Brahmamudi March 2 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో దానికి ఫోన్ చేసావా అంటుంది కనకం. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అంటుంది కావ్య. అది మనల్ని మోసం చేసి పోయింది అంటుంది అప్పు. నువ్వే ఏదో ఒక దారి చూపించు దేవుడా జీవితంలో మరి ఎప్పుడూ అబద్ధం ఆడను అని లేంపలు వేసుకుంటుంది కనకం. ఏంటండీ పెళ్లి చూపులప్పుడు కూడా ఇలాగే లేట్ చేయించారు ఇప్పుడు కూడా అలాగే లేట్ చేస్తున్నారు టైం సెన్స్ లేదా అంటూ కృష్ణమూర్తిని అడుగుతుంది రుద్రాణి.

నిజం తెలుసుకుని షాకైన రుద్రాణి..

దానికి ఆయన మాత్రం ఏం చేస్తారు అంటూ వెనకేసుకొస్తాడు రాజ్. ఏదేదో మాట్లాడుతున్న కనకం అక్కకి కళ్యాణ్ ని అప్పజెప్పి ఈవిడకి నీ కవిత్వం వినిపించు అంటుంది రుద్రాణి. చెప్పు చెప్పు నాకు కూడా కవిత అంటే చాలా ఇష్టం అంటుంది కనకం అక్క. ఆ మాటలకి అందరూ నవ్వుకుంటారు. ఇనాటికి పదిమందిలో కవిత్వాన్ని వినిపించే అవకాశం దొరికిందని ఆనందంతో కవిత చెప్తాడు కళ్యాణ్. కవిత్వానికి కంగారు పడిపోతుంది కనకం వాళ్ళ అక్క. వదిన గారు ఏమైందో చూడండి అంటాడు కృష్ణమూర్తి.

పొద్దున్నే కళ్ళు తిరిగి పడిపోయింది అంట మన రాహుల్ చెప్పాడు అంటుంది మీరు వెళ్తే లేటవుతుంది నేను వెళ్లి తీసుకొస్తాను అని వాళ్ల రూమ్ కి వెళ్తుంది రుద్రాణి. వాళ్లు మాట్లాడుకోవడం విని స్వప్న వెళ్లిపోయిందా అందుకే మండపానికి తీసుకురావడం లేదా అనుకుంటుంది రుద్రాణి. గదిలో ఉన్న కావ్య వాళ్ళని చూసి మిగతా ఇద్దరు కూతుర్లు వీళ్లేనా అందుకే ప్రతిసారి ఎదురు పడుతున్నారు అనుకుంటుంది. ఇప్పుడు స్వప్న లేకపోతే ఎలా పెళ్లి ఆగిపోతుంది అని కంగారు పడిపోతుంది రుద్రాణి.

రుద్రాణి మాటలకి షాకైన తల్లి కూతుర్లు..

ఏమి తెలియనట్లుగా లోపలికి వచ్చి స్వప్న ఏది? తనకోసం అందరూ అక్కడ కంగారు పడుతుంటే మీరేంటి ఎక్కడ కూర్చున్నారు వీళ్ళిద్దరూ ఎవరు మీ కూతుర్లా అంటూ నిలదీసినట్లుగా మాట్లాడుతుంది. పెళ్లిచూపులు ఎప్పుడు బ్యూటీ పార్లర్ కి వెళ్ళినట్లు వెళ్లిందా, ఎప్పుడు వస్తుంది అని అడుగుతుంది రుద్రాణి. వచ్చేస్తుంది అని కంగారుగా చెప్తుంది కనకం. లేచిపోయిన కూతురు ఎలా వస్తుంది నిజం చెప్పు తను ఎవరితోనో లేచిపోయింది కదా అంటుంది రుద్రాణి.

ఆ మాటలకి అందరూ షాక్ అవుతారు. కారులో వెళ్ళిపోయింది అంతేకానీ లేచిపోలేదు అంటుంది అప్పు. పెళ్లిలో వెళ్లిపోతే అలాగే అనుకుంటారు అయినా నీ పిల్లలందరూ ఫారిన్ లో చదువుతున్నారు బిజినెస్ చేస్తున్నారని చెప్పావు. కుండలకి రంగులు వేసుకునే మీ ఆయన్ని తీసుకొచ్చి క్షణం తీరిక ఉండదు అన్నావు ఇన్ని అబద్ధాలకి సమాధానం చెబుదువు గానివి రా అంటూ లాక్కొని వెళ్లబోతుంది రుద్రాణి. కావ్య కంగారుగా ఆపి అసలే మా అక్క చేసిన పనికి ఉరేసుకోబోయింది నేనే కాపాడాను అంటుంది కావ్య.

స్వప్నని నేను తీసుకొస్తానంటున్న అప్పు..

ఇప్పుడు డబ్బు ఉన్నది లేనిది సమస్య కాదు కానీ బయట మీడియా అందరూ వెయిట్ చేస్తున్నారు దుగ్గిరాల ఫ్యామిలీ లోకి రావాల్సిన కోడలు లేచిపోయింది అంటే పరువు పోతుంది. మీ కుటుంబంలో ఎప్పుడు ఇలాంటి దరిద్రం జరగలేదు. ఇన్ని మాయలు చేసిన దానివి ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి జరిపించు అంటుంది రుద్రాణి. నేను వెళ్లి తీసుకొస్తాను అని అప్పు అంటే అంతవరకు తనతో ఆగాలి కదా అసలే మా రాజ్ ఆవేశపరుడు ఏదో ఒకటి చెయ్యు అంటుంది రుద్రాణి.

ఏం చేసేది మా పెద్ద కూతురు లేచిపోతుందని నేను ఊహించలేదు. దానికి బదులుగా దీన్ని తీసుకెళ్లి ప్లేట్ల మీద కూర్చోబెట్టలేను కదా అంటూ కావ్య ని చూపిస్తుంది కనకం. రాజ్ అంటే క్షణం పడని ఈ కావ్య ని కూర్చోపెట్టి ఈ పెళ్లి జరిగేలాగా చేస్తే అని ఆలోచనలో పడిన రుద్రాణి కూర్చోబెట్టు అంటుంది. ఆ మాటలకి ముగ్గురు షాక్ అవుతారు. అర్థం కానట్లుగా మళ్లీ ఏంటి అని అడుగుతారు. తాళికట్టే లోపల నువ్వు వెళ్లి అని తీసుకొస్తావా అంటుంది రుద్రాణి.

సహనాన్ని కోల్పోతున్న రాజ్ కుటుంబ సభ్యులు..

మరోవైపు వెళ్ళిన వాళ్ళు వెళ్లినట్లుగానే అక్కడే ఉండిపోతున్నారేంటి అంటుంది ధనలక్ష్మి. అందంగా కనబడాలని ఎక్కువ కేర్ తీసుకుంటుందేమో అంటుంది రేఖ. టైం కి జీలకర్ర బెల్లం పెట్టించాలి కదా అంటుంది చిట్టి. అదే అర్థం కావటం లేదు ముహూర్తం దాటిపోయేలాగా ఉంది రుద్రానికి వెళ్లి కూడా చాలా సేపు అయింది అక్కడ ఏం చేస్తుందో అంటాడు సీతారామయ్య. మరోవైపు మా వాళ్ళు ఎవరికీ ఇంకా డౌట్ రాలేదు లేకపోతే ఏ పాటికి ఇక్కడికి వచ్చి గొడవ చేసేవారు ఏదో ఒకటి ఆలోచించుకోండి అంటుంది రుద్రాణి.

రాజ్ కి కావ్యకి అస్సలు పడదు అంటుంది కనకం. దీనికి ఏ పాపము తెలియదు దీన్ని ఎలా పీటల మీద కూర్చోబెడతారు అంటూ కావ్యని వెనకేసుకొస్తుంది అప్పు. సరే అయితే ఏ గొడవ జరగకుండా మీరు ఆపుతారా? పేదరికానికే రిచ్ ముసుగు వేసిన నువ్వు దేనికైనా ముసుగు వేయగలవు ఇప్పుడు నీ కూతురికి ముసుగు వెయ్యు అంటుంది రుద్రాణి. మరోవైపు పెళ్లి పీటల మీద కూర్చున్న రాజ్ లోపల ఏమైనా గొడవ జరుగుతుందా అని కంగారు పడుతుంటాడు.

కూతుర్ని కోరరాని కోరిక కోరిన కనకం..

ఏ పెళ్ళిలోనూ పెళ్ళికూతురు ఇంత ఆలస్యం చేయలేదు అని ఒక ఆవిడ అంటే పొద్దుటి నుంచి చూస్తున్నాను మంగళ స్నానాలు అనేసరికి కళ్ళు తిరిగి పడిపోయింది. నలుగు లేదు పాడు లేదు ఇంత నాగరికతని ఎక్కడా చూడలేదు అని అమ్మలక్కలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ మాటలు విన్న కృష్ణమూర్తి వదిన గారు అక్కడ ఏం జరుగుతుందో చూడండి అంటాడు. మరోవైపు నేను పెళ్ళి కొడుకు మేనత్తని నేనేదో మిమ్మల్ని సపోర్ట్ చేద్దాం అనుకుంటే మీరు నా మాటే వినడం లేదు సరే అయితే పెళ్లికూతురు లేచిపోయిందని మీడియా ముందు చెప్పేస్తాను అంటుంది రుద్రాణి.

ఆమెని బలవంతంగా ఆపి ఈ పెళ్లి చేసుకోమంటూ కూతుర్ని బ్రతిమాలుతుంది కనకం. రాజ్ కనుక కావ్య మెడలో తాళి కడితే నేను అనుకున్న దానికన్నా డబల్ ధమాకా అవుతుంది. నిత్యము ఉప్పు నిప్పులాగా పోట్లాడుకుంటూ ఉంటారు నాకు కావాల్సింది అదే అనుకుంటుంది రుద్రాణి. ఈరోజు పెళ్లికూతురు వస్తుందా, అసలు ఈరోజు పెళ్లి జరుగుతుందా లేకపోతే మేము ఇంటికి వెళ్ళిపోతాము పెళ్లికూతురు వచ్చాక కబురు పెట్టండి వస్తాము అంటూ కోప్పడతాడు సుభాష్.

కొడుక్కి సర్ది చెబుతున్న సీతారామయ్య..

ఎవరికి బాధ్యత లేదు అంటాడు సుభాష్. నీ ఆవేశంలో అర్థం ఉంది, మా అందరికీ కూడా సహనం చచ్చిపోయింది అలా అని పెళ్లి మండపంలో అల్లరి చేస్తే అది మనకే చెడుగా మారిపోతుంది. ఎందుకంటే పెళ్లికూతురు కాసేపట్లో మన ఇంటి కోడలు అవుతుంది అంటూ సర్ది చెప్తాడు సీతారామయ్య. మరోవైపు ఇంకెప్పుడూ అబద్ధాలు ఆడను నా పరువు నిలబెట్టు అంటూ కూతుర్ని చెయ్యి పట్టుకొని బ్రతిమిలాడుతుంది కనకం. ఇన్నాళ్లు నువ్వు ఏది చెప్తే అది చేశాను కానీ ఇప్పుడు ఎలా కుదురుతుంది అంటుంది కనకం.

దానికి నేను ఒక ఉపాయం చెప్తాను వంశాచారం అని చెప్పి నువ్వు మేలుముసుకు వేసుకొని పీటల మీద కూర్చో ఈలోపు మీ చెల్లెలు వెళ్లి స్వప్నని తీసుకొస్తుంది అప్పుడు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అంటుంది రుద్రాణి. ఈ విషయం బయటపడితే నేను బ్రతికున్నా, చచ్చిన దానితో సమానం అని తల్లి బ్రతిమాలుతుంటే నావల్ల కాదు అంటుంది కావ్య. కానీ తల్లి పోరు పడలేక పెళ్లికి సిద్ధపడుతుంది.

Brahmamudi March 2 Today Episode కావ్యకి మాటిచ్చిన అప్పు..

అప్పు నాకు ఒక మాట ఇవ్వు నేను పెళ్లికూతురు స్థానంలో మాత్రమే వెళ్తున్నాను పెళ్లికూతురుగా కాదు మెడలో తాళిపడే లోపల నువ్వు అక్కని తీసుకుని వస్తానని మాట ఇవ్వు. అమ్మ కోసం నేను రిస్క్ చేస్తున్నాను నువ్వు నాకోసం రిస్క్ చేసి అక్కని తీసుకురా అంటుంది కావ్య. తను మనల్ని ఇంతలాగా మోసం చేసినందుకు ఏం చేసినా తక్కువే కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పంతాలకు పోతే జరగదు నీకు మాటిస్తున్నాను అక్కని ఎలాగైనా వెతికి తీసుకొస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పు.

తరువాయి భాగం లో ముసుగు వేసి కూతురిని తీసుకొస్తున్న కనకాన్ని పెళ్లికూతురుకి ముసుగు ఎందుకు వేశారు అని అడుగుతుంది ధనలక్ష్మి. ఇది మా ఆచారం అని కనకం చెప్తుంది. ఇలాంటి ఆచారం ఉందని మాకు ముందుగా చెప్పలేదు కదా అయినా మూసుకు వేసుకుంటే పెళ్లికూతురు ఎలా అందరికీ ఎలా కనిపిస్తుంది అంటుంది చిట్టి.