Brahmamudi January 30 Today Episode: ఈ రోజు ఎపిసోడ్ లో పగలు రాత్రి కష్టపడి ఆ బొమ్మలకి రంగులు వేసాను అందుకే అంత హర్ట్ అయ్యాను అంటుంది కావ్య. ఇదేంటి రివర్స్లో తనే తగ్గి మాట్లాడుతుంది అనుకుంటాడు రాజ్. ఇదేంటి పొగరుగా వెళ్లిపోయి పిల్లికూన లాగా వెనక్కి వచ్చాడు అనుకుంటుంది కావ్య. మనకి వేరే కళాకారులు దొరక్క కాదు టైం లేక వెనక్కి వచ్చామని చెప్పు అంటాడు రాజ్.

పొగరుబోతులకి పాస్లు ఇవ్వను అంటున్న కావ్య..

బొమ్మకి అర్జెంటుగా ఆభరణాలు డిజైన్ చేయకపోతే పూజ ఆగిపోతుంది అందుకే మీరు రావాలి అంటాడు కళ్యాణ్. ఆ విషయం మీ అన్నయ్యని చెప్పమనండి మీరు ఎందుకు కష్టపడతారు అంటుంది కావ్య. మా అన్నయ్యకి ఆడవాళ్ళతో మాట్లాడడం అంతగా రాదు అంటాడు కళ్యాణ్. ఆడవాళ్ళతో మాట్లాడటం రాకుండానే పొద్దున్న అంత గొడవ చేసినాడు మీ అన్నయ్య అంటుంది కావ్య.

మళ్లీ పాస్ ల విషయం గుర్తొచ్చి తగ్గి మాట్లాడుతుంది కావ్య. షాప్ లో పని ఉంది కానీ కవి గారు బ్రతిమాలుతున్నారు అందుకే రాకుండా ఉండలేకపోతున్నాను అంటుంది కావ్య. కానీ నాదొక కండిషన్ మీ ఫంక్షన్ కి పాసులు ఏవో పెట్టారంట కదా నాకు అవి కావాలి అంటుంది కావ్య. ఏం మాట్లాడుతున్నావ్ ఎవరిని పడితే వాళ్ళని పిలవకూడదని పాసులు పంపిస్తున్నాం. అందులోనూ నీలాంటి పొగరుబోతులకి అస్సలు ఇవ్వడం కుదరదు అంటాడు రాజ్.

రాజ్ ని పూర్తిగా నమ్ముతున్న చిట్టి..

అయితే ఇక బయలుదేరండి నాలాంటి పొగరుబోతులకి పాస్ ఇవ్వాల్సిన అవసరం మీకు లేకపోతే మీలాంటి వగరుబోతుల ఇంటికి రావలసిన అవసరం నాకు లేదు అంటుంది కావ్య. మరోవైపు ఈ పూజ జరగదు అంటూ మీడియా వాళ్ళు ఫిక్స్ అయిపోయారు నాన్నగారేమో జరుగుతుంది అని మాట ఇచ్చారు. వెళ్లిన రాజ్ ఇంకా ఆర్టిస్ట్ ని తీసుకురాలేదు అంటుంది రుద్రాణి. రాజ్ తప్పకుండా తీసుకువస్తాడు అంటుంది చిట్టి.

నీ మనవడిని వెనకేసుకుని రాకు అయినా ఈ ఫంక్షన్ ఎలాగూ ఆగిపోతుంది అందుకే ముందుగా మనమే అనౌన్స్ చేసేద్దాం అంటుంది రుద్రాణి. ఈ ఫంక్షన్ తప్పకుండా జరుగుతుంది అంటూ కావ్యని తీసుకొని వస్తాడు రాజ్. ఈమె వినాయకుడికి రంగులు వేసేది చాలా అద్భుతమైన కళాకారుని అంటూ తాతయ్యకి పరిచయం చేస్తాడు కళ్యాణ్. నేను కలలని కళాకారులని గౌరవిస్తాను పూర్వజన్మ సుకృతం ఉంటేనే గాని ఏ కళ అబ్బదు. ఇది వందేళ్ళ వారసత్వానికి నిదర్శనంగా జరిపించే పూజ ఎక్కువ సమయం లేదు.

ఇదంతా అవసరమా అంటున్న కళ్యాణ్..

నువ్వు ఆ సమయానికన్నా విగ్రహాన్ని పూర్తి చేయగలవా అంటాడు సీతారామయ్య. మీలాంటి పెద్దల ఆశీర్వచనం ఉంటే తప్పకుండా పూర్తి చేస్తాను అంటూ సీతారామయ్య దగ్గర ఆశీర్వచనం తీసుకుంటుంది కావ్య. కళ్యాణమస్తు అంటూ దీవిస్తాడు సీతారామయ్య. ఈ పొగరుబోతు కి కళ్యాణమంట ఎవడు చేసుకుంటాడో కానీ రెండు రోజుల్లో పారిపోతాడు అంటూ కళ్యాణ్తో నవ్వుతాడు రాజ్. వింటే ఆటో ఎక్కి పారిపోతుంది ఇదంతా అవసరమా అంటాడు కళ్యాణ్.

నీకు ఏమైనా కావాలంటే మా రాజ్ ని అడుగు అంటూ అక్కడి నుంచి పెద్దవాళ్లందరూ వెళ్ళిపోతారు. మరోవైపు కృష్ణ పంపించింది అని పాసులు తీసుకొని వస్తాడు షాప్లో కుర్రాడు. అవి చూసి మురిసిపోతారు కనకం, స్వప్న. నాన్న వీటిని చూసి అమ్మ చల్లబడింది అక్క చుక్కల్లో తేలిపోతుంది అంటూ ఆట పట్టిస్తుంది అప్పు. ఇందాక ఎవరో ఏంటో అన్నారు ఇప్పుడు చూడండి నా బంగారు తల్లి నా కోసం పాసులు పంపించింది అంటూ సంతోష పడిపోతుంది కనకం.

ఆనందంతో గంతులు వేస్తున్న తల్లి కూతుర్లు..

ఆఫ్ట్రాల్ పాస్లకే లాటరీ తగిలినట్లుగా ఎందుకలాగా ఫీలవుతావ్ అంటుంది అప్పు. ఇవి మీ కంటికి లాగా మాత్రమే కనిపిస్తున్నాయి కానీ నాకంటికి శుభలేఖల్లాగా కనిపిస్తున్నాయి అంటారు కనకం, స్వప్న. ఆనందంతో రెడీ రావడానికి బయలుదేరుతారు తల్లి, కూతుర్లు. మరోవైపు పూజకి అన్ని రెడీయే కదా అని పంతులు గారిని అడుగుతాడు రాజ్. అన్ని రెడీ ఒక విగ్రహం తప్ప అంటారు పంతులుగారు.

మళ్లీ కావ్య దగ్గరికి వెళ్తాడు రాజ్. నా పేరు అది ఇది కాదు అంటుంది కావ్య. నాకు నీ పేరుతో పనిలేదు పని తోనే పని అంటాడు రాజ్. ఇది పని కాదు పనితనం అంటుంది కావ్య. ఇంకా ఎంతసేపటికి పూర్తవుతుంది అంటూ కంగారుగా అడుగుతాడు. ఇదేమైనా కారుతో సైకిల్ ని గుద్దడం అనుకున్నావా? ఫాస్ట్ గా అయిపోవడానికి అంటుంది కావ్య. టైం కి పూర్తవ్వాలని మా తాతయ్య చెప్పారు కదా అని రాజ్ అంటే ఆయన ఇంత గర్వంగా చెప్పలేదు గౌరవంగా చెప్పారు అంటుంది కావ్య. నీకు కూడా ఎవరైనా గౌరవం ఇస్తారా అంటాడు రాజ్.

రాజ్ ని ఇరిటేట్ చేస్తున్న కావ్య..

తాతయ్య గారు అంటూ సీతారామయ్యని పిలుస్తుంది. ఇప్పుడు ఆయన ఎందుకు పిలుస్తున్నావు అంటూ టెన్షన్ పడతాడు రాజ్. నాకు కాస్త ప్రశాంతత కావాలి అని కావ్య అడిగితే అది ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతాడు రాజ్. మీరు వింటే అది వస్తుంది అయినా నాకు ఒక టీ కావాలి అంటుంది కావ్య. నేనేం చెప్తున్నాను నువ్వేం చెప్తున్నావు అంటాడు రాజ్. నేను ఒక టీ చెప్పాను అంటూ వెటకారంగా అంటుంది కావ్య.

నేను చచ్చినా చెప్పను అంటాడు రాజ్. తాతయ్య ఏం కావాలన్నా మిమ్మల్ని అడగమన్నారు అంటూ మళ్ళీ సీతారామయ్య అని పిలుస్తుంది కావ్య. తప్పనిసరి పరిస్థితుల్లో టీ చెప్తాడు రాజ్. కోపంగా చూస్తున్న రాజ్ ని మునీశ్వరుడు లాగా నన్ను కళ్ళతోనే కాల్చేస్తారా అంటూ ఇరిటేట్ చేస్తుంది కావ్య. అప్పుడే అక్కడికి వచ్చిన రుద్రాణి ఏం జరిగింది బావ అంత కోపంగా వెళ్తున్నాడు అని కూతుర్ని కడుగుతుంది. రంగులు వేసే అమ్మాయికి టాలెంట్ కన్నా పొగరే ఎక్కువ లాగా ఉంది బావకి టీ ఇమ్మని ఆర్డర్ చేస్తుంది అంటూ తల్లికి చెప్తుంది రేఖ.

తల్లి కూతుర్లకి సరైన సమాధానం చెప్పిన కావ్య..

నువ్వు ఈ వర్క్ ఫ్రీగా చేస్తున్నావా అని అడుగుతుంది రేఖ. ఏమైంది అని కావ్య అడిగితే ఎక్కువ మాట్లాడుతున్నావ్ కదా అందుకే అంటుంది రేఖ. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకొని మాట్లాడు అంటుంది రుద్రాణి. మీరిద్దరూ తల్లి కూతుర్ల అని కావ్య అంటే నీకు ఎలా తెలుసు అంటుంది రేఖ. ఆవు చేలో లేస్తే దూడ గట్టును మేస్తుందా అందుకే అలా అన్నాను అయినా మిస్టేక్ పర్ఫెక్ట్ కి చాలా టైం అయింది తీసుకురాలేదు మీరు ఆ పని చూడండి అంటూ ఆర్డర్ వేస్తుంది కావ్య. నిన్ను అంటూ కోపంగా ఆమె మీదకి వెళ్లబోతుంది రేఖ.

తాతయ్య ఉన్నారు అంటూ ఆమెని ఆపి తీసుకెళ్ళి పోతుంది రుద్రాణి. మిస్టర్ డిపెక్టే అనుకున్నాను ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా డిఫెక్ట్ ఏ అనుకుంటుంది కావ్య. మరోవైపు సరైన డ్రెస్ లేక కేకలు పడుతుంది స్వప్న. ఏమైంది నల్లి కుట్టిందా అంటూ ఆట పట్టిస్తుంది అప్పు. నువ్వు ఉండు అంటూ ఏమైందమ్మా అంటూ ముద్దుగా స్వప్నని అడుగుతుంది కనకం. అక్కడికి వెళ్లడానికి సరైన డ్రెస్ లేదు అంటుంది స్వప్న. ఎవరైనా పాత గిన్నెల కి కొత్త చీరలు ఇస్తాడేమో నాన్నని అడుగుతాను అంటూ అక్కడి నుంచి వెళ్తుంది అప్పు.

అక్కని ఆట పట్టిస్తున్న అప్పు..

చెల్లెలి మీద కోప్పడుతున్న స్వప్నని బాధపడకే పూర్ ఇంటి కూతురువైన రీచ్ ఇంటి కోడలు వి అవుదువుగానివి కూతుర్ని ఓదార్చుతుంది కనకం. మరోవైపు బొమ్మని పూర్తి చేసిన కావ్య ఇప్పుడు నీ రూపం నీకు వచ్చింది. ఈ పిచ్చి మనుషుల పిచ్చి కుదిరింది థాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఒక రస హీన రిచ్ పక్షికి గుర్తొచ్చేలాగా చేశావు అంటూ దండం పెట్టుకుంటుంది కావ్య. ఆ బొమ్మని చూసి ఇంప్రెస్ అవుతాడు రాజ్. కావ్యని మెచ్చుకుంటాడు సీతారామయ్య.

ఒరిజినల్ నగల కంటే ఈ నగలే కళ కళ లాడిపోతున్నాయి అంటూ మెచ్చుకుంటుంది రాజ్ పిన్ని. ఈ అమ్మాయికి గౌరవ పారితోషికం ఇచ్చి పంపించు అంటాడు సీతారామయ్య. పారితోషకం ఎంత అని అడిగితే నీకు నచ్చినంత అంటుంది కావ్య. మీరు కోరుకున్నట్టే అనుకున్న సమయానికి పని పూర్తి చేశాను కదా ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అని అడుగుతుంది కావ్య. మా బావని ఎందుకంత చీప్ గా తీసి పడేస్తున్నారు ఆయన ఈ ఇంటికి కాబోయే యువరాజు అంటుంది రేఖ.

Brahmamudi January 30 Today Episode బ్రమలోంచి బయటికి రమ్మంటున్న కావ్య..

రాజులు రాజ్యలు పోయి చాలా సంవత్సరాలు అయింది మీరు ఇంకా భ్రమలోనే ఉన్నట్టున్నారు అందులోంచి కాస్త బయటపడండి. తాతయ్య గారిని చూసి నేర్చుకోండి అంటుంది కావ్య. తనతో మాట్లాడితే మన స్థాయి పడిపోతుంది అంటూ కొంత అమౌంట్ ఇస్తాడు రాజ్. తీసుకొని పండగ చేసుకో మా బావ అసలు కన్నా టిప్ ఎక్కువిస్తాడు అంటుంది రేఖ. మరోవైపు చీర తెచ్చి నాకు మంచి చీర దొరికింది అంటూ చూపిస్తుంది స్వప్న.ఇది కావ్య చీర దానికి ఉన్న ఒకే ఒక్క మంచి చీర ఇది అంటుంది కనకం.

ఈ ఫంక్షన్ అయిపోగానే దాని చీర దానికి విచ్చేస్తాను నా చెల్లి నేను అడిగితే ఏది కాదనదు అంటుంది స్వప్న. తరువాయి భాగంలో పాస్ మర్చిపోయి ఫంక్షన్ కి వస్తారు స్వప్న వాళ్ళు. వాళ్లని లోపలికి పంపించకపోవడంతో గలాటా చేస్తారు. అది చూసిన రాజ్ ఏం జరుగుతుంది అని అడుగుతాడు. క్లాసులు లేకుండా లోపలికి పంపించమంటున్నారు సార్ అంటాడు సెక్యూరిటీ.