Ennenno Janmala Bandham February 7 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో అందంగా రెడీ అయినా వేద నా సారీ బాగుందా? పార్టీవేర్ సారీ ఎంతైనా మా విన్ని స్పెషల్ గా ఇస్తున్న పార్టీ కదా ఈ మాత్రం రెడీ అవ్వాలి అంటుంది వేద. ఆ మాటలకి షాక్ అవుతాడు యష్. తనని బ్రతిమాలుతుంది అనుకుంటే ఏమాత్రం పట్టించుకోకుండా రెడీ అయిపోతుంది ఏంటి అనుకుంటాడు యష్. మార్నింగ్ పార్టీకి వెళ్దాము అన్నట్లుగా ఉన్నావు అంటాడు యష్.

రివర్స్ ప్లాన్ వేసిన వేద..

కుదరదు అన్నారు కదా అంటుంది వేద. కుదరదు అనలేదు చూద్దాంలే అన్నాను దాని అర్థం అదే కదా రాత్రి కూడా అదే చెప్పారు. చేస్తే కాల్ కట్ చేశారు మళ్లీ పొద్దున అడిగితే అదే రిప్లై. మీరు ఆల్వేస్ బిజీ కదా మాటిమాటికి మిమ్మల్ని బ్రతిమాలి ఇబ్బంది పెట్టడం బాగోదు కదా కానీ నాకైతే తప్పదు కదా నా క్లోజ్ ఫ్రెండ్ విన్ని పార్టీ అంటూ బయలుదేరబోతూ మీకు జాయిన్ అవ్వాలంటే మీరు జాయిన్ అవ్వండి అంతేకానీ మొన్న వెనకనుంచి వచ్చి వెనకనుంచి వెళ్ళిపోయినట్లుగా గుమ్మం లో నుంచి వెళ్ళిపోకండి.

మాతో జాయిన్ అవ్వండి మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను అంటూ బై చెప్పి వెళ్ళిపోతుంది వేద. ఏంటి ఆ మాటలకి కోపంతో రగిలిపోయిన యష్ ఈమె వెనకాతల తుర్రుమనుకుంటూ వెళ్లిపోతాను అనుకుందా, వెళ్ళను గాక వెళ్ళను అనుకుంటాడు. పార్టీకి వచ్చిన వేదని బొకే ఇచ్చి గ్రాండ్ గా రిసీవ్ చేసుకుంటాడు విన్ని. ఇంతకీ నీ హస్బెండ్ ఏరి నన్ను కాంపిటేటర్ గా ఫీల్ అవుతున్నాడా అంటాడు విన్నీ. నీ మొహమే చెప్పింది నీ ఫ్రెండ్ పార్టీకి నేను రావటం ఏంటి కావాలంటే నువ్వే వెళ్ళు అని చెప్పి ఉంటాడు అంతేనా అంటాడు విన్ని.

భర్తని వెనకేసుకొస్తున్న వేద..

ఇద్దరినీ కలిసే బయలుదేరేము కాకపోతే అర్జెంట్ బిజినెస్కాలు రావటంతో మధ్యలోనే డ్రాప్ అయిపోయారు మధ్యలో జాయిన్ అవుతారు అంటూ భర్తని వెనకేసుకొస్తుంది వేద. మీ భర్తని బాగా వెనకేసుకొస్తున్నావు నీలాంటి భార్య దొరకడం అతని అదృష్టం అంటాడు విన్ని. ఆ మాట ఆయన అనుకోవాలి కదా అనుకుంటుంది వేద. ఇంకా పెళ్లి చేసుకోవా అని వేద అడిగితే అర్థం చేసుకునే మంచి భార్య దొరకాలి కదా, ఇష్టపడే అమ్మాయి దొరకకపోతే చాలా కష్టపడాల్సి వస్తుంది అంటాడు విన్ని.

నువ్వు నీ భర్త గొడవ పడుతుంటారా అని విని అడిగితే అవన్నీ చిన్నపిల్లల గొడవలు, గొడవలు గాని నువ్వు చూస్తే షాక్ అయిపోతావు అంటుంది వేద. మరోవైపు ఇంట్లో కాలు కాలిన పిల్లి లాగా తిరుగుతూ ఉంటాడు యష్. ఎంత ధైర్యం వేదకి భర్తంటే కనీసం మర్యాద కూడా లేదు. నన్ను వదిలేసి ఒంటరిగా పార్టీకి వెళ్ళిపోతుందా కనీసం మర్యాద కోసమైనా కూడా మరోసారి పార్టీకి రమ్మని పిలవచ్చు కదా ప్రేమగా అడిగితే రానని చెప్తానా, చూడ్డానికి చాలా అమాయకంగా కనిపిస్తుంది కానీ ఈ మిసెస్ న్యూసెన్స్ చాలా తెలివైనది.

అయోమయంలో యష్..

నా మైండ్ ని రీడ్ చేస్తుంది అనుకుంటాను నన్ను బ్రతిమాలకుండా వెళ్ళింది. అయినా నేను ఎలా వెళ్తాను వెళ్ళేది తన చిన్ననాటి స్నేహితుడిది కదా అతను కనీసం ఇన్వైట్ చేయాలి కదా అనుకుంటాడు యష్. మరోవైపు పార్టీలో ఎస్ కోసం ఎదురుచూస్తున్న వేద ఇంకా రాలేదు ఏంటి తనని బ్రతిమలాడకుండా వచ్చేసానని అలిగారా ఏంటి అనుకుంటూ ఫోన్ చేస్తుంది. మహానుభావుడా ఎక్కడున్నావు త్వరగా రా నీ శ్రీమతి మీకోసం వెయిటింగ్ ఇక్కడ అనుకుంటుంది.

మరోవైపు యష్ తను వెళ్ళిపోయింది ఎందుకంటే నేను వస్తానో,రానో అని టెస్టింగ్ కి. నా ఇగో దెబ్బతింది నేను అస్సలు వెళ్ళను అనుకుంటాడు యష్. మళ్లీ ఆలోచనలు పడిన యష్ నేను వెళ్లాలా వద్దా ఎంతైనా తను నా భార్య నేను తనకోసం తగిన తను నాకోసం తగిన ఇద్దరినీ సమానమే. తను ఒంటరిగా పార్టీకి వెళ్ళటం ఏమిటి అది బిజినెస్ పార్టీ అందరూ మగవాళ్ళే ఉంటారు పక్కన నేను లేకపోతే అందరూ ఏమనుకుంటారు వెళ్తాను కానీ నా కోసం కాదు తనకోసం అనుకుంటూ రెడీ అవ్వడానికి వెళ్తాడు. మరోవైపు నీట్ గా రెడీ అయిన అభి ఎలా ఉంది అని అడుగుతాడు.

అక్క కోసం ఆగుదామంటున్న అభి..

చాలా బాగుంది యువర్ లుకింగ్ హ్యాండ్సమ్ అంటుంది మాళవిక. నీ టేస్ట్ నాకు బాగా నచ్చుతుంది అంటాడు అభి. నువ్వు ఒక్కడివే పార్టీకి వెళ్ళటం ఏంటి నేను ఒక్కతినే ఇంట్లో ఉండలేను సో బోరింగ్ అంటుంది మాళవిక. నిన్ను వదిలి నేను ఎప్పుడైనా ఒంటరిగా వెళ్లాను కానీ నిన్ను చూస్తేనే అక్క మండిపడుతుంది అందుకని తను కూలయ్యేదాకా కొంచెం వెయిట్ చేద్దాము నన్ను పెళ్లి అయ్యేవరకు ఈ పార్టీలో అవి పక్కన పెట్టేద్దాము అంటాడు అభి.

మాటకి మొహం మాడుచుకున్న మాళవిక అని నువ్వు నవ్వుతూ పంపిస్తేనే వెళ్తాను లేకపోతే వెళ్ళను అని అభి అంటే వద్దులే హ్యాపీగా వెళ్ళిరా అని పంపిస్తుంది మాళవిక. మరోవైపు ఫోన్ ఎంతకీ కలవకపోవడంతో చిరాకు పడుతుంది వేద. అసలు ఆయన అక్కడ ఏం చేస్తున్నారు? వస్తున్నారు లేదు అంటూ టెన్షన్ పడుతుంది. ఇదంతా అబ్జర్వ్ చేస్తున్న విన్నీ ఎందుకు కంగారు పడుతున్నావు ఎన్నిసార్లు ఫోన్ చేసినా అవతల నుంచి రెస్పాన్స్ లేదా, పార్టీకి వచ్చావు కానీ మనిషివి ఎక్కడ మనసు ఎక్కడో అంటాడు విన్ని.

నా ట్రైన్ జీవితకాలం లేట్ అంటున్న విన్ని..

అలాంటిదేమీ లేదు తన ఫోన్కి సిగ్నల్స్ లేదనుకుంటాను ఫోన్ కలవట్లేదు అంటుంది వేద. ఒకరి కోసం ఒకరు ఎదురు చూడటంలో ఉండే బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు ఎందుకంటే కాలేజీ రోజుల్లో నాది కూడా సేమ్ పొజిషన్ కదా. ఫోన్ కాల్ కోసం ఎంతో ఎదురు చూసేవాడిని కానీ నువ్వు రెస్పాండ్ అయ్యేది అని కాదు. ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేటు అంటారు కదా నీ విషయంలో నేను అలాగే మిగిలిపోయాను నువ్వు రెస్పాండ్ అయి ఉంటే ఎంత బాగుండేది అంటాడు విన్ని.

ఇంక ఆపు అంటూ టాపిక్ కట్ చేసేస్తుంది వేద. పార్టీలో అందరూ ఈ పార్టీకి మీ వల్లే అందం వచ్చిందని అనుకుంటున్నారు అంటాడు విన్ని. ఈ ఫ్లర్ట్ చేయడం మానవా అంటే ఆశపడటం లో తప్పు లేదు కదా అంటాడు విన్నీ నేను ఇంకొకరి భార్యని అని వేద అంటే అబ్బా ఆ విషయం గుర్తు చేయకు అంటూ చిన్నగా నవ్వుతాడు విన్ని. నన్ను ఆట పట్టించకపోతే అక్కడ చాలామంది అమ్మాయిలు ఉన్నారు వాళ్ళతో మాట కలపవచ్చు కదా వాళ్ళందరూ నిన్నే చూస్తున్నారు నువ్వు తెగ నచ్చేసినట్లు ఉన్నావు అంటుంది వేద. నన్ను నచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ నాకు నచ్చిన అమ్మాయి దొరకటం లేదు అంటాడు విన్ని.

ఆలోచనలో పడిన వేద..

దొరకని దానికోసం ఆశపడకుండా దొరికిన దానికితో అడ్జస్ట్ అవ్వచ్చు కదా అని వేద అంటే అది చేతకాకే ఇలాగా మిగిలిపోయాను అంటాడు విన్ని. సరేగాని అక్కడ అమ్మాయిలు అందరూ నీకోసం వెయిట్ చేస్తున్నట్లుగా ఉన్నారు వెళ్లి వాళ్ళతో మాట్లాడు అంటూ అక్కడి నుంచి పంపించేస్తుంది వేద. విన్ని భార్యాభర్తల బంధం గురించి ఎంత బాగా మాట్లాడుతున్నాడు నాకు యశోదర్ కి ఉన్న బంధం అలాంటిదేనా అని ఆలోచనలో పడుతుంది వేద. మరోవైపు వేద నవ్వుతున్న ఫోటోని చూసి ఎంత బాగా నవ్వుతుందో నా బాధ చూసి తన ఇకో సాటిస్ఫై అయినట్టుగా ఉంది అనుకుంటాడు యష్.

నవ్వింది చాలు కానీ నేను అక్కడికి వస్తున్నాను కానీ అక్కడికి వచ్చిన తర్వాత నన్ను చూసి నవ్వకూడదు అనుకుంటాడు. రాను అన్నావ్ కదా మళ్లీ ఎందుకు వచ్చావు అని నీలాదీస్తే ఏమని చెప్పాలి అంటూ ఆలోచనలో పడతాడు. నాకు రావాలని లేకపోయినా వస్తున్నాను ఎందుకంటే నీ దగ్గర ఏమాత్రం తక్కువ కాకూడదని అనుకుంటూ రెడీ అవుతాడు యష్. మరోవైపు అదే పార్టీకి వచ్చిన అభిని కాంట్రాక్టు దక్కించుకున్నందుకు కంగ్రాట్స్ చెప్తాడు ఒక వ్యక్తి.

Ennenno Janmala Bandham February 7 Today Episodeవిన్నిని హెచ్చరించిన వేద..

అభి ని చూసిన వేద అతను ఎందుకు ఎక్కడికి వచ్చాడు అంటూ కంగారుగా అడుగుతుంది. అతను నీకు తెలుసా అని విన్ని అడిగితే అతని గురించి నీకు తెలియదా తను చాలా బాడ్ పర్సన్ అంటుంది వేద. పర్సనల్గా అతను ఎలాంటి వాడు అయినా బిజినెస్ పరంగా అతనితో నాకు అవసరం ఉంది అంటాడు విని. అసలు అతను కరెక్ట్ పర్సన్ కాదు అతని వల్ల నువ్వు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తావు అంటుంది వేద.నీ బెస్ట్ ఫ్రెండ్ గానే నీ విన్నీ నీకు తెలుసు కానీ బిజినెస్మేన్ గా నాకు ఇంకొక యాంగిల్ ఉంది అంటాడు విన్నీ.

నీ బెస్ట్ ఫ్రెండ్ ని కాబట్టి నీకు చెప్తున్నాను అతనితో ప్రాబ్లమ్స్ వస్తాయి జాగ్రత్త అని హెచ్చరిస్తుంది వేద. ఇలాంటి వాళ్ళని చాలామందిని చూశాను వదిలేయ్ అంటాడు విన్ని. వెళ్లి అభిమన్యుని గ్రాండ్ గా రిసీవ్ చేసుకుంటాడు విన్ని. కొంచెం లేటుగా వచ్చారు అని అంటే లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వస్తాను అంటాడు అభి. మా ఫ్రెండ్స్ ని ఎందుకు చేస్తాను చూడండి అంటూ తీసుకొని వెళ్తాడు విన్ని. తరువాయి భాగంలో తనకోసం పార్టీకి వచ్చిన యస్ ని చూసి ఆనందంతో అతన్ని హగ్ చేసుకుంటుంది వేద.

Akashavani

Hai I'm Akashavani, Film Journalist. I breathe and live entertainment. I love to watch serials and films from childhood-now I get paid for it. I worked in a few top media houses such as News18 Telugu,...