Brahmamudi February 24 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో నాకు కావలసింది మంచి చీరలు అవి అమ్మ తీసుకొచ్చింది అంటుంది స్వప్న. నీకు అక్కర్లేకపోవచ్చు కానీ నాకు కావాలి ఎందుకంటే నాకు నేనే తీర్చాలి అంటుంది కావ్య. నువ్వేమీ కట్టక్కర్లేదు అంటుంది కనకం. అయితే నువ్వే కట్టేవా ఎక్కడి నుంచి తెచ్చి కట్టావు అని నిలదీస్తుంది కావ్య.
కనకాన్ని నిలదీసిన అప్పు, కావ్య..
అక్కడికి వచ్చిన అప్పు ఇందాక నిన్ను చంపక్ లాల్ ఇంటి దగ్గర చూశాను పిలుస్తుంటే వచ్చేసావు అసలు నువ్వు అక్కడికి ఎందుకు వెళ్లావు అంటూ నిలదీస్తుంది. ఇల్లు భూములు తాకట్టు పెట్టుకొని ఎక్కువ వడ్డీకి డబ్బులు ఇస్తాడు కదా అలాంటి వాడి ఇంటికి నువ్వు ఎందుకు వెళ్లావు అంటుంది కావ్య. నేను అతని ఇంటికి వెళ్ళలేదు నేను వెళ్లే దారిలోనే అతని ఇల్లు ఉంది అంటూ మంత్రం లేకుండా సమాధానం చెబుతుంది కనకం. ఇంతకీ నువ్వు ఆ చీరలు ఎక్కడినుంచి తెచ్చావు చెప్పలేదు అంటూ రెట్టిస్తుంది కావ్య.
మీ పెద్దమ్మ కొన్నది అంటూ పెద్ద కట్టు కధ చెప్తుంది కనకం. ఏదో కథ చెప్పినట్లుగా చెప్తున్నావేంటి అంటుంది అప్పు. అయినా పెద్దమ్మ దగ్గర ఎందుకు తీసుకున్నావు తను ఎప్పటికీ మనకి చాలా సాయం చేసింది అంటుంది కావ్య. ఈసారి అడిగితే మా కావ్యకి ఇష్టం లేదు అని చెప్తానులే అయినా నాకు బోల్డు పెళ్లి పనులు ఉన్నాయి నాకు అస్సలు ఖాళీ లేదు అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది కనకం.
సీతారామయ్య అభిప్రాయం కనుక్కోమంటున్న చిట్టి..
మరోవైపు పెళ్లి పనులు హడావుడిలో ఉంటారు రాజ్ కుటుంబ సభ్యులు. మెహందీ ఫంక్షన్ కంపల్సరీ అంటారు పింకీ,రేఖ. పిల్లకి బంగారం కొనాలి అని చిట్టి అంటే ఎవరు కంగారు పడవలసిన అవసరం లేదు పెళ్లి తక్కువ టైంలో జరుగుతుంది కాబట్టి మొత్తం పెళ్ళంతా ఒక ఈవెంట్ కి అప్ప చెప్పేసాను అంటాడు సుభాష్. మావయ్య గారు ఎలా జరుగుతున్నది అని కోరుకుంటున్నారో అవన్నీ ఆ ఈవెంట్ వాళ్లకి తెలుస్తాయా అంటుంది రాజ్ పిన్ని.
నిజమే ఈ విషయంలో మీ నాన్నగారి అభిప్రాయం కనుక్కో అంటుంది చిట్టి. లేకపోతే ఆరోజు బావకి అక్షంతలు పడినట్లుగా ఇప్పుడు మనందరికీ అక్షింతలుపడతాయి అంటుంది రేఖ. వాడికి ఎలాగూ నిజంగా అక్షింతలు పడుతున్నాయి తర్వాత నీ వంతే అంటూ ఆట పట్టిస్తుంది రేఖ అంతలోనే అక్కడికి వచ్చిన సీతారామయ్య ఏంటి అందరూ కొలువుతీరి కూర్చున్నారు అంటాడు. పెళ్లి ఏ పద్ధతిలో జరగాలో బావ మిమ్మల్ని అడుగుతాడంట అంటుంది రేఖ.
భయంతో కంగారుపడుతున్న కావ్య..
ముందు నీ అభిప్రాయం చెప్పు అని సీతారామయ్య అంటే నాకు తెలుగింటి సంప్రదాయం ప్రకారం కావాలి అంటాడు రాజ్. అసలు ఈ పెళ్లి జరిగితేనే కదా అనుకుంటాడు రాహుల్. మా పెళ్లి 16 రోజుల్లో జరిగింది మీ నాన్న పెళ్లి ఐదు రోజులు జరిగింది కానీ నీకు ఒక్క రోజుతోనే సరిపెట్టాల్సి వస్తుంది. ఆ ఒక్క రోజులోనే తెలుగింటి పెళ్లి అంటే ఇలాగ చేయాలి అనే లాగా చేద్దాం అంటాడు సీతారామయ్య. అలాగా జరగటం కోసమే ఒక లిస్టు తయారు చేసి తీసుకు వచ్చాను అంటూ పంతులుగారు ఒక లిస్టు ఇస్తారు.
ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి నాకు తెలుసు నేను చూసుకుంటాను అంటాడు కళ్యాణ్. మరోవైపు అప్పు,కావ్య ఇద్దరూ పని చేసుకుంటూ ఉంటే అక్కడికి కళ్యాణ్ కి వస్తాడు. అమ్మో కవిగారు వచ్చారు అమ్మను గాని అక్కను గాని చూస్తే పెళ్లి ఆగిపోతుంది అంటూ అమ్మ వాళ్ళని బయటికి రాకుండా ఆపు అంటూ అప్పుని లోపలికి పంపిస్తుంది. తను కళ్యాణ్ కి ఎదురెళ్లి ఎక్కడికి వచ్చారేంటి అంటుంది.
నిజం చెప్పి తల్లి కూతుర్లకి షాకిచ్చిన అప్పు..
కళాకారులు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లాలి కదా మీ కళాకృతులు చాలా బాగున్నాయి ఇంట్లోకి పిలవరా అంటాడు కళ్యాణ్. పిలవను అంటుంది కావ్య. అదేంటి అలా అనేసారు అంటే మా ఇల్లు ఇరుకు మీరు ఇబ్బంది పడతారు అంటుంది కావ్య. మీరు సూటిగా మాట్లాడే పద్ధతి చూస్తే ముచ్చటేస్తుంది అంటాడు కళ్యాణ్ ఇంతకీ మీరు ఏ పని మీద వచ్చారో చెప్పలేదు అంటుంది కావ్య. తన దగ్గర ఉన్న లిస్టు ఇస్తాడు కళ్యాణ్.
మీ షాప్ దగ్గరికి వెళ్ళాను అక్కడ మీరు లేకపోవడంతో మీ కుర్రాడిని అడిగి అడ్రస్ తెలుసుకుని ఇక్కడికి వచ్చాను మాట్లాడు కళ్యాణ్. బయటికి రాబోతున్న కనకాన్ని మొహం మూసేసి ఇంట్లోకి తీసుకొని వస్తుంది అప్పు. ఏం జరిగింది అని కనకం అడిగితే నిజం చెప్తే గుండెలు చేస్తావ్ అంటూ కవి గారు వచ్చారు అని చెప్పింది అప్పు. ఆ మాటకి తల్లి కూతుర్లు ఇద్దరు షాక్ అవుతారు. చెప్పాను కదా గుండే ఆగుద్దని మీరు ఇక్కడే ఉండండి అతను ఎందుకు వచ్చాడో చూసొస్తాను అంటూ బయటికి వెళ్తుంది అప్పు.
కంగారులో నోరు జారిన కావ్య..
మా రాజ్ అన్నకి పెళ్లి కుదిరింది పెళ్ళికూతురు బెస్ట్ డిజైనర్ వాళ్ళు మా కన్నా బాగా డబ్బున్న వాళ్ళు. మా తాతయ్య గారు పెళ్లి సాంప్రదాయబద్ధంగా జరగాలని కోరుకుంటున్నారు అందుకే దానికి కావలసిన సామాన్లన్నీ మీ దగ్గరే కావాలి అంటాడు కళ్యాణ్. సాయంత్రం వస్తే ఇస్తాను అని కావ్య అంటే మీరే వచ్చి డెకరేట్ చేయాలి అంటాడు కళ్యాణ్. ఈ కాంటాక్ట్ తీసుకుంటే నావల్ల మా అక్క పెళ్లి ఆగిపోతుంది అనుకుంటుంది కావ్య. ఏం ఆలోచిస్తున్నారు అని కళ్యాణ్ అంటే నేను డెకరేట్ చేస్తాను అంటే మీ అన్నయ్య కుండలన్నీ బద్దలు కొడతాడు.
అయినా పెళ్లిళ్లు సీజన్ కదా నేను చాలా బిజీ మీ పెళ్లి కూడా ఎల్లుండే కదా అంటుంది కావ్య. ఆ మాటకి షాక్ అయినా కళ్యాణ్ నేను మీకు చెప్పలేదు కదా మీకు ఎలా తెలుసు అంటాడు. నోరు జారిన కావ్య మళ్లీ తమాయించుకొని అదే ఎల్లుండే కదా ఆఖరి ముహూర్తం అందుకే అలా చెప్పాను అంటుంది. మీ అలంకరణ మా తాతయ్య గారికి చాలా ఇష్టము మీరే అలంకరణ చేయాలి అంటాడు కళ్యాణ్. ఇంతలో అప్పు వచ్చి కావ్యని పనుంది అంటూ లోపలికి తీసుకు వెళుతుంది.
కళ్యాణ్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన రాజ్..
హే బ్రో ఎలా ఉన్నావు అంటూ ఆమెని పలకరిస్తాడు కళ్యాణ్. ఇంకొకసారి బ్రో అంటే బొందలో పెడతాను అంటూ కోప్పడుతుంది అప్పు. మరోవైపు రాజ్, కళ్యాణ్ కి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు అని అడుగుతాడు. కళావతి అని చెప్పి నోరు జారితాడు కళ్యాణ్. ఏంటి అంటాడు అదే కళాకారులని వెతుక్కుంటూ వెళ్తున్నాను అంటాడు కళ్యాణ్. పొరపాటున కూడా ఆ కళావతి ఇంటికి వెళ్ళకు వెళ్ళమంటే ఊరుకోను అంటాడు నీకు ఇష్టం లేని పని చేయను అంటాడు కళ్యాణ్.
నువ్వు ఈ కాంట్రాక్టు ఒప్పుకో అప్పులు తీర్చడానికి పనికొస్తాయి అంటుంది అప్పు. స్వప్న చెల్లిని అని తెలిస్తే పెళ్లి ఆగిపోతుంది అంటూ భయపడుతుంది కావ్య. అమ్మని చూసి ఎట్లా మేనేజ్ చేయడమో నేర్చుకో అంటూ ఆమె చేత ఒప్పిస్తుంది అప్పు. వచ్చినందుకే అన్నయ్య అంత సీరియస్ అయ్యాడు అందుకే ఈవిడ కూడా భయపడుతుంది వెళ్ళిపోదాం అనుకుంటాడు కళ్యాణ్. కానీ కావ్య వచ్చి తాతయ్య గారి కోసం అంటున్నారు కదా అందుకే ఒప్పుకుంటున్నాను అని చెప్పి షాక్ ఇస్తుంది.
తల్లికి నిజం చెప్పాలని ప్రయత్నిస్తున్న స్వప్న..
మీ అన్నయ్య మండపానికి వచ్చే లోపల డెకరేషన్ చేసి వెళ్ళిపోతాను అంటుంది కావ్య. అడ్వాన్స్ కావ్యకి ఇచ్చి రేపు కారు పిచ్చి మా డ్రైవర్ ని పంపిస్తాను అన్ని ఐటమ్స్ తీసుకొని రండి అని చెప్పి వెళ్ళిపోతాడు కళ్యాణ్. మరోవైపు రాహుల్ గురించి ఎలాగైనా చెప్పాలి అనుకుంటుంది స్వప్న. నగల్ని అందరికీ చూపిస్తూ ఉండగా అమ్మ నీతో మాట్లాడాలి అంటుంది వీళ్ళకి నాకలు చూపిస్తున్నాను ఉండు అంటే లేదు నీతో అర్జెంటుగా మాట్లాడాలి వాళ్ళు నాకు అలా చూస్తారులే అంటూ తనతో లాక్కొని వెళ్ళిపోతుంది గదిలోకి వెళ్ళిన తర్వాత అన్ని నగలు ఎప్పుడు కొన్నావు అని అడుగుతుంది.
నగలప్పాడ రోల్డ్ గోల్డ్ నగలుకొని చమన్ లాల్ దగ్గర బాక్సులు తెచ్చి అందులో పెట్టాను నిజమేనవే అనుకుంటున్నారు పిచ్చోళ్ళు అంటూ నవ్వుతుంది కనకం. ముందు నా గోల విను అని స్వప్న అంటుంది. అంతలోనే అక్కడికి వచ్చిన కనకం అక్క ఇదిగో మీకోసమే ఈ నగలు అన్ని తీసుకువచ్చాను అవి గిల్టు నగలని నాకు తెలుసు పెళ్లికి వెయ్యు ఆ తర్వాత తీసుకుంటాను అంటుంది.
రాజ్ ని చీదరించుకుంటున్న స్వప్న..
నువ్వు బాగా తెలివైన దానివి అని కనకం అంటే బంగారం గురించి పెద్ద క్లాస్ తీసుకుంటుంది ఆమె అక్క. మీది బంగారు లాంటి మనసు అక్క పదా వాళ్ళతో ఇది నా నగలనే చెప్దువు గాని అంటుంది కనకం. నువ్వు బాగా చూపిస్తావు అంటుంది ఆమె అక్క పెళ్లి అయిపోయిన వెంటనే హిట్ చేయాలి మరి అంటుంది పెళ్లి అయిపోయిన తర్వాత వీటితో నాకేం పని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు అక్క,చెల్లెలు ఇద్దరు.
అంతలోనే రాజ్ ఫోన్ చేయటంతో ఇప్పుడు ఫోను లిఫ్ట్ చేయకపోతే లేనిపోని డౌట్స్ వస్తాయి అంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది స్వప్న. నేను మిమ్మల్ని పెళ్లి పీటల మీదే చూడాలి అనుకున్నాను అప్పటివరకు మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు అనుకున్నాను ఇంతకీ మీరు ఖాళీయే కదా అంటాడు. ఎలాగైనా రాజుని వదిలించుకోవాలనుకున్న స్వప్న చెల్లి అంటేనే నగలు చీరలు వంటి చిన్న సైజు దుకాణం పెడతారు కదా అంటుంది స్వప్న. అవును అర్థం చేసుకోగలను ఓకే క్యారీ ఆన్ అంటాడు రాజ్.
Brahmamudi February 24 Today Episodeస్వప్న ఫోన్ ని అవాయిడ్ చేస్తున్న రాహుల్..
ఓకే బాయ్ అని ఫోన్ పెట్టెయ్యబోతుంది స్వప్న. ఒక్క నిమిషం అంటూ మిమ్మల్ని పెళ్లికూతురుగా ఎప్పుడు చూస్తానో అని ఉంది అప్పటివరకు నా ఊహల్లో మిమ్మల్ని ఊహించుకుంటాను అంటూ ఫోన్ పెట్టేస్తాడు రాజ్. ఫోన్లోనే భరించలేకపోయాను ఇంకా జీవితకాలం ఎలా భరిస్తాను ఇంతకీ ఈ రాహుల్ ఏం చేస్తున్నాడో అనుకుంటుంది స్వప్న. రాహుల్ అక్కడ మరో అమ్మాయిని ఫ్లర్ట్ చేస్తూ ఉంటాడు. ఏమైనా ప్లాన్ చేస్తున్నాడు లేదో అనుకుంటూ అతనికి ఫోన్ చేస్తుంది స్వప్న.
నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేసినా నేను లిఫ్ట్ చేయను నిన్ను ఎంత దూరం పెడితే మీలో అంత టెన్షన్ పెరిగి నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చేస్తావు అనుకుంటాడు రాహుల్. రాహుల్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇప్పుడు లిఫ్ట్ చేయకపోతే ఏంటి పెళ్లయ్యాక నాతోనే ఉంటాడు కదా అనుకుంటూ సంతోష పడిపోతుంది స్వప్న. తరువాయి భాగంలో అటువైపు ఇంట్లోని, ఇటువైపు ఇంట్లోనే కూడా పెళ్లి పనులు ప్రారంభమవుతాయి.