Ennenno Janmala Bandham January 12 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో సాంప్రదాయ దుస్తుల్లో ఒకరిని ఒకరు చూసుకొని తన్మైత్వంలో ఉండిపోతారు వేద దంపతులు. పూజ ప్రారంభించిన పంతులుగారు ఒకరి చేత ఒకరికి తోరాలు కట్టిస్తారు. అత్యంత భక్తిశ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించాలి స్వామివారికి దండం పెట్టుకోండి అని చెప్పి పంతులుగారు పూజ స్టార్ట్ చేస్తారు.
ప్రమాణాలకి అర్థం చెప్తున్న రాజా దంపతులు..
ఇప్పుడు దాంపత్య కలసపూజ అని చెప్పి కలశానికి పూజ చేయమంటారు పంతులుగారు. ఈ వ్రతం పూర్తయిన తర్వాత ఈ పెళ్లి సందర్భంగా మీరు మీ భార్యకి చేసిన ప్రమాణాన్ని మళ్లీ పలకండి అని ధర్మేచ, అర్దేచ మంత్రాన్ని చదివిస్తారు పంతులుగారు. దీనికి అర్థం తెలుసా అని అడుగుతాడు రాజా. కష్టాల్లో నష్టాల్లో సుఖంలోని దుఃఖంలోని, నీ చేయి వదలనని నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటానని మీ భార్యకి నువ్వు మాట ఇస్తున్నట్లు అర్థం. నీ భార్య కూడా నీకు అదే మాట ఇస్తున్నట్టు లెక్క అంటుంది రాణి.
ఇది తూచా తప్పకుండా భార్యాభర్తలు ఆచరించవలసిన వ్యవహారం. భర్త ప్రాణం అయితే భార్య ఊపిరి. అదే అవినాభావ బాంధవ్యం. అర్ధనారీశ్వర తత్వం అంటే ఇదే రాజా. భార్యాభర్తలిద్దరికీ కొంగుముడి ఆశీర్వదిస్తారు పంతులుగారు. మీ అమ్మమ్మ తాతయ్యలా ఆశీర్వచనం తీసుకోమంటూ మంత్రాలు చదువుతారు పంతులుగారు. ఏ కొంగుముడి బ్రహ్మముడి ఇద్దరు మనుషులని, రెండు మనసులని ఏకం చేసే అన్యోన్య దాంపత్య బంధం అని చెప్తాడు రాజా.
మళ్లీ ఏడు అడుగులు వేసిన వేద దంపతులు..
నీ భార్య గారి చిటికెలు వేలు పట్టుకొని ఏడు అడుగులు నడిచి స్వామివారికి భక్తిగా నమస్కరించుకోండి అని చెప్తారు పంతులుగారు. పెద్దవాళ్ల సాక్షిగా మళ్లీ ఏడు అడుగులు వేస్తారు వేద దంపతులు. వేసిన ఒక్కొక్క అడుగుకి అర్థం చెప్తారు రాజా రాణి. ఐదుగురు ముత్తైదువులకి వాయనాలు ఇచ్చి ఆశీర్వచనం తీసుకో అంటారు పంతులుగారు. మొదట వాయినం రాణికే ఇప్పిస్తారు పంతులుగారు. వ్రతం పూర్తయింది అంటూ ప్రసాదం చేతిలో పెడతారు పంతులుగారు.
దంపతులు ఇద్దరు తమ మనసులో కోరికల్ని ఆ భగవంతునితో చెప్పుకోండి తప్పకుండా నెరవేరుతాయి అని చెప్తారు పంతులుగారు. నా మనసు గాయమైన సమయంలో నాకు అండగా నిలబడింది తను. కానీ మా ఇద్దరి బంధానికి రాసుకున్న పేరు ఒప్పందం. కానీ నాకు ఇప్పటి పరిస్థితుల్లో అర్థమవుతుందేంటంటే ఇది ఒప్పందం మాత్రమే కాదు భార్యాభర్తల బంధం అని.
మన మధ్య ఉన్నది కేవలం ఒప్పందం మాత్రమే కాదు అంటున్న యష్..
ఈరోజు చేసే ఈ వ్రతం ఎవరికోసమో కాదు నా మనస్ఫూర్తిగా నేను చేసింది ఎందుకంటే నేను వేదని నా భార్యగా మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను కానీ తనకి ఎలా చెప్పటం అని అనుకుంటాడు యష్. నేను నా భర్త యశోదర్ ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నేను నా భర్తకి దగ్గర అవ్వాలి అనుకుంటున్నాను కానీ ఎలా చెప్పడం అనుకుంటుంది వేద.
అన్ని కార్యక్రమాలు అయిన తర్వాత మెట్ల మీద కూర్చొని భర్తకి ప్రసాదిస్తుంది వేద. మన ఇద్దరి పెళ్లి అందరూ అనుకున్నట్లు బంధం కాదు మనిద్దరం చేసుకున్న ఒప్పందం. కానీ ఈ ఊరు వచ్చిన దగ్గరనుంచి నా మనసు కొత్తగా ఆలోచిస్తుంది. ఈ అభిమానాలు ఆత్మీయతలు చూశాక, వ్రతం చేశాక మొదటిసారి ఏదో అలజడి చెలరేగుతుంది. మన కొంగుముడి సప్తపది ఇవన్నీ చూస్తే మన మధ్య ఒప్పందం మాత్రమే కాదు అంతకుమించి ఇంకేదో ఉంది అనిపిస్తుంది.
మళ్లీ ఫూల్ అవలేను అంటున్న వేద..
మనది అన్యోన్యమైన దాంపత్య బంధం నువ్వేమంటావు అంటాడు యష్. థాంక్యూ యశోద గారు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు నాకోసం ఏమైనా చేస్తాను అన్నారు. ఈరోజు ఈ వ్రతం కూడా చేశారు. మనం ఏమి చేసినా ఖుషీ కోసమే, మనం వ్రతం చేసాము అంటే అది భార్యాభర్తలు గా చేశామని వాళ్ళు అనుకుంటున్నారు కానీ నిజం మనకు మాత్రమే తెలుసు కేవలం ఖుషి తల్లిదండ్రులుగా మాత్రమే చేసాం అంటుంది వేద.
ఆ మాటలకి షాక్ అయిపోతాడు యష్. ఈ వ్రతం చేయటం వల్ల ఏదైనా మంచి జరిగింది అంటే అది ఖుషికే దక్కుతుంది. మనకు కావాల్సింది అదే కదాఅని యష్ తో అంటుంది మీరు మళ్లీ నన్ను ఆటపట్టించాలని కొత్త నాటకం మొదలుపెట్టారు. ఈ మాత్రం తెలివితేటలు నాకు ఉన్నాయి ప్రతిసారి నేను ఫోన్ కాలేను అనుకుంటుంది వేద. ఇంటికి వచ్చిన తర్వాత మా ఇద్దరి మధ్య ఈ దోబూతులు ఎన్నాళ్ళు నన్ను ఆయన అర్థం చేసుకోవట్లేదు అయినా నాకు అర్థం కావట్లేదు.
Ennenno Janmala Bandham January 12 Today Episode: కన్ఫ్యూషన్ లో ఉన్న వేద..
ఒక అమ్మాయి అబ్బాయి భార్య భర్తలయ్యాకే అమ్మానాన్నలవుతారు. కానీ మేము మాత్రం అమ్మానాన్నలు అవటం కోసమే భార్యాభర్తలు అయ్యాం. మా ఇద్దరి మధ్య ఉన్నది ఒప్పందంగా మొదలైన బంధమా, బంధంగా అభిమాని ఒక ఒప్పందమా ఏమి అర్థం కావట్లేదు అనుకుంటుంది వేద. అంతలోనే రాణి బంగారాన్ని పిలిచి పడకగదిని అలంకరించమంటుంది.
ముత్యాలని పిలిచి మల్లెపూలు అవి కట్టించి ధూపాలు అవి వెలిగించ మంటుందిఏంటమ్మమ్మా హడావుడి చేస్తున్నావు అంటుంది వేద. నువ్వు ఇక్కడే ఉన్నావా హడావుడి మరి ఈరోజు మీ శోభనం కదా అంటుంది రాణి. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.