Devatha April 27 Episode: రాధను భార్యగా చేసుకోవాలనుకుంటున్న మాధవ.. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన దేవి!

Akashavani

Devatha April 27 Episode: ఈరోజు ఎపిసోడ్ లో రాధ మాధవపై అరుస్తుంది. ఆ ఆఫీసర్ సారు కన్నబిడ్డను ఇవ్వడానికి మీకేం అవుతుంది అంటూ మాధవ పై అరుస్తుంది రాధ. రక్త బంధాన్నికి ఎటువంటి అడ్డు ఉండదని అంటుంది. అంతేకాకుండా పెంచుకుంటున్న బిడ్డకే మీకు ఇంత ప్రేమ ఉంటే.. కన్న బిడ్డ మీద ఆ ఆఫీసర్ సారు కు ఎంత ప్రేమ ఉంటుందని ప్రశ్నిస్తుంది. ఇక మీరు చేసిన పని వల్ల దేవితో పాటు అందరికీ అసలు నిజం తెలిసేలా ఉంది అని అక్కడి నుంచి కోపంతో వెళ్ళిపోతుంది.

రాధను సొంతం చేసుకోవాలనుకుంటున్న మాధవ..

ఇక మాధవ రాధ చెప్పింది నిజమే కదా అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. తన కూతురు చిన్మయి గుర్తుకు రావడంతో తన కూతురు పరిస్థితి ఏంటి అని.. ఇప్పుడు దేవిని పంపిస్తే.. ఆ తర్వాత కు రాధ నా భార్య అని ఆదిత్య వస్తాడు. అప్పుడు రాధ కూడా వెళ్ళిపోతే నా కూతురు తట్టుకోలేదు అని అనుకుంటాడు. ఎలాగైనా రాధను, దేవిని ఇక్కడి నుంచి పంపించకూడదని అనుకుంటాడు. ఇక రాధను పంపించకూడదు అంటే ఒక అడ్డు ఉండాలి అని.. అంటే రాధ నా భార్య కావాలి.. రాధ ను నేను పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటాడు.

భార్య నడుములు విరగగొట్టిన రంగ..

మరోవైపు రంగా భాష పై కోపంతో రగిలి పోతూ ఉంటాడు. ఇంట్లోకి పానకంను రానివ్వకుండా చేస్తున్నాడని.. తన భార్య రాజ్యంను కింద పడేసేలా చేస్తాడు. రాజ్యం గట్టిగా అరవడంతో ఇంట్లో వాళ్ళందరూ అక్కడికి వస్తారు. ఇక రంగ తన భార్య నడుములు విరిగాయని ఇంట్లోకి పనిమనిషి కావాలి అని అంటాడు. దాంతో భాష రంగపై అరిచి నోరు మూసేలా చేస్తాడు. మరోవైపు ఇంట్లో రాధ ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటుంది. మాధవ అన్న మాటలను తలుచుకుంటూ ఉంటుంది.

ఇక అప్పుడే అక్కడికి దేవి రావటంతో ఇంకా పడుకోలేదా అని రాధ అడుగుతుంది. దాంతో అన్నం తినకుండా ఎలా పడుకుంటాను అమ్మ అని దేవి అనడంతో.. వెంటనే రాధ దేవి కి అన్నం పెట్టాలని చూస్తుంది. కానీ అందులో అన్నం లేకపోవడంతో అక్కడికి రామమూర్తి, జానకి లు వచ్చి బిడ్డను దూరం చేసుకుంటున్నావన్న ఆలోచనలలో వంట చేయడం మర్చిపోయావ్ అమ్మ అని అంటారు. అంతేకాకుండా దేవిని దూరం చేసుకుంటుందన్న నేపథ్యంలో మరిన్ని మాటలను అంటారు.

Devatha April 27 Episode: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన దేవి..

ఇక దేవి నిజంగానే వదిలేస్తున్నావా అంటూ బాధపడుతుంది. లేదమ్మా అని ఇప్పుడే వంట చేసి తీసుకు వస్తాను అని వంట చేసుకుని వచ్చి చిన్మయికి, దేవి కి అన్నం తినిపిస్తుంది. ఇక రాధ దేవిని ఉద్దేశించి.. చెప్పిన మాట వినాలని అనడంతో ఆ విషయాన్ని దేవి అర్థం చేసుకొని అక్కడ నుంచి వెళ్లి పోతుంది. మాధవ ఇక్కడికి వచ్చి తనకు భోజనం వడ్డించమని అంటాడు. రాధతో నువ్వు తినకపోతే నేను తినను అనడంతో రాధ కోపంగా తింటుంది. ఇక రాధ పిల్లలతో పడుకొని ఉండగా మాధవ అక్కడికి వచ్చి రాధ ని చూసి ఆలోచిస్తూ ఉంటాడు. మాధవని చూసిన రాధ మాధవ పై అరుస్తుంది. తరువాయి భాగంలో దేవి కనిపించడం లేదు అని రాధతో పాటు ఇంట్లో వాళ్లంతా వెతుకుతూ ఉంటారు.

- Advertisement -