Ennenno Janmala Bandham January 19 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో వేద లేకపోతే నాకు జరగదా ఏంటి, ఏంటంట ఆవిడ గొప్ప తనని మైండ్ లోంచి డిలీట్ చేసేయాలి అనుకుంటాడు యష్. మరోవైపు వేద కూడా అలాగే అనుకుంటుంది. తన ఆలోచనని కూడా మా ఇంట్లోకి రానివ్వకూడదు అని గుడ్ బై మిస్టర్ ఆర్రోగెంట్ అనుకుంటుంది వేద. అంతలో మాళవిక యష్ కి ఫోన్ చేస్తుంది.
అసహ్యంగా మాట్లాడుతున్న మాళవిక..
నువ్వా అన్న యష్ తో నువ్వు నా నవ్వుని మర్చిపోలేవు అంటుంది మాళవిక. ఫోన్ పెట్టేయమంటాడు యష్. శీను గారు ఆఫీసుకి వెళ్లారు లేదో అసలే ఆఫ్ మైండ్ పర్సెంట్ సగం సంపాదన చలానాలకి సరిపోతుంది. అన్ని నేనే చెప్పాలి చంటి పిల్లాడా అంటూ యష్ కి ఫోన్ చేస్తుంది వేద. ఎగిరిపోయిన చిలక స్థానంలో కొత్త చిలుక వచ్చి చేరుతానంటే పంజరం ఒప్పుకోదంట. పంజరానికి మించిన ఏకపత్నివ్రతుడు ఉండడంట, ఏమంటావ్ మిస్టర్ పంజరం అంటుంది మాళవిక.
ఫోన్ ఎంతకీ లిఫ్ట్ చేయకపోవడంతో డ్రైవింగ్ లోనే ఫోను ఇంతసేపు మాట్లాడడం అవసరమా ఆక్సిడెంట్లు అవ్వ రేపటి నుంచి ఆయనకి కారు ఇవ్వను నా కారులోని ఆయన్ని ఆఫీస్ కి డ్రాప్ చేస్తాను అనుకుంటుంది వేద. అలాగని ఆయన మీద కోపం తగ్గినట్లు కాదు అంటూ మళ్ళీ కాల్ చేస్తుంది వేద. అయినా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఎంతసేపు మాట్లాడుతావు ఫోన్ లిఫ్ట్ చెయ్యు అనుకుంటుంది. విలేజ్ లో కూడా మీ ఇద్దరి మధ్య ఏమీ జరగలేదంట కదా అని మాళవిక అసహ్యంగా మాట్లాడితే చికాకుగా ఫోన్ పెట్టేస్తాడు యష్.
యష్ మాటలకి కి డిస్టర్బ్ అయిన వేద..
ఈలోపు వేద ఫోన్ చేస్తే మళ్ళీ మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తావు వేదకి తెలిస్తే బాగోదు అంటాడు. ఆ మాటకి షాక్ అయిన వేద కాల్ కట్ చేసేస్తుంది. ఫోన్ చేసింది వేదా అని తెలుసుకొని అనవసరంగా ఇరుక్కుపోయాను అంటూ తిరిగి తనే ఫోన్ చేస్తాడు యష్. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ కట్ చేసేస్తుంది వేద. ఇంకా ఇంకా ఫోన్ చేస్తుండటంతో లిఫ్ట్ చేసిన వేదని ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని మందులిస్తాడు యష్. నువ్వు అనుకున్నట్లు ఇక్కడ ఏమి జరగటం లేదు, నేను చెప్పేది విను అంటాడు యష్.
ఉంటే నాకేంటి లేకపోతే నాకేంటి అయినా ఏదో పెళ్ళాన్ని డబ్బా ఇచ్చినట్లు ఏంటి నేను మదర్ ఆఫ్ ఖుషి అంతే అంటూ ఫోన్ పెట్టేస్తుంది వేద. నీకు బుద్ధి లేదు తెలిసి తెలిసి వేద దగ్గర లూస్ టాక్ అవసరమా అని గిల్టీగా ఫీల్ అవుతాడు యష్. తను ఎవరితో మాట్లాడితే నీకెందుకు, అప్పటికి తన ఏదో నువ్వేదో సొంత మొగుడైనట్టు ఫీల్ అవుతున్నావు ఎందుకు అని తనలో తానే మాట్లాడుకుంటుంది వేద. తను నా పెళ్ళాం కాదు అంటుంది మళ్ళీ పెళ్ళాం లాగా కసుబుస్సు లాడుతుంది.
భ్రమరాంబికని చూసి షాక్ అయిన వేద..
ఏమనుకుంటుంది నా గురించి, నాకు గాని కోపం వచ్చిందంటేనా అంటూ యష్ కూడా తనలో తానే మాట్లాడుకుంటాడు. ఎంతైనా నా భర్త నాకు భర్త కాకుండా నా భర్త జోలికి వచ్చావంటే నీ ముక్కు చెవులు కోసేస్తాను అని అనుకుంటుంది వేద. నా ఫోనే కట్ చేస్తావా నేను నీకు అంత చీప్ అయిపోయాను నేను నిన్ను వదిలిపెట్టను అనుకుంటూ వెనక్కి తిరుగుతుంది మాళవిక. ఎదురుగా ఉన్న బ్రమరాంబికని చూసి షాక్ అవుతుంది. కొంపతీసి ఎస్ తో మాట్లాడింది వినేసిందా అంటూ టెన్షన్ పడుతుంది.
ఇప్పటివరకు ఎవరితో మాట్లాడావు అని అడుగుతుంది భ్రమరాంబిక. నా ఫ్రెండ్ అని మాళవిక అంటే ఫ్రెండ్ తో మాట్లాడితే ఎందుకు అంత కంగారు, తప్పు చేయనివాడు ఎప్పుడూ కంగారు పడడు జీవితంలో తప్పులు చేసిన వాడే అంత కంగారు పడుతుంటారు. ఎందుకు ఈ ఇంట్లో ధైర్యంగా ఉండలేకపోతున్నావ్, నువ్వు ఏదైనా తప్పు చేశావా అని భ్రమరాంబిక అడుగుతుంది.
అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన భ్రమరాంబిక..
నేను ఏ తప్పు చేయలేదు ఎవరికి భయపడవలసిన అవసరం లేదు అంటుంది మాళవిక. నీకు ఏమైనా పాత జ్ఞాపకాలు వెంటపడుతున్నాయా అంటుంది భ్రమరాంబిక. నేను బాగానే ఉన్నాను అని మాళవిక అంటే నేను మొత్తం వినేసాను, నువ్వు అనుకోనిది అన్నావు నేను వినకూడనిది విన్నాను. నేను ఈ ఇంటి యజమానురాలిని నన్నే వంటింట్లోకి వెళ్లొద్దంటావా? కుక్ తో ఏమని చెప్పావు వదిన గారిని వంట గదిలోకి రానివ్వద్దు వదిన గారికి ఇష్టమైనవన్నీ నేనే చేసి తినిపిస్తాను అన్నావా లేదా? అంటూ ట్విస్ట్ ఇస్తుంది బ్రమరాంబిక.
ఆ మాటలకి రిలాక్స్ అయినా మాళవికతో కంగారు పడ్డావా? సరదాగా నిన్ను ఆటపట్టించాను అంతే భ్రమరాంబిక. ఎంత బిల్డప్ ఇచ్చింది చివర్లో తుస్సుమనిపించడానికి అనుకుంటాడు కైలాష్. నాకు నీ చేతులతో ఉండి తినిపించాలని ఎందుకంత తాపత్రయం అని భ్రమరాంబిక అడిగితే మీరంటే గౌరవం వదిన అంటుంది మాళవిక. మరోవైపు ఆఫీసులో వర్క్ చేసుకుంటున్నా యష్ కి మాళవిక మాటలు గుర్తొచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. మరోవైపు వేద కూడా అలాగే డిస్టర్బ్ గా ఫీల్ అవుతూ ఉంటుంది.
రాజా పంపించిన సర్ప్రైజ్ గిఫ్ట్..
అంతలోనే రాజా నీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ పంపిస్తున్నాను అంటూ గుడిలో వాళ్ళు తీయించుకున్న ఫోటోని సెండ్ చేస్తాడు. సమయానికి వచ్చే టీవీ చూస్తే అయినా వేద కూల్ అవుతుంది అనుకుంటూ ఆ ఫోటోలు వేదకి పంపిస్తాడు. ఆ ఫోటోలు చూసిన వేద నేను పంపించిన ఫోటోలు చూసుకొని నేను మురిసిపోవాలా, గిల్లి జోలపాటడం అంటే ఇదే అంటూ మండిపడుతుంది. ఫొటోస్ చూసి కూడా రియాక్ట్ అవలేదు అంటే ఇంకా కోపం పోలేదా అనుకుంటాడు యష్.
మరోవైపు మాళవిక గురించి ఆలోచిస్తూ ఉంటుంది భ్రమరాంబిక. మాళవిక గురించి ఎంత ఆలోచించినా ఇంకా సస్పిసియస్ గానే ఉంది అనుకుంటుంది. అంతలోనే అక్కడికి జ్యూస్ తీసుకుని వచ్చిన కైలాష్ ఒక విషయం గురించి ఆలోచించి ఆలోచించి అలసిపోయారని మీకోసం నేనే స్వయంగా తీసుకొచ్చాను అంటూ ఆమె చేతికి ఇస్తాడు. జ్యూస్ నిజంగానే నువ్వు చేసావా అని బ్రమరాంబిక అంటే ఈవిడతో అంత ఈజీ కాదు అనుకొని అక్కడ నుంచి వెళ్ళిపోబోతాడు కైలాష్.
అసలు నిజం చెప్పి షాకిచ్చిన కైలాష్..
కైలాష్ కి క్యాష్ అంటే ఇష్టమేంట కదా, నా దగ్గర డబ్బు సంపాదించే మార్గం ఉందని నీకు తెలుసు, మరి నీకు తెలిసిన విషయాలు నాకు చెప్పకుండా వెళ్ళిపోతున్నవేమి నీకు తెలిసిన కాస్ట్లీ నిజాలకి బేరం మాట్లాడలేదనా అంటుంది బ్రమరాంబిక. అయ్యో ఎంత మాట మీతో బేరం ఏంటి మీ తమ్ముడి భవిష్యత్తు కోసం నేను ఉపయోగపడతాను అంటే నాకు విల్లా కొనరా ఏంటి, నాలాంటి వాడి అవసరం ఉందని అర్థం చేసుకొని నన్ను అమెరికా తీసుకెళ్లరా ఏంటి అంటాడు కైలాష్. తెలివైన వాడివే నా అవసరాలు నీ కోరికలు చెప్పకనే చెప్తున్నాయి ఇంతకీ విషయం చెప్పు అంటుంది భ్రమరాంబిక.
జరిగిందంతా చెప్తాడు కైలాష్. నిజం తెలుసుకున్న బ్రమరాంబిక తమ్ముడిని నిలదీస్తుంది. నిజమే అక్క టైం చూసుకుని నేనే చెబుదాము అనుకున్నాను, నీకు ఎలాగూ నిజం తెలిసింది కాబట్టి నువ్వే మా పెళ్లి అని అభి అంటూ ఉండగానే ఈ పెళ్లికి పెట్టి పరిస్థితుల్లోనే ఒప్పుకోను అంటుంది భ్రమరాంబిక. ఎట్టి పరిస్థితుల్లోనే నేను కూడా మాళవికని వదులుకోను అంటాడు అభిమన్యు. ఆ మాటలకి కోపంతో అభి చెంప పగలగొడుతుంది భ్రమరాంబిక.
Ennenno Janmala Bandham January 19 Today Episode: గుడ్ న్యూస్ వింటావంటున్న బ్రమరాంబిక..
ఇంతలో కైలాష్ కేకలు వేస్తూ ఉంటాడు మేడం మీరు నన్ను కొడుతున్నారు నేను మీ తమ్ముడిని కాదు కైలాష్ ని అంటాడు. తేరుకున్న బ్రమరాంబిక అభి ని ఈ విషయం గురించి డైరెక్ట్ గా అడిగితే వాడి రియాక్షన్ ఇలాగే ఉంటుంది. ఆ మాళవిక మాయ అలాంటిది స్లో పాయిజన్ ని స్లోగా ఇంట్లోంచి పంపించేయాలి అనుకుంటుంది భ్రమరాంబిక. ఒక మంచి వార్త చెప్పావు కైలాష్ నువ్వు తొందరలోనే గుడ్ న్యూస్ వింటావు అంటుంది బ్రమరాంబిక. నీ కాళ్లు ఒక పడవులోనే ఉంచు లేకపోతే నువ్వే మునిగిపోతావు అని భ్రమరాంబిక అంటే లేదు మేడం నా ప్రయాణం మీతోనే ఉంటాడు కైలాష్.మరోవైపు తల్లిదండ్రుల కోసం ఎదురుచూస్తూ ఉంటుంది ఖుషి. ఇంతలోనే ఇంటికి చేరుకుంటారు యష్ దంపతులు.
మీ తాతయ్య పంపించిన ఫోటోలు నీకు పంపించాను కదా ఎలా ఉన్నాయి అంటాడు యష్. చాలా బాగున్నాయి ఎందుకు అంటే అవి నిజం కాదు కదా అంటుంది వేద. తరువాయి భాగంలో చిరుబురులాడుతున్న వేదని నీ కోపం ఎవరిమీద అని అడుగుతాడు యష్. ఇంకెవరు ఖుషి డాడీ మీద అంటుంది వేద. నా గురించి ఏమనుకుంటున్నావు అంటే మీరు పెద్ద బండరాయి, భార్య గురించి పట్టించుకోని వాడు బండ రాయి తో సమానం అంటుంది వేద.