Ennenno Janmala Bandham December 27 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో పాటలు పాడుకుంటూ కుకుడుకాయలు కొడుతుంది ముత్యాలు. అంతలో అక్కడికి వచ్చిన బంగారం ఏంటి ముత్యాలు మంచి హుషారుగా ఉన్నావు, పాట పాడుతున్నావ్ నా కోసమేనా అని అడుగుతాడు. కాదు మామ కొత్త అల్లుడు గారికి తల స్నానం కోసం రెడీ చేయమన్నారు అమ్మగారు అంటుంది ముత్యాలు.
పిట్టతో మాట్లాడుతున్న వేద..
నన్ను ఒక చెయ్యి వేయమంటావా అంటాడు బంగారం. వద్దులే మామ ఇవి ఆడవాళ్ళ పనులు నేను చూసుకుంటానులే ముత్యాలు. ఏ మాటకి ఆ మాటే అమ్మాయి గారు అల్లుడుగారు చిలకా గోరింక లాగా ఉన్నారు కదూ అంటూ మాట్లాడుకుంటారు ఆ దంపతులు. మరోవైపు కోయిలతో గొంతు కలిపి తను కూడా కోయిల లాగా కూస్తుంది వేద. ఆ శబ్దానికి భార్య వైపు చూసి నవ్వుకుంటూ ఆమె దగ్గరికి వస్తాడు. భర్తను చూసిన వేద నేను చిన్నప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు పిట్టలతో ఇలాగే ఆడుకునేదాన్ని తెలుసా అంటుంది వేద.
ఒకటి ఇంట్లో పిట్ట ఇంకొకటి చెట్టు మీద పిట్ట అని నవ్వుకుంటాడు యష్. అంతలోనే అక్కడికి రాజా రాణి వస్తారు. చెట్టు కింద పెట్ట చెట్టు మీద పెట్టా ఎలా మాట్లాడుకుంటున్నాయో చూశావా మనవడా అంటాడు రాజా. నిజంగానే పిట్టబాష ఉంటుందా తాతయ్య అంటాడు యష్. ఉంటుంది మనవడా కిందనున్న పిట్ట కూహు కోహు హౌ ఆర్ యు అంటే పైన ఉన్న పిట్ట ఐ యాం ఫైన్ అంటుంది అంటూ నవ్వుతూ చెప్తాడు రాజా.
ఉడుక్కుంటున్న యష్..
ఊరుకోండి తాతయ్య పిట్ట భాషా లేదు ఏం లేదు మీరు నన్ను ఆట పట్టిస్తున్నారు అంటాడు యష్. అలా కాదండి ఆ పిట్ట నా ఫ్రెండ్ కావాలంటే మీరు కూడా దాంతో మాట్లాడండి అంటుంది వేద. అవునా అయితే నేను ట్రై చేస్తాను అంటూ తను కూడా కోయిల లాగా కూస్తాడు. కానీ ఆ పిట్ట రిప్లై ఇవ్వదు. దానికి అందరూ నవ్వుతారు. మళ్లీ ట్రై చేసినా ఆ పెట్టా రిప్లై ఇవ్వకపోతే వేద నవ్వి చెప్పాను కదా ఆ పిట్ట నా ఫ్రెండ్ అని అంటుంది. అవునా అయితే మళ్లీ నువ్వు ట్రై చెయ్యి రిప్లై ఇస్తుందేమో చూద్దాం అంటాడు యష్.
వేదం కోయిల లాగా కూస్తే ఆ పిట్ట దానికి రిప్లై ఇస్తుంది. అప్పుడు అందరూ నవ్వుతారు. చూశారా ఇప్పుడైనా నమ్ముతారా ఆ పిట్ట నా ఫ్రెండ్ అని అంటుంది వేద. ఆ కోయిల నన్ను చీజ్ చేసింది అయినా అది మగ కోయిల పై ఉంటుంది అందుకే నీకు రిప్లై ఇచ్చింది అసలే ఎర్రగా బుర్రగా ఉంటావు కదా అని ఉడుక్కుంటాడు యష్. అది కాదు మనవడా నువ్వు ఈ ఊరు కొత్త కదా నాలుగు రోజులు ఇక్కడే ఉంటే అది నీకు కూడా ఫ్రెండ్ అవుతుంది మీతో కూడా మాట్లాడుతుంది అంటాడు రాజా.
ఆరు బయట స్నానానికి ఒప్పుకోనుంటున్న యష్..
అంటే సోషల్ మీడియాలో రిక్వెస్ట్ పెట్టినట్టు ఈ పెట్టకు కూడా రిక్వెస్ట్ పెట్టాలా అంటాడు యష్. నాలుగు రోజులు ఇక్కడ ఉంటావు కదా అది నీకు కూడా ఫ్రెండ్ అవుతుందిలే అంటుంది రాణి. అంతలోనే అక్కడికి వచ్చిన ముత్యాలు తల స్నానానికి అన్ని రెడీ చేశాను అంటుంది వేద. ఎవరికి అని అడుగుతావేంటి నీ భర్తకి అంటుంది రాణి. శుభ్రంగా వాష్ రూమ్ ఉండగా ఆరు బయట స్నానం ఏంటి అంటాడు యష్. ఇంటికి వచ్చిన కొత్త అల్లుడికి కుంకుడుకాయలతో భార్య భర్తకి తల స్నానం చేయించడం మన సంప్రదాయం అంటాడు రాజా.
ఇదేం సాంప్రదాయం విచిత్రంగా ఉంది అంటాడు యష్. సిటీలో పుట్టి పెరిగావు పల్లెటూరి ఆచారాలు నీకు తెలియదు అంటూ మొదటిసారి ఇంటికి వచ్చిన అల్లుడికి ఆరుబయట తలంటి స్నానం చేయించాలి అంటుంది రాణి. అలాగే మా వేద ఇప్పుడు నీకు తలస్నానం చేస్తుంది అంటాడు రాజా. లేదా నాకు స్నానం చేయిస్తుందా నేను ఒప్పుకోను అంటాడు యష్. ఆరుబయట స్నానం చేయించాలా నా వల్ల కాదు నేను ఒప్పుకోను అంటుంది వేద.
ఒప్పుకోను అంటే కుదరదు అంటున్న రాజా..
ఇది మన సాంప్రదాయం ఒప్పుకోక తప్పదు అంటాడు రాజా. చోద్యం చూస్తారేంటి వెళ్లి స్నానానికి రెడీ చేయండి అంటుంది రాణి. మిస్టర్ అర్రోగెంట్ కి నేను స్నానం చేయించడం ఏంటి అంటూ మొహం చిన్న బుచ్చుకుంటుంది వేద. అలా స్నానం చేయించడం కుదరదు తాతయ్య ఎందుకంటే ఈయనకి షాంపూ తోని అలవాటు కుంకుడుకాయలు అలవాటు లేదు అంటుంది. ఈ ఒక్క రోజుకి నా అలవాటు పక్కన పెట్టేస్తాను తాతయ్య సాంప్రదాయం అంటున్నారు కదా తాతయ్య.
మన ట్రెడిషన్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అంటాడు యష్. మిస్సెస్ మెసేజ్ ఆరుబయట తలస్నానం చేయిపించుకుంటే ఆ కిక్కే వేరు అని మనసులోని ఆనంద పడిపోతాడు యష్. ఆరుబయట భార్య నలుగు పెడితే ఉంటుంది నా స్వామి రంగా అంటూ యష్ ని ఊరిస్తాడు రాజా. ఇంకేమీ చెప్పొద్దు తాతయ్య సినిమా మొత్తం అర్థమైపోయింది స్నానానికి నేను రెడీ అంటాడు యష్. అమ్మ వేద మనవడు రెడీ అయిపోయాడు నువ్వు కూడా రెడీ అయిపో అంటుంది రాణి.
భర్తని మనసులోనే తిట్టుకుంటున్న వేద..
నన్నే ఇరికిస్తావా అంటూ భర్త వైపు కోపంగా చూస్తుంది వేద. మరోవైపు భార్యని స్నానానికి అన్ని రెడీగా ఉన్నాయి కదా అంటాడు రాజా. అన్ని రెడీ గానే ఉన్నాయి అని రాణి అంటే ఇంకా పిల్లలు రాలేదేంటి అంటాడు రాజా. నేను అదే చూస్తున్నాను అని రాణి అనే లోగానే అక్కడికి వస్తాడు యష్. మీ వాళ్ళతో కలిసి ఉండమని చెప్పావు కదా చిన్న ఇంటిస్తే చాలు ఈ యశోద దూసుకొని వెళ్ళిపోతాడు రా నీ పని చెప్తాను అని మంచి హుషారుగా మనసులోనే అనుకుంటాడు యష్.
నేను రెడీ తాతయ్య అంటాడు. భారీ చేత ఎప్పుడెప్పుడు తలస్నానం చేపించుకుందామని మంచి ఆత్రంగా ఉన్నావు కదా మనవడా అంటాడు రాజా. అవును తాతయ్య ఇలాంటి సువర్ణవకాశం ఎప్పుడో గాని రాదు కదా అందుకే చాలా హ్యాండ్సైటీగా ఉన్నాను అంటాడు యష్. ఆ మాత్రం ఉండాలి అంటాడు రాజా. వేద ఇంకా రాకపోవడంతో రాని తనని పిలవడానికి వెళ్తుంది. బయటికి వచ్చిన వేద భర్తని కోపంగా చూస్తుంది.
వేద మీద కంప్లైంట్ ఇచ్చిన యష్..
తను నాకు స్నానం చేపించడానికి కాదు యుద్ధానికి వస్తున్నట్లుగా వస్తుంది అని కంగారు పడతాడు యష్. ఆరుబయట అందరి ముందు మీకు స్నానం చేయించేలాగా నన్ను ఇరికిస్తావా? ఇంకా జన్మలో నన్ను స్నానం చేయమని అడగకుండా నీ సంగతి తేలుస్తాను అని మనసులోని అనుకుంటుంది వేద. ముందు భర్తకి నుదుటిన బొట్టు పెట్టి నెత్తిమీద మూడుసార్లు నూనె వేసి స్నానం చేయించు కానీ మనవరాలుకి పురమాయిస్తుంది రాణి.
Ennenno Janmala Bandham December 27 Today Episode:
పెళ్ళాం చేత్తో నలుగు పెట్టించుకుని స్నానం చేయిస్తుంటే ఆ ఇదే వేరు అంటాడు రాజా. ఇంకా ఆపండి అంటుంది రాణి. వేద తన కోపాన్ని అంతా యష్ తలమీద చూపించి ఒక రేంజ్ లో మర్దన చేస్తుంది. ఆ మర్దన కి తట్టుకోలేక పోతాడు యష్. చేతులకి భుజాలకే కూడా నూనె రాయమని చెప్తుంది రాణి. అవునవును తలకి చాలు అంటాడు యష్. కానీ కోపాన్ని ఎలా తీర్చుకోవాలో తెలియక భర్తని గిచ్చేస్తుంది వేద. తాత గారికి కంప్లైంట్ ఇస్తాడు యష్.
గోరుగిచ్చుకుంది తాతయ్య అంటూ ఎక్స్ప్లనేషన్ ఇస్తుంది వేద. కాస్త నాజుగా మర్దన చెయ్ అమ్మ అబ్బాయి ఇబ్బంది పడుతున్నాడు అంటుంది రాణి. అవును నాజుగ్గా మర్దన చేయి అంటాడు యష్. ఈ మాత్రం సరిపోతుందా అంటూ స్మూత్ గా మర్దన చేస్తుంది వేద. తరువాత ఏం జరిగిందో రేపు ఎపిసోడ్ లో చూద్దాం.