Ennenno Janmala Bandham February 24 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో వేదని చూసి ఎమోషనల్ అవుతాడు యష్. తనతో గడిపిన పాత జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఏడుస్తాడు. మరోవైపు ఖుషి, సులోచనని పిలిచి అమ్మకి ఏమైంది అని అడుగుతుంది. ఖుషికి తెలీదా అంటాడు విన్నీ. నేనే చెప్పలేదు అంటుంది సులోచన. చిన్నపిల్లల దగ్గర అన్ని రాయవలసిన అవసరం లేదు కొన్ని కొన్ని విషయాలు చెప్పే విధంగా చెప్తే అర్థం చేసుకుంటారు అంటూ ఖుషి ని దగ్గరగా తీసుకొని లాలిస్తూ ఆమెకి నిజం చెప్తాడు విన్ని.
ఖుషి కి నిజం చెప్పిన విన్నీ..
మా అమ్మ డాక్టర్ కదా తనకి కూడా జ్వరం వస్తుందా అంటే తను కూడా మనిషే కదా అంటాడు విన్ని. నన్ను అక్కడికి తీసుకెళ్లండి నన్ను చూస్తే తనకి ఎనర్జీ వస్తుంది అంటుంది ఖుషీ. తీసుకువెళ్తాను కానీ తను నిన్ను చూస్తే అన్నం తినిపిస్తాను,ఆడుకుంటాను అంటూ అటు ఇటు తిరుగుతుంది కానీ తనకి ఇప్పుడు రెస్ట్ అవసరం కదా అంటాడు విన్ని. నాకు అర్థమైంది ఇప్పుడు మమ్మీ హెల్త్ ఇంపార్టెంట్ నేను హాస్పిటల్ కి రానులెండి అంటుంది.
అమ్మకి హెల్త్ బాగోలేకపోతే నువ్వు ఎక్కడ ఎందుకు ఉన్నావు అమ్మమ్మ అంటూ సులోచన అని నిలదీస్తుంది. అమ్మ హెల్త్ రిపోర్ట్స్ ఉండిపోయాయి వాటి కోసమే వచ్చాము అది కనిపించడం లేదు అంటుంది సులోచన. అవి ఎక్కడ ఉన్నాయో నాకు తెలుసు అంటూ తన హెల్త్ రిపోర్ట్ తీసుకొచ్చి ఇస్తుంది ఖుషి. ఖుషి చెప్పక పోయి ఉంటే మనకి ఈ ఫైల్ దొరికి ఉండేది కాదు వేద ఆరోగ్యానికి తన కూతురే దారి చూపించింది అంటూ ఖుషి ని ముద్దు పెట్టుకుంటుంది సులోచన. మరోవైపు విన్నీ మీద కోపంతో రగిలిపోతూ ఉంటాడు యష్.
విన్ని మీద ఫ్రెస్టేట్ అవుతున్న యష్..
నా భార్య విషయంలో అతని జోక్యం ఏంటి, వాడి ఓవరాక్షన్ భరించలేకపోతున్నాం. తన హెల్త్ విషయంలో నాకు తెలుసుకొనే అవకాశం రాలేదు కాబట్టి తెలుసుకోలేకపోయాను అయినా దానికే అంత కోఆపరేషన్ ఎందుకు అయినా వాడిని వీలైనంత తొందరగా ఇక్కడి నుంచి పంపించేయాలి అనుకుంటాడు యష్. అంతలోనే విన్నీ రావటంతో ఏంటి ఇంత లేటు అని తన చేతిలో ఫైలు లాక్కుంటాడు యష్. ఎందుకంత ప్రస్టేట్ అవుతావు నీ కోపం తగ్గించుకుంటే నీకు మంచిది ఎదుటి వాళ్ళ ఆరోగ్యానికి కూడా మంచిది అంటూ సలహా ఇస్తాడు విన్ని.
అదేమీ పట్టించుకోకుండా ఆ ఫైల్ తీసుకెళ్లి డాక్టర్కి ఇస్తాడు యష్. మీ మిస్సెస్ ఉపవాసం చేయకుండా ఉండవలసింది తనకి మళ్ళీ స్టమక్ టీబి ఎటాక్ అయిందేమో అని అనుమానంగా ఉంది. మనం ఇంకొకసారి ఫుల్ ఎక్సమినేషన్ చేయాలి చాలా కేర్ఫుల్ గా ఉండాలి వచ్చే 24 గంటలు చాలా కృషియల్ అని చెప్తుంది డాక్టర్. మరోవైపు అభి చిత్ర కి ఫోన్ చేసి వేదకి ఎలా ఉంది అని అడుగుతాడు. మా అక్క గురించి నీకెందుకు అని చిత్ర అంటే లీవ్ కావాలని అడిగావు కదా తనకి సీరియస్ గా ఉందేమో అని కాల్ చేశాను.
చిత్రని ట్రాప్ చేస్తున్న అభిమన్యు..
ఒక రోజు కాకపోతే ఒక వారం లీవ్ తీసుకో ఇది మీ ఆఫీసు. ఇది నా పర్సనల్ నెంబర్ నీకు ఏ అవసరం వచ్చినా కాల్ చెయ్యు నీకు నేను ఉన్నాను అంటాడు అభి. నీకు ఫోన్ చేయవలసిన అవసరం నాకు ఎప్పటికీ రాదు అంటూ కోపంగా ఫోన్ పెట్టేస్తుంది చిత్ర. ఫస్ట్ టైం ఇంతకన్నా ఎక్కువగా అడ్వాన్స్ అవ్వకూడదు. చిత్ర చాలా బెట్టుగా ఉంది అందమైన అమ్మాయిలు మనసు మీద వేసుకునే ముసుగే బెట్టు. ఆ ముసుగు తొలగించడం ఈ అభిమన్యుకి అలవాటే అనుకుంటాడు అభి.
మరోవైపు వేద పక్కనే కూర్చున్న యష్ ఎంతసేపు ఇలాగ పడుకుంటావు బోర్ కొట్టడం లేదా నాకు ఏమీ తోచటం లేదు. ఈ బాటికీ నువ్వు నేను ఎన్నిసార్లు గొడవపడే వాళ్ళం కదా, గొడవ పడటం కోసమే మనం దగ్గరవుతూ ఉంటాం కదా, లేకపోతే దగ్గరవడం కోసమే గొడవ పడుతుంటామా. మనం మాత్రమే ఇలా ఉంటామా లేకపోతే భార్య భర్తలు అందరూ ఇలాగే ఉంటారా అనుకుంటాడు యష్. ఎంత మంచి దానివి నాకు నేనే అర్థం కాను అలాంటిది నన్ను నువ్వు బాగా అర్థం చేసుకున్నావు. నేను నిన్ను తాకొచ్చా విత్ యువర్ పర్మిషన్ అంటూ ఆమె తల మీద చేయి వేసి అభిమానంగా నిమురుతాడు యష్.
అల్లుడికి జాగ్రత్తలు చెప్తున్న సులోచన..
నువ్వు త్వరగా కోలుకో మిస్టర్యారోగెంట్ ఈస్ వెయిటింగ్ అని చెప్తాడు. ఇంతలో నర్స్ వచ్చి ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు అని చెప్పడంతో బయటికి వెళ్లిపోతాడు. మరోవైపు ఇదంతా నా వల్లే అంటూ ఏడుస్తుంది సులోచన. ఇలా జరుగుతుందని అనుకున్నాము ఊరుకో అంటూ ఓదారుస్తుంది చిత్ర. తన ఆరోగ్య పరిస్థితి నాకు తెలుసు కదా తను ఉపవాసం చేస్తే నేను ఒప్పుకోవడం ఏంటి అంటూ ఏడుస్తుంది. అత్తారింట్లో కూడా పూజలు వ్రతాలు మానొద్దు అని నూరి పూసింది నేనే అంటూ ఏడుస్తుంది.
అంతలోనే యష్ అక్కడికి రావడంతో అతనిని ఓదారుస్తారు రత్నం, శర్మ. నేను చూసుకుంటాను మీరు ఇంటికి వెళ్ళండి అత్తయ్య గారు అంటాడు యష్. నా కూతురు హాస్పిటల్ లో ఉంటే నేను ఎలాగా ఇంటికి వెళ్తాను అంటుంది సులోచన. మేమందరం చూసుకుంటాం కదా అంటూ చిత్ర, విన్నీ కూడా చెప్తారు. వసంత్ ని డ్రాప్ చేయమంటే నేను డ్రాప్ చేస్తాను అని విని వాళ్ళని తీసుకొని వెళ్తాడు. వెళ్లేముందు తన కూతురు జాగ్రత్త అని చెప్పి వెళ్తుంది సులోచన.
నీకన్నా నాకు ఏది ఎక్కువ కాదు అంటున్న చిత్ర..
కోపంగా ఉన్న వసంత్ ని ఇదంతా నా మీద కోపమే వసంత్ ఎప్పుడు ఇలా అలగడు కదా అంటూ అతన్ని హత్తుకొని నా వసంతకి ఇష్టం లేని పని నేను ఎప్పుడు చేయను కావాలంటే రేపే అది ఆఫీస్ లో రిజైన్ చేసి వచ్చేస్తాను అంటుంది. నీ జాబ్ విషయంలో డెసిషన్ నీదే నీ జడ్జిమెంట్ మీద నాకు నమ్మకం ఉంది అంటాడు వసంత్. నువ్వు పొదుటి నుంచి ఏమి తినలేదు కదా అంటే అతనికి టిఫిన్ ఇస్తుంది చిత్ర. బావగారు కూడా ఏమి తినలేదు అని చిత్ర అంటే అవును వదినకి ఏమవుతుందో అనే కంగారులో ఉన్నాడు అంటాడు వసంత్.
సమస్యలు వస్తేనే కదా ఎదుటివారి మీద మనకున్న ప్రేమ ఏ పాటిదో తెలుస్తుంది అంటుంది చిత్ర. ఎదురెదురుగా ఉంటే డబ్బులు ఆడుకుంటారు కానీ వారిద్దరికీ ఒకరు ఉంటే ఒకరు ఎంతో ప్రేమ అంటాడు వసంత్. ఆ విషయం నేను ఇప్పుడే చూశాను ఇంత బాధలోనూ నాకు సంతోషాన్ని కలిగించే విషయం ఇదే అంటుంది చిత్ర. మాటలతోనే కడుపు నింపేసుకుంటాము అంటూ వసంత్ కి టిఫిన్ తినిపిస్తూ ఉంటుంది చిత్ర. అంతలోనే అక్కడికి వచ్చిన యష్ అదంతా చూస్తాడు. నేను తిన్నాను సరే నువ్వు కూడా తినలేదు కదా అంటూ వసంత్, చిత్రకి తినిపిస్తాడు.
Ennenno Janmala Bandham February 24 Today Episode నువ్వు నన్ను మెస్మరైజ్ చేసేసావు అంటున్న యష్..
అది చూసిన భార్యతో తను గడిపిన క్షణాలని గుర్తు చేసుకొని బాధపడతాడు. నేను ఎప్పుడూ అనుకోలేదు నీ గురించి నాకు ఇలాంటి ఫీలింగ్స్ ఉంటాయని, నీకోసం ఇంత ఆరాటపడతానని ఎప్పుడూ అనుకోలేదు నన్ను ఇంతలా ఎలా మెస్మెరైజ్ చేసేసావ్ అనుకుంటాడు యష్. మొన్న వాలెంటైన్స్ డే రోజు నువ్వు సెకండ్ ఛాన్స్ గురించి అడిగినప్పుడు మనసులో ఐ లవ్ యు చెప్పాలని చాలా గట్టిగా అనిపించింది.
కానీ మన ఇద్దరి మధ్య ఉన్న అగ్రిమెంట్ గుర్తొచ్చి ఆగిపోయాను. నిన్ను నా జీవితంలోకి ఖుషి తల్లిగా రమ్మని పిలిచింది నేనే కదా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఎలా చెప్పగలను అంటూ ఎమోషనల్ అవుతాడు. ఆ మాటల్ని చిత్రావాళ్ళు వింటారు. తరువాయి భాగంలో స్పృహలోకి వచ్చిన వేద భర్తని పిలుస్తుంది. విన్ని వచ్చి వేద స్పృహలోకి వచ్చిందని చెప్తాడు. తొందరగా ఆమె రూమ్ లోకి పరిగెడతాడు యష్.