Ennenno Janmala Bandham January 17 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో రాకరాక పిల్లలు వచ్చారు అనుకుంటే, ఆనందం కోసమా వాళ్ళు ఇలా నటించారు అంటాడు రాజా. భార్యాభర్తల మధ్య ఎంత ప్రేమ అభిమానాలు ఉన్న పడక మంచం మీద ఇద్దరు ఒకటి కానప్పుడు వాళ్ళ మధ్య దూరం ఉన్నట్టే అంటుంది రాణి. నేను గమనిస్తున్నాను వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రేమ గౌరవం ఉన్నాయ్. వాళ్లు మనకోసమే నటించి ఉండొచ్చు కానీ అందులో ఉన్న నిజాన్ని వాళ్లు అర్థం చేసుకోలేకపోతున్నారు.

అసలు విషయం సులోచనకు చెప్పొద్దు అంటున్న రాజా..

ముందు ఉన్న కాలం నటనలో నుంచి నిజాన్ని బయటకు తీసి వాళ్లని ముందుకు నడిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలోనే ఉన్న దూరం అప్పుడు ఉండదు. ఇప్పుడే ఈ విషయం సులోచనకి చెప్పొద్దు ఎందుకంటే వాళ్ళిద్దర్నీ కలుపుతామని మాట ఇచ్చాం. అలా జరగలేదని తెలిస్తే బాధపడుతుంది ఎప్పుడు చెప్పాలో ఆలోచించి నిర్ణయం తీసుకుందాం అంటాడు రాజా. మరోవైపు కారులో వెళ్తున్న వేద ఒకటవుదామని వచ్చాము కానీ మా మధ్య ఒప్పందం తప్పితే ఏమీ మిగల్లేదు అంటూ కన్నీరు పెట్టుకుంటుంది.

అది గమనించిన యష్ అమ్మమ్మ వాళ్ళ ఊరు వదిలి వెళ్ళిపోతున్నందుకు బాధపడుతున్నావా అంటాడు. అలాంటిదేమీ లేదు కంట్లో నలక పడింది అంటుంది వేద. మళ్లీ మనసులో తనకు తానే అసలు ఆయన మనసులో నేను ఉన్నానా లేకపోతే అప్పటివరకు భర్త లాగా ప్రవర్తించి చివరికి నటన అనరు కదా, నేను ఆయన గురించి ఎక్కువ ఆలోచిస్తున్నానా లేకపోతే ఆయన నా గురించి అస్సలు ఆలోచించట్లేదా? మేము కలిసి ప్రయాణం చేస్తున్నావా విడివిడిగా ప్రయాణం చేస్తున్నామా అంటూ కన్ఫ్యూజ్ అవుతుంది వేద.

డాక్టర్ని కన్సల్ట్ చేసిన మాళవిక..

మరోవైపు రాజా అన్న మాటలు తలుచుకుంటాడు యష్. నిజంగానే గ్రాండ్పా చెప్పినట్లు అసలు తన మనసులో నేను ఉన్నానా? నాతో భార్యగా జీవించటానికి తను సిద్ధంగా ఉందా అనుకుంటాడు. మరోవైపు ఫేస్ మీద పింపుల్స్ ఎక్కువైపోయాయని డాక్టర్ ని కన్సల్ట్ చేస్తుంది మాళవిక. అటువైపు నుంచి డాక్టర్ 2 లాక్స్ అడుగుతాడు. మనీ ప్రాబ్లం కాదు అంటూ ఫోన్ పెట్టేస్తుంది మాళవిక.

అప్పుడే అక్కడికి వచ్చిన బ్రమరాంబిక మాట్లాడుతున్నావు అని అడుగుతుంది. ఫేస్ ట్రీట్మెంట్ కోసం అని మాళవిక అంటే నిజమే మన ఆడవాళ్ళకి అందమైన ముఖం కదా కానీ ఆ ఖర్చు పెట్టే సొమ్ము కూడా మందైతే ఇంకా బాగుంటుంది భ్రమరాంబిక. చాలా కష్టపడి డబ్బులు సంపాదిస్తాం కదా, అంత ఈజీగా డబ్బులు ఖర్చు పెట్టడం మంచిది కాదు కదా అని అంటుంది భ్రమరాంబిక. ఇంతకీ నేను తెచ్చిన కాస్మెటిక్స్ నచ్చాయా అంటూ టాపిక్ మార్చేస్తుంది భ్రమరాంబిక.

మాళవిక ని అవమానించిన భ్రమరాంబిక..

చాలా బాగున్నాయి నాకోసం తీసుకొచ్చినందుకు థాంక్స్ అంటుంది మాళవిక. నీకు అభ్యంతరం లేకపోతే నాకు నెయిల్ పాలిష్ వేస్తావా అంటుంది మాళవిక. తప్పకుండా, కూర్చోండి అంటూ నెయిల్ పాలిష్ తీస్తుంది మాళవిక. హ్యాండ్ కి హెయిర్ ఫాల్స్ వేసుకుంటే కాదు నా కాళ్ళకి వెయ్యు అంటూ తన పాదాలని ఇస్తుంది భ్రమరాంబిక. కాళ్ళని చూసి మొహమాటపడుతున్న మాళవికని నా కాళ్లు పట్టుకోవడానికి నీకు ఏమైనా ఇబ్బందా అని అడుగుతుంది భ్రమరాంబిక.

అలాంటిదేమీ లేదు అని మాళవిక అంటే అయితే స్టార్ట్ చెయ్యు అంటుంది భ్రమరాంబిక. మా యూఎస్ కంపెనీలో నా పిఏ జాబ్ కి ఒక అమ్మాయికి ఫోన్ ఇంటర్వ్యూ చేయాలి. నువ్వు నైల్ పోలిష్ వేసే లోపు ఆ ఇంటర్వ్యూ చేయమంటావా అంటుంది భ్రమరాంబిక. అలాగే వదిన అంటుంది మాళవిక. బంగారం ఫోన్ లో ఆ క్యాండిడేట్ పేరు మాళవిక. బంగారం ఆ అమ్మాయి పేరు నీ పేరెనంట అంటుంది భ్రమరాంబిక. ఆ అమ్మాయితో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతుంది భ్రమరాంబిక.

మళ్లీ గొడవ పడుతున్న మాలిని, సులోచన..

నువ్వు పాత కంపెనీలో పని చేసావా నాకు సెకండ్ హ్యాండ్ వద్దు, ఫ్రెష్ కాండిడేట్ కావాలి. ఇద్దరు పిల్లల తల్లి మళ్లీ పెళ్లికి రెడీ అయినట్టు నాకు పాత డబ్బులు అంటే అసహ్యంగా పెట్టెయ్ ఫోన్ అంటుంది బ్రమరాంబిక. ఫోన్ పెట్టేసిన తను నువ్వు ఇంకా నా కాళ్ల దగ్గరే ఉంటే నా పెంపుడు కుక్క గుర్తొస్తుంది అంటుంది. ఆ మాటకి షాక్ అవుతుంది మాళవిక. దాని పేరు టామీ అదంటే నాకు చాలా ఇష్టం. తమాషా ఏంటంటే దాన్ని కూడా నేను బంగారం అని పిలుస్తాను అంటూ ఇన్సెంటింగ్ గా మాట్లాడుతుంది భ్రమరాంబిక.

మరోవైపు వేద, యష్ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళ కుటుంబ సభ్యులు. ఇంత కంగారు అవసరమా సులోచన అంటాడు ఆమె భర్త. వచ్చేది నా అల్లుడు నాకు ఆ మాత్రం కంగారు ఉండదా అని సులోచన అంటే వచ్చేది నా కోడలు నాకు మాత్రం కంగారు ఉండదా అంటూ గొడవ పడతారు మాలిని వాళ్ళు. గొడవపడ్డలో గిన్నిస్ రికార్డు ఏదైనా ఉందా అని సులోచన భర్త అడిగితే అలాంటిదేమైన ఉంటే వీళ్లకు ఇవ్వకుండా ఉంటారా అంటూ నవ్వుతాడు రత్నం.

యష్ మాటలు కి ఎమోషనల్ అయిన వేద..

మరోవైపు పడుకోని లేచిన లేదా ఎక్కడ వరకు వచ్చాము అని అడిగితే ఇంకొక గంటలో ఇంటికి వెళ్ళిపోతామంటాడు యష్. కాఫీ తాగుదామా అని యష్ అడిగితే మీ ఇష్టం ఉంటుంది వేద. ఒక పక్కగా కార్ ఆపి తన కాపీ తెచ్చుకొని వేద కూడా కాఫీ తెస్తాడు. నువ్వు ఏమి అనుకోకపోతే నేను ఒక మాట చెప్తాను అంటూ చెప్పడం ప్రారంభిస్తాడు యష్. మీ ఇంట్లో వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు హ్యాపీగా తిరిగి వస్తున్నామని అనుకుంటారు అంటే మనం హ్యాపీగానే ఉన్నాం అనుకో అది వేరే విషయం కానీ వాళ్ళు ఏమో హోప్స్ పెట్టుకుంటారు కదా, ఎమోషన్ వాళ్లది అలా అని వాళ్ళని హార్ట్ చేయలేం కదా.

వాళ్లకి మనం అండర్స్టాండింగ్ తెలియనియద్దు. బ్రాండ్ పవర్ దగ్గర ఎలాగా హ్యాక్ చేసామో ఇకపై ఇక్కడ కూడా అలాగే చేయాలి అంటాడు యష్. ఇది నిజం కావాలని నేను అనుకుంటున్నాను కానీ మీరు ఒకటి పదిసార్లు నటన నటన అంటూ నా నిజానికి నన్ను దూరం చేస్తున్నారు అంటూ బాధపడుతుంది వేద. కారు దిగి బాధపడుతున్న వేద దగ్గరికి వచ్చి ఏమైంది అని అడుగుతాడు యష్.

Ennenno Janmala Bandham January 17 Today Episode: ఖుషి ఇచ్చిన తీర్పు..

ఇంట్లో వాళ్ళ దగ్గర నటించాలని నాకు తెలియదా, ఎవరి సంతోషంగా ఉన్నారు ఎవరు బాధపడుతున్నారు ఇవేవీ మీకు తెలియదు కానీ నాకు తెలుసు. నేను సంతోషంగా ఉన్నా లేకపోయినా ఎదుటి వాళ్ళ సంతోషం కోసం ముఖ్యంగా నా ఖుషి సంతోషం కోసం నేను ఏమైనా చేస్తాను. చాలా ఇంకేమైనా చెప్పాలా అంటుంది వేద. ఎమోషనల్ అవ్వద్దు అంటూ భార్యని ఓదార్పుతాడు యష్. ఈ టాపిక్ నేను ఇలా తెచ్చి ఉండకూడదు ఐ యాం సారీ అంటాడు యష్.

మీరు ప్రేమగా టచ్ చేస్తే ఓకే కానీ ఓదార్పుగా టచ్ చేస్తే మాత్రం భరించలేను అనుకుంటూ ఇక్కడ కూడా నటించవలసిన అవసరం లేదు అంటూ కోపంగా కారులో కూర్చొని త్వరగా వెళ్దాం మళ్లీ మనం యాక్ట్ చేయడానికి టైం అయింది. మన యాక్టింగ్ కోసం ఇంట్లోవాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు అంటూ కోపంగా మాట్లాడుతుంది వేద. మరోవైపు నేను దిష్టి తీస్తాను అంటే నేను దిష్టి తీస్తాను అని మాలిని వాళ్ళు గొడవ పడుతూ ఉంటారు. ఇద్దరూ కలిపి దిష్టి తీయండి అంటూ తీర్పు ఇస్తుంది ఖుషి. అంతలోనే వచ్చిన తల్లిదండ్రుల దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. తర్వాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జనవరి 17, 2023 at 12:50 సా.