Brahmamudi February 8 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో ఎంత చదివినా బుర్రకి ఎక్కడం లేదు అంటూ చిరాకు పడుతుంది అప్పు. మీ బుర్రలో ఉన్న మట్టి తీసి దానికి ఇస్తే కుండ తయారు చేస్తుంది, అయినా ఏం చదువుతావు కానీ వెళ్లి డబ్బులు సంపాదించు అంటుంది స్వప్న.

రాజ్ తో పాటు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా ఇంప్రెస్ చేస్తున్న స్వప్న..

అన్ని విషయాల్లోనే డబ్బు ముఖ్యం కాదు చదువు సంస్కరాన్ని ఇస్తుంది. ఎప్పటికైనా మనతో ఉండే ఆస్తిచదువు మాత్రమే,డబ్బుంటేనే మనిషికి సమాజంలో విలువ. డబ్బు అవసరం మాత్రమే కాదు మనల్ని కన్నవాళ్ళ కోసం మనం కన్న వాళ్ళ కోసం ఏ లోటు రాకుండా చూసుకుని ఒక సాధనం అంటూ కావ్య చెప్పిన మాటల్ని రాజ్ ముందు అప్పజెప్తుంది స్వప్న.

ఆ మాటలకి కాస్త తో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఇంప్రెస్ అవుతారు. అలాంటిదే ఇంకొక క్వశ్చన్ అడుగుతాను అందం ముఖ్యమా తెలివితేటలు ముఖ్యమా అంటూ స్వప్నని అడుగుతుంది రేఖ. అందం కన్నా వ్యక్తిత్వమే ముఖ్యము అంటూ కావ్య మాటల్ని వాళ్లకి తప్పు చెప్తుంది స్వప్న. ఆ మాటలకి చప్పట్లు కొడతారు రాజ్, వాళ్ల కుటుంబ సభ్యులు.

కధకి నేనే సూత్రధారిణి అనుకుంటున్న రుద్రాణి..

నా కవిత్వం లాగే మీ సమాధానం కూడా కళాత్మకంగా ఉన్నాయి అంటాడు కళ్యాణ్. తను చాలా అద్భుతంగా చెప్పింది అని రాజ్ అంటే నేను కూడా అంతే అద్భుతంగా చెబుతాను కదా అంటూ అమాయకంగా మొహం పెడతాడు కళ్యాణ్. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు అని అడుగుతుంది రాజ్ వాళ్ళ అమ్మ. హస్త కళలు ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్ మా డాడీ చాలా బిజీగా ఉంటారు అంటూ నోటికి వచ్చిన అబద్ధం చెప్తుంది స్వప్న.

ఆ మాటలకి ఇంప్రెస్ అయిన రాజ్ అమ్మకి తను తప్పకుండా నచ్చుతుంది అనుకుంటాడు. తను నిన్నే కాదు నన్ను కూడా ఇంప్రెస్ చేసింది అని అనుకుంటాడు రాహుల్.వీళ్ళ తల్లిదండ్రుల గురించి తెలుసుకోవాలి అనుకుంటుంది రాజ్ వాళ్ళ అమ్మ. ఈ అమ్మాయి పాత్రధారుని మాత్రమే కధకి నేనే సూత్రధారిని అవుతాను. నీ తెలివితేటలు ఉన్న ఈ పేద ఇంటి అమ్మాయి ఈ గొప్పింటికి కోడలు అయితే అందర్నీ ఒక ఆట ఆడిస్తుంది అనుకుంటుంది రుద్రాణి.

బ్యాచ్ తో సహా దిగిపోయిన అప్పు..

మరోవైపు వెనక్కి వచ్చేస్తున్న కావ్యకి తన బ్యాచ్ తో బ్యాట్లు పట్టుకొని వస్తున్న అప్పుని చూసి వీళ్లంతా ఎవరు అని అడుగుతుంది. వీళ్లంతా నా బ్యాచ్ నేనే మెయింటైన్ చేస్తున్నాను వీళ్లంతా ఆ సెక్యూరిటీ గాడిని కోడిని మెడ విరిచినట్టు విరిచేస్తారు అంటుంది అప్పు. అక్కడ మన అక్క ఉంది అని కావ్య అంటే దాని పోయిన బుట్ట కోసం అది వచ్చింది దానికి ఏమి సెంటిమెంట్ లేవు దానికి ఫోన్ ఇవ్వడానికి వస్తే ఇంత గలట జరిగింది నిన్ను తిట్టిన ఆ రాజ్ ని ఆ సెక్యూరిటీ గాడిని వదిలేదే లేదు అంటూ ముందుకి ఉరుకుతుంది అప్పు.

నీకేమైనా పిచ్చా రౌడీయిజం చేస్తావా ఇప్పటికే ఆ రాజు వాళ్ళ పరువు పోయింది ఆ రాజ్ కి నా మీద ఇప్పటికే చాలా కోపంగా ఉన్నాడు ఇప్పుడు నువ్వు వెళ్లి గలాటా చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు అంటుంది కావ్య. ఏంటి నీ పిరికి ముచ్చట్లు వాడు పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు అని మనం తోకముడుచుకొని పోతామా అంటుంది అప్పు. పోనీలే మనకి కావలసినది బుట్ట అది దొరికింది కదా అంటూ తీసి చూపిస్తుంది కావ్య. ఎక్కడ దొరికింది పని అప్పు అడిగితే అక్కడే ఉన్నదంట అక్కిచ్చింది అని చెప్తుంది కావ్య.

ఇదంతా స్వప్న అక్క ప్లాన్ అంటున్న అప్పు..

ఇప్పుడు నాకు కథ మొత్తం అర్థమైంది అదే కావాలని అక్కడ వదిలేసి దానికోసం మళ్లీ ఆ రాజ్ వాళ్ళ ఇంటికి వెళ్లింది అంటూ స్వప్న మీద కోప్పడుతుంది అప్పు. అప్పుకి సర్ది చెప్పి తీసుకొని వెళ్ళిపోతుంది కావ్య. మరోవైపు మీ తల్లిదండ్రులని రేపు ఒకసారి రమ్మని చెప్పు నేను మాట్లాడాలి అంటుంది రాజ్ వాళ్ళ అమ్మ. న్యాయంగా అయితే నేనే రావాలి అని ఆమె అంటే అలాంటి ఫార్మాలిటీస్ ఏమి పెట్టుకోకండి దుగ్గిరాల ఫ్యామిలీ నుంచి ఇన్విటేషన్ వచ్చిందంటేనే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అంటూ లో లోపల ఎంతో ఆనంద పడిపోతుంది స్వప్న.

రాజ్ ఫోన్ నెంబరు ఎలాగైనా తీసుకోవాలి అంటూ అమ్మవాళ్ళు ఏ టైం కి రావాలో ఆ డీటెయిల్స్ అవి మాట్లాడటానికి ఏ నెంబర్ కి కాల్ చేయాలి అంటుంది స్వప్న. రాజు తన ఫోన్ నెంబర్ ఇద్దామనుకున్నా టైం కి వాళ్ళ బాబాయ్ వచ్చి పంతులుగారు ఫోన్ చేశారు కాసేపట్లో గుడి మూసేస్తారట అని చెప్తాడు. కంగారు పడుతున్న రాజ్తో మీ ఫోన్ నెంబరు నేను ఇస్తానులే నువ్వు వెళ్ళు అంటూ కంగారు పెట్టేస్తాడు రాహుల్. మరోవైపు పంతులుగారు స్వప్న కి చెప్పిన జాతకం గురించి ఆలోచిస్తూ నా పెద్ద కూతురు గొప్ప ఇంటికి కోడలు కావాలని కలలు కంటున్నాను.

అక్క,అమ్మ కోసం కోరుకుంటున్న కావ్య..

అది కూడా రాజ్ని బాగా ఇష్టపడుతుంది. జాతకంలో వచ్చే చిక్కులు, దోషాలు అన్నీ తొలగించి నువ్వే ఆ గొప్పింటికి కోడలు చేయాలి అంటూ దేవుడికి దండం పెట్టుకుంటుంది కనకం. మరి రేపు గుడిలో దేవుడికి దండం పెట్టుకుంటున్న కావ్య మా అమ్మ గొంతెమ్మ కోరికలని మా అక్క ఆకాశానికి వేసే నిచ్చెనని చూసి నవ్వుకుంటున్నావా? ఆ కోరికలు తీర్చకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళకి ఏ ఇబ్బంది రాకుండా చూసుకో అంటూ కోరుకుంటుంది కావ్య. తధాస్తు. నీకోసం కూడా ఏవైనా కోరుకో అమ్మ తధాస్తు అంటాను అంటారు పంతులుగారు.

నీకు కష్టంగా అనిపించినప్పుడు దేవుని కోరుకో అని పంతులుగారు అంటే అలాగే అంటుంది కావ్య. ఆ దేవుడు మనల్ని బొమ్మలుగా చేసి ప్రాణం పోస్తే నువ్వు ఆయననే బొమ్మను చేసి ప్రాణం పోస్తున్నావు బాగుంది మీ బొమ్మలాట అంటూ పంతులుగారు కావ్యని ఆశీర్వదిస్తారు. అంతలోనే అక్కడికి వస్తారు రాజ్ కళ్యాణ్. మరోవైపు పంతులుగారు ఈరోజు చాలా మంచి రోజు హోమాలు అవి చేశాము ఈ జలాన్ని గుడి అంతా జల్లు అని చెప్తారు పంతులుగారు.

మళ్లీ గొడవ పడుతున్న రాజ్, కావ్య..

అలాగే అంటూ గుడి చుట్టూ గంగాజలం జల్లుతుంది కావ్య. పట్టు వస్త్రాలు పంతులు గారికి ఇస్తే మీరు ప్రదక్షిణలు చేస్తూ ఉండండి నేను మీలోపు పూజికానిస్తాను అంటారు ఆయన. ప్రదక్షిణలు చేస్తున్న రాజ్, కావ్య అనుకోకుండా ఒకరికొకరు గుద్దుకుంటారు. నీవల్ల నా డ్రెస్ పాడైపోయింది అంటూ కేకలు వేస్తాడు రాజ్. పట్టుకోకపోతే పడిపోయే వాడివి అంటుంది కావ్య. పడేవాడును కంట్రోల్ చేసుకునేవాడిని నీకెందుకు అసలు నువ్వు ఎక్కడ కూడా ఎందుకు తయారయ్యావ్ అంటూ కేకలు వేస్తాడు.

ఈ గలాటా చూస్తున్న అప్పు అరటి పండు తింటూ తొక్క విసిరేస్తుంది. దానిమీద పడ్డ కళ్యాణ్ కాలుజారి అప్పు మీద పడతాడు. నీకు కళ్ళు దొబ్బాయా అంటూ కేకలు వేస్తుంది అప్పు. ఆరోజు నా డ్రెస్ మీద కలర్ వేసావు ఈరోజు ఈ డ్రెస్సు పాడు చేసావ్ అని రాజ్ అంటే రెండు కలిపి వాషింగ్ మిషన్ లో వేసుకోండి అంటుంది కావ్య. నాకు సారీ చెప్పు అయినా నాకు ఎందుకు తగిలేవు అంటాడు రాజ్. నేనేమీ కావాలని తగల్లేదు పిల్లలు తరుముకుంటూ వచ్చి మీకు తగిలేరు నీ వెనుక నేను ఉన్నాను కాబట్టి మీరు నన్ను తగిలారు.

నా పరువు తీశారంటున్న కావ్య..

అప్పుడు మీరు తూలి పడిపోతే నేను పట్టుకున్నాను అంటుంది కావ్య. ఎందుకు నాకు బీపీ తెప్పిస్తున్నావు అని రాజ్ అంటే మీరే నా పరువు తీస్తున్నారు అంటుంది కావ్య. కొన్నది అగ్గిపెట్టె అంత షాపు దానికి పరువు కూడా నా అంటాడు రాజ్. ఆ చిన్న షాపులో పనిచేసే నేను వస్తే తప్ప మీ ఇంట్లో గణపతి హంగులు పూర్తవ్వలేదు అంటుంది కావ్య. నువ్వేమీ ఉత్తనే చేయలేదు డబ్బులు ఇచ్చాను అంటాడు రాజ్. నీతో మాట్లాడితేనే చిరాగ్గా ఉంది పోయేకాలం నుంచి అంటాడు రాజ్. సేమ్ టు యు అంటూ ఉంది కావ్య.

నన్నే పో అంటావా ఇది నిజంగానే మా తాత గుడి అని రాజ్ అంటే అయితే భక్తులకి ప్రవేశం లేదు అని బోర్డు పెట్టండి అంటూ మాట మాట పెంచుకుంటారు రాజ్, కావ్య. వాళ్ల గొడవ ఆపటానికి వెళ్తున్న కళ్యాణ్ ని ఆపేస్తుంది అప్పు. నేను వెళ్లి గొడవ ఆపాలి అంటే నువ్వు ఆపకూడదని నేను నిన్ను ఆపుతున్నాను అంటూ కళ్యాణిని ఆపేస్తుంది అప్పు. మరోవైపు రాజ్ ఫోన్ నెంబర్ తో పాటు ఒక సౌందర్య ఆరాధకుడు నెంబర్ కూడా సేవ్ చేస్తున్నాను అంటాడు రాహుల్. మీ కవిగారి భాష మీకు కూడా వచ్చినట్లుగా ఉంది అంటుంది స్వప్న.

Brahmamudi February 8 Today Episodeస్వప్నను మించి గొప్పలు చెబుతున్న రాహుల్..

ఏం చేస్తాం వద్దన్నా వినిపిస్తుంటాడు అంటాడు రాహుల్. మీరు చాలా ఫన్నీగా మాట్లాడుతున్నారు అని స్వప్న అంటే ఫన్నీ గా మాట్లాడే అబ్బాయిలకి అమ్మాయిలు పడిపోతారంట అంటాడు రాహుల్. నా నెంబరు ఎందుకు సేవ్ చేసావని అడుగుతారేమో ఒకవేళ రాజు లిఫ్ట్ చేయకపోతే నాకు కాల్ చేయండి ఎందుకంటే రాజ్ ఎప్పుడు నాతోనే తిరుగుతూ ఉంటాడు అంటాడు రాహుల్. నిజం చెప్పండి మీరు అతనితో తిరుగుతారా అతను మీతో తిరుగుతాడా అంటుంది స్వప్న.

ఎవరు ఎవరితో తిరిగినా బిజినెస్ లు అన్ని చూసుకునేది నేనే. బిజినెస్ నేర్పించింది నేను ఎంతైనా నేను చూసుకున్నంత బాగా అతను చూసుకోలేదు ఇంకా అలవాటు అవలేదు అంటాడు రాహుల్. మీతో మాట్లాడుతుంటే టైమే తెలియడం లేదు అంటూ బయలుదేరిపోతుంది స్వప్న. డ్రైవర్ పొజిషన్ ఏంటి వస్తాడా ఏంటి కనుక్కోండి అంటాడు రాహుల్. నా పరువు పోయేలాగా ఉంది అనుకుంటుంది స్వప్న.

ఆలోచిస్తారేమీ కాల్ చేయండి అని రాహుల్ అంటే ఏదో నెంబర్ కి కాల్ చేసి అవతల నుంచి ఏమీ మాట్లాడకపోయినా ఇవతల నుంచి మాత్రం నేను ఏం చెప్పాను నువ్వు ఏం చేస్తున్నావు వెళ్ళిపోయావా స్టుపిడ్ అంటూ ఏదేదో మాట్లాడేస్తుంది స్వప్న. తరువాయి భాగంలో ఇంటికి వచ్చిన స్వప్న ఆ ఇంటికి నేను కోడలు కాబోతున్నాను, మిమ్మల్ని వాళ్లు రమ్మన్నారు అంటుంది స్వప్న. అదే విషయం భర్తకి చెప్తే నేను బొమ్మలుకి రంగులు వేస్తాను కానీ మనసుకి రంగులు వేసుకోలేను నేను రాను అని చెప్తాడు కృష్ణమూర్తి.