పెడుతుంది కనకం. అంత టైం దొరికితే పిల్లలు ఒకరికి ఒకరు అర్థం చేసుకుంటారు కదా అంటుంది రాజ్ వాళ్ళ తల్లి.

ఏం చెప్పాలో అర్థం కాక మా అక్క అంటూ ఆమె వీపు గిల్లుతుంది కనకం. ఏం చెప్పాలో అర్థం కాక నువ్వే చెప్పు చెల్లి అంటుంది కనకం వాళ్ళ అక్క. తరువాయి భాగంలో వచ్చే వారంలోని ముహూర్తం పెడతారు పంతులుగారు. మురవైపు స్వప్న ఫోన్ చేసి మిమ్మల్ని కలవాలి అంటే రాత్రికి మీ గేటు ముందు ఉంటాను అంటాడు రాహుల్. రెండు రోజుల్లో పెళ్లి పెట్టుకొని కనీసం రాత్రులు కూడా మీరిద్దరూ ఫోన్ మాట్లాడుకోవట్లేదు అంటే అసలు తనకి పెళ్లి ఇష్టమేనా అంటుంది రేఖ. ఇంతమందిని ఇంట్లో పెట్టుకొని తను బయటికి వెళ్ళటం ఏంటి అంటూ అనుమాన పడుతుంది అప్పు.