Ennenno Janmala Bandham February 27 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో మెలకువ వచ్చిన వేద భర్తని పిలుస్తుంది. మరోవైపు రండి బావగారు ఏమైనా తిందురు గాని అంటుంది చిత్ర ఏమి వద్దు అంటాడు యష్. బావగారు పొద్దుటి నుంచి ఏమీ తినలేదు అని చిత్ర అంటే జ్యూస్ తీసుకొస్తాను అంటూ బయలుదేరుతాడు వసంత్. నాకేమీ వద్దు నావల్లే వేదకి ఇలాంటి ఈ పరిస్థితి వచ్చింది.

పశ్చాతాపంతో కన్నీరు పెట్టుకుంటున్న యష్..

నీ వల్ల కాదు అంటూ నేనే రెచ్చగొట్టాను నా మీద పంతంతో తను ఉపవాసం చేసింది, నాకు కడుపునిండా అన్నం పెట్టింది కానీ తన కడుపు మాడ్చుకుంది. పాపం తనకి ఎంత ఆకలి వేసిందో ఎంత బాధ భరించిందో నిజంగానే నాకు తెలీదు తనకి చిన్నప్పటినుంచి హెల్త్ ప్రాబ్లం ఉందని. తను అసలు తిండి మానకూడదంట లో లోపల పేగులు ఎంత నలిగిపోయాయో, తను ఉపవాసం నాకోసమే నా కుటుంబం కోసమే చేసింది. మా సంతోషం కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టింది, నా గురించి అంతగా ఆలోచించే వేదని కొంచమైనా పట్టించుకున్నానా అంటూ బాధపడతాడు.

నువ్వు ఇదంతా కావాలని చేయలేదు కదా బాధపడొద్దు అంటూ ఓదారుస్తారు చిత్ర, వసంత్. తనకి ఏమైనా అయితే నన్ను నేను క్షమించుకోలేను అంటూ ఏడుస్తాడు యష్. తనకి ఏమీ కాదు నువ్వు బాధపడొద్దు నువ్వే తనకి బలము అంటాడు వసంత్. నేను తనకి బలం కాదు తానే నాకు బలం. తను లేకపోతే నేను జీరో అంటూ చిన్న పిల్లాడి లాగా ఏడుస్తాడు. మరోవైపు వేద దగ్గరికి వచ్చిన డాక్టర్ ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతుంది ఇప్పుడు బానే ఉంది నా హస్బెండ్ ఎక్కడ అని అడుగుతుంది వేద.

వేదని చూసి ఎమోషనల్ అయిన యష్..

వాళ్ల హస్బెండ్ కి ఇన్ఫాం చేయు అని సిస్టర్ ని పంపిస్తుంది డాక్టర్. సిస్టర్ బయటికి వచ్చి వేద గారికి మెలకువ వచ్చింది ఒకసారి చూడాలనుంది అంటుంది అని విన్నికి చెప్తుంది సిస్టర్. తను కాన్సెసులోకి రాగానే నన్ను కలవరిస్తుందా, నన్ను చూడాలని తాపత్రయపడుతుందా అంటూ ఆనందంగా ఆమె గదిలోకి వెళ్ళబోతాడు విన్నీ. సార్ ఆవిడ చూడాలనుకుంటుంది మిమ్మల్ని కాదు ఆవిడ భర్త యశోదర్ గారిని ఆయనకి ఇన్ఫాం చేయండి అంటుంది సిస్టర్.

విషయం తెలుసుకున్న యష్, వేద దగ్గరికి వచ్చి బాగా ఎమోషనల్ అయిపోతాడు. నాకు ఏమైంది నన్ను ఎందుకు హాస్పిటల్లో జాయిన్ చేశారు అని అడుగుతుంది వేద. నువ్వు నిజంగానే డాక్టరేనా నీకు కామన్ సెన్స్ ఉందా అసలు నీకు, మీకు హెల్త్ ఇష్యూ ఉందని తెలిసి కూడా నన్ను టార్చర్ పెడతావా నీకు అంత అశ్రద్ధ ఎందుకు , నీకేమైనా అయితే అని యష్ అంటుండగానే చచ్చిపోయేదానిన అంటుంది వేద. ఆ మాటకి ఆమె నోరు మూసేస్తాడు యష్.

మిమ్మల్ని దెయ్యంలాగా పీడిస్తానంటున్న వేద..

నాకోసం బెంగ పెట్టుకున్నారా అని వేద అడిగితే నువ్వు కదలకుండా మెదలకుండా 24 గంటలు ఐ సి యు ఉంటే ఎంత టార్చర్ అనుభవించెను నాకు తెలుసు నా గుండె ఆ గుడిలో గంట కొట్టుకున్నట్లుగా కొట్టుకుంది. ఆ దేవుడు విన్నాడు నువ్వు దేవుడు భక్తురాలు కదా అంటాడు యష్. మీరు అంత కంగారు పడకండి మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి పోను, ఒకవేళ దేవుడు నన్ను బలవంతంగా తీసుకుని వెళ్లిన వెనక్కి వచ్చి దెయ్యంలాగా మిమ్మల్ని పీడిస్తాను అంటూ యష్ ని నవ్విస్తుంది వేద.

మీరు కన్నీరు కారుస్తుంటే మీ ఫేస్ కి సూట్ అవ్వలేదు మీకు కోపమే కరెక్ట్ అంటుంది వేద. నీకోసం నేను కోప్పడాల నీవు ఓవరాక్షన్ ఆపు అంటాడు యష్ డాక్టర్ ఎలా ఉంది ఆర్ యు ఆల్ రైట్ అని అడుగుతుంది. బాగానే ఉంది అని వేదా అంటే మీరు డాక్టర్ కదా మీ గురించి మీరే కేర్ తీసుకోకపోతే ఎలాగా ఫాస్టింగ్ చేయకూడదు కదా అంటుంది డాక్టర్. అలా చెప్పండి అని యష్ కంటే తనకి కాదు నీకు చెప్తున్నాను తను ఇంకెప్పుడూ ఫాస్టింగ్ చేయకూడదు మీ భార్య మీ బాధ్యత టేక్ కేర్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది డాక్టర్.

అంతా మనమంచికే అనుకుంటున్న వేద..

మరి ఎప్పుడు ఇలాగా ఫాస్టింగ్ చేయొద్దు ఎవరీ త్రీ అవర్స్ కి ఏదో ఒకటి తింటూ ఉండు అని భార్యకి జాగ్రత్తలు చెప్తాడు. నేను వెళ్లి ఇంటికి ఫోన్ చేసి వస్తాను నువ్వు రిలాక్స్ అవ్వు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు యష్. పైకి చెప్పరు కానీ ఈయనకి నామీద చాలా ప్రేమ ఉంది. ఆయన మొహం లో కంగారే ఆ విషయాన్ని చెప్తుంది. నాకు ఏం జరిగినా మన మంచికే అంటారు కదా నాకు ఇలాగ జరగటం వల్ల ఆయనకి నా మీద ఎంత ప్రేమ ఉందో అర్థమైంది అనుకుంటుంది వేద. మరోవైపు అభి దగ్గరికి ఒక ఫైల్ తీసుకొని వస్తుంది పిఎ మేనేజర్ గారు మీకు ఈ ఫైల్ ఇమ్మన్నారు అంటూ వెళ్ళిపోబోతుంది.

వెళ్ళిపోతావా అని అది అడిగితే వెళ్ళొద్దా అంటుంది తను. వెళ్లొద్దు కూర్చో అని అభి అంటే ఇది ఆఫీస్ అంటుంది ఆమె. నెక్స్ట్ వీక్ మనిద్దరం ఫారిన్ టూర్ వెళ్తున్నాము అంటే నిజంగానా అంటుంది ఆమె. టెన్ డేస్ హ్యాపీగా ఫారెన్ లో ఎంజాయ్ చేద్దాం, కానీ ఈ విషయం ఎవరికీ తెలియకూడదు సీక్రెట్ గా ఉంచు అంటాడు అభి. ఓకే అంటూ ఆనంద పడిపోతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆమె. నాకు ఎప్పటికప్పుడు కొత్త వాళ్లతో ఎంజాయ్ చేస్తేనే బాగుంటుంది లేకపోతే జీవితం బోర్ కొట్టేస్తుంది అనుకుంటాడు అభి.

విన్నీ చేసిన పనికి షాక్ అయిన వేద దంపతులు..

మరోవైపు నువ్వు ఏమీ తినలేదు కదా సూప్ తాగు అంటాడు యష్. నాకేమీ వద్దు మూడు రోజులు ఉపవాస దీక్ష కదా ఇంకా ఒక్క పూట మిగిలింది ఎలాగో ఇంటికి వెళ్ళిపోతాం కదా అంటుంది వేద. ఇది చాలా ఇష్టం వల్లే ఎంతవరకు తెచ్చుకున్నావు ఇంక ఆపు, ముందుగా బిహేవ్ చేయొద్దు అంటూ నా మీద కోప్పడతాడు యష్. అంతలోనే అక్కడికి వచ్చిన విన్నీ అప్పుడే వేద మీద అరవడం స్టార్ట్ చేశావా యశోధర్,కూల్ గా చెప్తే ఎవరైనా వింటారు అంటాడు విన్ని. ఏంటి మా ఆయనతో పాటు నువ్వు కూడా హాస్పిటల్ లోనే వెయిట్ చేస్తున్నావంట ఏంటి సంగతి అని వేద అంటే తప్పుతుందా బెస్ట్ ఫ్రెండ్ పోస్టు అంట కదా అంటాడు విన్నీ.

ఈ సూప్ తాగు నీ హెల్త్ ఇంపార్టెంట్ అంటాడు విన్నీ. ఇప్పటివరకు ఆయన, ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేసావా వద్దు అని చెప్తే వినరేంటి అంటుంది వేద. నేను నీ బెస్ట్ ఫ్రెండ్ కదా ఇవి అన్ని చెప్పినా కూడా తాగవా అని విన్ని అంటే మీ హస్బెండ్ ని కదా నేను చెప్పిన తాగావా అంటూ ఇద్దరూ పోటీపడి ఆమె చేత సూప్ తగించడానికి ట్రై చేస్తారు. మీరు ఎవరు చెప్పినా నేను తాగను అని వేద అంటే నువ్వు ఎవరు చెప్తే తాగుతావో నాకు తెలుసు అందుకే వాళ్ళని తీసుకొచ్చాను అంటూ ఖుషి ని చూపిస్తాడు విన్ని. తల్లి దగ్గరికి వచ్చిన ఖుషి ఆమెని హత్తుకొని నేను నిన్ను ఎంత మిస్ అయ్యానో తెలుసా అంటూ బాధపడుతుంది.

Ennenno Janmala Bandham February 27 Today Episode కోపంతో పనులు జరగవుంటున్న విన్ని..

ఎలాగా ఉన్నావు అని వేద అంటే సుహాసిని పెద్దమ్మ నన్ను చాలా బాగా చూసుకుంది. నువ్వు హాస్పిటల్లో ఉన్నావని విన్ని అంకుల్ చెప్పారు. త్రీ డేస్ ఫాస్టింగ్ అంట కదా నీకు ఆకలి వేయలేదా ఫాస్టింగ్ రాంగ్ అంట మా టీచరు చెప్పింది. నువ్వు ఫుడ్డు తినకపోతే నేను ఊరుకోను అంటూ బలవంతం పెడుతుంది ఖుషి. శివరాత్రికి ఉపవాసం ఉండాలి కదా ఇప్పుడు నేను ఉపవాసం మానేస్తే దేవుడికి కోపం వస్తుంది అందుకే తినట్లేదు అంటుంది వేద. నువ్వు ఫుడ్డు తినకపోతేనే దేవుడికి కోపం వస్తుంది, ఇప్పుడు నువ్వు తినకపోతే నా మీద ఒట్టు అంటూ సూప్ ని ఆమె చేత తాగిస్తుంది ఖుషి.

విన్నీ, యష్ దగ్గరగా వెళ్లి ఏ పని చేయడానికి అయినా ఒక పద్ధతి ఉంటుంది షౌట్ చేయడం వల్ల పనులు జరగవు అంటాడు. నన్ను ఇక్కడికి విన్నీ అంకులే తీసుకొచ్చారు. నన్ను ఇక్కడికి తీసుకు వచ్చినందుకు థాంక్యూ సో మచ్ అంటుంది ఖుషి. ఖుషి ని నా దగ్గర తీసుకొచ్చి మంచి పని చేశావు అంటూ వేద కూడా థాంక్స్ చెప్తుంది. ఇదంతా చూస్తూ కోపంతో రగిలిపోతాడు యష్. తరువాయి భాగంలో నా కూతుర్ని నా పర్మిషన్ లేకుండా ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చావు, వేద దగ్గర మంచి మార్కులు కొట్టేద్దామని అంటూ కేకలు వేస్తాడు యష్.

నాలుగు గోడల మధ్య ఉంటే భార్యాభర్తలు అయిపోరు అది ఒక బంధం అంటాడు విన్ని. వేద పడుకుందేమో అనుకొని అందాల రాక్షసి ఎంత అందంగా ఉందో అంటాడు యష్. థాంక్స్ అంటూ కళ్ళు తెలుస్తుంది వేద. ఆమె రియాక్షన్ కి ఒక్కసారిగా షాక్ అవుతాడు యష్.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on ఫిబ్రవరి 27, 2023 at 9:16 ఉద.