Ennenno Janmala Bandham December 26 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో మాట్లాడిన తర్వాత వియ్యపు రాళ్లు ఇద్దరు వారి కోడల్ని, అల్లుడ్ని మెచ్చుకుంటారు. వాళ్ళ మాటలకి చిరాకు పడిన ఖుషి మా అమ్మ నాన్న ఎందుకు దిష్టి పెడతారు అంటుంది. వాళ్లు అక్కడ అన్యోన్యంగా ఉన్నారంటే ఎందుకు ఉండరు ఇక్కడ ఈవిడ గారు వాళ్ళని సంతోషంగా ఉండనిస్తే కదా అంటుంది సులోచన.
యష్ కి చెమటలు పట్టించిన రాజా..
అంటే వాళ్ళిద్దర్నీ నేను కలవటం లేదా అంటూ గొడవకి దిగుతుంది మాలిని. అంటే వాళ్ళని అక్కడ పంపించాలన్న ఆలోచన నీదా అంటే ఒకరి మీద ఒకరు కాలు దువ్వుకుంటారు. వాళ్ళిద్దర్నీ ఒక్క గసురు గసిరి అక్కడ మా మమ్మీ డాడీ హ్యాపీ ఇక్కడ నేను హ్యాపీ మధ్యలో మీ ముసలోళ్ళ గొడవ ఏంటి అంటుంది. చిన్న పిల్ల మనల్ని ఎంతమాట అంది అంటూ బిత్తర పోయిన ముసలోళ్ళు ఇద్దరు దాన్ని అలా పెంచింది నువ్వే అంటే నువ్వే అంటూ మళ్ళీ వాదులాటకి దిగుతారు.
ఆ గొడవకి అక్కడ నుంచి బయటికి వచ్చేస్తుంది ఖుషి. మరోవైపు యోగ చేస్తున్న యష్ దగ్గరికి వచ్చి తను కూడా యోగ చేస్తాడు రాజా. ఉత్సాహంగా యోగ చేస్తున్న రాజాని మిమ్మల్ని ఒకటి అడుగుతాను నిజం చెప్పండి అంటాడు యష్. మొహమాటం ఎందుకు అడుగు అంటాడు రాజా. మీ వయసు ఎంత అని అడిగితే 82 అంటాడు రాజా. మాటకి ఆశ్చర్యపోయిన యష్ యోగ చేసినప్పుడు కూడా నాకు చెమటలు పట్టలేదు కానీ మీ వయసు చెప్పి చెమటలు పట్టించేసారు యంగ్ బాయ్ అంటాడు యష్.
ఖుషి ని చూసి మురిసిపోతున్న వృద్ధ దంపతులు..
అంతలో ఖుషి ఫోన్ ఫోన్ చేసి వేదతో మాట్లాడి డాడీకి ఒకసారి ఇవ్వు అంటుంది. అలాగే అంటూ ఫోన్ తీసుకుని వెళ్లి యష్ కి ఇస్తుంది వేద. ఫోన్ తీసుకొని కూతుర్ని విష్ చేస్తాడు యష్. గుడ్ బాయ్ లాగా యోగ చేస్తున్నావా డాడీ ని పక్కనున్న గుడ్ బాయ్ కి ఫోన్ ఇవ్వు అంటుంది ఖుషి. ఫోన్ రాజాకిస్తాడు యష్. హాయ్ ముత్తాతయ్య హాయ్ ముత్తమ్మమ్మ మా మమ్మీ డాడీ వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి అంటుంది ఖుషి.
చూడండి మనకి జాగ్రత్తలు చెప్తుంది సిసింద్రీ అంటూ మురిసిపోతుంది రాణి. బాగా చదువుకుంటున్నావా అని వాళ్ళిద్దరూ అడిగితే నేనే క్లాస్ ఫస్ట్ అంటుందీ ఖుషి. తల్లితోనే తండ్రి తోని మాట్లాడిన తర్వాత నిన్ను మిస్ అవుతున్నాను ఖుషి అంటుంది వేద. కానీ నా నేను మిస్ అవ్వటం లేదు ఆఫీస్ పనిలో ఉన్నాయని పరిగెత్తుకొని వచ్చేయకండి, హ్యాపీగా వెళ్లారు నాలుగు రోజులు అక్కడే హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఖుషి. సరే ఇల్లు చూపిస్తాను అంటూ ఫోన్ తీసుకొని ఖుషితో ఆనందంగా కబుర్లు చెప్తూ ఇల్లంతా చూపిస్తుంది వేద.
యష్ కి చేతులెత్తి దండం పెట్టాలంటున్న రాణి..
చూసావా మనవడా కూతురితో మాట్లాడితే మా మనవరాలు ఎంత ఆనందంగా ఉందో ఈ ఆనందం అంతటికీ కారణం నువ్వే అంటాడు రాజా. చిన్నవాడివి అయిపోయావు లేకపోతే చేతులు ఎత్తి దండం పెట్టే వాళ్లని అంటుంది రాణి. అయ్యేం మాటలు గ్రాండ్ మా అంటాడు యష్. నిజం బాబు ఆ దేవుడు దానికి ఇవ్వని తల్లి స్థానాన్ని నువ్వు ఇచ్చావు నీలాంటి భర్త దొరకటం దాని అదృష్టం అంటాడు రాజా. అలా మాట్లాడకండి గ్రాండ్పా మీ పొగడ్తలకి నేను అర్హుడ్ని కాదు అంటాడు యష్.
మీరు పొగడాల్సి వస్తే అది నన్ను కాదు మీ మనవరాల్ని పొగడండి, ఎందుకంటే తను నా భార్య కావడం నా అదృష్టం. మీకు తెలియదు గ్రాండ్ ఫా ఈరోజు మీరు చూసే నా వెనక ఇంకొక యష్ ఉండేవాడు. నా వెనుక ఒక తీరని విషాదం ఉంది నేను మొత్తం కోల్పోయాను, నా బ్రతుకు చిందరవందర అయిపోయింది నన్ను నేను క్షమించుకోలేని పెద్ద తప్పు చేశాను. అదేంటో తెలుసా నా కూతుర్ని నిర్లక్ష్యం చేయడం. తను అమ్మని పిలిస్తే పలికే దిక్కులేదు నాన్న అని పిలిస్తే పలకడానికి నేను లేను నేను ఫాదర్గా ఫెయిల్ అయ్యాను అంటాడు.
బాగా ఎమోషనల్ అవుతున్న యష్..
నా దిగులుకి నా కూతురు సంతోషాన్ని బలి తీసుకున్నాను అప్పుడే నా జీవితంలోకి వేద వచ్చింది. నా కూతురికి అమ్మవటం కోసం నాకు భార్య అయింది. తల్లి వదిలేసిన బిడ్డకి కన్నతల్లి కన్నా ఎక్కువ అయింది. వేద మా జీవితంలోనికి కొత్త వెలుగుని తీసుకొని వచ్చింది. వేద లేకపోతే యష్ లేడు అంటూ ఎమోషనల్ అయిపోతాడు యష్. బాధపడుతున్న యష్ని ఓదార్చుతాడు రాజా. అనుకోకుండా ఆ మాటలన్నీ వేద వింటుంది.
తనని తానే సర్దుకొని సారీ గ్రాండ్పా ఎమోషనల్ అయిపోయాను, ఎక్కువ మాట్లాడేశాను అంటాడు యష్. సీన్ కట్ చేస్తే మందు వేస్తూ గుండెలు బాదుకుంటూ ఏడుస్తాడు కైలాష్. ఏంటి పట్టపగలే ఇంట్లో దుకాణం మొదలుపెట్టావ్ అంటుంది మాళవిక. నా గుండె మండిపోతుంది సిస్టర్ ఏడవకూడదా సిస్టర్ అంటాడు కైలాష్. నీ ఇష్టం వచ్చినంత మందు కొట్టు అంతేకానీ సిస్టర్ అయ్యో అంటూ నన్ను చూసి ఈ ఓవరాక్షన్ ఏంటి.
అసలు నిజం చెప్పి మాళవికకి షాక్ ఇచ్చిన కైలాష్..
చండాలంగా నేనేదో బకెట్ తన్నేసినట్టు అంటుంది వేద. నువ్వు పోయినా బాగుండేది సిస్టర్ కానీ ఆ వేద సిస్టర్ నిన్ను ఎడంకాలితో తన్నింది అంటాడు కైలాష్. వేద ఏం చేసిందో తెలుసా సిస్టర్ అంటాడు కైలాష్. ఏం చేస్తుంది కోర్టు దగ్గర నేనిచ్చిన వార్నింగ్ కి ఒక మూలన కూర్చొని కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ ఉంటుంది మాళవిక. అక్కడే విస్కీలో ఊపేసావ్ సిస్టర్ ఆ వేద ఒక మూలన కూర్చోలేదు మొగుడితో కలిపి అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళింది.
ఆ మాటలకి షాక్ అవుతుంది మాళవిక. మనం అనుకుంటున్నట్టు వేదవాళ్లు ఇక్కడ లేరు వాళ్ళు వెధవల్ల అమ్మమ్మ గారి ఊరికి హనీమూన్ కి వెళ్లారంట, అక్కడ ఆ ముసలోళ్ళు వీళ్ళ చేత ఫ్రెష్ గా ఫస్ట్ నైట్ చేయిస్తారంట, మూడు రాత్రుల ముచ్చట తీరితే గాని ఇక్కడికి రారంట. మా బావమరిది పెళ్ళాం ముందు పిల్లి అయిపోయి ఉంటాడు. ఆ వేద నీ ముందు పులి అయిపోతుంది అంటూ మళ్లీ మాళవిక కోసం గుండెలు బాదుకుంటూ ఏడుస్తాడు.
Ennenno Janmala Bandham December 26 Today Episode: కోయిలతోపాటు కూస్తున్న మరో కోయిల..
మరోవైపు కూస్తున్న కోయిల తో పాటు వేదా కూడా కోయిల లాగా కూస్తుంది. అంతలోనే అక్కడికి వచ్చిన యష్ తో నేను చిన్నప్పుడు ఇలాగే కోయిలతో ఆడుకునేదాన్ని అంటుంది. బావుంది చెట్టు మీద ఒక పిట్ట, నా పక్కన ఒక పిట్ట అంటాడు యష్. కావాలంటే మీరు కూడా దాంతో మాట్లాడండి అంటుంది వేద. నేనా అంటూ తను కూడా కూత పెడతాడు యష్.
తరువాయి భాగంలో స్నానానికి వచ్చిన యష్ నేను రెడీ గ్రాండ్ పా అంటాడు.
పెళ్ళాం చేత ఎప్పుడెప్పుడు స్నానం చేపించుకుందామా అని రెడీగా ఉన్నట్లు ఉన్నావు మనవడా అంటాడు రాజా. అంతలోనే అక్కడికి వచ్చిన వేదాన్ని చూసి స్నానం చేయించడానికి కాదు యుద్ధానికి వస్తున్నట్లుగా వస్తుంది అనుకుంటాడు యష్. భర్తకి స్నానం చేయించేటప్పుడు శ్రద్ధగా చేయించాలి అంటూ మనవరాలికి సలహా ఇస్తుంది రాణి.