Ennenno Janmala Bandham December 30 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో యష్ ని గుర్తుపట్టలేక పోతుంది వేద. నువ్వు ఎవరు అంటుంది. నేను నీ భర్తని అంటే, షట్ అప్ నువ్వు నా భర్త వేంటి అంటుంది వేద. నువ్వు జోక్ చేస్తున్నావ్ కదా అంటాడు యష్. నీతో నాకు జోక్స్ ఏంటి అసలు నువ్వు ఎవరు అంటుంది వేద. నేను యష్ ని నీ భర్తని, మిస్టర్ ఆరోగెంట్ ని అంటాడు యష్. ఇదంతా నేను ఎలా నమ్మాలి అంటుంది వేద.
గతం మర్చిపోయిన వేద..
తను ఫోటోలో వేద ఫోటో ఖుషి ఫోటో చూపించి జరిగిందంతా చెప్తాడు. ఇంకా ఆమెకి గతం గుర్తుకు రాకపోతే కంగారు పడిపోతాడు యష్. అప్పుడు వేద, యష్ ని ఏవండీ అని పిలుస్తుంది. మాటలకి షాక్ తో వెనక్కి తిరుగుతాడు యష్. ఈ ప్రపంచంలో నన్ను నేను మర్చిపోతానేమో కాదు మిమ్మల్ని, ఖుషి ని మర్చిపోవడం అంటూ జరగదు. అలా జరిగితే అదే నా ఆఖరి రోజు అంటుంది వేద.
యశోదర్ ని ఆట పట్టిస్తున్న వేద..
ఇందాక పుట్ట దగ్గర నా ప్లేస్ లో ఎవరన్నా అలాగే రియాక్ట్ అవుతాను అన్నారు మరి ఇప్పుడు మీ ప్లేస్ లో ఎవరున్నా అలాగే రియాక్ట్ అవుతారా అంటుంది వేద. షాక్ నుంచి తేరుకున్న యష్ వెళ్దాం పద అంటాడు. పగలబడి నవ్వుతున్న వేదని ఎందుకు అలా నవ్వుతున్నావ్ మళ్ళీ మైండ్ దొబ్బిందా అంటాడు.వేద నేను నీ హస్బెండ్ ని, నువ్వు ముద్దుగా పిలుచుకునే నీ యశోదర్ ని అంటూ యష్ అన్న మాటల్ని తను ఇమిటేట్ చేస్తూ అతన్ని ఉడికిస్తుంది.
మాటలకి ఉడుక్కున్న యష్ మిస్సెస్ న్యూసెన్స్ అంటూ ఆమెని పట్టుకోబోతాడు అతనికి అందకుండా పరిగెడుతుంది వేద. వాళ్ళిద్దరూ ఆ మూమెంట్ ని బాగా ఎంజాయ్ చేస్తారు. మరోవైపు అభిమన్యు కోసం పెళ్లి ఫోటోలు తీసుకొని వస్తాడు బ్రోకర్. నీకు ఎంత ధైర్యం పెళ్లికూతురు ఫోటోలు చూపించడానికి పెళ్లి ఖాయం చేయడానికి అంటూ అతన్ని బయటికి పంపిస్తుంది మాళవిక. నా ఎదురుగా గొంతు ఎత్తి మాట్లాడుతున్నావ్,నీకు ఎంత ధైర్యం అంటుంది బ్రమరాంబిక.
మాళవిక ప్రవర్తనకి ఆశ్చర్యపోతున్న కైలాష్..
ఇది మా అక్క డెసిషన్ మీరు కలగజేసుకోవడమే మంచిది అంటాడు అభి. మీ అక్కగారి డెసిషన్ కాబట్టే మాట్లాడుతున్నాను అభిమన్యు గారు అయినా మీ రేంజ్ ఏంటి, భ్రమరాంబికా దేవి గారి అంతస్తు ఏంటి, అయినా ఒక మ్యారేజి బ్రోకర్ ఈ ఇంటికి రావడం ఏంటి, అంటే పెళ్లికి మీరు సిద్ధపడిపోయినట్టేనా అంటుంది మాళవిక. ఏంటి ఇది ఇలా రెచ్చిపోతుంది, కొంప ముంచేలాగా ఉంది అనుకుంటాడు కైలాష్.
లేకపోతే ఇద్దరూ పిల్లల తల్లికి మాయ మాటలు చెప్పి భర్తని వదిలి వచ్చి ఈ ఇంట్లో మీతో కాపురం చేసేలా లొంగదీసుకున్నారా? అలాంటిదేమీ లేదు కదా మీరు కటోర బ్రహ్మచారి కదా ఒప్పుకోండి అంటుంది మాళవిక. అలాంటిదేమీ లేదు నా లైఫ్ లో ఏం జరిగినా మా అక్క పరిమిషన్ తోనే అంటాడు అభి. మరి అలాంటప్పుడు పెళ్లి విషయంలో మాత్రం మీ అక్క డెసిషన్ కాకుండా మీ డెసిషన్ అవసరమా? మీ అక్క మీద నమ్మకం లేదా అంటుంది మాళవిక.
బ్రమరాంబికని బుట్టలో వేసిన మాళవిక..
అదేంటి అలా అంటారు నాకు మా అక్క తర్వాతే ఎవరైనా, మక్కా ఎవరిని చూపిస్తే వాళ్ళని కళ్ళు మూసుకుని తాళి కట్టేస్తాను అంటాడు అభి. ఇంకా ఆపండి అంటూ మాళవిక బాడీ మెజర్మెంట్స్ చెప్తుంది, మైండ్ గురించి చెప్పమంటావా అంటుంది భ్రమరాంబిక. అభి కంగారు పడితే చెప్పు అక్క అంటాడు. తను బంగారు నా పెద్దరికం గురించి ఎంత మర్యాదగా చెప్పింది అదే తన స్పెషాలిటీ. ఇదేంటి సీన్ రివర్స్ అయింది అని షాక్ అవుతాడు కైలాష్.
నన్ను ఎంత గొప్పగా పొగిడింది అమ్మని నమ్మాలి అంటూ ఎక్కడో టచ్ చేసింది బంగారం అంటుంది బ్రమరాంబిక. షాక్ అయినా మాళవిక అని చూసి ఏం నేను కాకుండా నిన్ను ఇంకెవరైనా బంగారం అన్నారా అంటుంది బ్రమరాంబిక. నా లైఫ్ లో ఫస్ట్ టైం బంగారం అనే మాట మీ నోటి నుంచే వింటున్నాను అంటుంది మాళవిక. నా పట్ల నువ్వు చూపించిన గౌరవానికి గుర్తుగా నా చిరుకానుక అంటూ ఆమెకి చైన్ లిఫ్ట్ చేస్తుంది భ్రమరాంబిక. భ్రమరాంబిక దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది మాళవిక.
అయోమయంలో అభిమన్యు..
నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా అంటుంది మాళవిక. అడుగు అంటే నేను మిమ్మల్ని వదిన అని పిలుస్తాను అంటుంది. ఆ మాటకి ఆనందంగా సరే అన్న బ్రమరాంబిక, మాళవిక ని తీసుకొని అక్కడినుంచి వెళ్ళిపోతుంది. షాక్ లో ఉన్న అభి ఇదంతా నిజమేనా,నన్ను ఒకసారి గిల్లు అంటూ కైలాష్ ని గిల్లమంటాడు. అభిని గిల్లిన కైలాష్ నిజమే బ్రో అంటాడు. మరోవైపు తల్లిదండ్రులకు ఫోన్ చేస్తుంది సులోచన.
ఏంటి విషయం మాటిమాటికీ ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తున్నావ్ అంటుంది రాణి. పిల్లలు ఎలా ఉన్నారు అని ఫోన్ చేశాను అమ్మ అంటుంది సులోచన.వాళ్ళు ఏమైనా చిన్న పిల్లల భేషుగా ఉన్నారు అంటుంది రాణి. నా మనవరాలికి ఇద్దరు పిల్లల తండ్రి ఇచ్చి పెళ్లి చేసి గొంతు కోసమని చాలా బాధపడ్డాను కానీ వాళ్ళిద్దర్నీ చూస్తే చిలకా గోరింకల్లాగా చక్కగా ఉన్నారు అంటాడు రాజా. వాళ్ళు ఎప్పుడూ అలాగే ఉంటారు నాన్న ప్రేమ పక్షుల్లాగా అంటుంది సులోచన.
Ennenno Janmala Bandham December 30 Today Episode: సులోచనకి చీవాట్లు పెట్టిన తల్లిదండ్రులు..
ఈరోజు నీ కూతురు వాళ్ళ ఆయనకి వీపు రుద్ది స్నానం చేయించింది అంటుంది రాణి.
నా మనవడు తన భార్యని షికార్ కి తీసుకొని వెళ్ళాడు ఊరంతా వాళ్ళని చూసి ఎంత బాగున్నారు అని తెగ పొగిడేసారు అంటాడు రాజా. వాళ్ళిద్దరి మధ్య సఖ్యత లేదు అని చెప్పటానికి నీకు నోరు ఎలా వచ్చింది అంటుంది రాణి. నేను అనలేదు అమ్మ వియ్యపురాలు మాలినియే అంది అంటుంది సులోచన. మీ ఇద్దరికీ ఒకటే చెప్తున్నాను వాళ్ళ జంట చిలకా గోరింకల్లాగా ఉంది వాళ్ళ బంధం ఎన్నెన్నో జన్మల బంధం మీరు ఇంకా ఎలాంటి అనుమానాలు పెట్టుకోకండి.
మీరు హాయిగా ఉండండి ఆ జంటని చూస్తూ మేము హాయిగా ఉంటాం అంటుంది రాణి. మరోవైపు ఇంటికి వెళ్ళగానే మీ అమ్మమ్మతో దిష్టి తీయించుకో, నాదిస్టే తగిలేలా గా ఉంది అంటాడు యష్. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.