Ennenno Janmala Bandham January 16th Today’s Episode: వేద గదిలో నుంచి బయటకు వచ్చి గుడ్ మార్నింగ్ తాతయ్య గుడ్ మార్నింగ్ అమ్మమ్మ ఆయన్ని అప్పుడే లేపొద్దు నేను స్నానం చేసిన తర్వాత వచ్చి లేపుతాను అని అనగా పోనీలే ఇప్పటివరకు కలిసినట్టు నటించిన ఇప్పటికైనా కలిశారు అని రాజా అనుకుంటాడు. పక్కనే ఉన్న రాణి లేదు వాళ్లు కలవలేదు అని తను చూసిన విషయం అంతా చెప్తుంది.
వీళ్ళు ఎందుకు ఇలా నటిస్తున్నారు వీళ్ళ సమస్య ఏంటసలు వీళ్ల సమస్య ఏంటో వీళ్లకు కూడా తెలియడం లేదు అని అనుకుంటూ వడి బియ్యం వేసే కార్యక్రమానికి సిద్ధమవుమ్మా అని అంటాడు రాజా. తర్వాత వేద పూజ చేస్తూ ఉండగా పక్కనే ఉన్న ముత్యాలు ఒక మంచి బిడ్డను కనుమ్మ అని అంటుంది. అప్పుడు రాణి మా ముత్యాలు మాటల్లో ఒక ముత్యం లాంటి మాట బయటకు వచ్చింది.
పండంటి బిడ్డని కనాలి అని దీవించిన రాణి..
నీకు పిల్లలు పుట్టే అవకాశం కొంచెం శాతం ఉందని మీ అమ్మ చెప్పింది అదే నిజమవ్వాలి అని కోరుకుంటున్నాను అని చిన్నికృష్ణుని బొమ్మను వేదకు ఇచ్చి దీవిస్తుంది రాణి. తర్వాత వేద యష్ దగ్గరకు వెళ్లి ఆశీర్వాదం తీసుకుంటుంది యష్ దీవించిన తర్వాత ఇద్దరూ రాజారాణిల దగ్గరికి వెళ్లి ఆశీర్వాదాలు తీసుకుంటారు.వాళ్ళని దీర్ఘ సుమంగళి భవ అని దీవిస్తారు. ఆ తర్వాత సీన్లో మాళవిక స్నానం చేసి అద్దం దగ్గర నించొని చూడగా అక్కడ తన కాస్మెటిక్స్ అన్ని మాయమవుతాయి.
భ్రమరాంబిక మీద కోపంతో మాళవిక..
పనిమనిషి దగ్గరికి వచ్చినా కాస్మెటిక్స్ ఎవరు తీశారు అని అనగా పెద్దమ్మ గారి తీసి పారేయమన్నారు అని అంటుంది. తీపించడానికి తనెవరు తీయడానికి నువ్వు ఎవరు అని కోపంగా అంటూ అభి అని పిలుస్తుంది మాళవిక. జరిగిన విషయం అంత చెప్పగా ఇప్పుడు మీరు మీరు మంచి ఫ్రెండ్స్ అయ్యారు కదా మధ్యలో నాకెందుకు అని అంటాడు. అది ఇంతలో భ్రమరాంబికా వచ్చి అసలు మాలవిక ఎవరు అభి అని అంటుంది.
వదిన అని పిలవమన్న భ్రమరాంబిక..
ఆ మాటలుకు అభి మాలవికలు ఆశ్చర్యపోతారు. మాళవిక మన ఇంటి గెస్ట్ అలాంటి గెస్ట్ ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి అంత చీప్ కాస్మెటిక్స్ వాడుతుంటే నువ్వు ఏం చేస్తున్నావు అందుకే అవన్నీ పారేసి ఒక మంచి సెట్ అమెరికా నుంచి తీసుకు వస్తున్నాను. ఒక్క రోజుకి ఓపిక పట్టు అని అంటుంది దానికి మాలవిక అయ్యో పర్లేదు మేడం అని అంటుంది. మేడం ఎందుకు వదిన అని పిలు అని అనగా అలాగే వదినా అని అంటుంది మాళవిక.
తర్వాత అభి ఎక్కడ నుంచి వెళ్ళిపోతాడు.అప్పుడు బ్రమరాంబికా మాళవిక దగ్గరకు వెళ్ళి అసలు నువ్వు ఎవరు? మీ కుటుంబం ఏం చేస్తూ ఉంటుంది? నువ్వు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నావు? అని అన్ని విషయాలు అడగగా ఈ విషయాలు నాకన్నా మీకు అభి చెప్తేనే మంచిది అప్పుడే మీకు అన్ని అర్థమవుతాయి అని చెప్పి అక్కడి నుంచి నవ్వుతూ వెళ్ళిపోతుంది.
ఇది నేను అనుకున్న దానికన్నా తెలివైనదే అనుకున్న బ్రమరాంబిక..
ఇది నేను అనుకున్నంత తెలివి తక్కువ ధేమీ కాదు ఇలా ఇండైరెక్టుగా కాకుండా డైరెక్ట్ గా అడగాలి అని అనుకుంటుంది భ్రమరాంబిక. ఆ తర్వాత సీన్లో వేదా యష్ లు ఇంటికి బయలుదేరడానికి సిద్ధమవుతారు. ఇంతలో వసంత్ ఫోన్ చేయగా నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను రేపు ఆఫీస్ కి వచ్చేస్తాను మీటింగ్లు అన్ని చూసుకొ అని ఫోన్లో చెప్తాడు.
Ennenno Janmala Bandham January 16th Today’s Episode యష్ తో తన చివరి కోరిక చెప్పుకున్న రాజా..
తర్వాత రాజా,యష్ తో వేద ఆనందంగా ఉండటమే నాకు కావాలి మీరిద్దరూ జీవితాంతం కలిసి ఉండాలి మీరిద్దరూ ఇక్కడ ఎంత ఆనందంగా ఉన్నారో మిగిలిన జీవితం కూడా అంతే ఆనందంగా ఉండాలి. ఇదే మా ఆకరి కోరిక అని అనగా అలాగే ఉంటాము అని అంటాడు. ఇంట్లో నుంచి బయటకు వస్తున్నప్పుడు వాళ్ళు ఇంట్లో గడిపిన తీపి క్షణాలు అన్ని గుర్తుతెచ్చుకుంటూ ఉంటారు.
ఇంటికి బయలుదేరిన వేద దంపతులు..
కారు ఎక్కుతూ ఉండగా వేద తిరిగి వచ్చి రాజారాణిలను గట్టిగా హద్దుకొని క్షమించండి అమ్మమ్మ తాతయ్య మీ దగ్గర నటించాల్సి వచ్చింది అని అనుకుంటుంది. ఏమమ్మా బెంగ పెట్టుకున్నావా అని రాణి అనగా దుర్ముహూర్తం వచ్చేస్తుంది త్వరగా బయల్దేరండి అని రాజా అంటాడు. తర్వాత వాళ్ళిద్దరూ అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. తరువాయి భాగంలో ఈ యష్,వేదలు ఇంటికి రాగా ఖుషి వాళ్ళను వెళ్లి హత్తుకోవడాన్ని చూపిస్తారు.