Brahmamudi January 27 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో రాహుల్ కి కూడా పెళ్లి వేసి వచ్చింది కదా ముందు ఆ సంగతి చూడు అంటూ రుద్రాణికి చెప్తుంది ఆమె వదిన. వాడికి ఎంత ఎక్కువ వాడి కోసం ఎక్కడో ఒక రాజకుమారి పుట్టే ఉంటుంది అంటుంది రుద్రాణి. అదే సమయంలో కనకం పెద్ద కూతురు తను బ్యూటీ కాంపిటీషన్లో పిన్ అయినట్టుగా డబ్బులు పంచుతున్నట్లుగా కలకంటూ పిల్లోని చింపి గాల్లోకి ఎగరవేస్తుంటుంది.

ఊహల్లో తేలిపోతున్న స్వప్న..

స్వప్నని దుగ్గిరాల వాళ్ళ ఇంటికి కోడలుగా పంపిద్దాం అనుకుంటే అందరూ నన్ను అనేవాళ్లే అనుకుంటుంది కనకం. మనం మన ఇంట్లో దరిద్రం పోదు మీ ఒంట్లో బ్లడ్ ప్రెషర్ పోదు అంటూ భర్తని ఆడిపోసుకుంటుంది కనకం. ఇంతలో బయటికి వస్తున్న దూదిని చూసి అందరూ కంగారుగా స్వప్న గదికి వెళ్తారు. తనని తట్టి లేపుతుంది కనకం. మెలకువ వచ్చిన స్వప్న మీరు ఎప్పుడు వచ్చారు ఈ ఫంక్షన్ కి అని అడుగుతుంది. ఏంటి కలగన్నావా అని కనకం అడిగితే అవును పగటి కల అంటాడు ఆమె భర్త.

నీ పగటి కల నిజమయ్యేలాగా నేను మహారాజుల కుటుంబానికి కోడల్ని చేస్తాను అంటూ కూతురిని అక్కడి నుంచి తీసుకెళ్ళి పోతుంది కనకం. ఆస్తి మూరెడు ఆశ బారెడు అంటే ఇదే అంటూ దూదని అంతా ఎత్తడానికి ప్రిపేర్ అవుతారు తండ్రి కూతుర్లు. మరోవైపు వినాయకుడిని సర్దుతూ ఉంటారు రాజ్, కళ్యాణ్ వాళ్ళు. నా కొడుకుని చూడు ఎంత ప్రశాంతంగా నవ్వుతున్నాడో అంటుంది వాళ్ళ అమ్మ. పెళ్లి మాట ఎత్తు ఆ నవ్వు మాయమైపోతుంది అంటుంది రుద్రాణి.

కావ్య కన్య కావాలంటున్న కళ్యాణ్..

వాళ్ల దగ్గరికి వెళ్లి బావ నీ పెళ్ళెప్పుడు అని అడుగుతుంది. ఇంద్రాణి కూతురు. నా పెళ్లి సంగతి ఇప్పుడు ఎందుకు ముందు రాజ్ అన్నయ్యకి కావాలి కదా అంటాడు కళ్యాణ్. ముందు నా సంగతి ఎందుకురా బాబు నువ్వు చేసుకో ఇన్ని పిచ్చి కవితలు వినే బాధ మాకు తప్పుతుంది అంటాడు రాజ్. నా భార్య కావాలి అంటే ఆ అమ్మాయి ఇలా ఉండాలి అంటూ పెద్ద లిస్టు చదువుతాడు కళ్యాణ్. అందుకు విరుద్ధంగా ఉన్న అప్పు క్యారెక్టర్ని అప్పుడే ఇంట్రడ్యూస్ చేస్తారు.

అప్పు, కనకం చిన్న కూతురు తను పిజ్జా డెలివరీ కోసం ఒక ఇంటికి వెళ్తుంది. టామ్ బాయ్ లాగా చాలా బాగున్నావు లోపలికి వస్తే ఇద్దరమే పిజ్జా షేర్ చేసుకుందాము అంటాడు ఆ వ్యక్తి. కత్తిలాంటి దాన్ని కోసి కారం పెడతాను అంటూ ఆ పిజ్జాని వాడి మొహనీకేసి కొడుతుంది అప్పు. అంతలోనే తనకు ఫోన్ చేసి మర్యాదగా వచ్చి నాలుగు ముద్దలు తినేసి వెళ్లి తిండి మీద ధ్యాసే లేదా అంటూ మందలిస్తుంది. సరే అంటూ అక్కడి నుంచి బయలుదేరుతుంది అప్పు. మరే వైపు రాజ్ ఫోటో చూస్తూ ఇతనికేనా నన్ను చూపించాలనుకుంటున్నావు అంటుంది స్వప్న.

భర్త మీద నిప్పులు కక్కుతున్న కనకం..

మరి ఏమనుకున్నావు నేను కాబట్టి ఇలాంటి సంబంధం తీసుకొచ్చాను అంటూ నిన్న తయారుచేసిన పసుపు వద్దని ట్యూబ్ లోకి అదే కొత్త ఫేస్ ప్యాక్ గా ఇస్తుంది కనకం. చాలా స్మూత్ గా ఉంది అంటూ మురిసిపోతుంది స్వప్న. మసి పూసి మారేడు కాయలు చేయడంలో మీ అమ్మని మించిన మంత్రగత్తె లేదు అంటూ కావ్యతో చెప్తాడు ఆమె తండ్రి. నన్ను అందంగా తయారు చేస్తే సరిపోతుందా అక్కడికి వెళ్లడానికి ఎంట్రీ పాసులు కావాలి కదా అంటుంది స్వప్న.

అవునమ్మా ఎంట్రీ కే పాస్ లో పెట్టిన వాళ్ళు మనలాంటి వాళ్ళని చేసుకుంటారా అని అడుగుతుంది కావ్య. బీద అరుపులు అరవకండి మిమ్మల్ని నమ్ముకుంటే ఇంత మంచి సంబంధం తీసుకొస్తారా, ఇప్పటికే పెళ్లీడు దాటిపోతుంది. దానికి పెళ్లి కాకపోవడానికి కారణం నేనేనా, మన స్థాయికి తగ్గ సంబంధాలు తెస్తే నువ్వే వంకలు పెట్టి తిప్పి కొడుతున్నావు. చాలండి చెప్పొచ్చారు నా స్థాయికి తగ్గవాడినే చేసుకున్నాను నాకు ఏం వరగపెట్టారు. పెద్దది మిస్ హైదరాబాదు అవుతాను అన్నది మిమ్మల్ని నమ్ముకున్నందుకు అవ్వలేదు. ఈ రెండోది మట్టి బొమ్మలికి రంగులు వేసుకుంటుంది.

కొడుకుని తలుచుకొని ఏడుస్తున్న కనకం..

ఈ మూడోది మధ్యలో చదువు ఆపేసి పిజ్జాలు అవి అమ్ముకుంటుంది ఎవరిని సరిగ్గా పెంచారు మీరు? ఈ సంసారం ఎంత దరిద్రంగా ఏడ్చింది కాబట్టే మన పిల్లలు కూడా మనకులాగా అవ్వకూడదని నేను ఇదంతా చేస్తున్నాను అంటూ కేకలు వేస్తుంది కనకం. నేను పేదవాడినైనా పిల్లల్ని పద్ధతిగా పెంచుతున్నాను కానీ నువ్వేం చేస్తున్నావు కూతుర్ని అందంగా ముస్తాబు చేసి అక్కడెక్కడుకో తీసుకెళ్తున్నావు ఇది తప్పు కాదా అంటాడు ఆమె భర్త.

అవునయ్యా తప్పే నేను చేస్తున్నది తప్పే ఈ నీతులన్నీ నా కొడుకు చావు బతుకులో ఉన్నప్పుడు పనికొచ్చాయా? చనిపోయిన నా కొడుకుని బ్రతికించడానికి పనికిరాని ఈ నీతులు నాకు ఇంకొకసారి చెప్పొద్దు అంటూ భర్తకి వార్నింగ్ ఇస్తూ కొడుకు చనిపోయిన పరిస్థితిని తలుచుకుంటుంది కనకం. వర్షంలో తడుచుకుంటూ కొడుకుని హాస్పిటల్ కి తీసుకువెళ్తారు కనకం దంపతులు. నా కొడుకుని కాపాడండి అంటూ డాక్టర్లకి దండం పెట్టి వేడుకుంటుంది కనకం.

నా బిడ్డలకి ఆ గతి పట్టనివ్వను అంటున్న కనకం..

లేదమ్మా బ్రెయిన్ కి సర్జరీ చేస్తే గాని బాబు బ్రతకడు 500000 రెడీ చేసుకోమని ఎప్పుడో చెప్పాను మీరు నిర్లక్ష్యం చేసి చివర్లో తీసుకువచ్చారు అంటాడు డాక్టర్. 5000 జీతంతో ఆరుగురం బ్రతకాలి. ఎవరిని అప్పడిగినా ఇవ్వడం లేదు అంటాడు కనకం భర్త. వాళ్లు అలా బ్రతిమాలుతూ ఉండగానే ఆ బిడ్డ చనిపోతాడు. ఆ సంఘటన తలుచుకుని ఏడుస్తుంది కనకం. ఈ బిడ్డ ప్రాణాలు వదులుతుంటే కన్న తల్లిదండ్రులుగా మనం చూస్తూ నిలబడిపోయాం కానీ ఏమీ చేయలేకపోయాం ఎందుకంటే మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి.

కన్న కొడుకుని కూడా కాపాడుకోలేని కటిక దరిద్రం లో ఉన్నాం కాబట్టి. ఆరోజు మీ దగ్గర డబ్బు ఉంటే ఈ రోజు నా కొడుకు నా దగ్గర ఉండేవాడు అంటూ తను బాధని అంతా వెళ్ళగకుతుంది కనకం. ఇప్పుడు లక్ష్మీపార్వతుల్లాగా మన ఇంట్లో ముగ్గురు కూతుర్లు ఉన్నారు వాళ్ళ పెళ్ళికి సరిపడా డబ్బుని మీరు తేగలరా కన్నందుకు వాళ్ళని ఏం చేద్దాం, జీవితాంతం వాళ్ళని మోస్తూ ఉండాలా అంటూ భర్తని నిలదీస్తుంది కనకం. భార్యని ఓదార్చబోతే నా కడుపు కోత తీర్చలేని మీరు నా గుండె కోతని తీర్చలేరు అందుకే నాకు వచ్చిన దుస్థితి నా బిడ్డలకి రాకూడదు.

స్వరాజ్ కి చివాట్లు పెట్టిన సీతారామయ్య..

నా బిడ్డలు మహారానుల్లగా బ్రతకాలి. అలాగని నా బిడ్డలని నేను తప్పుతోవల్లో నడిపిస్తానా, నేను వాళ్ళ తల్లిని ఎలాగైనా వాళ్ళని ఆ ఇంటికి తీసుకువెళ్తాను దీన్ని ఆ దేవుడు కూడా మార్చలేడు అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కనకం. మరోవైపు వినాయకుడి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు రాజ్ వాళ్ళు. దాన్ని చూసినా సీతారామయ్య షాక్ అవుతాడు. ఏం చేసావు నువ్వు ఈ నగలు అన్ని ఏంటి అని సీరియస్గా మనవడ్ని అడుగుతాడు.

నిన్ను నమ్మి బాధ్యతని అప్పగిస్తే నువ్వు ఆ దేవుణ్ణి అవమానిస్తావా అంటూ మనవడి మీద కేకలు వేస్తాడు. ఏమైంది బానే ఉంది కదా అంటుంది వాళ్ళ నాన్నమ్మ. మన ఐశ్వర్యాన్ని 10 మంది ముందు ప్రదర్శించడం నాకు నచ్చలేదు అంటాడు సీతారామయ్య. కొత్తగా ఉంటుందని ట్రై చేశాను అంటాడు రాజ్. పూజ అయిపోయిన తర్వాత విగ్రహాన్ని నిమజ్జనం చేయాలి ఈ బంగారం తోనే నిమజ్జనం చేయిస్తావా అంటాడు సీతారామయ్య. నగలు తీసే నిమజ్జనం చేద్దాము అంటే ఒకసారి భగవంతుడికి సమర్పించినవి వస్త్రమైనా, నగలైన వెనక్కి తీసుకోకూడదు అంటాడు సీతారామయ్య.

విషయాన్ని లీక్ చేసిన రాహుల్..

మీరే ఏదైనా సలహా చెప్పండి అంటాడు అతను కొడుకు. విగ్రహాన్ని నగలతో డిజైన్ చేయించండి అంటాడు సీతారామయ్య. టైం లేదు మనం అనుకున్న ముహూర్తానికి సిద్ధమయ్యేలాగా చూడండి అంటారు పంతులుగారు. పోనీ వేరే విగ్రహం తెప్పిద్దాం అంటాడు రాహుల్. ఒకసారి ప్రతిష్టించిన విగ్రహాన్ని పక్కకి తప్పించకూడదు అంటాడు సీతారామయ్య. ముందు ఆ పని చూడు అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు సీతారామయ్య.

వారసుడిగా ప్రకటించే టైంలో ఇలాంటి రిస్క్ ఎందుకు చేస్తావు, కనీసం టైం కి విగ్రహానికి రంగులైన వేయించు అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది రుద్రాణి. రాజ్ తను మేనేజర్ కి ఫోన్ చేసి విగ్రహం తయారు చేసిన వాళ్ళని పంపించమంటాడు. నేను దూరంగా ఉన్నాను వాళ్లకి ఫోన్ చేసి పంపిస్తాను అంటాడు ఆ మేనేజర్. మరోవైపు ఆత్రంగా లోపలికి చూస్తున్న కెమెరామెన్ ని లోపలికి పిలిచి ఎందుకు అంత ఆత్రంగా చూస్తున్నావు లోపల పూజ ఆగిపోయింది మా యువరాజు వినాయకుడికి నిజమైన ఆభరణాలు తయారు చేయించాడు అంటూ లీక్ చేస్తాడు రాహుల్.

Brahmamudi January 27 Today Episode స్వయంగా రంగంలోకి దిగిన రాజ్..

ఆ న్యూస్ ని స్ప్రెడ్ చేయడానికి బయటకు వెళ్ళిపోతుంది ఆ కెమెరావుమెన్. ఇంతలో మేనేజర్ ఫోన్ చేసి వాళ్ళ ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది వాళ్ల స్టోర్ లోకేషన్ షేర్ చేస్తాను ఎవరినైనా పంపించండి అంటాడు. ఎవరో కాదు నేనే వెళ్తాను అంటూ కళ్యాణ్ ని తోడు తీసుకుని వెళ్తాడు రాజ్. వాళ్ళు బయటికి వచ్చేసరికి మీడియా వాళ్ళు అంతా మీద పడి పూజ ఆగిపోయింది అంట కారణం ఏంటి అని అడుగుతారు. పూజ ఆగిపోలేదు అనుకున్న టైం కి అవుతుంది అంటూ కళ్యాణ్ అందరికీ సర్ది చెప్తాడు.

తరువాయి భాగంలో ఈ పూజ అమ్మ నాన్న గారి తరఫునుంచి వస్తుంది నీవల్ల ఆగిపోయింది అంటే క్షమించను అంటాడు సీతారామయ్య. తప్పకుండా అదే టైం కి చేద్దాం అంటూ మాట ఇస్తాడు రాజ్. కావ్య వాళ్ళ స్టోర్ కి వచ్చి తనని అక్కడ చూసి షాక్ అవుతాడు రాజ్. మా ఇంటికి వచ్చి విగ్రహానికి నగలు దిద్దాలి అని కళ్యాణ్ అడిగితే మీలాంటి పొగరుబోతుల ఇంటికి రావాల్సిన అవసరం నాకు లేదు అంటుంది కావ్య.