Ennenno Janmala Bandham February 28 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో ఖుషి ని నా దగ్గరికి తీసుకొచ్చి మంచి పని చేశావు థాంక్స్ అంటుంది వేద.ఆ మాటలకి కోపంగా బయటికి వచ్చేస్తాడు. అప్పుడే డాక్టర్ తో మాట్లాడటం కోసం బయటకు వచ్చిన విన్నీని ఏంటి నీ ప్రాబ్లం ఎందుకు పక్క వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకుంటున్నావు అంటాడు యష్. ఇప్పుడు నేనేం చేశాను అని విన్ని అంటే నా కూతుర్ని హాస్పిటల్ కి తీసుకురావడానికి నువ్వు ఎవరివి.

విన్నీ మీద కేకలు వేస్తున్న యష్..

ఖుషి ఎంత దాని వయసెంత, హాస్పిటల్ బెడ్ మీద చూస్తే ఆ పసిపిల్ల ఎంత కాపురం పడుతుందో తెలుసా? వాళ్ళిద్దరికీ ఎంత మంచి బాండింగ్ ఉందో తెలుసా, ఇదంతా చూసి ఖుషి కి ఏమైనా అయితే ఎవరిది బాధ్యత నీకేమీ నష్టం ఉండదు నష్టమంత నాకే కదా అంటాడు యష్.నువ్వు మాట్లాడే పద్ధతి బాగోలేదు ముందు నువ్వు కంట్రోల్ చేసుకో,అసలు వేదుకి ఈ ప్రాబ్లం రావడానికి కారణం ఉపవాసం. అదే వద్దు అని డాక్టర్లు, నువ్వు చెప్పిన వినట్లేదు.

తన చేత తినిపించ గలిగే ఒకే ఒక వ్యక్తి ఖుషి అందుకే తనని తీసుకొచ్చాను అంటాడు విన్నీ. ఖుషి నా కూతురు వేద నా భార్య మధ్యలో నువ్వు ఎవరివి పెత్తనాలు చేయటానికి, తనకి ఎలా తినిపించాలో ఎవరి చేత తినిపించాలో నాకు తెలుసు నువ్వేమీ సలహాలు ఇవ్వక్కర్లేదు అంటూ విన్నీ మీద రెచ్చిపోతాడు. నా భార్యకి నువ్వు బెస్ట్ ఫ్రెండ్ వి కావచ్చు తను నిన్ను నెత్తిన పెట్టుకోవచ్చు కానీ దానివల్ల నా కొరిగేదేమీ లేదు, వేద గురించి నాకన్నా నీకు ఎక్కువగా తెలుసా నాకన్నా ఎక్కువగా తాపత్రయమా ఇన్నాళ్లు లేనిది ఉన్నట్లుండి ఊడిపడ్డావు కంటి విన్నిని నానా మాటలు అంటాడు.

అంత కర్మ నాకు పట్టలేదు అంటున్న యష్..

వేద గురించి ఏవో నాలుగు విషయాలు గుర్తు పెట్టుకొని డాక్టర్ దగ్గర చెప్పినంత మాత్రాన మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని ఒప్పుకోవాలా, సర్టిఫికెట్ ఇవ్వాలా, నిజంగానే తను నీకు బెస్ట్ ఫ్రెండ్ అయితే తనకి నిశ్చితార్థం ఆగిపోయినప్పుడు తన లైఫ్ డిస్టర్బెన్స్ అయినప్పుడు ఎక్కడికి పోయావు. వేద కష్టాల్లో ఉన్నప్పుడు రాకుండా తనకి ఇంకొకరితో పెళ్లి అయిపోయాక వస్తావా తనకి మరిన్ని కష్టాలు పెంచడానికా, వేదనా భార్య తనని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు నీ దగ్గర నేర్చుకోవాల్సిన కర్మ నాకు పట్టలేదు అంటాడు యష్.

నువ్వు చెప్పడం అయిపోయిందా అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు ఇలాగా నాలుగు కేకలు వేసేస్తే పెద్ద మగాడిని అనుకుంటున్నావా, వేద నా భార్య వేరే ఎవరికీ ఏమీ కాదు అని ఏదైనా మాట్లాడుతున్నావు నిజమే నీ భార్య తను నీ భార్యగా నూటికి నూరుపాళ్లు న్యాయం చేసింది. ఖుషి కి తల్లిగా ఆ ఇంటి కోడలుగా ఏం చేయాలో అన్ని చేసింది కానీ భర్తగా నువ్వు తనకోసం ఏం చేశావు అని నిలదీస్తాడు విన్ని. వేదం నీకోసమే నీ భార్యగా బ్రతుకుతుంది నిన్ను ఒక్క మాట అననివ్వదు.

యష్ కి తల తిరిగిపోయేలా సమాధానం చెప్పిన విన్ని..

నువ్వు ఏమి చేసినా నిన్ను వెనకేసుకొస్తుంది కానీ నువ్వు తనకోసం ఏం చేసావు ఏం ఆలోచించావు అంటూ నిలదీస్తాడు విన్ని. పట్టించుకోకుండానే కాపురం చేస్తున్నానా అంటాడు యష్. ఏంటి నువ్వు చేసే కాపురం అయిందానికి కానిదానికి నోరు పారేసుకోవటమా, అపార్థం చేసుకోవడమా, అనారోగ్యం పాలు చేసి ఐసియులో జాయిన్ అయ్యేటట్లు చేయటమా? అసలు వేద గురించి నీకు ఏం తెలుసు.

వేద మనసుని అర్థం చేసుకునే ప్రయత్నం చేసావా తనకి ఏం కావాలో ఏం వద్దు అనుకున్నావా ఓకే భార్య తన భర్త నుంచి ఏం ఆశిస్తుందో నువ్వు ఆలోచించవా, ఒక భార్య భర్త అంటే ఒక ఇంట్లో కలిసి బ్రతకటం కాదు ఒక బెడ్ ని షేర్ చేసుకోవడం కాదు, అది ఒక బంధం వివాహ బంధం ఆ బంధం ఒక్కరోజుతో ఏర్పడేది కాదు మెల్లిమెల్లిగా బలపడాలి నిలబడాలి. నిలబెట్టుకోవటం చేత కావాలి అది నీకు చేతకాలేదు అంటాడు విన్ని. యష్ ఏదో మాట్లాడే లోపు వెయిట్ నేను ఇంకా మాట్లాడటం పూర్తి కాలేదు అంటూ ఒక భార్య తన భర్త నుంచి ఒక భరోసా కోరుకుంటుంది కానీ నువ్వు తనకి అలాంటి భరోసా ఇవ్వలేదు.

వేదకి అన్ని విధాలా తోడుంటానంటున్న విన్ని..

నువ్వు కేవలం నీ గురించి మాత్రమే ఆలోచిస్తావు నువ్వు నీ కూతురు నీ కుటుంబము అని మాత్రమే ఆలోచిస్తావు అలాగే వేద కూడా తనకోసం తను ఆలోచించుకుంటుంది కదా, తనకి ఆశలు కోరికలు ఉంటాయి కదా దాని గురించి ఎప్పుడైనా ఆలోచించావా, భర్తవి అయ్యావు కానీ మంచి భర్తని కాలేకపోతున్నావు. ఒక చేత్తో చప్పట్లు కొడతానంటే కుదరదు రెండో చెయ్యిని కలుపుకోకపోతే ఎలా రెండో చేతిని కూడా కలుపుకుంటేనే మంచి బంధం అవుతుంది అంటూ చివాట్లు పెడతాడు. ఊడిపడ్డాడు బెస్ట్ ఫ్రెండ్ అని కాదు అన్నావు అవును నేను వేదకి బెస్ట్ ఫ్రెండ్ ని, వేదకి ఎప్పుడు ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకోవడానికి నేనున్నాను తనకి అండగా నేనుంటాను అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విన్ని.

మరోవైపు కోలుకున్న వేద దగ్గరికి వచ్చి అందరూ పలకరిస్తారు నిన్ను ఇలా చూసినందుకు చాలా ఆనందంగా ఉంది సులోచన. కొంచెం కళ్ళు తిరిగి పడిపోయినందుకే ఇంత హడావిడి చేస్తున్నారు అంటుంది వేద. మీ అమ్మ రెండు రోజుల తర్వాత చాలా సంతోషపడుతుంది అంటారు శర్మ గారు. అంటే ఈ రెండు రోజులు ఆంటీ కోడలు తిప్పుతూనే ఉన్నారా అంటాడు విన్ని ఆ మాటలకి అందరూ నవ్వుతారు. నీకోసం నేను వినాయకుడికి ప్రే చేశాను అంటుంది ఖుషీ.

నా నెక్స్ట్ టార్గెట్ అదే అంటున్న వేద..

అందుకే నాకు త్వరగా నయమైపోయింది అంటుంది వేద. ఇది హాస్పిటల్ ఒకరు ఇద్దరు ఉంటే పర్వాలేదు కానీ ఎంత మంది వద్దు అంటూ సిస్టర్ మందలిస్తుంది. డాక్టర్ చెప్పింది కదా ఇంకా ఇక్కడే ఉన్నారేంటి పదండి పదండి అంటుంది ఖుషి. ఇంకాసేపు ఉంటే కోప్పడుతుందేమో అంటూ వేదకి జాగ్రత్తలు చెప్పి బయలుదేరుతారు అందరు. కానీ వసంత్, చిత్ర ఉండిపోతారు. నాతో ఏమైనా మాట్లాడాలా అంటుంది వేద. పెద్దవాళ్లు అంటుంటారు కదా బ్యాడ్ లో కూడా గుడ్ ఉంటుందని నువ్వు హాస్పిటల్లో చేరడం బ్యాడ్ అయితే మా అందరికీ నీ విలువ బాగా తెలిసింది ముఖ్యంగా బావగారికి ఇది గుడ్ అంటుంది చిత్ర.

నువ్వు మా అందరి కోసం ఆలోచిస్తావు మా అందరి పనులు చేస్తావు మాకు తెలియకుండానే మా లైఫ్ లో భాగం అయిపోయావు అంటాడు వసంత్. అగ్రహారం ఫ్యామిలీ మలబార్ ఫ్యామిలీ అని ప్రియ కుర్రాళ్ళు ఇద్దరు గొడవ పడతారు కానీ మనదంతా ఒకటే ఫ్యామిలీ వేదాస్ ఫ్యామిలీ అంటుంది చిత్ర. వేద ఫ్యామిలీ ఫుల్ ఫీల్ అవ్వాలంటే మీ ఇద్దరూ ఒకటవ్వాలి. అన్ని చేశాను కానీ ఒకటి మిగిలిపోయింది నా చేతుల మీదుగా మీ పెళ్లి జరిపించడం నా నెక్స్ట్ టార్గెట్ అదే అంటుంది వేద.

యష్ బాడ్ ఫాదర్ అంటున్న ఖుషి..

నీ మాటని మేము ఎప్పుడూ కాదనము మేము కూడా అదే ప్రయత్నంలోనే ఉన్నాము త్వరలోనే గుడ్ న్యూస్ చెప్తాము అంటారు చిత్ర,వసంత్. ఆ క్షణం కోసమే వెయిట్ చేస్తాను అంటూ ఆల్ ద బెస్ట్ చెప్తుంది వేద. మరోవైపు విన్నీ మాటలు తెలుసుకొని కోపంతో రగిలిపోతూ ఉంటాడు యష్. ఇది అతని అభిప్రాయమైన లేక అందరూ అలాగే అనుకుంటున్నారా అనుకుంటాడు యష్. నేను మంచి భర్తని కాదు అని వేద అనుకుంటుందా అని ఆలోచిస్తాడు. వేద కళ్ళు తిరిగి పడిపోతే కంగారు పడ్డాను అది కన్సర్నా లేక అంతకుమించా, మా రిలేషన్ ని విన్నీ సరిగా అర్థం చేసుకోలేక అలాగా మాట్లాడుతున్నాడు.

వేద భార్యగా చక్కగా తన బాధ్యత నెరవేరుస్తుంది కానీ నేను అలాగా ఉండలేకపోతున్నానా, అయినా ఆ విని ఏదో అన్నాడని పట్టించుకోవాల్సిన అవసరం లేదు నేను మంచి భర్తని అంతే అనుకుంటాడు యష్. అంతలోనే అక్కడికి వచ్చిన ఖుషి ఇక్కడ కూర్చుని ఏం ఆలోచిస్తున్నారు అమ్మ పిలుస్తుంది అంటుంది. నేను మంచి డాడీని కాదా అని మొహమాటంగా ఖుషి ని అడుగుతాడు యష్. యువర్ నాట్ ఏ గుడ్ డాడీ, యు ఆర్ మై బెస్ట్ డాడీ అంటూ తండ్రిని ముద్దు పెట్టుకుంటుంది ఖుషీ. ఆ మాటలకి ఆనందంతో కూతుర్ని దగ్గరికి తీసుకుంటాడు యష్.

టోటల్గా చేంజ్ అవుతాను అంటున్న యష్..

మమ్మీ మీకోసం వెయిట్ చేస్తుంది అని ఖుషి అంటే నువ్వు వెళ్ళు అని వేద దగ్గరికి వస్తాడు యష్. నన్ను ఎందుకుపిలిచావు అని అడిగితే నిన్నటి నుంచి ఇక్కడే ఉన్నారా అని అడుగుతుంది వేద. నీకు బాగోకపోతే ఎక్కడ ఉంటాను అంటూ కోపంగా మాట్లాడుతాడు మళ్ళీ విన్ని అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటాడు. తనని తాను కూల్ చేసుకొని వేదా పక్కన కూర్చుంటాడు నా సంగతి వదిలేయి ఇప్పుడు నీ సంగతి చెప్పు ఎలా ఉంది అంటాడు యష్. నాకేంటి బ్రహ్మాండంగా ఉన్నాను శుభ్రంగా ఇంట్లో ఉండవలసిన దాన్ని ఇక్కడికి తీసుకువచ్చి పడేశారు అంటుంది వేద. నీకు ఇంత కేర్ లెస్ ఏంటి,నీ హెల్త్ గురించి నువ్వు ఆలోచించుకోవాలి కదా అంటాడు యష్.

మనసులో మాత్రం నీకేమైనా అయితే నేను భరించలేను అనుకుంటాడు. ఏమైంది మీకు? ఏదో ఆలోచిస్తున్నారు అంటుంది వేద. ఐ యాం ఆల్ రైట్ అంటాడు యష్. సరే ఆలస్యం ఎందుకు స్టార్ట్ చేయండి అంటుంది వేద. ఏంటి స్టార్ట్ చేయాలి అని ఎస్ అంటే నా మీద కేకలు వేయడం అంటుంది వేద. నేను కేకలు వేయను కూల్ గా ఉంటాను నో కోపం, నో చిరాకులు టోటల్గా చేంజ్ అంటాడు యష్.

Ennenno Janmala Bandham February 28 Today Episode బాగా కన్ఫ్యూజ్ అవుతున్న యష్..

అప్పుడు గాని మిమ్మల్ని బాడ్ హస్బెండ్ అనరు అంటుంది వేద. ఆ మాటకి షాక్ అయిన యష్ కేకలు వేస్తే నేను బాడ్ హస్బెండ్ ని అవుతాను అని అవిన్ని గాడు చెప్పాడు, వేద ఏమో కేకలు వేయకపోతేనే బ్యాడ్ హస్బెండ్ అంటుంది ఇంతకీ నేను గుడ్ హస్బెండ్ బాడ్ హస్బెండా అని ఆలోచనలో పడతాడు యష్. కూల్ గా ప్రశాంతంగా ఉండడం మీకు సెట్ అవ్వదు మిమ్మల్ని ఇలా చూస్తుంటే ఏదో పోగొట్టుకున్న వాళ్ళ లాగా ఉన్నారు.

అరుస్తూ చిరాగ్గా ఉంటేనే మీకు సెట్ అవుతుంది నాకు ప్రశాంతంగా ఉంటుంది అంటుంది. మీరు మీలాగే ఉండండి మారిపోతే బోర్ కొట్టేస్తారు అంటుంది వేద. అంటే నన్ను గుడ్ హస్బెండ్ ని అవ్వనివ్వవా అని యష్ అంటే గుడ్ హస్బెండ్ అవార్డు ఎవరైనా ఇస్తానన్నారా అంటుంది వేద. ఏం ఇవ్వకూడదా? నాకేం తక్కువ అంటాడు యష్. ఇలా ఉంటే ఎలా ఇస్తారు ఒకసారి ఇంటికి వెళ్లి ఫ్రెష్ అప్ అయ్యి రండి నేను వెళ్ళిపోతే నిన్నెవరు చూసుకుంటారు అంటాడు యష్.

నేనున్నాను కదా అంటూ లోపలికి వస్తాడు విన్ని. తరువాయి భాగంలో గుడ్ హస్బెండ్ అనిపించుకోవాలంటే ఎలా అంటూ గూగుల్ లో సెర్చ్ చేస్తాడు యష్. భార్యకి ముద్దు పెడితే గుడ్ హస్బెండ్ అవుతారు అని అందులో ఉంటుంది అప్పుడే వచ్చినా సిస్టర్ కి వేద అనుకొని ముద్దు పెట్టేస్తాడు. ఆ సిస్టర్ కేకలు వేయడంతో లోపలికి వస్తారు విన్ని, వేద. ఏం చేశారు అని వేద అడిగితే మీ హస్బెండ్ నాకు ముద్దు పెట్టారు అంటుంది సిస్టర్.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on ఫిబ్రవరి 28, 2023 at 9:59 ఉద.