Ennenno Janmala Bandham February 20 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో నాగార్జునసాగర్ గేట్లు ఎత్తేసినట్లుగా ఉన్నారు అంటూ యష్ కి మోషన్ టాబ్లెట్స్ ఇస్తుంది వేద. నాకేమీ వద్దు నాది స్టీల్ స్టమక్ అంటాడు యష్. చెప్తే వినడు అని యష్ ని మందలించి టాబ్లెట్లు ఎక్కడ పెడుతున్నాను నచ్చితే వేసుకోండి అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళడమే తరువాయి గబుక్కున టాబ్లెట్స్ వేసుకుంటాడు యష్.

ఐ యాం సో లక్కీ అంటున్న విన్ని..

మరోవైపు విన్నీ కూడా అదే ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటాడు. నన్ను ఈ ప్రాబ్లం నుంచి ఎవరు సాల్వ్ చేసేవారు లేరా అంటూ ఇబ్బంది పడుతుంటాడు. అంతలోనే అక్కడికి వచ్చిన వేద అక్కడ ఆయనకి ఇక్కడ నీకు ఇద్దరికీ స్టమక్ పంచర్ అయిందా అంటుంది వేద. అలాంటిదేమీ లేదు పని విన్నీ అంటే ఈ ఫ్రెండ్ దగ్గర నీకు దాపరికం అవసరమా అంటూ టాబ్లెట్ ఇస్తుంది వేద.

టాబ్లెట్ వేసుకున్న విని నేను ఇబ్బంది పడుతున్నట్లుగా నీకు ఎలా తెలిసింది నేనంటే ఎంత ప్రేమ నీకు, నాకోసం టాబ్లెట్ తీసుకొచ్చావు ఐ యాం సో లక్కీ అంటాడు విన్ని. ఇంత స్టమక్ పెయిన్ తో కామెడీలు అవసరమా అక్కడ ఆయన వస్తే చూశాను కదా అందుకే నువ్వు కూడా ఇదే పరిస్థితిలో ఉంటావని ఎక్స్పెక్ట్ చేసి టాబ్లెట్ తీసుకువచ్చాను అంటుంది వేద. నువ్వు కాస్త బెటర్ కానీ ఆయన వాష్ రూమ్ కి అప్ అండ్ డౌన్ చేయలేక ఇబ్బంది పడుతున్నారు అంటూ ఇద్దరూ నవ్వుకుంటారు.

పంతం కొద్ది తాగేసారంటున్న వేద..

కానీ మీ ఆయన గటికుడే అంత పానకం గబగబా తాగేసాడు అంటాడు విన్ని. మామూలుగా అయితే తాగలేరు కానీ నీతో పోటీ అనేసరికి పంతానికి తాగేశారు ఇప్పుడు నేను బాత్రూంలో బెడ్ వేయాలో ఏంటో అంటూ యష్ దగ్గరికి బయలుదేరుతుంది వేద. అంతలో కాలు స్లిప్ అవడంతో విని కంగారుగా ఆమెని అక్కడే కూర్చోబెడతాడు. కరెంటు కూడా అప్పుడే పోతుంది. ఈ కరెంటు ఇప్పుడే పోవాలా అంటుంది వేద. నాకోసమే పోయింది కరెంట్ వచ్చిందాకా నీతో కబుర్లు చెప్పుకోవచ్చు కదా అంటాడు విన్నీ.

సరే జోక్ చెప్పు అని వేద అంటే ఏవో జోక్స్ చెప్తూ ఉంటాడు విన్ని. ఈ చీకట్లో వేద ఎలా వస్తుందో ఏంటో అయినా ఇప్పుడు ఆ కిందకి వెళ్లవలసిన అవసరం వచ్చింది ఈ టైంలో ఏం మీటింగ్లో అనుకుంటూ చిరాకు పడతాడు. కరెంటు మా ఇంట్లోనే పోయిందో లేక అందరి ఇంట్లోనే పోయిందో చూడటం కోసం బయటకు చూస్తాడు యష్. అంత లెక్క చీకటిగా ఉండడం చూసి అందరికీ పోయినట్లు ఉంది అని వెనక్కి వెళ్ళిపోబోతు వేద వాళ్ళు మాట్లాడుకోవడం చూస్తాడు.

నేను గుర్తుకు రాలేదా అంటూ వేదని నిలదీస్తున్న విన్ని..

అప్పట్లో నేను నీకోసం పిచ్చివాడిలాగా తిరిగేవాడిని. నువ్వు మాత్రం నన్ను పూచిక పుల్ల లాగా తీసి పారేసావు ముందు ఆ మనోహర్ని ప్రేమించావ్, ఇప్పుడు ఈ కేశవ దాన్ని పెళ్లి చేసుకున్నావు. నాకు ఒక ఫోన్ కొడితే నేను నీ ముందు గాలిపోయేవాడిని కదా పెళ్లి చేసుకునే ముందు నేను నీకు గుర్తు రాలేదా ఇదంతా నా తలరాత అంటాడు విన్నీ. నన్ను ఎప్పుడూ ఆట పట్టించడం తప్పితే వేరే పని లేదా, అయినా నీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదా అని వేద అంటే చేసుకుంటాను కానీ ఏం పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అచ్చం నీలాగే ఉండాలి అంటాడు విన్ని.

నీ మనసంతా నేనే వున్నానేమో కానీ నా మనసులో మాత్రం నో వేకెన్సీ బోర్డు పెట్టేసాను. నా లైఫ్ లో నా భర్త బిడ్డ ఉన్నారు ఇప్పుడు నా మనసు హౌస్ ఫుల్ అంటుంది వేద అంతలోనే కరెంట్ రావడంతో రాకుండా ఉండి ఉంటే బాగుండేది నువ్వు ఇంకా కాసేపు నాతో ఉండే దానివి అంటాడు విన్ని. మళ్లీ మొదలు పెట్టావా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వేద. మరోవైపు గాజు పెంకులు కాలికి గుచ్చుకోవటంతో వసంత్ ని పిలుస్తుంది చిత్ర. వసంత్ వచ్చి ఆమెని సోఫా మీద కూర్చోబెట్టి మాటల్లో పెట్టి ఆమె కాలిలో గాజు పెంకు తీసేసి కట్టు కడతాడు.

యష్ కి హితబోధ చేస్తున్న అతని ఆత్మ..

మరోవైపు భర్త ఇంత బాధలో ఉండగా కేర్ తీసుకోకుండా వెళ్లి వాడితో ముచ్చట్లు పెట్టుకొని కూర్చుంది తప్పు కదా అనుకుంటాడు యష్. ఏమి తప్పులేదు తనది తప్పు అని నువ్వు ఎలా ఉంటావు అంటూ యష్ ఆత్మ తనతో మాట్లాడుతుంది. నన్ను వదిలేసి తనతో తిరగొచ్చా అని యష్ అంటే బెస్ట్ ఫ్రెండ్ కదా అంటుంది ఆత్మ. భర్త కంటే ఎక్కువా, నాకంటే ఎక్కువ అతను అంటాడు యష్. అలా అని తను చెప్పిందా అయినా తను ఏం తప్పు చేసింది.

మీ అమ్మానాన్నలకి ఏమైనా లోటు చేసిందా భార్యగా నీకు ఏమైనా లోటు చేసిందా మీ బిడ్డకి ఏమైనా తక్కువగా చూసిందా అంటుంది ఆత్మ. లేదు నిజానికి నా కన్నా నా నా కూతుర్ని తనే బాగా చూసుకుంది అంటాడు యష్. వేద మీద నీకు అనుమానమా లేకపోతే ప్రేమా అంటుంది ఆత్మ. అవును అంటాడు యష్. మరి ఏంటి నీ ప్రాబ్లం నాకు అర్థమైంది నీకు ఇన్ సెక్యూరిటీ వేద నీకు దూరమై పోతుంది అని నీ బాధ నిజమే కదా అంటుంది ఆత్మ. అలా ఫీల్ అవ్వటం తప్పు కాదు కదా అంటాడు. దీనికి అలా ఫీల్ అవ్వకపోతే నే తప్పు అంటుంది ఆత్మ.

మాళవిక, అభిల మధ్య దూరాన్ని పెంచుతున్న బ్రమరాంబిక..

దీనికి సొల్యూషన్ లేదా అని అంటే ఎందుకు లేదు అని నమ్ము, తన మాటలకి విలువివ్వు తను చెప్పినట్లు విను, ఎందుకంటే వేద నీకు ఒక కొత్త జీవితాన్ని ఇచ్చింది లేకపోతే నువ్వు లేవు అంటూ హిత బోధ చేస్తుంది ఆత్మ. ఇంతలో కరెంట్ రావటంతో ఆత్మ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు అభి మీటింగ్లో ఉండగా భ్రమరాంబిక వచ్చి నేను నీతో ఐదు నిమిషాలు మాట్లాడాలి అంటుంది. అలాగే అంటూ అక్కడ ఉన్న వాళ్ళందరినీ బయటకు పంపించేస్తాడు అభి.

ఇదంతా చూస్తున్న చిత్ర, మాళవిక మీద ఏదో కుట్ర చేస్తున్నట్లుగా ఉన్నారు అని అనుమాన పడుతుంది. బ్రమరాంబిక మాటలు విన్న అభి మాళవిక ఎందుకు నామీద కేసు వేస్తుంది అంటాడు. ఎందుకు చేయకూడదు చాలా ఎండ నుంచి మీ ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు, సహజనం కూడా పెళ్లితో సమానమే రేపు నువ్వు వదిలేస్తే నీ మీద కేసు వేసి ఆకులో సగం వాటా లాగేసుకుంటుంది అంటుంది బ్రమరాంబిక.

ఏదో జరుగుతుందని అనుమాన పడుతున్న చిత్ర..

ఇప్పుడు ఏం చేయమంటావు అని అభి అంటే నీ ఆస్తిలో నాకు సంబంధం లేదు అంటూ మాళవిక తణుకు తానుగా రాసిచ్చిన లీగల్ డాక్యుమెంట్ అని అభి చేతిలో ఫైల్ పెట్టి దీని మీద మాళవికతో సంతకం పెట్టించు అని మాట్లాడుతూ ఉండగా అక్కడికి సడన్ గా చిత్ర రావటంతో మాటలు ఆపేస్తుంది భ్రమరాంబిక. నా ఫైల్ మర్చిపోయాను అంటూ వచ్చిన చిత్రన్ని బయటకు పంపించేస్తాడు అభి. ఈ ఫైల్ మీద మాళవికతో సంతకం పెట్టిస్తే నువ్వు సేఫ్ నీ ఆస్తి సేఫ్ అంటూ సలహా ఇస్తుంది భ్రమరాంబిక.

బయటికి వచ్చిన చిత్ర, మాళవిక చేత ఏ ఫైల్ మీద సంతకం చేయించాలి అనుకుంటున్నారు అంటూ ఆలోచనలో పడుతుంది. మరోవైపు యష్ దగ్గరికి వచ్చిన రాజేశ్వరి అనే ఆవిడ తన కూతురికి పెళ్లి సంబంధాలు చూస్తున్నట్లుగా చెప్పి వీవింగ్ గురించి మీ అభిప్రాయం ఏంటి తను వేదకి బెస్ట్ ఫ్రెండ్ అంట కదా ఎలా అయినా ఈ సంబంధం కుదిర్చి పెట్టు నీకు పుణ్యం ఉంటుంది అని బ్రతిమాలుతుంది ఆవిడ. ఇదే కరెక్ట్ టైం, ఆ విన్ని గాడికి పెళ్లి చేసి అమెరికాకి తరిమేస్తే పీడ విరగడైపోతుంది అంటూ ఆలోచనలో పడతాడు యష్.

ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో విన్ని..

ఏం ఆలోచిస్తున్నావ్ అని ఆవిడ అడిగితే మీరు అడిగితే నేను కాదంటానా, మనం ఎప్పటినుంచో ఫ్యామిలీ ఫ్రెండ్స్ కదా ఈ సంబంధాన్ని నేను కుదురుస్తాను అంటూ మాటిస్తాడు యష్. ఈ పెళ్లి బాధ్యత నాకు వదిలేయండి ఎలా అయినా ఈ పెళ్లి కుదిరి తీరుతుంది మీరు వెళ్లి పెళ్లి చూపుల బాధ్యత చూసుకోండి, ఇంకో గంటలో పెళ్లిచూపులు ఏర్పాటు చేసుకోండి అని యష్ కంటే ఎంత తొందరగా అంటే ఎలా మా కుటుంబ సభ్యులందరికీ చెప్పాలి కదా అంటుంది ఆవిడ. ఇలాంటి విషయాల్లో అసలు ఆలస్యం చేయకూడదు.

మీరు వెళ్లి మీ అమ్మాయిని తీసుకొని వచ్చేయండి మిగతా విషయాలు నేను చూసుకుంటాను అంటూ ఆమెని పంపించేస్తాడు. మాత్రం దొరికాడు అంటే సంతోష పడిపోతాడు యష్. ఇంట్లో అందరూ హడావిడిగా ఉండటంతో అక్కడికి వచ్చిన విన్నీకి గబగబా స్వీట్ పెడతాడు యష్. ఏమి అర్థం కాని విన్నీ ఏంటి స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఏంటి విషయం అని అడుగుతాడు. నీకు పెళ్లి చూపులు ఏర్పాటు చేశాము వీళ్లది మన అపార్ట్మెంట్ అంటూ అన్ని వివరాలు చెప్తుంది మాలిని. నాకు చెప్పలేదు కదా ఆంటీ అంటాడు విన్ని. మీ ఇద్దరికీ ఈడు జోడు బాగుంటుందని మా అల్లుడు గారే సెలెక్ట్ చేశారు అంటుంది సులోచన.

Ennenno Janmala Bandham February 20 Today Episode:హైట్ ప్రాబ్లం అంటున్న వేద..

అయోమయంగా చూస్తున్న విన్నీని నీకు ఈ పెళ్లి చూపులునీకు ఏమైనా అభ్యంతరమా అంటుంది మాలిని. ఏమీ లేదు వేద కోసం చూస్తున్నాను అంటాడు విన్ని. అప్పుడే అక్కడికి వచ్చిన వేద ని ఏంటిది అన్నట్లుగా సైగ చేస్తాడు. కంగారు పడొద్దు అన్నట్లుగా సైగ చేస్తుంది వేద. నీకేమైనా ఇబ్బంది సులోచన అడిగితే ఏమీ లేదు మీరు అందరూ ఉన్నారు కదా అంటాడు విన్ని. పెద్దలంటే ఎంత గౌరవం నా అల్లుడికి అంటుంది పెళ్లికూతురు తల్లి. ఇంకా పెళ్లి చూపులే అవ్వలేదు అప్పుడే అల్లుడు అనేస్తున్నావా అంటూ నవ్వుతుంది మాలిని.

ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి వీరిద్దరి వీడు జోడు చాలా బాగుంది కదా అంటాడు యష్. అన్ని బానే ఉన్నాయి కానీ కొంచెం హై ప్రాబ్లం ఉంది పక్కన తను కొంచెం పొట్టిగా కనిపిస్తుంది అంటుంది వేద. చూడబోతే ఈ సంబంధం చెడగొట్టేలాగా చూస్తుంది అనుకుంటాడు యష్. తరువాయి భాగంలో నీ భర్త చూసిన సంబంధం మీకు నచ్చని లేనట్లుగా ఉంది అంటూ పెళ్లికూతురు తల్లి వేదని మందలిస్తుంది.

యష్ కూడా వేదని మందలిస్తే నేను ఏది చేసినా మీకు తప్పుగానే కనిపిస్తుంది, నా మనసుని బాధ పెడుతూనే ఉంటారు అంటూనే కళ్ళు తిరిగి పడిపోతుంది. కంగారుపడిన యష్ ఆమెని హాస్పిటల్ లో అడ్మిట్ చేస్తాడు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on ఫిబ్రవరి 20, 2023 at 9:37 ఉద.