Devatha August 6 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో మాధవ ఫ్రెండ్స్ మాధవ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక మాధవ ఎంట్రీ ఇవ్వగా ఆ సమయంలో మాధవ చేతిలో స్టిక్ కనిపించదు. దీంతో మాధవ ఇంట్లో వాళ్లని మోసం చేస్తున్నట్లు అర్థమవుతుంది. తన ఫ్రెండ్స్ దగ్గరికి వారితో కాసేపు సరదాగా మాట్లాడుతాడు.
ఇక మాధవ తను ఇంటికి వెళ్ళాలి అనటంతో తన ఫ్రెండ్స్ రాధ కోసం వెళ్తున్నాడు అని అంటారు. ఆ తర్వాత అందులో ఒకతను పెళ్లయిన ఆంటీ తో లవ్ ఏంటి అంటూ వెటకారం చేస్తూ మాట్లాడుతాడు. దాంతో మాధవ తన ఫ్రెండ్ చెంప పగలగొడతాడు. ఆ తర్వాత తనకు రాధ మీద ఎటువంటి ప్రేమ ఉందో వివరించి చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతాడు.
సీన్ కట్ చేస్తే..
రాధ తన మనసులో తన భర్త, తన బిడ్డ కలవాలి అని దేవుడిని వేడుకుంటుంది. అప్పుడే మాధవ రావటంతో అనుకోకుండా వచ్చాడు ఏంటి అని కోపంగా అనుకుంటుంది. మాధవ రాధ దగ్గరికి వచ్చి మాట్లాడుతుండగా రాధ చిరాకు పడుతూ కనిపిస్తుంది. నేను రెండు రోజులు లేకపోయేసరికి నువ్వు ఏమేమి చేసావో నాకు అవన్నీ విషయాలు తెలుసు అని రాధ చేసిన పనులు మొత్తం చెబుతాడు.
ఇక దేవిని కరాటే నేర్పించి మంచి పని చేయించావు అని.. ఏదో ఒక రోజు ఆదిత్యను దేవి కొడుతుంది అని రాధను రెచ్చగొట్టేలా మాట్లాడుతాడు. రాధ అతనిపై అరుస్తూ ఉండగా అప్పుడే అక్కడకు దేవి వచ్చి మాధవని పలకరిస్తుంది. మాధవ కూడా ఎంతో ప్రేమ ఉన్నట్లు మాట్లాడుతాడు.
ఆ తర్వాత నిన్ను ఒక చోటకు తీసుకొని వెళ్తాను అని దేవితో అంటాడు. అంతేకాకుండా రాధను కూడా రమ్మని అనడంతో రాధ తను రాను అంటుంది. కానీ దేవి ఎలాగైనా నువ్వు రావాలి అనడంతో రాధ ఒప్పుకుంటుంది. మరోవైపు సూరిని తన అన్నయ్య కోప్పడుతూ ఉంటాడు. ఆ ఊరికి ఎందుకు వెళ్లావు అని అంటుంటాడు.
దేవుడమ్మను ఆపిన సత్య..
దాంతో సూరి వదినమ్మ బాధ చూడలేక రుక్మిణిని వెతకడానికి వెళ్లాను అని అంటాడు. అప్పుడే దేవుడమ్మ వచ్చి నిజంగానే ఆ అమ్మాయి రాధలా ఉందా అని ప్రశ్నలు వేయటంతో సూరి అలాగే ఉంది అని అంటాడు. దాంతో దేవుడమ్మ ఆ ఊరికి వెళ్ళాలి అని అనటంతో వెంటనే సత్య ఆపే ప్రయత్నం చేస్తుంది. అంతేకాకుండా అలా వెళ్తే ఎవరైనా చూసి మరోలా అనుకుంటారు అని అంటుంది.
Devatha August 6 Today Episode: రాధకు పెద్ద షాక్ ఇవ్వనున్న మాధవ..
మరోవైపు మాధవ రాధను, దేవిని కారులో తీసుకొని వెళ్తాడు. ఇక దేవి దారిలో ఆఫీసర్ సారు ఇల్లు ఉంటుందని అనటంతో అక్కడికే వెళ్తున్నాము అని మాధవ రాధకు పెద్ద షాక్ ఇస్తాడు. దాంతో రాధ అక్కడికి ఎందుకు అని అంటుంది. ఇక తరువాయి భాగంలో ఏం జరుగుతుందో చూద్దాం.