Brahmamudi January 26 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో ప్రెస్టేజ్ గురించి మాట్లాడుతున్న కనకం తో ఎప్పుడైనా ముఖాన్ని కారద్దంలో చూసుకున్నావా అంటాడు డ్రైవర్. కారు డ్రైవరు ఓనర్ తో అలాగా మాట్లాడుతాడు ఏంటి అంటాడు ఆ మేనేజర్. ఆ కారు ఈవిడది కాదు దొంగ మొహం ది అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఆ డ్రైవర్. నేను కిందన వెయిట్ చేస్తాను ఆయన ఏమైనా ఇస్తే అయి మీరే పుచ్చుకోండి అంటూ అక్కడి నుంచి కామ్ గా పారిపోతుంది కనకం పిఏ.
బ్యూరో మేనేజర్ తో చాలెంజ్ చేసిన కనకం..
కనకాన్ని చూసిన మేనేజర్ ఎన్నెన్ని కూతలు కూసావు, మా మ్యారేజ్ బ్యూరో చూడడానికి రిచ్ గా ఉంది కానీ సంబంధాలు అన్ని పూర్ గా ఉన్నాయని అంటావా? అలాంటి నువ్వు అల్లుడికి వచ్చే ఆస్తి గురించి లెక్కలేసుకుంటున్నావా, అయినా కడుపుకి రిచ్ గా అన్నం తింటున్నావా పూర్ గా గడ్డి తింటున్నావా అంటూ గడ్డి పెడతాడు మేనేజర్. డబ్బున్న వాళ్ళ ఇంటికి కోడలుగా చేయాలని ఏ పిల్ల తల్లిదండ్రులు కోరుకోరు అంటుంది కనకం.
దుగ్గిరాల ఇంటికి ఈ జన్మలోనే కాదు ఏ జన్మలోని అందుకోలేవు అంటాడు మేనేజర్. చేసి చూపిస్తాను నా కాళ్లు పట్టుకుంటావా అని అడుగుతుంది కనకం. పెళ్లి మాట తర్వాత ముందు ఈరోజు వాళ్ళింట్లో జరిగే ఫంక్షన్ కి పాస్ సంపాదించు అప్పుడు నీ కాళ్లు పట్టుకుంటాను అంటాడు మేనేజర్. ఎలాగైనా పాస్ సంపాదించి నా కూతుర్లని అక్కడికి తీసుకు వెళ్తాను అని శపథం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కనకం. మరోవైపు ఇంట్లో జరిగే ఫంక్షన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు దుగ్గిరాల కుటుంబ సభ్యులు.
అరగంటలోగా రావాలి అంటూ ఆర్డర్ వేసిన రాజ్..
ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి అని సీతారామయ్య అడిగితే బాగానే జరుగుతున్నాయి అంటాడు రాజ్. అన్ని ఓకే అంటున్నావు కానీ విగ్రహం ఏది అని అడుగుతుంది వాళ్ళ అత్త. ఇంకా రాలేదా అని సీతారామయ్య అడిగితే వచ్చేస్తుంది అంటాడు రాజ్. ముహూర్తం దాటక ముందే విగ్రహాన్ని తెమ్మని చెప్పు అంటాడు సీతారామయ్య. అలాగే అంటూ వాళ్ళ మేనేజర్ కి ఫోన్ చేస్తాడు రాజ్. విగ్రహం రావడానికి ఇంకా ఎంత టైం పడుతుంది అంటే కనుక్కొని చెప్తాను అని ఆ మేనేజర్ కావ్య అని ఎంత టైం పడుతుంది అని అడుగుతాడు అరగంటలో అయిపోతుందని చెప్పండి అంటుంది కావ్య.
అరగంటలోగా పూర్తవ్వాలి డామేజ్ లేకుండా ఇక్కడికి షిఫ్ట్ చేయండి అంటూ ఆర్డర్ వేస్తాడు రాజ్. అంతలోనే అక్కడికి వచ్చిన వాళ్ళ నాన్నమ్మ ఏదైనా సమస్య అని అడుగుతుంది. ఏమీ లేదు నానమ్మ అని రాజ్ అంటే మరి ఎందుకు ఇంత లేట్ అని అడుగుతుంది వాళ్ళ అమ్మ. విగ్రహాన్ని స్పెషల్ గా చేస్తున్నాను అమ్మ మొదటిసారిగా తాతయ్య నాకు ఈ బాధ్యత అప్పచెప్పారు అంటాడు రాజ్. ఈసారి వినాయకుడు రుచిగా కనిపిస్తాడు ఎందుకంటే ఒరిజినల్ నగలతో వినాయకుడిని అలంకరించబోతున్న అంటాడు రాజ్.
ఆడంబరం అవసరమా అంటున్న నానమ్మ..
అంత పెద్ద విగ్రహానికి బంగారు నగలు అంటే మామూలు విషయం కాదు అంటుంది రుద్రాణి. ఇంత ఆడంబరం అవసరమా అంటుంది వాళ్ళ నాన్నమ్మ. తాతకి ఈ విషయం చెప్పావా అని వాళ్ళ అమ్మ అడిగితే లేదు ఒకేసారి సర్ప్రైజ్ చేద్దామని చెప్పలేదు అంటాడు రాజ్. ఇంతకీ నగలేవి నగిసి అవి ఎలా చెప్పారో నేను చూస్తాను అంటుంది వాళ్ళ పిన్ని. ఇప్పుడే వెళ్లి తీసుకొస్తాను అంటూ తోడుగా కళ్యాణ్ ని తీసుకువెళ్తాడు రాజ్. కారులో వెళ్తున్న రాజ్ వాళ్ళు ట్రాఫిక్ లో ఆగుతారు.
అక్కడ అడుక్కుంటున్న వృద్ధ దంపతులను చూసి బాధపడతాడు కళ్యాణ్. వీళ్ళకి కొడుకులు ఉండరా చూస్తే బ్రతికి చెడిన వాళ్ళ లాగా ఉన్నారు మనిషి మనిషికి ఒక కథ గుండె గుండెకో వ్యధ అంటాడు. ఆ మాటలకి ఫీలైన రాజ్ వాళ్ళని పిలిచి 2000 ఇస్తాడు. కళ్యాణ్ నవ్వుతుంటే ఎందుకు నవ్వుతున్నావు అని అడుగుతాడు. నువ్వు ఇచ్చే 2000 వాళ్లకి ఏమాత్రం ఆ డబ్బులు అయిపోగానే మళ్ళీ అదే పని చేయాలి అంటాడు కళ్యాణ్.
కనకాన్ని తిట్టుకుంటున్న ఆమె భర్త..
మరోవైపు విగ్రహం డెలివరీ తీసుకుంటున్న మేనేజర్ 4000 కావ్య తండ్రి చేతిలో పెడతాడు. మనం మాట్లాడుకున్నది 5000 కదా 4000 ఎందుకు ఇస్తున్నారు అని అడిగితే నగలు వేయలేదు కదా అంటాడు ఆ మేనేజర్. నగలు మేము వెయ్యము అనలేదు కదా అంటే మీ అమ్మాయి నీకు లాగా కాదు అంటూ 5000 చేతిలో పెట్టి వెళ్లిపోతాడు ఆ మేనేజర్. ఎందుకమ్మా అతనితో గొడవ ఈ రోజుల్లో ఈ కళకి విలువ ఇచ్చే వాళ్ళు ఎవరు అంటాడు కావ్య తండ్రి. ప్రతీకలకి ఎప్పుడూ విలువ ఉంటుంది నాన్న మన కాళ్ళకి మనమే విలువ ఇచ్చుకోకపోతే ఇలాంటి వాళ్ళకి పని అయిపోతుంది అంటుంది కావ్య.
సరే ఈ 2000 అమ్మకి ఇవ్వు అంటుంది కావ్య ఎందుకు అని అడిగితే అమ్మకి ఏదో అవసరం వచ్చిందని రామలక్ష్మి దగ్గర డబ్బు తీసుకుందంట రాగానే లిఫ్ట్ చేయమని చెప్పింది ఇంతకీ అమ్మేది అని అడిగితే నిచ్చని కొనడానికి వెళ్ళింది అని చెప్తాడు ఆమె తండ్రి. ఎందుకు అని కావ్య అడిగితే ఆకాశానికి నిచ్చెన వేయటానికి, తను డబ్బున్న సంబంధం మాట్లాడటానికి వెళ్ళింది తను నేల మీద నడవటం మానేసి చాలా రోజులైంది అంటూ బాధపడతాడు ఆమె తండ్రి.
కూతురు కోసం బాధపడుతున్న కావ్య తండ్రి..
ఈ కళ మీకు నేర్పినందుకు బాధపడాలో సంతోషించాలో అర్థం కావడం లేదు ఈ కళ్ళతోనే ఇప్పుడు నువ్వు వింతల బాధని పోషించవలసి వస్తుంది ఇది నీ తల్లి ఎప్పుడు అర్థం చేసుకుంటుందో ఏంటో అంటూ కన్నీరు పెట్టుకుంటాడు కావ్య తండ్రి. ఇంతలో కనకం ఫోన్ చేస్తుంది పాపి చిరాయి చూడు ఇప్పుడే తలుచుకుందాము అప్పుడే ఫోన్ చేసింది అంటూ లిఫ్ట్ చేస్తాడు ఆమె తండ్రి. ఎక్కడున్నావు అని భార్యని అడిగితే నువ్విచ్చిన విమానంలో నేను ఆటోలో ఉన్నాను అంటుంది కనకం. ఆకాశం నుంచి ఆటోలోకి పడిపోయావా అంటాడు ఆమె భర్త. అసలే చిరాకులో ఉన్నాను నన్ను చిరాకు పెట్టకండి అయినా కావ్య అని డబ్బులు అడిగాను ఆ డబ్బులు పట్టుకొని ఇంటికి వచ్చేయండి మీతో అర్జెంటుగా మాట్లాడాలి అంటూ ఫోన్ పెట్టేస్తుంది కనకం.
ఏంటో అంత అర్జెంటు బిల్ గేట్స్ అపాయింట్మెంట్ అడుగుతుందో ఏంటో అంటూ కూతురితో నవ్వుతాడు కావ్య తండ్రి. మరోవైపు కారులో వస్తున్న రాజ్ పూజకి లేట్ అయిపోయింది లేట్ అయితే అసలు తాతయ్య ఊరుకోరు లిస్ట్ ప్రకారం అన్ని వచ్చాయో లేదో చూడు అంటాడు. అని చెక్ చేస్తాడు కళ్యాణ్. దేవుడికే ఇన్ని నగలు చేయించావు అంటే కాబోయే వదినకి ఇంకెన్ని నగలు చేయిస్తావో అని నవ్వుతాడు. అంతలో అటువైపే సైకిల్ మీద వెళుతుంటుంది కావ్య. రాజ్ సడన్ బ్రేక్ వేయడంతో ఆ కారు గుద్దుకొని కింద పడిపోతుంది కావ్య. మీకు ఏమి కాలేదు కదా అంటూ పరిగెత్తుకొస్తాడు కళ్యాణ్.
పేదవాళ్లు అంటూ పొగరుగా మాట్లాడిన రాజ్..
పగిలిపోయిన బొమ్మల్ని చూసి ఎంత ఆర్టిస్టిక్ గా ఉన్నాయి, సారీ అండీ ఇంత మంచి బొమ్మలు పగిలిపోయినందుకు అంటాడు కళ్యాణ్. అప్పుడు తన బొమ్మలన్నీ పగిలిపోయి ఉండడం గమనిస్తుంది కావ్య. త్వరగా లేట్ అవుతుంది రా అంటూ కళ్యాణ్ ని పిలుస్తాడు రాజ్. అక్కడ ఉన్న అందరూ రాజ్ ని కార్ దిగమని డిమాండ్ చేస్తారు. ఏం జరిగిందని గోల చేస్తున్నారు ఏమి జరగలేదు కదా అని రాజ్ అంటే బొమ్మలని పగిలిపోయాయి కదా అంటారు వాళ్ళు. పగిలింది బోడి బొమ్మలే కదా డ్యామేజ్ ఎంతయిందో చెప్తే పడేస్తాను అంటాడు రాజ్.
ఆ మాటలకి కోపగించుకున్న కావ్య ఏం పడేస్తావు, మిస్టర్ అయినా మనిషి కింద పడితే కనీసం ఏం జరిగిందో అని జాలి కూడా లేకుండా అలాగ మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడినా చెల్లి పోతుందని డబ్బు పొగరా అంటుంది కావ్య. మీలాంటి వాళ్లకి మాలాంటి వాళ్ళని చూస్తే ఎప్పుడూ జలసే అందుకే పొగరు అహంకారం అంటూ ఏవేవో పేర్లు పెట్టి తృప్తి పడుతుంటారు అయినా బొమ్మలు విరిగిపోతే ఎందుకు ఇంత సీన్ చేస్తున్నారు అంటాడు రాజ్. నేను కష్టపడి ఆ బొమ్మలకి జీవం పోస్తే నువ్వు ఆఫ్ట్రాలంటే తీసి పడేస్తావా నీ కళ్ళకి కళ కనబడదా అని అడుగుతుంది కావ్య.
రాజ్ కి సర్ది చెప్తున్న కళ్యాణ్..
నువ్వు నీ కలని మ్యూజియం కి డొనేట్ చేస్తున్నావా అమ్ముకోడానికే కదా మరి ఇంకేంటి ఆ డబ్బు నేనే ఇస్తానన్నాను కదా ఎంత చెప్పు వెయ్యా? పదివేలా? అంటూ 20000 ఆమె చేతిలో పెట్టి వెళ్ళిపోబోతాడు రాజ్. అతన్ని ఆపి నీకు అంత డబ్బు ఉంటే నీ ఒంట్లో పెరిగిపోయిన కొవ్వుని కరిగించుకోవడానికి ఉపయోగించు అంటూ ఆ డబ్బుని ఇవ్వబోతుంది కావ్య. ఆ మాటలకి కోపం దించుకున్న రాజ్ నేను ఎవరో తెలుసా అని అడుగుతాడు. కలని గుర్తించలేని నువ్వు ఎవరైతే నాకేంటి అంటుంది కావ్య. గొడవ పెద్దదవుతుంది అని గ్రహించిన కళ్యాణ్ కళాకారులకి వాళ్ళు తయారుచేసిన వస్తువు మీద సెంటిమెంట్ ఉంటుంది నువ్వే కొంచెం అర్థం చేసుకో అంటాడు.
నువ్వే అర్థం చేసుకో డబ్బు కోసం ఇదంతా వీళ్ళందరూ ఆడుతున్న నాటకం అంటాడు రాజ్. ఆ మాటలకి కోపంతో సారీ చెప్పమంటుంది కావ్య. నేనెందుకు సారీ చెప్పాలి అని అంటే ఈ ఇరుకు సందులోకి కారు తెచ్చినందుకు వెనక ముందు ఎవరు వస్తున్నారు చూడకుండా సడన్ బ్రేక్ వేసినందుకు అంటుంది కావ్య. అందులో నా తప్పులేదు అని రాజ్ అంటే అది తర్వాత విషయం కానీ నా కళ్ళని తక్కువ చేసినందుకు మాత్రం సారీ చెప్పి తీరాలి అంటుంది కావ్య. నోరు వేసుకొని పడిపోయినంత మాత్రాన నేను సారీ చేస్తాను అనుకున్నావా ఏం చేసుకుంటావో చేసుకో అంటూ కళ్యాణ్ ని కారు ఎక్కమని కారు ముందు పోనిస్తాడు రాజ్.
రాజ్ పొగరు దించిన కావ్య..
ఎదురుగా రాయపట్టుకునించిన కావ్య ని చూసి కార్ ఆపేస్తాడు. అంతలో అటువైపే వచ్చిన కనకం డ్రైవర్ బాబు నువ్వు వెనక్కి పోనీ ఈ గొడవ ఇప్పుడప్పుడే తేలదు అంటుంది. ఇక్కడినుంచి సారీ చెప్పకుండా కదిలితే నా బొమ్మలు పగిలినట్టే నీ కారు అద్దం కూడా పగిలిపోతుంది అంటూ బెదిరిస్తుంది. లేట్ అయితే తాతయ్య కోప్పడతారు ఈ విషయం ఇక్కడికి ఆగేలాగా లేదు సారీ చెప్పేయ్ అంటాడు కళ్యాణ్. తప్పనిసరి పరిస్థితుల్లో సారీ చెప్పిన రాజ్ తో విసిరిపారేయటానికి మీ దగ్గర కోట్లు ఉండి ఉండవచ్చు కానీ కష్టపడి సంపాదించే మాకు దానికి సరిపడా డబ్బులు మాత్రమే తీసుకుంటాం అంటూ మిగతా సొమ్ముని అతని చేతిలో పెడుతుంది.
వెళ్ళిపోతున్న కావ్యతో జీవితంలో నాకు ఎప్పుడూ ఎదురు పడకుండా చూసుకో అంటాడు. సేమ్ టు యు అంటుంది కావ్య. కారులోకి వస్తున్న కళ్యాణ్ ఎదురుగా ఉన్న వాళ్ళ కారుని చూసి అన్నయ్య ఇది మన కంపెనీ కార్ లాగే ఉంది వాళ్ళు మన ఎగ్జిక్యూటివ్ లాగా ఉన్నారు అసలు ఏం జరుగుతుంది అంటాడు. ఒక ఆరు మనదే ఆ ఎగ్జిక్యూటివ్ లు మనవాళ్ళే అంటూ కారు దిగి ఇందాక ఆడుకుంటున్న ముసలి వాళ్ళతో వీళ్ళు మా వాళ్లే మిమ్మల్ని మంచి ఆశ్రమంలో చేర్పిస్తారు అంతవరకు ఈ డబ్బులు ఉంచండి అంటూ డబ్బులు వాళ్ళ చేతిలో పెడతాడు రాజ్. నీకు మంచి భార్య దొరకాలి నీ బిడ్డలు నిన్ను బంగారం లాగా చూసుకోవాలి నా బిడ్డల్లాగా కాకూడదు అంటూ ఆ ముసలమ్మ ఆశీర్వదిస్తుంది.
భర్తని ఆడిపోసుకుంటున్న కనకం..
నువ్వు నాకు ఎప్పటికీ అర్థం కావు అని కళ్యాణ్ అంటే నీ కవిత్వం కన్నానా అంటూ నవ్వుతాడు రాజ్. కోపంతో పసుపు నూరుతున్న కనకాన్ని ఏంటో నూరుతున్నావు అని అడుగుతాడు ఆమె భర్త. మీరు కొనిచ్చిన బంగారాన్ని అరగదీసి కరగదీసి నూరుతున్నాను దాంతోని హారాలు చేయించుకుందామని అంటుంది కనకం. కాసేపు ఆగితే నీ కూతురు కావ్య వచ్చి వాటికి రంగులు వేస్తుందిలే అంటాడు ఆమె భర్త. అసలు నేను దేనికి వాగుతున్నాను ఈ మంట దేనికి అని అడిగే పని లేదా అంటుంది కనకం. నీ బండారం ఎక్కడో బయటపడి ఉంటుంది అంటాడు ఆమె భర్త.
నన్ను ఆ మ్యారేజ్ బ్యూరో గాడు ఎన్ని మాటలు అన్నాడు నాకు చాలా అవమానంగా అనిపించింది అయినా దీని అంతటికి కారణం మీరే గనుక కోట్లు సంపాదించి ఉంటే నాకు ఈ కర్మ పట్టేది కాదు కదా అంటుంది కనకం. కోట్లు అంటే గుర్తొచ్చింది కోటింగు చీటింగు కోసం 2000 అప్పు చేసావంట కదా ఆ డబ్బులు మీకు ఇవ్వమని చెప్పింది కావ్య అంటూ ఆ డబ్బులు చేతిలో పెట్టి ఇందుకేనా రమ్మన్నావు అని అడుగుతాడు. నేను రమ్మన్నది అందుకు కాదు దుగ్గిరాల వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అంట ఆ ఫంక్షన్ తాలుకు పాసులు కావాలి అని అడుగుతుంది.
జరిగిందంతా చెప్పిన కనకం..
పాస్ లేంటి అని అడిగితే ఈరోజు వాళ్ళింట్లో ఫంక్షన్ అంట కొందరిని పిలుస్తారు అంట అది కూడా పాసులు ఉంటేనే లోపలికి వదులుతారు అంట అంటుంది కనకం. అంతలోనే అక్కడికి వచ్చిన కావ్య అని చూసి ఏంటమ్మా బొమ్మలు అన్నీ ఇలా పగిలిపోయాయి అంటాడు ఆమె భర్త. జరిగిందంతా చెప్తుంది కావ్య. అందుకు కంగారుగా ఏమైనా దెబ్బలు తగిలాయమ్మ అని తండ్రి అడిగితే మొహానికి ఏమైనా దెబ్బలు తగిలాయా అని అడుగుతుంది కనకం. ఎక్కడ తగిలినా దెబ్బ దెబ్బ అని ఆమె భర్త అంటే మీరు ఊరుకోండి పెళ్లి కావలసిన పిల్ల మొహానికి దెబ్బ తగిలితే రిచ్ సంబంధాలు రావు అంటూ జరిగిందంతా చెప్తుంది కనకం.
అంతా బానే ఉంది కానీ పిలవని పేరంటానికి వెళ్తే అసహ్యంగా ఉంటుంది అంటాడు ఆమె భర్త. అంతలోనే ఆమె తోటి కోడలు రావడంతో నీ కొడుకు అక్కడే కదా పనిచేస్తున్నాడు నువ్వు అడిగితే పాస్ ఇస్తాడు కదా అంటుంది. తనతో ఉంటాను అంటే తల్లినే వద్దనుకున్నాడు అలాంటి వాడిని ఎలాగ అడగమంటావు అంటుంది ఆమె. అవును కన్న తల్లికి సాయం చేయలేని వాడు కనకం పిన్నికి ఏం సాయం చేస్తాడు అంటుంది కనకం. మరోవైపు దుగ్గిరాల వాళ్ళ ఇంటి ముందు మీడియా వాళ్లు ఫంక్షన్ గురించి మాట్లాడుతూ ఈరోజు వినాయకుడి విగ్రహానికి బంగారు నగలు అలంకరించబోతున్నారు అంటూ చెప్తుంది యాంకర్.
Brahmamudi January 26 Today Episodeప్రతి పైసా కి లెక్కుంది అన్న రాజ్..
ఇలా ఆడంబరానికి పోతే హైట్ వాళ్ళు వస్తారు అంటుంది ఆమె అత్త. రానీ అత్త పరవాలేదు ప్రతి దానికి లెక్క ఉంది అంటాడు రాజ్. వెళ్లి పూజారి గారికి ఇచ్చి దేవుడుకి అలంకరించమని చెప్పు అంటుంది వాళ్ల నానమ్మ. నా మనవడికి ఎవరిని ఎక్కడ ఉంచాలో బాగా తెలుసు వాడు ఏం చేసినా పరిపూర్ణంగా చేస్తాడు అంటుంది. లైఫ్ పార్ట్నర్ కూడా అన్నిట్లోనూ పరిపూర్ణంగా ఉండాలి అంటే ఎన్నాళ్లకు దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది అంటుంది రుద్రాణి. ఆ వినాయకుడే మనకి కాబోయే కోడల్ని ఇంటికి పంపిస్తాడు అంటుంది వాళ్ళ నాన్నమ్మ.
రాజ్ సంగతి పక్కన పెట్టు నీ కొడుకు రాహుల్ కి కూడా పెళ్లి వయసు వచ్చింది ముందు అతని సంగతి చూడు అంటుంది కళ్యాణ్ వాళ్ళ అమ్మ. వాడికేం తక్కువ వాడి కోసం ఒక మహారాణి ఎక్కడో పుట్టి ఉంటుంది అంటుంది రుద్రాణి. తరువాయి భాగంలో పెద్ద పిల్లకి పిల్లకు పెళ్లి అవ్వకపోవటానికి కారణం నేనేనా డబ్బున్న సంబంధం కాదు అంటూ వచ్చిన ప్రతి సంబంధాన్ని వెనక్కి పంపించేస్తున్నావు అంటూ కనకం మీద కేకలు వేస్తాడు ఆమె భర్త. వాళ్ల బ్రతుకులు మన బ్రతుకులు లాగే కాకూడదని నా తాపత్రయం అంటుంది కనకం.