Ennenno Janmala Bandham: మనసులో ప్రేమను దాచుకుంటూ బయటపడలేకపోతున్న ఇద్దరి దంపతుల కథ ఈ ఎన్నెన్నో జన్మల బంధం.ఈ వారం ఏం జరిగిందో చూద్దాం.
రాజారాణి లను కలవడానికి బయలుదేరుతారు యష్ దంపతులు. దారిలో ఆకలేస్తుంది అని హోటల్లో ఆగుతారు. అప్పుడు వాళ్ళు భోజనం చేస్తూ ఉండగా మాటల్లో ఖుషీ నే వాళ్ళ ఇద్దరినీ ఒప్పించింది అని తెలుసుకుంటారు. ఖుషి మనం కలవడం కోసం ఎన్ని చేస్తుంది అని అనుకుంటారు. తర్వాత వాళ్ళు తిరిగి ప్రయాణం మొదలుపెడతారు ఇంతలో వేదా పడుకుంటుంది.
వేద చూసిన యష్ నువ్వు ఇంత మంచి దానివి వేదా అని తనని పొగుడుతూ ఉంటాడు ఇంతలో వేద కి మేలుకోవచ్చి బయలుదేరుదాము అని అంటుంది. వాళ్లు ఊరికి వెళ్లేసరికి రాజా రాణి లు ఆడంబరంగా వాళ్లని ఆహ్వానిస్తారు. మా ఊరి పద్ధతులు ఇంతే అని అంటుంది వేదా. వాళ్ళని చూసిన యష్ వెంటనే వాళ్ళ దగ్గర వెళ్లి ఆశీర్వాదాలు తీసుకుంటారు.
బలే నటిస్తున్నారు అని అనుకుంటుంది వేద. తనని తాను పరిచయం చేసుకున్న యష్ తో, నువ్వు మాకు ముందే తెలుసు బాబు మీ ఫోటోలు చూస్తూ ఉంటాము అని అంటారు రాజా రాణి లు. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ఇంటినీ, ఆ పరిసరాలని చూసిన యష్ రాజా రాణిలను పొగుడుతూ ఈ ఇల్లు చాలా బాగుంది అని అంటాడు.
తర్వాత వాళ్ళిద్దరూ అలసిపోయారు అని భోజనం చేసి వెళ్లి పడుకోండి అంటారు రాజారాణిలు. వేద భోజనం చేస్తున్నప్పుడు యష్ వేదకు వడ్డిస్తారు దాన్ని చూసిన రాజారాణిలు మురిసిపోతూ ఉంటారు తర్వాత రాణి వేదకు పూల దండ పెట్టి అందంగా అలంకరిస్తుంది. బయటికి వెళ్ళడం లేదు కదా అని వేద అనంగా భర్త దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనం అందంగానే ఉండాలి అని అంటుంది.
అప్పుడు వేదా లోపలికి వెళ్ళగా వేద ని చూసిన యష్ కొత్తగా కనిపిస్తున్నావు అని అంటాడు అమ్మమ్మ చాదస్తం అని అనగా వాళ్ళు అలాగే అంటారు లే అని అంటాడు యష్. తర్వాత యష్ కింద పడుకొని వేద పైన పడుకుంటాది. మనం ఎప్పటికీ ఇలాగే ఉండిపోతామా ఆ ఒప్పందాలనుంచి ముందుకు కదలలేమా అని ఇద్దరికీ ఇద్దరు మనసులో అనుకుంటారు.
మరోవైపు రాజా రాణి లు వీళ్ళు ఇంత కలివిడిగా ఉంటే సులోచన ఎందుకు అంత భయపడిపోతుంది అని అనుకుంటారు. ఆ తర్వాత రోజు ఉదయం వేద వెళ్లి ఇంటి బయట ముగ్గు వేస్తుంది దాన్ని చూసిన రాజా రాణి లు మన మనవరాలు పెద్ద డాక్టర్ అయినా ఇంటి మూలాలు మర్చిపోలేదు మన సులోచన పెంపకం అలాంటిది అని మురిసిపోతారు.
అప్పుడే అక్కడికి వచ్చిన యష్ వేద ఇలా ముగ్గు వేయడం చాలా బాగుంది అని వెళ్లి వేదతో పాటు ముగ్గు వేస్తాడు. ఇది ఇలా ఉండగా మరోవైపు అభివాళ్ళ అక్క అభిని సమయపాలన కోసం తిడుతూ రెండు నిమిషాలు కూడా లేట్ చేయకూడదు మనం సక్సెస్ఫుల్గా అవ్వాలంటే డిసప్లైన్ ముఖ్యం అని బ్రేక్ ఫాస్ట్ కి లేటుగా వచ్చినందుకు తిడుతుంది.
అప్పుడే అక్కడికి వచ్చిన మాళవిక ఇంత త్వరగా ఎందుకు బ్రేక్ఫాస్ట్ అని అభి పక్కన కూర్చుంటుంది. నువ్వు ఈ ఇంటికి గెస్ట్ గా వచ్చావు అభి పక్కన కూర్చోవడానికి ఎంత ధైర్యం అని వాళ్ళ అక్కగా అడగగా తిను కూడా మన ఫ్యామిలీ మెంబర్ లాంటిదే అక్క అని అంటాడు అభి. కాదు గెస్ట్ గా ఓకే గాని ఫ్యామిలీ మెంబర్గా నాట్ ఓకే అని అంటుంది ఆది వాళ్ళ అక్క అప్పుడు బాధపడుతూ వెళ్ళిపోతుంది మాళవిక.
వాళ్ళ అక్క వెళ్ళిపోయిన తర్వాత అభి మాళవిక దగ్గరికి వెళ్లి నువ్వు బాధపడొద్దు నేనే అక్కని ఇక్కడికి తెప్పించాను అక్కకి చాలా కోట్ల ఆస్తి ఉన్నది నేనొక్కడినే వారసుడ్ని ఎలాగైనా అక్కని ఒప్పించి పెళ్లి చేసుకుందాము అని అంటాడు. మరోవైపు ఖుషి తల్లిదండ్రులు లేనందుకు బాధపడుతూ మీరు లేకుండా నేను ఎప్పుడూ లేను కదా వచ్చేటప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ గా తిరిగి రండి అని అంటాది.
దాన్ని చూసిన వియ్యంకులు ఇద్దరు మురిసిపోతారు. తర్వాత వేద యష్ కి, రాజాకి కాఫీ ఇస్తూ ఉంటుంది అప్పుడు అనుకోకుండా కాఫీ కప్పులు మారిపోవడం గమనించని వేద తిరిగివచ్చి రాణి దగ్గర కూర్చుంటుంది. కాఫీ బాగోకపోవడంతో ఏమీ చేయలేక వేద చాలా బాగా కాఫీ పెట్టింది అని పొగుడుతూ ఉంటారు రాజా యష్ లు ఏదో తేడాగా ఉన్నది అని గమనించిన వేద రాణిలు వెల్లి కాఫీ తాగగ కప్పులు మారిపోయాయి అని తెలుస్తుంది.
వేద సారీ చెప్తుంది సారీ చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు అనుకొని చేయలేదు కదా పర్లేదు షుగర్ లేకపోయినా సరే తీయగానే ఉంది నువ్వు పెట్టావు కదా అని అంటాడు. భార్యని వెనకేసుకొని వస్తున్న యష్ ని చూసి రాజా మురిసిపోతాడు భర్త అంటే ఇలాగే ఉండాలి ప్రతి విషయాన్ని వేలెత్తి చూపకూడదు. నా మనవడివి అనిపించుకున్నావు అని అంటాడు.
మరోవైపు సులోచన ఆనందంగా మాలిని దగ్గరికి వచ్చి మన వేదా యష్ లు ఇద్దరు కలిసి ముగ్గులు వేస్తున్నారట అని అంటుంది. ఖుషి, మాలినీలు ఇద్దరూ ఆనందంగా ఆ వీడియోని చూస్తారు. మరోవైపు యష్ వేదకు భోజనం వడ్డిస్తున్నప్పుడు తీసిన వీడియోని చూసిన ఖుషి చాలా మురిసిపోతుంది. అమ్మ నాన్నలు అక్కడికి వెళ్ళిన తర్వాత బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు అని అనుకుంటుంది.
Ennenno Janmala Bandham: కొత్త మలుపు తీసుకుని ఇంట్రెస్టింగ్ గా సాగుతున్న సీరియల్ ని ఇష్టపడుతున్న ప్రేక్షకులు..
ఇక ఈవారం కథ ఇలా సాగగా వచ్చేవారం భార్యాభర్తలు మధ్యలో ఉన్న చిన్న చిన్న కలతలు వీడి ఒకటి అవ్వగలరా? అభీ, మాళవిక గురించి వాళ్ళ అక్కతో చెప్పనున్నాడా? రాజా రాణి లు యష్ దంపతులకు ఎటువంటి సలహాలు ఇవ్వనున్నారు? అనేవి తెలియాలంటే వచ్చేవారం వరకు ఎదురు చూడవలసిందే.