Devatha August 4 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో దేవి భాగ్యమ్మ ఇద్దరు కలిసి నడుచుకుంటూ వస్తారు. ఇక దేవి భాగ్యమ్మను స్కూల్ దగ్గర వ్యాపారం చేసే దానివి కదా ఇక్కడికి ఎందుకు వచ్చావు అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. దాంతో తనకు అక్కడ ఎక్కువ డబ్బులు లేవు అని అందుకే ఇక్కడ ఉన్నాను అని అంటుంది.
దేవి మాటలకు షాక్ అయిన భాగ్యమ్మ..
ఇక మిమ్మల్ని మంచిగా చూసుకుంటాను అని అంటుంది. ఆ తర్వాత ఈ కొట్లాట ఎందుకు నేర్చుకుంటున్నావు అని భాగ్యమ్మ అడగడంతో మా నాయన గురించి నేర్చుకుంటున్నాను అని.. ఆయనను కొట్టడానికి నేర్చుకుంటున్నాను అని అంటుంది. ఆ మాట విన్నాక భాగ్యమ్మ షాక్ అవుతుంది.
ఆ తర్వాత దేవి తన తండ్రి గురించి అన్ని విషయాలు చెప్పటంతో భాగ్యమ్మ ఆశ్చర్య పోతుంది. ఆ తర్వాత భాగ్యమ్మ తన మనసులో ఇదంతా మాధవ చేశాడని వాడి పని చేస్తాను అని అనుకుంటుంది. ఆ తర్వాత దేవి ఈ విషయం గురించి ఎక్కువగా ఎవరికీ చెప్పకూడదు అని అనుకుంటుంది.
సీన్ కట్ చేస్తే..
దేవుడమ్మ రుక్మిణి ఫోటో చూసుకొని బాధపడుతుంది. ఎక్కడ ఉన్నదో అని బాధపడుతుంది. అప్పుడే దేవుడమ్మ భర్త వచ్చి దేవుడమ్మతో మాట్లాడుతాడు. దేవుడమ్మ రుక్మిణి గురించి తన భర్తకు చెప్పుకుంటూ బాధపడుతుంది. బాగా ఎమోషనల్ అవుతుంది. దాంతో దేవుడమ్మ భర్త బాధపడకు అని ధైర్యం చెప్పి ఎలాగైనా రుక్మిణి ఎక్కడ ఉందో వెతుకుతాము అని అంటాడు.
తన పోలిక ఎవరిది అనే రాధను అడిగిన దేవి..
రాధ వంట చేస్తూ ఉండగా దేవి వచ్చి తను ఎవరి పోలిక ఉంటాను అని అడుగుతుంది. దాంతో రాధ నువ్వు మీ నాయన పోలిక ఉంటావు అని అనగా ఇంకా నాయన పోలికలు ఏంటివి అని అంటుంది. దాంతో రాధ ఈ విషయం గురించి ఇప్పుడు ఎందుకు అని అంటుంది. ఆ తర్వాత సత్య ఒంటరిగా ఆలోచిస్తూ ఉండగా అక్కడికి దేవుడమ్మ వచ్చి ఏం జరిగింది అని అడుగుతుంది.
ఇక సత్య ఆదిత్య సరిగా ఉండటం లేదు అని చెబుతుంది. ఒకప్పటిలాగా లేడు అని.. ఏ విషయం గురించో బాగా ఆలోచిస్తున్నాడు అని అడిగితే కూడా ఎటువంటి సమాధానం చెప్పడం లేదు అని అంటుంది. అంతే కాకుండా అమెరికా ప్రయాణం గురించి కూడా మాట్లాడుతుంది. దేవుడమ్మ కూడా అమెరికాకు వెళ్దాం అన్నాడు కదా మళ్లీ ఎందుకు దిగులుగా ఉన్నావు అని అంటుంది.

Devatha August 4 Today Episode: అమెరికాకు వెళ్ళనంటున్న సత్య..
దాంతో సత్య అక్కడికి నెల ముందు ప్లాన్ చేస్తేనే వెళ్లలేదు అని ఇప్పుడు ఎలా వెళ్లగలము అని అంటుంది. అంతేకాకుండా తను కూడా ఆదిత్య అలా ఉండటంతో అమెరికాకు వెళ్ళను అని నేరుగా చెప్పేస్తుంది. దాంతో దేవుడమ్మ ఆశ్చర్య పోతుంది. రాధ ఒంటరిగా ఉండి ఆలోచిస్తూ ఉండగా అక్కడికి భాగ్యమ్మ వచ్చి నీ పెనిమిటి గురించి ఆలోచిస్తున్నావు కదా అని అంటుంది.
ఇక భాగ్యమ్మ కాసేపు రాధ బాధల గురించి మాట్లాడుతుండగా అప్పుడే అక్కడికి దేవి వచ్చి నాకు నిద్ర రావడం లేదు అని నాయన కథ చెప్పు అని అడుగుతుంది. అంతే కాకుండా ఆయన వివరాలు కూడా అడుగుతుంది. దీంతో రాధ ఇవన్నీ ఇప్పుడు ఎందుకు అని అంటుంది.