Ennenno Janmala Bandham: కుటుంబ సభ్యులను సంతోషపెట్టడం కోసం వాళ్లు సంతోషంగా ఉన్నట్లు నటిస్తున్న ఓ దంపతుల కథ ఈ ఎన్నెన్నో జన్మల బంధం.
భార్య భర్తలు ఇద్దరూ కలిశారు అని ఆనందపడుతున్న భర్తకి వాళ్ళు కలవలేదు మన ముందు నటిస్తున్నారు అంటూ చెబుతుంది రాణి. వీళ్ళు ఎందుకిలా చేస్తున్నారు అంటూ బాధపడతాడు రాజా. మనవరాలుకి ఒడి బియ్యం పోసి పండంటి బిడ్డని కనమని ఆశీర్వదించి వేద దంపతులను సాగనంపుతారు రాజా దంపతులు. వాళ్లు వెళ్లిన తర్వాత వీళ్ళు మన ముందు ఎందుకు నటిస్తున్నారు. సులోచనకి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాము.
అయినా సులోచనకి అప్పుడే విషయం చెప్పొద్దు అంటూ భార్యకి చెప్తాడు రాజా. మరోవైపు వేదవాళ్లు వస్తున్నాయి విషయాన్ని తెలుసుకొని సంతోషపడతారు మాలిని సులోచన వాళ్ళు. నేను హారతి ఇస్తాను అంటే నేను హారతి ఇస్తాను అని మళ్లీ ఇద్దరూ గొడవ పడతారు. గొడవపడటంలో గిన్నిస్ రికార్డు ఏమైనా ఉంటే వీళ్ళకి ఇవ్వాలి అంటూ వాళ్ళ భర్తలిద్దరూ వీళ్ళని ఆటపట్టిస్తారు.
ఇద్దరు కలిసి హారతి పట్టండి అని ఖుషి తీర్పిస్తుంది. కార్లో బయలుదేరిన వేదతో మనం ఇంటికి వెళ్ళాక కూడా ఇదే నటన కంటిన్యూ చేయాలి లేకపోతే వాళ్లు బాధపడతారు అంటాడు యష్. నిజమే మీరు అక్కడ బాగా నటించారు మీరు బెస్ట్ సీఈఓ తో పాటు బెస్ట్ యాక్టర్ కూడా నేను కూడా అలాగే నటిస్తాను అంటూ కన్నీరు పెట్టుకుంటుంది వేద. మరోవైపు మాళవిక గురించి తెలుసుకోవాలని ప్రయత్నించిన భ్రమరాంబిక, మాళవిక ఏమి చెప్పకపోవడంతో నిరాశకి గురవుతుంది ఈమె చాలా తెలివైనది అనుకుంటుంది.
అమెరికా నుంచి కాస్మెటిక్స్ తెప్పిస్తున్నాను అంతవరకు ఓపిక పట్టు అంటుంది. అయితే అమెరికాలో వేరే వాళ్ళతో మాట్లాడుతున్నట్లుగా మాట్లాడి మాళవిక ని అవమానిస్తుంది భ్రమరాంబిక. అదే విషయాన్ని అభి కి చెప్తే మాళవికకి సర్ది చెప్పి పంపించేస్తాడు. వీళ్ళిద్దరి మధ్యలో నేను నలిగిపోతున్నాను అనుకుంటాడు. మరోవైపు ఇంటికి వచ్చిన వేద దంపతులని హారతి ఇచ్చి ఆహ్వానిస్తారు మాలిని వాళ్ళు. ఒడి బియ్యంతో పుట్టింట్లోనే వండుకొని తినాలి అంటే అక్కడే భోజనం చేస్తారు ఇద్దరూ కుటుంబ సభ్యులు.
మరోవైపు మాళవిక, యష్ కి ఫోన్ చేయటంతో తనమీద చిరాకు పడతాడు యష్. మళ్లీ ఫోన్ వస్తే మాళవికే ఫోన్ చేసిందనుకొని వేదని తిడతాడు. విషయం తెలుసుకున్న వేద, యష్ మీద అలుగుతుంది. ఊర్లో వాళ్ళు ఎలా ఎంజాయ్ చేసింది కూతురికి చెప్తారు వేద దంపతులు. నేను మిమ్మల్ని మిస్ అయ్యాను అని ఖుషి అంటే నేను కూడా అంటూ ఇద్దరూ హగ్ చేసుకుంటారు వేద,ఖుషి. ఖుషి ని తనతో తీసుకువెళ్లిపోతుంది చిత్ర. ఆ రాత్రి మళ్లీ వేద దంపతులిద్దరూ గొడవపడతారు.
కానీ తెల్లారేసరికి ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు. మరోవైపు మాళవిక, అభిల సంబంధాన్ని భ్రమరాంబిక దగ్గర బయటపెట్టి ఆమెకి షాక్ ఇస్తాడు కైలాష్. విషయాన్ని తెలుసుకున్న బ్రమరాంబిక మాళవిక స్లో పాయిజన్ లాంటిది తనని స్లోగా ఇంట్లోంచి పంపించేయాలి అంటూ కైలాష్ ని టచ్ లో ఉండమని, ఓకే పడవలో ప్రయాణం చేయమని హెచ్చరించి అతనికి కావలసినంత డబ్బుని ఆఫర్ చేస్తుంది భ్రమరాంబిక. నా ప్రయాణం మీతోనే అని బ్రహ్మరాంబిక నమ్మిస్తాడు కైలాష్.
మరోవైపు తెల్లవారుతూనే ఇంటికి వచ్చిన సులోచనని ఇంత పొద్దున్నే వచ్చావ్ ఏంటి అని అడుగుతుంది మాలిని. నీ దగ్గర దాచేది ఏమి ఉంది నేను అందుకే వచ్చాను అంటుంది మాలిని. మరోవైపు వేద ఫ్రెండ్ పంపించిన జోక్స్ కి భార్యాభర్తలిద్దరూ నవ్వుకుంటూ ఉంటారు. ఆ నవ్వులని విన్న వియ్యపురాళ్ళు ఇద్దరూ ఏదో జరిగిపోయింది అనుకొని సంతోషపడతారు. లేదా చూపించిన జోక్స్కి నవ్వుతూ మీ ఫ్రెండ్ ని నేను కూడా కలవాలి అనుకుంటున్నాను ఆమెని నాకు పరిచయం చెయ్యు అంటాడు యష్.
Ennenno Janmala Bandham:సీరియల్ బాగున్నప్పటికీ కథ అక్కడికక్కడే తిరుగుతుంది ముందుకి వెళ్ళటం లేదు అంటున్న ప్రేక్షకులు..
తను ఆమె కాదు అతను నా బెస్ట్ ఫ్రెండ్ అంటుంది వేద. ఆ మాటలకి షాక్ అవుతాడు యష్. ఈ ఇష్యూ వాళ్ళ మధ్య ప్రాబ్లం అవుతుందా? మాళవికని అభి జీవితంలో నుంచి భ్రమరాంబిక పంపించేస్తుందా? ఇవన్నీ తెలుసుకోవాలంటే వచ్చేవారం వరకు ఆగాల్సిందే.