Brahmamudi February 6 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో బుట్ట వెళ్లి తెచ్చుకుందాం పద అని స్వప్న ని పడుతుంది కావ్య. నువ్వు స్వప్న కి చెల్లెలు అని తెలిస్తే ఇబ్బంది అవుతుంది అంటుంది కనకం. ఆ బుట్ట కనిపించకపోతే ఇంకా ఇబ్బంది అవుతుంది అంటుంది కావ్య. నీకెందుకు ఆ బుట్ట ఎలాగైనా తెచ్చి ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతుంది స్వప్న.

నటనలో జీవించేస్తున్న స్వప్న..

అంతలో ఫోన్ రింగ్ అవ్వటంతో ఎవరిది ఆ ఫోన్ అంటుంది కావ్య. ఇంకెవరిది కోటీశ్వరుడికి కాబోయే పెళ్ళానికి అంటూ నవ్వుతుంది అప్పు. అక్క ఫోన్ మర్చిపోయిందా? ఈ డబ్బులు ఎలా మారుతాయో తెలియదు తనకు ఏమైనా సమస్య వస్తే మనకి చెప్పుకోవటానికి తన దగ్గర ఫోన్ లేదు మనం ఇచ్చి వద్దాం రా అంటూ అప్పుని బ్రతిమాలి తీసుకొని వెళ్తుంది కావ్య.

మరోవైపు రాజ్ ని మీట్ అయిన స్వప్న మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్లు ఉన్నాను మీరు చాలా బిజీ పర్సన్ కదా అంటుంది స్వప్న. ఈరోజే మేనేజింగ్ డైరెక్టర్ గా కంపెనీలో అడుగుపెట్టబోతున్నాను అంటూ తన ఫ్యామిలీ మెంబర్స్ కి పరిచయం చేయడానికి తీసుకు వెళ్తాడు రాజ్. తన నానమ్మ అమ్మ పిన్నిని అందరినీ పరిచయం చేస్తే వాళ్ళ దగ్గర ఆశీర్వచనం తీసుకుంటుంది స్వప్న. నన్ను క్షమించండి మిమ్మల్ని డిస్టర్బ్ చేసి ఉంటాను అంటుంది స్వప్న.

కూపీ లాగుతున్న రుద్రాణి..

మీ ఇంటికి మీ కోడలు అడిగితే ఉందో లేదో తెలుసుకోవాలి అంటుంది వాళ్ళ అమ్మ. నిన్న రాత్రి చెవి బుట్ట పడిపోయింది అందుకే వచ్చాను అంటుంది స్వప్న. మీరు చాలా లుచ్చని చెప్పారు మీ అమ్మగారు చిన్న చెవి బుట్ట కోసం వచ్చారా అంటూ కూపి లాగుతుంది రుద్రాణి. చెవి బుట్ట చిన్నది కానీ అది మా అమ్మ నాకు బర్త్డే రోజు ఇచ్చింది. ఎన్ని రకాల జ్యువెలరీ ఉన్నా అమ్మ ప్రెసెంట్ చేసిన జువెలరీ నాకు ఇష్టము. బంగారం కన్నా బంధాలు ముఖ్యం కదా అంటూ నటించేస్తుంది స్వప్న.

అరువు తెచ్చుకొని ఉంటుంది అవతలి వాళ్ళు అరుస్తారని పరిగెత్తుకొచ్చింది అనుకుంటుంది రుద్రాణి. మరోవైపు స్వప్న కోసం వచ్చిన కావ్య వాళ్ళని గేటు ముందే ఆపేస్తాడు సెక్యూరిటీ. ఎందుకు పంపించు అని హక్కు అడిగితే రోజుకి 10 మంది వస్తారు ఉద్యోగాలు కావాలి అవి ఇవి అని వాళ్ల పర్మిషన్ లేకుండా పంపిస్తే మా ఉద్యోగాలు ఊడిపోతాయి అంటాడు సెక్యూరిటీ. మేము తప్పకుండా లోపలికి వెళ్ళాలి అని కావ్య అంటే వాళ్లు ఫోన్ చేసి మాకు ఇన్ఫార్మ్ చేయకపోతే మేము మిమ్మల్ని లోపలికి పంపించలేము అంటాడు సెక్యూరిటీ.

సెక్యూరిటీతో గొడవ పడుతున్న కావ్య,అప్పు..

వీళ్ళని బ్రతిమిలాడేది ఏంటి అంటూ లోపలికి పోనీకపోతే నేనేంటో చూపిస్తాను అంటూ ఎక్కడికో వెళ్తుంది అప్పు. ఈ బిడ్డకు ఏమి తక్కువ లేదు అంటాడు సెక్యూరిటీ. మరోవైపు తన చెవి రింగు ని స్వప్నకి ఇస్తూ ఇదిగోండి మీ అమూల్యమైన జ్ఞాపకం అంటూ ఆమె చేతిలో పెడతాడు రాజ్. ఒక అమ్మాయి తనకోసం వస్తే ఇంత త్వరగా ఇచ్చి పంపించేస్తాడా? వచ్చిన పని అయిపోయినా కూడా ఇంకా ఇక్కడే ఉండాలి అంటే ఎలా మేనేజ్ చేయాలి అంటూ ఆలోచనలో పడుతుంది స్వప్న.

తను వచ్చిన పని అయిపోయినట్లు ఉంది వెళ్తుందేమో అంటుంది రుద్రాణి. తనకి ఇంకా పరీక్షలు ఏమీ పెట్టకుండా ఎలా పంపించేస్తాను అనుకుంటుంది రాజ్ వాళ్ళ అమ్మ. అందరినీ టిఫిన్ చేసి టైం అయింది కదా టిఫిన్ చేసే వెళ్తుందిలే అంటే రాజ్ కూడా ఆ మాటకి వంత పాడతాడు. నాకు ఇంపార్టెంట్ మీటింగు ఉంది అయినా పెద్దవారు అడుగుతున్నారు కాబట్టి చేసే వెళ్తాను అంటుంది స్వప్న. ఉండాలని వచ్చావని నాకు తెలుసు అని లోపల అనుకుంటూ మీరు చాలా రిచ్ కదా, ఇంపార్టెంట్ కార్ లోనే వచ్చి ఉంటారు ఫాస్ట్ గానే వెళ్ళిపోవచ్చు లెండి అంటుంది రుద్రాణి.

నాకన్నా ముదురు అనుకుంటున్న రుద్రాణి..

అవునండి కారులోనే వచ్చాను డాడీకి ఇంపార్టెంట్ పని ఉందని డ్రాప్ చేసి వెళ్ళిపోయారు అంటుంది స్వప్న. నాకన్నా ముదురు లాగా ఉంది చూద్దాము ఎన్నాళ్ళు ఈ ఆట ఆడుతుందో చాలా సరదాగా ఉంది ఈ ఆట అనుకుంటుంది రుద్రాణి. ఇంతలో సెక్యూరిటీ ఫోన్ చేసి గేటు దగ్గర ఎవరో గొడవ పెడుతున్నారు అంటే వస్తున్నాను అంటూ బయలుదేరుతాడు రాజ్. మరోవైపు పిల్లల ముగ్గురివి జాతకాలు చూపించి రిచ్ సంబంధాలు వస్తాయో లేదో చూడమంటుంది పంతులు గారిని.

మీ రెండో అమ్మాయి కావ్య జాతకం చాలా బాగుంది మీరు ఊహించని గొప్పింటి సంబంధం వస్తుంది అంటే పోనీలే మా కోసం చాలా కష్టపడుతుంది తన జీవితం సుఖపడితే అంతే చాలు అంటుంది. మీ మూడో అమ్మాయి అపూర్వ జాతకం కూడా బాగానే ఉంది తను కూడా మీరు అనుకున్నట్లుగా రిచ్ సంబంధమే చేసుకుంటుంది అంటాడు పంతులుగారు. నా మాట వినకుండా నువ్వు మగరాయుడు లాగా తిరుగుతుంది తనకి కూడా అలాంటిది సంబంధం కుదిరితే మా పంట పండినట్లే ఇంతకీ మా పెద్దమ్మాయి జాతకం అంటూ స్వప్న జాతకం చేతిలో పెడుతుంది.

అసలు విషయం చెప్పి కనకానికి షాకిచ్చిన పంతులుగారు..

మీ పెద్దమ్మాయి జాతకమే కాస్త స్పష్టతవ్యస్థంగా ఉంది ఈ అమ్మాయికి కుజదోషం ఉంది ఇలాంటి వాళ్ళకి సంబంధాలు కుదరదు కుదిరిన ఒక పట్టానా నిలవవు అంటారు పంతులుగారు. మీరు అలా అనకండి దాని బుద్ధులన్నీ విరుచుగా ఉంటే దాని జాతకైలాపూర్గా తగలబడింది ఏంటి ఏదైనా మార్గం ఉంటుందేమో ఒకసారి చూడండి అంటూ బ్రతిమాలుకుంటుంది కనకం. ఒకే ఒక పరిష్కారం ఉంది స్వప్నకి కావ్య కవచం లాగా ఉంటుంది. కావ్య తోడు ఉన్నంతవరకు ఎలాంటి హాని ఉండదు అంటూ పరిష్కారం చెప్తాడు పంతులుగారు.

అందుకు సంతోషించిన కనుక్కో ఇప్పుడు తీసుకొస్తాను కాఫీ అంటూ ఆనందంగా వంటగదిలోకి వెళ్తుంది. మరోవైపు గేట్ దగ్గరికి వచ్చిన రాజ్,కావ్య ని చూసి నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. ఎంత వెళ్ళమన్నా వెళ్ళటం లేదు ఈ అమ్మాయి తో పాటు ఇంకొక అబ్బాయి కూడా వచ్చాడు మీ అంతు చూస్తాను అంటూ రౌడీలు తీసుకోవడానికి వెళ్ళాడు అని చెప్తాడు సెక్యూరిటీ. వాడు అబ్బాయి కాదు నా చెల్లెలు అని చెప్తుంది కావ్య. మళ్లీ అబద్ధం చెప్తుంది సార్ అంటాడు సెక్యూరిటీ. నువ్వు పగ ప్రతీకారాలు అంటూ మా ఇంటి వైపు తిరిగితే ఊరుకునేది లేదు.

కావ్య ని బయటికి గెంటేసిన రాజ్..

పైగా రౌడీలు అది ఇది అంటే అటెండ్ టు మర్డర్ కేసు పెడతాను అంటూ ఆమెని చేయి పట్టుకుని బయటికి తోసేస్తాడు రాజ్. ఇంతలో కావ్య ని గమనించిన స్వప్న ఇదేంటి ఈ టైంలో ఇక్కడికి వచ్చింది అంటూ పరిగెత్తుకుంటూ బయటికి వస్తుంది. స్వప్నని చూసిన కావ్య అక్క అంటూ పిలుస్తుంది. ఆ మాటలకి షాకేనా రాజ్ తనని ఎందుకు అక్కని పిలుస్తున్నావు తను నీకు ముందే తెలుసా అని అడుగుతాడు. కంగారుపడిన స్వప్న తను నాకు తెలియదు బహుశా నీ నుంచి తనని రక్షించుకోవడానికి నన్ను హెల్ప్ అడగడం కోసం అక్క అని పిలిచి ఉంటుంది నిన్న కూడా అలాగే పిలిచింది కదా అంటూ లోపలికి లాక్కొని వెళ్ళిపోతుంది.

నిన్నటి నుంచి నాకు ఒక విషయం అర్థమైంది దానివల్ల మీకు ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది అందుకే మీరు కాదు తనతో నేను మాట్లాడతాను అంటుంది స్వప్న. మీలాంటి వాళ్ళు అలాంటి రౌడీ పిల్లతో మాట్లాడడం ఏంటి అంటాడు రాజ్. మాట్లాడే తీరులో మాట్లాడితే ఎవరైనా వింటారు ఉండండి నేను మాట్లాడతాను అంటూ కాగానే తీసుకొని పక్కకి వెళ్తుంది స్వప్న. హ్యాపీగా ఉండడం నీకు ఇష్టం లేదా అంత నన్ను చూసి ఇంప్రెస్ అవుతున్నారు అనుకునే టైం కి నువ్వు ఇలా తయారయ్యావ్ ఏంటి? నీకు ఇక్కడ ఏం పని ఉందని వచ్చేవు.

స్వప్న ప్రవర్తనకి భయపడుతున్న కావ్య.

పోనీ వచ్చిన దానివి రాజ్ తో ఎందుకు గొడవ పడుతున్నావు అంటూ మందలిస్తుంది స్వప్న. నేను చెప్పేది ఒకసారి విను నువ్వు ఫోన్ మర్చిపోయావు అది ఇవ్వడానికే వచ్చాను అంటే ఇప్పుడు ఈ ఫోన్ మర్చిపోతే వచ్చిన నష్టం ఏంటి స్వప్న అంటే నగలు తీసుకోవటానికి కార్పొరేటర్ గారు వస్తానన్నారు ఆ బుట్ట వెతికావా అని అడుగుతుంది కావ్య. నీ తొక్కలో బుట్ట కోసం రాత్రి నుంచి నన్ను టార్చర్ పెడుతున్నావు అంటూ ఆ బుట్ట తీసి ఆమె చేతిలో పెడుతుంది స్వప్న. నీకు నాకు దూరం పెరిగినట్లుగా అనిపిస్తుంది భయంగా ఉంది అంటుంది కావ్య.

నీ మీద నాకు కోపం లేదు కానీ నువ్వు నా చెల్లెలు అని తెలిస్తే నన్ను కూడా రిజెక్ట్ చేస్తారేమో అని భయం అంటుంది స్వప్న. ఇంతలో రాజ్ వాళ్ళ అమ్మ రావటంతో అగో వాళ్ళ అమ్మ వచ్చేస్తుంది దయచేసి ఎక్కడ నుంచి వెళ్ళిపో అంటూ కావ్య కి చెప్పి పంపించేస్తుంది. తనతో ఏం చెప్పావు అని రాజ్ వాళ్ళ అమ్మ అడిగితే నాలుగు మంచి మాటలు చెప్పాను. మనలాంటి గొప్ప వాళ్ళ చుట్టూ ఇలాగ సాయం కోసం లేని వాళ్ళు ఎంతోమంది తిరుగుతూనే ఉంటారు మళ్లీ తను మిమ్మల్ని డిస్టర్బ్ చెయ్యదు అంటుంది స్వప్న. సరే టిఫిన్ చేద్దురుగాని రండి గుంటూరు లోపలికి తీసుకువెళ్తుంది రాజ్ వాళ్ళ అమ్మ.

Brahmamudi February 6 Today Episode స్వప్నను చూసి ఇంప్రెస్ అయిన రాజ్..

డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న స్వప్నని మాటల్లో పెట్టి ఎవరెవరు మీ ఇంట్లో ఉంటారు అని అడుగుతుంది రాజ్ వాళ్ళ అమ్మ. అందరి పేర్లు చెప్పి కావ్య దగ్గరికి వచ్చేసరికి ఆగిపోతుంది. కావ్య పేరు చెప్తే తిన్న ప్లేట్ కూడా లాగేసుకుంటాడు అనుకుంటుంది స్వప్న. ఎవరిదో పేరు చెప్పబోయి ఆగిపోయావు అంటుంది రుద్రాణి. లేదు మా నానమ్మ ఉండేది ఎవరైనా అడిగితే తన పేరు కూడా చెప్పేస్తూ ఉంటాను అంటుంది స్వప్న. ఉన్న వాళ్ళని గుర్తుపెట్టుకోవట్లేదు అలాంటిది లేని వాళ్ళని కూడా గుర్తుపెట్టుకుంటున్నారంటే మీరు గ్రేట్ అంటాడు రాజ్.

మరోవైపు టిఫిన్ చేయమ్మా అని రాజ్ వాళ్ళ పిన్ని అంటే తను ఆయిల్ ఫుడ్ తినదేమో నాలాగా ఓట్స్ తెప్పించు అంటాడు రాజ్. మా ఇంట్లో పండగలకు కూడా ఇన్ని ఐటమ్స్ చేయరు నా పొట్ట కొట్టొద్దు అని మనసులో అనుకుంటుంది స్వప్న. మీ దృష్టిలో డబ్బు ఇంపార్టెంటా,చదువు ఇంపార్టెంట్ ఆ అని అడుగుతాడు రాజ్.

తరువాయి భాగంలో నా పెద్ద కూతురికి పెద్ద సంబంధం చేయాలంటే ఏవేవో దోషాలు ఉన్నాయి అంటున్నారు. అవేవీ లేకుండా ఆ ఇంటికి కోడలు అయ్యేలాగా చెయ్యి తల్లి అంటూ దేవుడికి దండం పెట్టుకుంటుంది కనకం. మరోవైపు గుడిలో ఒకరిని ఒకరు చూసుకోకుండా గుద్దుకుంటారు రాజ్, కావ్య.