Ennenno Janmala Bandham January 23 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో విన్నీ గురించి వేద విడమర్చి చెప్తుంటే, నువ్వు అంతలా చెప్తుంటే నాకు కూడా చూడాలనిపిస్తుంది తను అమెరికాలో ఎక్కడ ఉంటుంది ఏం చేస్తుంది అని అడుగుతాడు యష్. తను షీ కాదు ఛీ తను అబ్బాయి వీర వెంకట వినాయకరావు మేము ముద్దుగా విన్నీ అని పిలుచుకుంటాము. అప్పట్లో మేమిద్దరం క్లాసులు ఎగ్గొట్టి క్యాంటీన్లో కూర్చొని గంటలు గంటలు కబుర్లు చెప్పుకునే వాళ్ళం.
పొసెసివ్ గా ఫీల్ అవుతున్న యష్..
తను బైక్ స్పీడ్ గా డ్రైవ్ చేస్తుంటే నేను వెనకన కూర్చొని నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్ మీద వెళ్తుంటే ఆ ఎంజాయ్మెంట్ వేరు. రేపు తను హైదరాబాదు వస్తున్నాడు. చాలా సంవత్సరాల తర్వాత వస్తున్నాడు నేను చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నాను అంటూ ఆనంద పడిపోతుంది వేద. తన ఆనందాన్ని చూసి కుళ్లుకుంటాడు యష్. మరోవైపు కూతురికి టిఫిన్ పెడుతున్న వేద కి ఏదో మెసేజ్ వస్తే చూస్తూ నవ్వుతుంది.
ఏంటి అలా నవ్వుతున్నావ్ అని అడుగుతుంది ఖుషి. విన్ని అంకుల్ మంచి జోక్ పంపించాడు అందుకే నవ్వుతున్నాను ఉంటుంది వేద. విన్ని అంకుల్ ఎవరు అని అడిగితే నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తుంది వేద. నేను కదా నీ బెస్ట్ ఫ్రెండ్ అని కృషి అంటే ఇప్పుడు నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్ వి కానీ అప్పట్లో తనే నా బెస్ట్ ఫ్రెండ్ అంటుంది ఖుషి. ఆ మాటలకి అక్కడే ఉన్న యష్ ఆఫీస్ కి బయలుదేరబోతూ భార్యని లంచ్ అడుగుతాడు.
యష్ ని ఇరిటేట్ చేస్తున్న వేద..
వచ్చారా రండి అంటూ దీన్ని పంపించిన జోక్ చూపించి నవ్వుతుంది వేద. అది చూసిన యష్ ఇదొక జోకు దీనికి నేను నవ్వాలా? నువ్వే జోక్స్ ఇందాక చూపిస్తే చాలా బాగున్నాయి అన్నారు అని వేదం అంటే ఇప్పుడు దీనికోసం ఎంత డిస్కషన్ అవసరమా? అయినా ఇప్పుడు నా లంచ్ బాక్స్ ఇవ్వటం అవసరమా ఈ కుళ్ళు జోక్స్ అవసరమా అంటాడు యష్. ఎవడో ఎప్పుడో కాలేజీ ఫ్రెండ్ అంట,ఇప్పుడు వస్తాడంట.
నువ్వేమీ కాలేజీ స్టూడెంట్ వి కాదు ఒక భార్యని తల్లి గుర్తుపెట్టుకో అని అక్కడినుంచి కోపంగా వెళ్ళిపోతాడు యష్. సడన్గా మూడ్ ఆఫ్ అయ్యారు ఏంటి అనుకుంటుంది వేద. డాడీ కోపం నీ మీదా,విన్ని అంకుల్ మీదా అని అడుగుతుంది ఖుషి. ఎవరి మీద కోపం కాదు డాడీకి ఆఫీస్ కి వెళ్లి హడావుడి కదా కొంచెం చిరాగ్గా ఉన్నారు అంతే నువ్వు ఫాస్ట్ గా టిఫిన్ చేస్తే స్కూల్ కి వెళ్దాం అంటుంది వేద. మరదకు చిత్రాలతో వచ్చిన ఖుషి వసంత్ ని విష్ చేస్తుంది.
చిత్రని లైట్ తీసుకోమన్న వసంత్..
వసంత్,చిత్రని విష్ చేస్తాడు. తనతో మాట్లాడకుండా ఫోన్ చూసుకుంటున్న వసంత్ దగ్గరికి వచ్చి ఏంటి అంత బిజీ అంటుంది చిత్ర. వచ్చేది మాఘమాసం కదా మన పెళ్ళికి ఏ డేట్ బాగుంటుందా అని సెర్చ్ చేస్తున్నాను అంటాడు వసంత్. ఈ అబ్బాయిలకి దేని మీద తొందర ఉన్న లేకపోయినా పెళ్లి మీద చాలా తొందర. అయినా ఎవరినైనా పంతుల్ని కలవచ్చు కదా అని చిత్ర అంటే, ఇప్పుడు ఇదంతా లేటెస్ట్ ట్రెండ్ ముహూర్తం పంతులు కాదు గూగుల్ పెడుతుంది.
అంటూ ఒక డేట్ అనుకోని ఈ ముహూర్తం చాలా బాగుందిఅని ఇద్దరు ఒకరికి ఒకరు కంగ్రాట్స్ చెప్పుకుంటారు. ఆనందంతో ఒకరికి ఒకరు ఐస్క్రీం తినిపించుకుంటూ ఉంటారు. చిత్ర వసంత్ కి తినిపించబోతే అది చేయి జారిపోతుంది. టెన్షన్ పడుతున్న చిత్రని ఎందుకంత కంగారు పడుతున్నావ్ అని అంటే ఇప్పుడే మా పెళ్లి ముహూర్తం పెట్టుకున్నావు ఇంతలోనే ఇలా జరిగింది ఏదో అపశకునం లాగా ఉంది అంటుంది చిత్ర. ఇది చాలా చిన్న విషయం, నువ్వు దాన్ని లైట్ తీసుకో కాకపోతే వేరే ఐస్క్రీమ్ తీసుకుందాం అంటూ వేరే ఐస్ క్రీమ్ ఆర్డర్ చేస్తాడు వసంత్.
ఏం జరుగుతుందో అని కంగారు పడుతున్న చిత్ర..
ఈ ఐస్ క్రీమ్ లాగే నా ఆశలు కూడా కరిగిపోతాయా ఎందుకు ఇలా జరిగింది అంటూ ఆలోచనలో పడుతుంది చిత్ర. మరోవైపు ఇంటిముందు సన్నాయి మోకటంతో ఆనందంగా బియ్యం తేవడానికి వెళ్తుంది సులోచన. మరోవైపు ఏంటి సౌండ్ పొల్యూషన్ అంటూ చిరాకు పడుతుంది మాలిని. సౌండ్ పొల్యూషన్ ఏంటి పండగ స్టార్ట్ అయినట్టుంది అంటాడు రత్నం. అయితే మాత్రం ఇంత సౌండ్ పొల్యూషన్ అంటూ సన్నాయి వాటి దగ్గరికి వచ్చి అతని మందలిస్తుంది మాలిని.
అలా అనకండి వదినగారు అంటూ అప్పుడే బియ్యంతో వచ్చిన సులోచన అతనికి బియ్యాన్ని వేసి పండగ విశేషాలు కనుక్కుంటుంది. సన్నాయి అతను పాత బట్టలు ఉంటే ఇమ్మంటే చిత్రాన్ని తెమ్మని చెప్పి ఖుషి చేత ఇప్పిస్తుంది సులోచన. మాలిని కూడా రత్నం దగ్గర డబ్బులు తీసుకొని సన్నాయి అతనికి ఇస్తుంది. యష్, వసంత్ కూడా డబ్బులు ఇస్తారు. మొత్తానికి సంక్రాంతి సన్నాయిమేళంతో శుభప్రదంగా ప్రారంభమైంది అంటాడు వేద తండ్రి.
పుట్టింటి బడాయి ఎక్కువైపోతుందంటున్న మాలిని..
అంతా వేద, అల్లుడు గారు మా అమ్మ నాన్న వాళ్ళ ఇంటికి వెళ్లి వచ్చిన వేళా విశేషం అంటుంది సులోచన. ఇది మరి ఫన్నీ అయినా వాళ్ళు ఊరు వెళ్ళటానికి సంక్రాంతి సంబరానికి ఏంటి సంబంధం అంటుంది మాలిని. మా ఊరు వెళ్ళటమే పెద్ద గొప్ప అంటుంది సులోచన. ఈమధ్య పుట్టింటి బడాయి ఎక్కువైపోయింది అంటుంది మాలిని. మీరు కూడా నన్ను మాటలతో కుల్లబొడవడం బాగా ఎక్కువైపోయింది అంటుంది సులోచన. అబ్బబ్బ ఆపండి మీ సరసాలు అంటాడు రత్నం.
ఏంటి మాది సరసాల అంటుంది మాలిని. లేకపోతే ఎప్పుడూ అరుసుకోవటమే కానీ ఎప్పుడు కొట్టుకోలేదు అంటూ ఆట పట్టిస్తాడు రత్నం. మేము ఇద్దరమే ఎందుకు కొట్టుకుంటాము మేము బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు ఇద్దరు. చూశారా వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ మీరే మిస్ అండర్స్టాండింగ్ చేసుకున్నారు అంటాడు యష్. ఏదైనా వేద కేసులు వెకేషన్ కి వెళ్లి బాగా ఎంజాయ్ చేశారు అక్కడ అంతా శుభమే ఇక్కడ అంతా శుభమే అంటాడు వేద తండ్రి. ఈ క్రెడిట్ అంతా నాదే మా మమ్మీ డాడీ హ్యాపీ అయితే నేను కూడా హ్యాపీ అంటుంది ఖుషీ.
భార్యని అతిగా నమ్ముతున్న యష్..
సంక్రాంతి పండుగ సందర్భంగా ఈసారి సెలబ్రేషన్స్ గ్రాండ్గా చేయాలంటాడు రత్నం. మన కాలనీలో అన్ని ప్లాట్స్ కన్నా గ్రాండ్ గా మన ఫ్లాట్ లోనే సెలబ్రేషన్స్ జరగాలి అంటుంది మాలిని. వాళ్లు సరదా పడుతున్నారు అందుకు తగిన ఏర్పాట్లు మనమే చేద్దాం మనకి కూడా కాలక్షేపం అవుతుంది అంటాడు వేద తండ్రి. ఈసారి ముగ్గుల పోటీలో ఎంత ప్రైజ్ మనీ పెడదాం అని రత్నం అంటే 50,000 నేను స్పాన్సర్ చేస్తాను అంటాడు యష్. దానికి అందరూ ఆశ్చర్యపోతారు. అంతా డబ్బులు పంచడానికి నీకు ధైర్యం ఎలా వచ్చింది అంటాడు వసంత్.
నా ధైర్యం వేద ఎందుకంటే ఫస్ట్ ప్రైజ్ వచ్చేది వేదాకే కదా అంటాడు యష్. ఏంటి మా అక్క మీద మీకు అంత నమ్మకం అని చిత్ర అడిగితే అక్కడ పల్లెటూరులో చూశాను కదా ఎంత బాగా వేసిందో ఆ ముగ్గుల ముందు మా అమ్మ, అత్తయ్య ముగ్గులు కూడా వేస్ట్ అంటాడు యష్. అయితే ఫస్ట్ ప్రైజ్ అమ్మదే కన్ఫర్మ్ అనమాట అంటుంది ఖుషీ. అంతా ఆయనే డిసైడ్ చేస్తారా అసలు ఈ ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేయాలో లేదో డిసైడ్ చేసుకోలేదు అంటుంది వేద. మేము ముగ్గులు పోటీ పెట్టడం కన్ఫర్మ్ ఎవరు పార్టిసిపేట్ చేస్తారో, చేయరో అది వాళ్ళ ఇష్టం అంటాడు రత్నం.
భర్తని బ్రతిమాలుకుంటున్న వేద..
ఎవరు ముగ్గులు వేయను అని బెట్టు చేస్తారో,ఎవరు బ్రతిమిలాడి ఒప్పిస్తారో చూడాలి కదా అంటూ ఆట పట్టిస్తుంది చిత్ర. మరోవైపు ఆఫీస్ కి బయలుదేరుతున్న వేదకి ఫోన్ వస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసిన వేద చాలా సంతోషంగా మాట్లాడుతుంది. అది గమనించిన యష్ ఏంటి ఇంత సడన్గా ఇంత ఎగ్జైట్ అవుతుంది మిస్సెస్ న్యూసెస్ అనుకుంటాడు. అంతలో ఫోన్ పెట్టేసిన వేద, విన్ని వచ్చేసాడు తను ఆల్రెడీ ల్యాండ్ అయిపోయాడు చెప్పా పెట్టకుండా వచ్చేసాడు ఇతను ఎప్పుడు ఇంతే సరే కానీ పదండి వెళ్దాం అంటుంది వేద.
ఎక్కడికి? అయినా ఇప్పటికిప్పుడు ఎలా వెళ్తాం అంటాడు యష్. నేను కూడా అదే చెప్పాను కానీ మా విన్ని అసలు వినిపించుకుంటేనే కదా, అనుకున్నది జరగాలి అంటాడు ఎప్పుడూ అంతే అయినా అంత దూరం నుంచి వచ్చాడు కదా ఈసారి మనమే అడ్జస్ట్ అవుదాం అంటుంది వేద. నాకు ఆఫీసులో అర్జెంట్ మీటింగ్ ఉంది నాకు కుదరదు అంటాడు యష్. ఒక వన్ అవర్ పోస్ట్ పోన్ చేసుకోండి నా కోసం మన విన్నీ కోసం.
భార్యని పట్టించుకోకుండా వెళ్లిపోయిన యష్..
మనం వస్తున్నాము అని నేను కమిట్ అయిపోయాను నాకు కూడా విని కలవాలని చాలా ఎక్సైట్ గా ఉంది అంటుంది వేద. నీకు ఎగ్జామ్ అయితే నాకేంటి అయినా ఎవరిని అడిగి కమిట్ అయ్యావు అయినా ఎవడో అమెరికా నుంచి వస్తే నా ప్రోగ్రామ్ నేను మార్చుకోవాలా నావల్ల కాదు అంటాడు యష్. ఎవడు కాదండి నా బెస్ట్ ఫ్రెండ్ విన్నీ అంటుంది వేద. నీకు బెస్ట్ ఫ్రెండ్ అయితే నువ్వు వెళ్ళు నన్ను ఇబ్బంది పెట్టొద్దు అంటాడు యష్. నేను ఒక్కదాన్నే వెళ్ళటం నాకు ఐదు నిమిషాలు పని కానీ నేను ఒక్కదాన్నే వెళ్ళటం కరెక్ట్ కాదు కదా.
Ennenno Janmala Bandham January 23 Today Episode:
మీరు మీ ఫ్రెండ్స్ పార్టీకి మీరు పిలవగానే నేను ఎన్నిసార్లు వచ్చాను ఇప్పుడు నేను అడిగితే మీరు నో అంటున్నారు. రావచ్చు కదా అని రిక్వెస్ట్ చేస్తుంది వేద. అంతగా నేను రాకుండా నీకు వెళ్ళటం ఇష్టం లేకపోతే వెళ్లడం మానేయ్ అని ఎస్ అంటే అలా బాగోదు అంటుంది వేద. వేద ఎంత బ్రతిమాలిన వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు యష్. నా బాధ స్నేహితుడికి నా భర్తగా మిమ్మల్ని పరిచయం చేసుకోవడంలో నాకు ఎంత సంతోషం ఎంత సంతృప్తి.
నా మనసుని మీరు ఎప్పుడు అర్థం చేసుకుంటారు అంటూ మళ్లీ తనే కాంప్రమైజ్ అయ్యి మీకు ఆఫీసులో అర్జెంటు పని ఉండవచ్చు నేను మేనేజ్ చేసుకుంటాను లెండి అనుకుంటుంది. తరువాయి భాగంలో భోగి మంట దగ్గర కుటుంబ సభ్యులందరూ డాన్స్ చేస్తూ ఉంటారు.