Intiki Deepam Illalu January 24 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో సూర్య బట్టలు పట్టుకొని ఏడుస్తారు వర్షిణి, దమయంతి. ఈ వస్తువులన్నీ అన్నయ్య వే అంటూ ఏడుస్తుంది కృష్ణ. సూర్యం లేకుండా నేను ఉండలేను అంటూ ఏడుస్తుంది వర్షిణి. ఉన్నట్టుండి ఒక్కసారిగా నా కొడుకు యాక్సిడెంట్ లో చచ్చిపోలేదు మీరే చంపేశారు అంటూ ఏడుస్తుంది. ఆ మాటకి అందరూ షాక్ అవుతారు.
వర్షిణి కుటుంబ సభ్యుల్ని ఆడిపోసుకుంటున్న దమయంతి..
నా కొడుకు నాకోసం ఎప్పుడూ ఆలోచించలేదు బాధపడలేదు ఎప్పుడు మీకోసమే ఆలోచించాడు మీకోసమే అన్నీ చేశాడు మీకు ఏ ద్రోహం చేశారని ఇవన్నీ చంపేశారు అంటూ ఏడుస్తుంది దమయంతి. సూర్యని నీవు చంపుకోడి ఏంటి కొడుకు పోయిన బాధలో మాట్లాడుతున్నావు కానీ ఇంత ఘోరం జరుగుతుందని ఎవరైనా అనుకున్నారా అంటుంది లీలావతి. మాట్లాడొద్దు నా కొడుకుని పొట్టన పెట్టుకునేది మీరే, నా కడుపులో చిచ్చు పెట్టి కంటి తోడు పూమాటాలు మాట్లాడతారా అంటూ శాపనార్ధాలు పెడుతుంది.
సూర్య నీకు కొడుకు అయితే నాకు అన్నయ్య,వర్షిణి కి భర్త, మా మనిషిని మేమెందుకు చంపుకుంటాము అంటుంది కృష్ణ. నా కొడుకు మీ సమస్యల కోసమే మీ చుట్టూనే తిరిగాడు మీ దరిద్రమే వాడిని తినేసింది. నా కొడుకు మీ కారణంగానే చచ్చిపోయాడు అంటూ నిందలు వేస్తుంది. అన్నయ్యకి నామీద ఎంత కోపం ఉన్నా ఆ కోపంలో కూడా ప్రేమ ఉండేది అంటూ ఏడుస్తున్న రాశి ని ఓదార్చపోతుంది లీలావతి. ఆమె చేతిని తోసేసి మీ బెయిల్ కోసమే ఎక్కడెక్కడో అప్పులు చేశాడు.
శాపనార్ధాలు పెడుతున్న రాశి..
అప్పులు ఎలాగ తీర్చాలన్న బెంగతోనే బయటికి వెళ్లి చనిపోయాడు దానికి కారణం మీరే ఈ పాపం పుతూనే పోదు అంటూ శాపనార్థాలు పెడుతుంది రాశి. డెడ్ బాడీ మీదే అంటూ సంతకం పెట్టండి లేకపోతే బాడీ తీసుకెళ్లడానికి అవ్వదు అంటాడు ఎస్ఐ. సంతకం పెట్టిన వర్షిణి కుప్పకూలిపోతుంది. మొగుడు చచ్చాడని సంతకం పెట్టేసావు కదా ఇప్పుడు నీకు సంతోషమేనా నా కొడుకుని తోలుబొమ్మని చేసి ఆడించే నువ్వు మట్టి కొట్టుకుపోతావు అంటూ శాపనార్ధాలు పెడుతుంది దమయంతి. దమయంతి ఇంటి దగ్గరే సూర్య ఆఖరి కార్యక్రమాలన్నీ చేస్తారు కృష్ణ కుటుంబ సభ్యులు.
సూర్య ఫోటో దగ్గర కూర్చొని నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావు నేను ఏదైనా తప్పు చేస్తే క్షమించు అంటూ ఏడుస్తుంది వర్షిణి. నీ మాట వినబట్టే వాడికీ గతి పట్టింది. నేను చెప్పినట్లు వినుంటే వాడికి ఈ గతి పట్టి ఉండేది కాదు, నా కొడుకుని వాళ్ళకాటికి పంపించి వగలమారి ఏడుపులు ఏడుస్తున్నావా? అయినా నా కొడుకే నాకు కాకుండా పోయినప్పుడు నువ్వు మాత్రం ఎక్కడెందుకు మీ ఇంటికి పో అంటుంది దమయంతి. నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే నువ్వు నా కొడుకుని చంపినట్లు నేను నిన్ను చంపేస్తాను అంటూ కేకలు వేస్తుంది దమయంతి.
కష్టంలో కూడా శాడిజం చూపిస్తున్న దమయంతి..
ఏం మాట్లాడుతున్నావు దమయంతి చిన్న వయసులోనే పసుపు కుంకుమ పోగొట్టుకొని బాధపడుతున్న పిల్లని కన్నతల్లి లాగా ఓదార్చాల్సింది పోయి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నావు. మా బిడ్డకు ఇలాగ అయిందని మేమందరం బాధపడుతుంటే ఏమాత్రం దయ జాలి లేకుండా ప్రవర్తిస్తున్నావు. ఆడపిల్లకి పెళ్లి అయ్యాక ఇప్పుడు తను ఎక్కడికి పోతుంది అని లీలావతి అంటే తీసుకెళ్లి మీ ఇంట్లో పెట్టుకోండి నా ఇంట్లో మాత్రం ఉండడానికి వీల్లేదు అంటూ తెగేసి చెప్తుంది.
నా కూతుర్ని నీ కొడుక్కి ఇచ్చి పెళ్లి చేస్తే దాని జీవితాన్ని అధోగతిపాలు చేశావు. నా కొడుకుని నీ కూతురికిచ్చి పెళ్లి చేస్తే వాడు కాటికి వెళ్ళిపోయాడు. వంశానిత్రం లేకుండా పోయింది అంటూ ఏడుస్తుంది దమయంతి. భర్తని పోగొట్టుకున్న నా చెల్లెలు బాధని అర్థం చేసుకోండి అంటాడు హర్ష. భర్తకి దూరమైన నా కూతురు బాధని నువ్వేమి అర్థం చేసుకున్నావు, నాకు నీతులు చెప్తున్నావా అంటూ అల్లుడ్ని తిడుతుంది దమయంతి. బతికిచెడిన ఆడపిల్లని పుట్టింటి వాళ్ళు పోషించలేక కాదు, ప్రేమలు, అభిమానాలు,ఆస్తులు అన్ని పంచి ఇవ్వగలరు కానీ ఆడపిల్లకి జీవితాంతం తోడు ఉండవలసింది అత్తింటి వాళ్లే అంటూ పిన్నికి నచ్చ చెప్పాలని చూస్తుంది కృష్ణ.
శోకసముద్రంలో వర్షిణి కుటుంబం..
నాకు అన్యాయం జరిగిందని మీ ఎవరికీ బాధ లేదు, నా జీవితాన్ని బాగు చేయటానికి మీ మనసులు పెద్దవి చేసుకోలేదు కానీ మీ కోసం మాత్రం మా మనసులు పెద్దవి చేసుకోవాలా అంటూ అరుస్తుంది రాశి. నీ ఆడపడుచు ఇంత కష్టంలో ఉంటే అలాగేనా మాట్లాడ్డం అని జగదీష్ అంటే తప్పులు అందరూ చేస్తారు కాకపోతే చిన్న పెద్ద అలాంటి నా తప్పుల్ని అందరికీ చెప్పి నా జీవితాన్ని నాశనం చేసింది ఈ ఆడబడుచే అంటుంది రాశి. మీరు నాకు నచ్చ చెప్పాలని చూస్తున్నారు కానీ మీ కొడుకు నాతో చెప్పాలని చూస్తే ఈరోజు నేను ఇలా పుట్టింట్లో ఉండేదాన్ని కాదు అంటుంది రాశి.
దానికి దీనికి ముడి పెట్టొద్దు, కోపాలు తాపాలు మనుషుల్ని విడదీయటానికి పనికొస్తాయి గానీ అనుబంధాల్ని కలపడానికి పనికిరావు అంటాడు మనో. ఆవేశంగా వర్షిణి బ్యాగ్ బయటికి విసిరేసి నువ్వు వెళ్ళకపోతే నేనే వెళ్ళిపోతాను అంటుంది దమయంతి. నీకు అసలు మనసే లేదా అంటుంది కృష్ణ. నీకు ఉంది కదా పెద్ద మనసు ఇద్దరూ కలిసి ఏ ఏట్లోనో దూకి చావండి నాకు అనవసరం అంటుంది దమయంతి. వేరే దారి లేక బ్యాగ్ తీసుకొని అక్కడినుంచి అందరూ వెళ్ళిపోతారు.
Intiki Deepam Illalu January 24 Today Episode సూర్య కోసం ఏడుస్తున్న కుటుంబ సభ్యులు..
ఇంటికి వచ్చిన వర్షిణి భర్తని తలుచుకొని ఏడుస్తూ ఉంటుంది. కృష్ణ తను కష్టాల్లో ఉన్నప్పుడు సూర్య చూపించిన సపోర్ట్ ని తలుచుకొని ఏడుస్తుంది. మా అన్నయ్య నాకోసమే బాధపడేవాడు నా కోసం ఏం చేయడానికైనా సిద్ధపడేవాడు, నన్ను ప్రాణంగా ప్రేమించే అన్నయ్య నన్ను వదిలి వెళ్ళిపోతాడు అనుకోలేదు అంటూ ఏడుస్తుంది.
తరువాయి భాగంలో మన ఆస్తులు కోల్పోవడానికి మనం ఇలా వీధిని పడడానికి కారణం ఆ హారిక అంటూ భార్యకి నిజం చెప్తాడు మనో. హారిక ఇంటికి ఆవేశంగా వచ్చిన కృష్ణ ఆమెని చాచి కొడుతుంది నీ తప్పులను నిరూపించి నిన్ను జైలుకు పంపిస్తాను అంటుంది.