Ennenno Janmala Bandham January 2 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో బంగారం, ముత్యాల్ని సినిమాకి రమ్మంటే రాదు. ఒకటి చెప్పినట్లు వినాలి లేకపోతే రెండు పీకుతాను అంటాడు బంగారం. నువ్వు రెండు పీకితే నేను నాలుగు పీకుతాను అంటూ ఇద్దరూ వాదులాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన లేదా అదేంటి ఇప్పటివరకు బానే ఉన్నారు కదా ఇప్పుడే తగువులు ఆడుకుంటున్నారు ఎందుకు ఈ సంగతి వెంటనే అమ్మమ్మకి చెప్పాలి అంటూ రాణి దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్తుంది.

అమ్మమని ఎదురు ప్రశ్నివేసిన వేద..

అవునా నిజమా ఇదంతా నీకు కొత్త ఏమో కానీ మాకు కొత్త కాదు. ఇప్పుడే గొడవపడతారు అంతలోనే కలిసిపోతారు. అయినా నువ్వు నీ భర్త ఎప్పుడూ గొడవ పడలేదా అని అడుగుతుంది రాణి. మొగుడు అన్నాక కసరుకోవాలి పెళ్ళాం అన్నాక అలగాలి. ఈ కీచురాట్లు ఈ ముచ్చట్లు అన్ని కలిస్తేనే కాపురం అవుతుంది. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో కాపురంలో కీచులాటలు ఉండొచ్చు, కానీ రహస్యాలు ఉండకూడదు.

భార్యాభర్తలు మూసిన గుప్పెట్లగా కాకుండా తెరిచిన అరచేతిలాగా ఉండాలి అంటుంది రాణి. అమ్మమ్మ నువ్వు తాతయ్య ఎప్పుడూ గొడవ పడలేదా అంటుంది వేద. ఎందుకు గొడవ పడలేదు నేను మీ తాతయ్య ఎల్లకాలము సఖ్యంగా లేము, అప్పుడప్పుడు ఆయన నామీద కేకలు వేస్తారు అప్పుడప్పుడు నేను ఆయన మీద కేకలు వేస్తారు. చాలాసార్లు పెద్ద పెద్ద గొడవలు జరిగాయి. నేను మంచం మీద పడుకుంటే ఆయనేమో చాపేసుకొని కింద పడుకుంటారు.

భర్త మీద కంప్లైంట్ రాస్తున్న వేద..

అలసిపోయేదాకా కీచులు ఆడుకోవడం కీచులు ఆడుకున్నాక కలిసిపోవడం ఇదే సంసారం అంటే, ఒకే కంచంలో తింటే ఎంగిలి అనిపించదు ఓకే మంచంలో పడుకుంటే ఇరు కనిపించదు అంటూ మనవరాలికి జ్ఞాన బోధ చేస్తుంది రాణి. తరువాత భర్త మీద ఏదైనా కంప్లైంటు ఉంటే పేపర్ లో రాసి బాక్స్లో వేయమన్నాడు కదా తాతయ్య, కానీ ఆయన మీద కంప్లైంట్ చేస్తే నచ్చుకుంటారేమో, అయినా తప్పదు ఆయన చేసిన ఒక పని నాకు నచ్చలేదు, అదే చెప్తాను చదివాక మార్చుకుంటారో లేదో చూద్దాం అంటూ కంప్లైంట్ రాస్తుంది వేద.

అంతలోనే అక్కడికి వచ్చిన యష్, మిస్సెస్ న్యూసెన్స్ లెటర్ రాస్తుంది ఏంటి, నా మీద కంప్లైంటా? గుడి మీద కంప్లైంట్ చేయడం అలవాటేమో ఈ ఆడవాళ్ళకి అనుకుంటాడు యష్. లేదా తను రాసిన లెటర్ ని కంప్లైంట్ బాక్స్ లో వేస్తుంది. నా మీద నాకే ఫిర్యాదు చేస్తుందా ఉండు నీ మీద కూడా నేను ఫిర్యాదు చేస్తాను అంటూ తను కూడా ఒక ఫిర్యాదు లెటర్ రాసి ఇది మిస్సెస్ వేద మీద ద గ్రేట్ సీఈవో రాసిన లెటర్ అంటూ ఆ లెటర్ ని పోస్ట్ లో వేసి చిట్ ఫర్ టాట్ అనుకుంటాడు యష్.

మాళవిక ని పొగుడుతున్న అభి..

వేదం తనకు రాసిన కంప్లైంట్ లెటర్ ని తీసుకొని వెళ్ళిపోతాడు. మరోవైపు నేను మహానటులని సీరియల్ లోని సినిమాలోని చూశాను కానీ లైవ్ లో నిన్నే చూస్తున్నాను సిస్టర్ అంటూ పొగుడుతాడు కైలాష్. నీలో అందము తెలివి రెండు ఉన్నాయి బంగారం అంటాడు అభి. ఏదైతేనేమి పెద్దవిని బోల్తా కొట్టించి గోల్డ్ చైన్ నొక్కేసావు అంటాడు కైలాష్. ఈరోజు ఓకే కానీ అన్ని రోజులు నీది కాదు అంటాడు అభి. ఏనుగుని అదుపు చేయటానికి అంకుశం చాలు, మీ అక్కని అదుపు చేయటానికి నా తేనె పూసిన మాటలు చాలు అంటుంది మాళవిక.

నువ్వు గ్రేట్ సిస్టర్ అంటాడు కైలాష్. మనుషుల్ని మాయ చేయటం ఈ మాళవికకి పుట్టుకతో వచ్చిన టాలెంట్ మీ అక్కతో ఎలా ఆడుకుంటానో చూస్తూ ఉండు అంటుంది మాళవిక. సీన్ కట్ చేస్తే ఫిర్యాదుల బాక్స్ దగ్గరికి వచ్చిన ఎస్ నేను రాసిన లెటర్ మిస్సెస్ చదవలేనట్లు ఉంది మళ్లీ నాకే ఏదో రాసినట్లుగా ఉంది అంటే ఆ లెటర్ తీసుకొని బయటికి వచ్చి చదువుతాడు. లెటర్ బాక్స్ లో లెటర్ వేసానని మేము ఏదేదో ఫిర్యాదు రాశానని గాబరా పడకండి.

వేద కోరిక తీర్చిన యష్..

మీరు నాకు నచ్చినట్లుగా నడుచుకుంటున్నారు. ఆ విషయంలో నేను ఫుల్ హ్యాపీ. మరి ఫిర్యాదు ఏంటనే కదా మీ అనుమానం, మీరు స్ప్రే చేసుకునే పెర్ఫ్యూమ్ నాకు నచ్చలేదు, ఇబ్బందిగా ఉంది అంటే ఆఫ్ లెటర్ లో రాస్తుంది. మీరు అడిగాక కాదనేది ఉంటుందా మహారాణి గారు అని నవ్వుకుంటూ వేద దగ్గరికి వెళ్తాడు యష్. తను రాసిన లెటర్ ని చూపిస్తూ నవ్వుతాడు. అంటే తను నా లెటర్ ని చదివాడన్నమాట అనుకుంటుంది వేద.

తను చూస్తుండగానే ఆ స్ప్రే బాటిల్ని డస్ట్ బిన్ లో వేసేస్తాడు యష్. యాక్సెప్ట్ చేశారు అనుకుంటూ సంతోషంగా అక్కడి నుంచి యష్ ని పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది వేద. దిస్ ఇస్ టూ మచ్ తన ప్లీజ్ నీ యాక్సెప్ట్ చేశాను కదా కనీసం థాంక్స్ అయినా చెప్పాలి కదా చాంద్రాను తనకి నా మీద రెస్పెక్ట్ తగ్గిపోతుంది. ఈ ఆరోగెంట్ అంటే ఏంటో చూపిస్తాను అనుకుంటాడు యష్. బయటికి వచ్చిన వేద ఇప్పుడేంటి ఆయనకి సారీ చెప్పాలా అయినా ఈ కొత్త అలవాటు ఏంటో, ఎప్పటిలా నార్మల్గానే ఉండొచ్చు కదా.

Ennenno Janmala Bandham January 2 Today Episode: మ్యారేజ్ రూల్స్ మార్చాలంటున్న వేద..

అయినా మ్యారేజ్ రూల్స్ మార్చాలి. పిల్లల దగ్గరికి వెళ్లేటప్పుడు సెంట్లు, స్ప్రేలు కొట్టుకోకూడదని కొత్తగా పెళ్లి మంత్రం రాయించాలి అనుకుంటూ వెళ్తున్న వేద కి తన మీద రాసిన కంప్లైంట్ లెటర్ కనిపిస్తుంది. దీనికి నా మీద ఏం కంప్లైంట్ వచ్చిందో చూద్దాం అంటే ఆ లెటర్ ని ఓపెన్ చేస్తుంది. ఇదేదో కంప్లైంట్ అనుకొని మూతి ముడుచుకోకు ఇది చిన్న రిక్వెస్ట్ అంతే అంటూ రాత్రి నువ్వు గాజులు పట్టిలు తీసేస్తున్నావు అని లెటర్లో రాసి ఉంటుంది.అది పడుకునేటప్పుడు డిస్టబెన్స్ గా ఉంటాయి అందుకే తీసి పక్కన పెట్టేస్తున్నాను అనుకుంటుంది వేద. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ చూద్దాం.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జనవరి 2, 2023 at 12:00 సా.