Care Of Anasuya January 14 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో శివాలయానికి వెళ్దాం అంటాడు శివాని వాళ్ళ నాన్న. ఇవాళ మీ ఇద్దరి చేత అర్ధనారీశ్వర వ్రతం చేయిస్తానని దండం పెట్టుకున్నాను అంటాడు. నాకు కుదరదు అంటే నాకు కుదరదు అంటూ శివాని రాయుడు ఇద్దరు బెట్టు చేస్తారు. అర్ధనారీశ్వర వ్రతం అంటే అర్ధరాత్రి వరకు చేయక్కర్లేదమ్మ అరగంటలో అయిపోద్ది తర్వాత మీ పనులు lమీరు చేసుకోవచ్చు అంటాడు పవన్.
బెట్టు చేస్తున్న శివాని దంపతులు..
అయినా సరే కుదరదు అని బెట్టు చేస్తుంటే అయితే బ్రతకడం నాకు కూడా కుదరదేమో అంటాడు శివాని తండ్రి. ఎందుకు అని అడుగుతుంది శివాని. మీ ఇద్దరు చేత వ్రతం చేయిస్తానని ఒప్పుకున్నాను ఇప్పుడు అది కంప్లీట్ అవ్వకపోతే నాకు ఏదైనా జరగొచ్చు కదా అంటూ అబద్ధం చెప్తాడు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇద్దరూ వ్రతం చేయడానికి ఒప్పుకుంటారు. గుడిలోకి వచ్చిన కూతుర్ని అల్లుని విశాలాక్షికి పరిచయం చేస్తాడు శివాని తండ్రి.
పేర్లు ఏంటి అని అడిగి తెలుసుకుని శివపార్వతుల పేర్లు బాగా కలిసాయి. ఇద్దరు స్వామివారి దర్శనం చేసుకోండి అని చెప్తుంది విశాలాక్షి. పూజా వస్త్రాన్ని పంతులుగారు విశాలాక్షికిస్తే ఆమె శివానిని, రాయుడిని దీపారాధన చేయమని ఆ తర్వాత వాళ్ళిద్దరి చేతిని కలిపి ముడి వేస్తుంది. రాయుడు కంగారుగా ఎందుకు ఇద్దరు చేతుల్ని కలిపి కట్టేస్తున్నారు అని అడుగుతాడు. ఇది కట్టేయటం కాదు వ్రతం అయ్యేవరకు ఇలాగే ఉంచాలి దీన్ని సంకల్ప కంకణం అంటారు అంటుంది.
శివాని దంపతులను ఇరకాటంలో పెట్టిన పవన్..
ఈ వ్రతం అరగంటలో అయిపోద్దా అని రాయుడు అడిగితే రేపు సూర్యోదయం వరకు అవుతుంది అంటుంది విశాలాక్షి. ఇద్దరూ పవన్ కాసి కోపంతో చూస్తారు. అంటే రేపు పొద్దున వరకు ఇక్కడే ఉండాలా అంటుంది శివాని. అవునమ్మా మీరిద్దరూ రాత్రి ఇక్కడే నిద్ర చేయాలి పవన్ గారు మీరు మీ కూతురికి చెప్పలేదా అని అడుగుతుంది విషాలాక్షి. చెప్పానండి కాకపోతే మరో విధంగా చెప్పాను ఎలా చెప్పినా మీరు చెప్పింది ఫైనల్ కదా, వాళ్లు అర్ధనారీశ్వర వ్రతం పూర్తిచేసుకునే వెళ్తారు అంతే కదా అల్లుడుగారు అని వాళ్లని ఇరకాటంలో పెట్టేస్తాడు పవన్.
చేతులు కట్టేస్తే మేము పూజ ఎలా చేస్తాం అంటుంది శివాని. జంటగానే చేస్తారమ్మా అంటుంది విశాలాక్షి. శివానికి పూలదండ కట్టమని, రాయుడికి విఘ్నేశ్వరుని చేయమని పురమాయిస్తుంది విశాలాక్షి. వాళ్లు ఆ పనులు చేయటానికి నానా తంటాలు పడతారు. ఇలా కట్టేసిన చేత్తో నువ్వో పని నేనో పని చేయటం కష్టం.నీ పని అయ్యే వరకు నేను వెయిట్ చేస్తాను నా పని అయ్యేంతవరకు నువ్వు వెయిట్ చేయొచ్చు అని మ్యూచువల్ అండర్స్టాండింగ్ కి వస్తారు. వీళ్ళు ఈ పని చేసేసరికి తెల్లవారిపోతుంది ఏమో అని మనసులో అనుకుంటాడు పవన్.
నిజం తెలుసుకుని షాక్ అయిన బేబమ్మ..
మరోవైపు లేటుగా లేచిన బేబమ్మ జయమ్మని కాఫీ అడుగుతుంది. ఏమో లేటుగా లేచారు అని అడిగితే నిన్న రాయుడు బావ బర్త్డే సెలబ్రేట్ చేసినందుకు సంతోషంతో పక్కన శివాని అక్క లేనందుకు బాధతోనూ సరిగ్గా నిద్ర పట్టలేదు అంటుంది బేబమ్మ. వాళ్ల కోసం ఎంత బాగా ఆలోచిస్తున్నారమ్మా అంటుంది జయమ్మ. వాళ్లు పరాయి వాళ్ళు ఎందుకు అవుతారు నాన్న ఏమనేవారు శివాని తన పెద్ద కూతురునే కదా అనేవారు.
అందుకని వాళ్లు మన సొంత మనుషులే ఇంతకీ అక్కేది ఆఫీస్ కి వెళ్లిందా అని అడుగుతుంది బేబమ్మ. లేదమ్మా పవన్ గారు వచ్చి అర్ధనారీశ్వర ప్రాతం చేయిస్తానని అక్కని బావని తీసుకొని వెళ్లారు అని జయమ్మ చెప్తుంది. అదేంటి నేనెప్పుడూ వినలేదు అంటుంది బేబమ్మ. నేను కూడా వినలేదమ్మ జయమ్మ. వాళ్ళిద్దర్నీ కలపటానికి బాబాయ్ గారు ప్లాన్లు వేస్తున్నట్లుగా ఉన్నారు విడదీయడానికి నేను ఉన్నాను గా అంటూ నేను కూడా గుడికి వెళ్తాను జయమ్మ అంటుంది బేబమ్మ. నువ్వెందుకు అమ్మ అని జయం అడిగితే అక్క బావ అన్యోన్యత కోసం చేస్తున్న పూజ నేను లేకపోతే ఎలాగా అని అక్కడ నుంచి బయలుదేరుతుంది.
మరో కుట్రకు ప్లాన్ చేస్తున్న బేబమ్మ..
మరోవైపు పూజ రెడీ,దండ కూడా రెడీ అని విశాలాక్షి వాళ్లని శివాని దంపతులు పిలుస్తారు. వాళ్ల దగ్గరికి వెళ్లిన విశాలాక్షి పూజ ఎలా చేయాలో చెప్తుంది. అంతలోనే అక్కడికి వచ్చిన బేబమ్మ అదేంటి అలాగా చేతులు కట్టేశారు వీళ్ళని కలపటానికి ఏదో ప్లాన్ వేసినట్లుగా ఉన్నారు. వాళ్లని దూరం చేయటానికి నేనొక ప్లాన్ వేస్తాను అనుకుంటుంది బేబమ్మ. స్వామివారి మెడలో వేసిన దండ తీసి ఇద్దరికీ కలిపి వేసుకోమంటుంది విషాలాక్షి. శివాని దంపతులను త్వరగా చేసుకోండి అంటూ కంగారు పెడతాడు పవన్.
Care Of Anasuya January 14 Today Episode
మీరిద్దరూ జంటగా మూడు ప్రదక్షిణలు చేసి రండి, ప్రదక్షిణం పూర్తయ్య వరకు మీ మెడలో దండా జారటం కానీ చేతికి ఉన్న కంకణం ఉండటం కానీ జరగకూడదు. అలా జరిగితే ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. ఒక్కొక్కసారి ఆ దూరం శాశ్వతం కూడా అవ్వచ్చు అని జాగ్రత్తలు చెప్పి శ్రద్ధగా పూజ చేయమని చెప్పి పంపిస్తుంది విశాలాక్షి. ఎలాగైనా పూలదండ జారీ లాగా కానీ కంకణం ఊడిపోయేలాగా గాని చేయాలి అనుకుంటుంది బేబమ్మ.
తరువాయి భాగంలో ప్రసాదం చేసే విషయంలో ఎలాంటి అపస్థితి జరగకూడదు అని చెప్తుంది విశాలాక్షి. ప్రసాదం చేస్తున్న కుండకి రాయి వేసి కొడుతుంది బేబమ్మ. అనుకోని సంఘటనకి అందరూ కంగారు పడతారు.