Ennenno Janmala Bandham January 20 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో గ్రాండ్ ఫా పంపిన ఫోటోలు పంపించాను చూసావా అంటాడు యష్. బాగున్నాయి ఎందుకంటే అవి నిజం కాదు కదా అంటుంది వేద. అంటే అంటాడు యష్. ఖుషి చెప్పిన వెంటనే బాగా నటించారు కదా అదే తాతయ్య అమ్మమ్మ వాళ్ళతో నటించారు కదా అలాగా, బెస్ట్ సీఈఓ గానే కాదు బెస్ట్ యాక్టర్ గా కూడా మీరు ట్రై చేయొచ్చు అంటుంది వేద.

ఖుషి కి సారీ చెప్పిన వేద..

నువ్వు పొగుడుతున్నావా తిడుతున్నావా అంటాడు. పొగడటం లేదు నిజంగానే బాగా కలిసి పోయారు వాళ్లతో, అది చూసి నేను నిజం కాదు కదా అనుకున్నాను అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది వేద. నువ్వు నాకు తెలిసినట్లే ఉంటావు కానీ తెలియదు అర్థం అయినట్లే ఉంటావు కానీ అర్థం కావు ఇలా ఎన్నాళ్లో అనుకుంటాడు యష్.సీన్ కట్ చేస్తే నిద్రపోతున్న ఖుషి దగ్గరికి వచ్చి పాపం వెయిట్ చేసి వెయిట్ చేసి నిద్రపోయినట్లుంది అంటూ సారీ చెప్తుంది వేద.

యష్ కూడా పడుకుంటాడు. అంతలో అక్కడికి వచ్చిన చిత్ర అమ్మ కుషిని తీసుకు రమ్మంది తన దగ్గర పడుకోబెట్టుకుంటుందంట అంటూ ఖుషి ని తీసుకెళ్లి పోతుంది. ఎంతకీ నిద్ర పట్టకపోవడంతో వేదని పిలిచి పడుకున్నావా అని అడుగుతాడు యష్. లేదు డాన్స్ చేస్తున్నాను అంటుంది వేద. ఎవరి మీద నీ కోపం అంటాడు యష్. ఖుషి వాళ్ళ డాడీ మీద అంటుంది వేద. నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను అంటూ కోప్పడతాడు యష్.

భర్తని బండరాయితో పోల్చిన వేద..

చెప్తే బాధపడతారు అంటుంది వేద. చెప్పు అంటే మీరు పెద్ద బండరాయితో సమానం అంటుంది వేద. నేను బండరాయినా అని యష్ అంటే భార్య గురించి పట్టించుకోని వాళ్ళు అందరూ బండ రాయి తో సమానమే అంటుంది వేద. ఇప్పుడు నేను నిన్ను ఏమీ అర్థం చేసుకోలేదు అంటాడు యష్ అర్థం చేసుకునే వాళ్లే అయితే నా మీద అంత చిరాకు పెడతారా అంటుంది వేద. నేనిప్పుడు నీ మీద చిరాకు పడ్డాను అని యష్ అంటే నా మీద చిరాకు పడినట్లు కూడా గుర్తు లేనంతగా మార్చేసిందా ఆవిడ అంటుంది వేద. ఆవిడ ఎవరు అంటాడు యష్.

అదే ఆ చుప్పనాతి సూర్పణక. దాని పేరు చెప్పడానికి కూడా నాకు చిరాగ్గా ఉంది అంటుంది వేద. అదా మేటరు మేడంగారు ఎందుకు తిరుగులాడుతున్నారో నాకు ఇప్పుడు అర్థమైంది అంటాడు యష్. మీరు నా మీద కోప్పడితే తప్పు లేదు గాని నేను మీ మీద చిర్రు బుర్రులాడితే తప్పా ఉంటుంది వేద. ఆ మాళవికని పీక పిసికి చంపేయాలి, అసలు తను నాకు ఎందుకు ఫోన్ చేయాలి చేస్తే నేనెందుకు ఆన్సర్ చేయాలి, చేసానే అనుకో అదే టైములో నువ్వెందుకు నాకు కాల్ చేయాలి.

పాత విషయాలు తవ్వుకుంటున్న యష్,వేదలు..

నేనెందుకు నీ మీద విసుక్కోవాలి అంటూ ఏదేదో మాట్లాడుతుంటే మీ సుత్తి ఆపండి అంటుంది వేద. నీ నసకంటేనా అంటాడు యష్. నాది నసా అని వేద అంటే మరి పాములు పుట్ట దగ్గర అంతా స్పీచ్ అవసరమా అంటూ ఇద్దరు గొడవ పెట్టుకుంటారు. చిన్న పిల్లల్లాగా పాత విషయాలన్నీ తవ్వుకుంటారు. ఎలాంటి మొగుడు దొరికారు అంటూ వేద బాధ పడితే ఎలాంటి పెళ్ళాం దొరికింది అని యష్ చిరాకు పడతాడు. రాత్రంతా గొడవపడిన ఇద్దరూ తర్వాత వాళ్ళ ఫోటోలు చూసుకొని ఆనందపడతారు. సేమ్ కట్ చేస్తే టిఫిన్ చేస్తున్న మాళవికని చూసి కైలాష్ మాటలు గుర్తు చేసుకుంటుంది భ్రమరాంబిక.

మాళవికని ఏమీ అనలేక ఫోన్లో మాట్లాడుతున్నట్లుగా మాట్లాడి నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తుంది నిన్ను అంతా తొందరగా వదలను అంటుంది భ్రమరాంబిక. అప్పుడే అక్కడికి వచ్చిన అభి ఎవరిని తిడుతున్నావు,ఎమ్చేశారు అని అడుగుతాడు. అందరూ అలాగే తగలబడ్డారు చెప్పాల్సిన నిజాలు దాస్తున్నారు, దాచాల్సిన అబద్ధాలు చెబుతున్నారు. మా ఫ్రెండ్ కొడుకుని ఒకటి మోసం చేసి పెళ్లి చేసుకుందట. తను బోరున ఏడుస్తుంది.

పొమ్మన లేక పొగ పెడుతున్న భ్రమరాంబిక..

మీ ఇద్దరినీ చూడండి మీ ఇద్దరిదీ ఎంత స్వచ్ఛమైన స్నేహం ఇద్దరు ఎంత గౌరవంగా ఉంటున్నారు. అందరూ మీలాగే ఎందుకు ఉండరు. అయినా వాళ్ల గోల మనకెందుకు గాని మాళవిక నాకు ఒక హెల్ప్ చెయ్ అంటుంది భ్రమరాంబిక. ఏంటోదిన మాళవిక అంటే ఇప్పుడే విన్నావు కదా మీ ఇద్దరిదీ ఎంత స్వచ్ఛమైన స్నేహం అయినా ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటే చూడడానికి అంత బాగోదు. నీ భవిష్యత్తు బాగోవాలన్న వాడి భవిష్యత్తు బాగోవాలన్న, వీలైనంత తొందరగా నీ ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేసుకో, లేకపోతే నాతో చెప్పు నేను క్లియర్ చేస్తాను.

అప్పటివరకు మీ ఇద్దరూ కాస్త జాగ్రత్తగా ఉండండి. అభి కి సంబంధం చూస్తున్నాను మంచి సంబంధం కుదరాలని ఆ దేవుడికి దండం పెట్టుకో అంటుంది భ్రమరాంబిక. ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు అంటుంది మాళవిక. నేను కూడా నీ విషయం డైరెక్ట్ గా ఎలా చెప్పాలో చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందో అర్థం కావట్లేదు అంటాడు అభి. అంటే నన్ను ఇంట్లోంచి పంపించేస్తావా అని మాళవిక అంటే ఇదేనా నన్ను నువ్వు అర్థం చేసుకున్నది అంటాడు అభి.

అందుకే వచ్చాను అంటున్న సులోచన..

మరోవైపు ఆ మాళవిక ని డైరెక్ట్ గా మెడపట్టి బయటికి గెంటెయ్యొచ్చు కదా అంటాడు కైలాష్. భయం అభి లో ఉన్నంతవరకు నా మాట నేరడు పోవాల్సింది మాళవిక మాత్రమే భ్రమరాంబిక. మిమ్మల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం పొమ్మనకుండా పొగ పెడుతున్నారు అంటాడు కైలాష్. మరోవైపు స్నానం చేసి వచ్చిన వేద పడుకున్న యష్ ని చూసి రాత్రంతా నాతో పోట్లాడటం ఎందుకు ఇంత పొద్దు ఎక్కిన పడుకోవడం ఎందుకు అంటుంది వేద. ఇంతలోనే అక్కడికి వచ్చిన సులోచన ఎవరు కనిపించడం లేదు వేద వాళ్ళు లెగలేదా, రాత్రి లేటుగా పడుకొని ఉంటారు అనుకుంటుంది.

అంతలోనే మాలిని ఎదురై అగ్రహారం వారు ఎర్లీ మార్నింగ్ పూడిపడ్డారు ఎందుకు అని అడుగుతుంది. పంచదార అప్పు కావాలి అని సులోచన అడిగితే నిజంగానే పంచదార కోసం వచ్చావా అని అడుగుతుంది మాలిని. చల్లకొచ్చి ముంత దాయటం ఎందుకు దేనికో కాదు దానికే వచ్చాను. మీ కోడలు ఇంకా నిద్ర లేచినట్టు లేదు అంటుంది సులోచన. మీ అల్లుడు కూడా ఇంకా నిద్ర లేవలేదు అంటుంది మాలిని. మరోవైపు పడి పడి నవ్వుకుంటున్న వేదని చూసి షాక్ అవుతాడు యష్. నిన్ను అంతగా నవ్విస్తున్న ఆ మ్యాటర్ ఏంటి అని అడుగుతాడు యష్.

Ennenno Janmala Bandham January 20 Today Episode ఏదేదో ఊహించుకుంటున్న వియ్యపురాళ్ళు..

నా ఫ్రెండ్ పంపించిన మెసేజ్ చూస్తే నవ్వు ఆగటం లేదు అంటే ఇలాగ ఇవ్వు నేను చూస్తాను అంటాడు యష్. ఆ జోక్ చూసిన యష్ కూడా పగలబడి నవ్వుతాడు. వాళ్ళ నవ్వులు విని బయట ఉన్న ఆడవాళ్ళు ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు. మనం వేసిన ప్లాను బాగా పనికొచ్చింది అంటుంది మాలిని. మనవల్ల కానిది మా అమ్మానాన్న వల్ల అయినట్టుంది అంటుంది సులోచన. ఏదైతేనేమి పిల్లలిద్దరూ సుఖంగా కాపురం చేసుకోవడమే కదా మనకు కావలసింది అనుకుంటారు.

మీ ఫ్రెండ్ కి సెన్సఫ్యూమర్ ఎక్కువ అని యష్ అంటే, మా కాలేజ్ డేస్ లో కూడా తను అంతే, తనతో ఉంటే టైమే తెలీదు అంటుంది వేద. నువ్వు చెప్తుంటే నాకు కూడా విని ఒకసారి కలవాలని ఉంది అమెరికాలో ఎక్కడ ఉంటుంది తను అక్కడ ఏం చేస్తుంది అంటాడు యష్. తను అమ్మాయి కాదు అబ్బాయి అంటుంది వేద. ఆ మాటకి షాక్ అవుతాడు యష్. తరువాయి భాగంలో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ భోగిమంట ముందు ఆనందంగా డాన్స్ వేస్తుంటారు.