Ennenno Janmala Bandham January 18 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో ఇంటికి వచ్చిన వేద దంపతులకు హారతి ఇచ్చి ఆహ్వానిస్తారు మాలిని,సులోచన. ఆనందంతో ఖుషి ఇద్దరినీ హత్తుకుపోతుంది. ప్రయాణం బాగా జరిగిందా అని ఒకరు అడిగితే మీ అమ్మమ్మ వాళ్ళింట్లో బాగా ఎంజాయ్ చేశారా అని రత్నం అడుగుతాడు. ఈ పూట భోజనం మా ఇంట్లోనే అంటుంది సులోచన. మా ఇంట్లోనే భోజనం చేయాలి అంటుంది మాలిని.

అది మా సాంప్రదాయం అంటున్న సులోచన..

అది కాదు అన్నయ్యగారు మా వేద వొడి బియ్యంతో వచ్చింది ఆ బియ్యంతో వండుకొని పుట్టింట్లోనే తినాలి అంటుంది సులోచన. సరే సాంప్రదాయంలో కాబట్టి ఊరుకుంటున్నాను. సాయంత్రం మాత్రం మా కోడలు మా ఇంట్లోనే భోజనం చేస్తుంది అంటుంది మాలిని. అత్తయ్య మీరు మా ఇంటికి భోజనానికి వచ్చేయండి అందరివి ఇక్కడే భోం చేద్దాం అంటుంది వేద. సాయంత్రం మీరందరూ ఎక్కడికి వచ్చేయండి అంటాడు యష్.

నా కోడలు బంగారం అత్తగారికి ఎంత మర్యాద ఇస్తుందో అని మాలిని అంటే నా అల్లుడు బంగారం అని సులోచన అంటుంది. మళ్లీ ఇద్దరూ వాదన ప్రారంభిస్తారు. సీన్ కట్ చేస్తే ఒడి బియ్యం దేవుడి ముందు పెట్టి ఇది మా అమ్మమ్మ తాతయ్య ఆశీర్వాదం వీటి వల్ల మీ అందరిని బాగోవాలి అని దేవుడికి దండం పెట్టుకుంటుంది వేద. నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అని సులోచన అంటే నీ ఆలోచన నాకు అర్థమైంది మేము అక్కడికి వెళ్ళాక ఏకమయ్యావని అనుకుంటున్నావు కానీ నువ్వు అనుకుంటున్నది అబద్ధం.

నా గుండెల్లో భారం దిగిపోయింది అంటున్న సులోచన..

నీ బాధ నిజం అనుకుంటుంది వేద. అమ్మమ్మ తాతయ్య వాళ్ళు బాగా చూసుకున్నారు అని వేద అంటే వాళ్ళకి నువ్వంటే ప్రాణం నీకు అంతా మంచే జరుగుతుంది. అక్కడ కార్యం బాగా జరిగిందా నువ్వు అల్లుడు హ్యాపీ కదా అంటుంది సులోచన. మళ్ళీ తనే హ్యాపీగానే ఉంటుందిలే ఎందుకంటే వెళ్ళింది మా అమ్మానాన్న దగ్గరికి కదా, వాళ్ల ప్రేమ వాళ్ళనే కరిగించేస్తుంది అలాంటిది మిమ్మల్ని కరిగించడం ఇన్నాళ్ళకి నా గుండెల్లో భారం దిగిపోయింది అని రిలాక్స్ అవుతుంది సులోచన.

ఈ లోపు ఖుషి వచ్చి వేద ని తీసుకొని రూమ్ కి వెళ్ళిపోతుంది. మంచం మీద ఉన్న తన చీరని చూసి ఏంటి ఇవన్నీ ఇక్కడ అని అడుగుతుంది. ఇవి పక్కన పెట్టుకొని పడుకుంటే మీరిద్దరూ నా పక్కనే ఉన్నట్లుగా అనిపించేది అని ఖుషి అంటే మరి మమ్మల్ని మిస్ అవ్వలేదు అన్నావు అంటుంది వేద. అలా అన్నాను కానీ నిజానికి మిమ్మల్ని మిస్ అయ్యాను ఐ మిస్ యు అమ్మ అంటుంది ఖుషి. మీ టు అంటూ హగ్ చేసుకుంటుంది వేద.

చిత్రకి ఆల్ ద బెస్ట్ చెప్పిన తల్లి కూతుర్లు..

అంతలోనే అక్కడికి వచ్చిన చిత్ర నాకు మంచి కంపెనీలో ఆఫర్ లెటర్ వచ్చింది కంగ్రాట్స్ చెప్పు అంటుంది. నువ్వు వేరే కంపెనీలో చేయటం ఎందుకు మీ బావగారు కంపెనీ ఉంది కదా అంటుంది వేద. ఇక్కడ ఆల్రెడీ వసంత్ ఉన్నాడు కదా అక్క అయినా నా ఓన్ టాలెంట్ మీద నేను జాబ్ తెచ్చుకుంటే అదే నాకు సాటిస్ఫాక్షన్. దట్ ఇస్ మై సిస్టర్ అంటుంది వేద. మరి పెళ్లి ఎప్పుడు హనీ వేద అడిగితే ఈరోజుల్లో ఒకరి జీతంతోనే ఇల్లు గడవదు, అందుకే నాకు కూడా జాబ్ వచ్చాక పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాం అంటుంది చిత్ర.

ఆల్ ద బెస్ట్ చెప్తారు వేద,ఖుషి. మరోవైపు వదిన గారు చేసిన అవమానాన్ని తలుచుకుంటూ కోపంతో రగిలిపోతుంది మాళవిక. అప్పుడే వచ్చిన అభి ఎందుకు అర్జెంట్గా రమ్మని మెసేజ్ పెట్టావు అంటాడు. అప్పుడు జరిగిందంతా చెప్పింది మాళవిక. నాతో మమ్మీ అక్క అలా బిహేవ్ చేయడం కరెక్టా అని వేద అడిగితే కాళ్ళకి నైల్ పాలిష్ పెట్టడం తప్పా అంటాడు అభి. అది తప్పు అనట్లేదు కానీ నన్ను పోల్చుతూ ఇంకెవరు తిడుతుంది అది నాకు నచ్చలేదు అంటుంది మాళవిక.

కోపంతో రగిలిపోతున్న మాళవిక..

కానీ దానివల్ల మనకొచ్చిన నష్టం ఏమీ లేదు అంటాడు అభి. ఈ ముసుగులో గుద్దులాట ఎందుకు డైరెక్ట్ గా వెళ్లి మన గురించి ఓపెన్ అయిపో, నేను గెస్ట్ ని కాదని మనం లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నామని త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నామని కొండ బద్దలు కొట్టు. నేను ఈ టెన్షన్ తట్టుకోలేక పోతున్నాను అని మాళవిక అంటే మా అక్క నిన్ను టెస్ట్ చేస్తుంది. ఇందులో నువ్వు 100% ఇంప్రెస్ చేసావ్ అనుకో తన ఆస్తి మొత్తం నీకే రాసేస్తుంది.

నాకు మీ అక్కని నమ్మాలి అనిపించట్లేదు అని మాళవిక అంటే మా అక్క గురించి నాకు తెలుసా నీకు తెలుసా తను పైకి అలా ఉంటుంది కానీ తన మనసు వెన్న లాంటిది కొంచెం వేడి చేస్తే కరిగిపోతుంది. ఇన్నాళ్లు తాగాం కొంచెం వెయిట్ చేద్దాం ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తాడు. ఎన్నిసార్లు ఓర్చుకోమంటావు ఈ ఎంక్వయిరీలు అవి ఏంటి,నాతో మంచిగా ఉంటే నన్ను తొక్కేయాలని చూస్తుంది మీ అక్క. అయినా మీ అక్క దగ్గర ఓపెన్ అయిపోతే ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా నీకోసం ఎన్ని వదులుకొని వచ్చాను అవి నాకు దక్కేలాగా లేవు నా బాధ నీకు అర్థం అవుతుందా అంటూ కోప్పడుతుంది మాళవిక.

భయంతో వణికి పోతున్న అభి..

గట్టిగా అరవకు అక్క వింటుంది అని అభి అంటే ఎన్నాళ్ళని దాస్తావు ఎప్పుడో ఒకరోజు కుండ బద్దలవుతుంది అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మాళవిక. ఈ మాటలు అన్నీ పక్కనుంచి వింటున్న కైలాష్ ఎన్నాళ్ళు మీ అక్క ముందు ఏమీ లేనట్లుగా నటిస్తారు. వాడి వల్ల మనకి ఏమైనా ఇబ్బంది వస్తుందేమో అని ఆలోచన కూడా లేదు ఇద్దరికీ, ఈ విషయం స్వయంగా నేనే మీ అక్కకి చెప్పేస్తే నాకేమైనా ఉపయోగం ఉంటుందేమో. అది సొంత అక్క దగ్గరే నటించి ఆస్తి కొట్టేయాలని చూస్తుంటే నేను నటించి ఆస్తి కొట్టేస్తే తప్పేముంది అనుకుంటాడు కైలాష్.

సీన్ కట్ చేస్తే విలేజ్ లో మీ ఇద్దరూ బాగా ఎంజాయ్ చేశారా అని అడుగుతుంది ఖుషి. మీ మమ్మీ బాగా ఎంజాయ్ చేసింది అంటాడు యష్. చెట్ల కింద ఉయ్యాల ఊగుతూ చేతులు నిండా గాజులు వేసుకొని నన్ను బాగా డిస్టర్బ్ చేస్తూ తను బాగా ఎంజాయ్ చేసింది అని నవ్వుతాడు యష్. మీ డాడీ మాత్రం తక్కువ తిన్నారా చెట్టు కింద బడబడా స్నానం చేశాడు ఆరు బయట పడుకున్నాడు. మా తాతయ్య చేతిలో చెస్ లో ఓడిపోయాడు మీ డాడీ. అలా అలా బానే ఎంజాయ్ చేసాం అంటాడు యష్.

కూతురితో ముచ్చట్లు చెబుతున్న వేద దంపతులు..

నువ్వు వస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాళ్లం అంటుంది వేద. మీరు అలా చెప్తుంటే నేను అక్కడే ఉండి ఎంజాయ్ చేస్తున్నట్లుగా ఉంది అంటుంది ఖుషి. అంతలోనే ఫోన్ రావడంతో కూతురికి చెప్పి ఆఫీస్ కి బయలుదేరుతాడు యష్. వేద కూడా నేను క్లినిక్ వెళ్తాను సాయంత్రం వచ్చాక కబుర్లు చెప్పుకుందాం అంటుంది. రెడీ అయ్యి వెళ్ళబోతున్న వేదని ఆపి థాంక్స్ చెప్తాడు యష్. ఎందుకు బాగా నటిస్తున్నందుకా అంటుంది వేద. మీకు కూడా థాంక్స్ నాకన్నా మీరు బాగా నటిస్తున్నారు అంటుంది వేద.

మనం నటిస్తున్నది అందరి కోసం కదా అంటాడు యష్. అందరూ అంటే అందులో నేను లేదా ఇలా ఎన్ని రోజులు అని వేద అడిగితే తెలియదు అంటాడు యష్. నా మనసులో ఏముందో నీకు తెలుసా ఏముందో చెప్పండి అంటుంది వేద. ఖుషి ఉంది ఖుషి కోసమే నువ్వు ఏమైనా చేస్తావ్ ఇందులో కొత్తగా తెలుసుకోవడానికి ఏముంది అంటాడు యష్. నిజమే మనం కలిసిందే ఖుషి కోసం కదా అంటూ బాధగా ఉంటుంది వేద. మనం మనంగా కాదు వేరువేరుగా అంటుంది వేద.

Ennenno Janmala Bandham January 18 Today Episode: ఏమి అర్థం కాని పరిస్థితుల్లో యష్..

నువ్వు నా జీవితంలోకి ఖుషి తల్లిగా ప్రవేశించావు కానీ ఇప్పుడు అలాగ లేను అంటాడు యష్. అందరూ భారీ స్థానం నుంచి తల్లి స్థానాన్ని కోరుకుంటారు కానీ నేను తల్లి స్థానం నుంచి భార్య స్థానాన్ని కోరుకుంటున్నాను ఇది ఎవరికి చెప్పుకోవాలి అనుకుంటుంది వేద. మన పరిస్థితి ఎవరికీ చెప్పుకోలేం అంటాడు యష్. అందరి సంతోషం కోసం మనం సంతోషంగా ఉండడం ఇది కొత్తగా ఉందో బాధగా ఉంది అర్థం కావట్లేదు యష్. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది.

మీకు ఒక గతం ఉంది నాకు ఒక గతం ఉంది. కానీ మన ఇద్దరికీ ఉన్న సంతోషం ఒకటే ఆ సంతోషం పేరు ఖుషి. ఈ విషయంలో మనం క్లారిటీ గానే ఉన్నామని అనుకుంటున్నాను పని లేదా అంటుండగానే తనకి ఫోన్ వస్తుంది. దీనికి టైం అవుతుంది వెళ్తున్నాను అని వెళ్ళిపోతుంది వేద. తరువాయి భాగంలో యష్ ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది మాళవిక. వేద ఎస్ కి ఫోన్ చేస్తే మాళవిక ఏమో అనుకొని ఎందుకు మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తావు మాళవిక అంటాడు. ఫోన్ పెట్టేసిన మాళవిక అక్కడే ఉన్న భ్రమరాంబికని చూసి షాక్ అవుతుంది.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జనవరి 18, 2023 at 11:00 ఉద.