Ennenno Janmala Bandham January 24 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో విన్నీ ని కలుసుకోవటానికి హోటల్ కి వస్తుంది వేద. అక్కడ ఆమెని రిసీవ్ చేసుకుని మీకోసం వెన్ని గారు టేబుల్ బుక్ చేశారు అంటూ ఆమెని రిజర్వ్డ్ టేబుల్ దగ్గర కూర్చోబెడతాడు మేనేజర్. మరోవైపు అదే హోటల్ కి వచ్చిన వేద చెప్పింది, అయినా రానని చెప్పి వస్తే ఏమనుకుంటుందో, పదేపదే విన్ని గురించి చెప్తుంటే ఆ సాల్తిని చూడాలనిపించి వచ్చాను. చూద్దాం అమాంతం అమెరికా నుంచి పూడిపడ్డ ఆ విన్ని గురించి లేదా చెప్పిన మాటలు అతను పంపించిన జోక్స్ చూస్తుంటే అతను ఎవరో డేరింగ్ అండ్ డాషింగ్ పర్సన్ లాగా అనిపిస్తుంది.
విన్ని ని చూసి షాకైన యష్..
అతను నా కన్నా బావుంటాడా లేకపోతే హిందీ సినిమా హీరోలాగా ఇంకా బాగుంటాడా లేకపోతే హిందీ సినిమా హీరో లాగా ఇంకా బాగుంటాడా, లెట్స్ సి అంటూ హోటల్లోకి అడుగుపెడతాడు. లోపలికి వచ్చిన యష్,వేద టేబుల్ దగ్గర ఎవరు లేకపోవడం గమనిస్తాడు. అంతలోనే వేదం దగ్గరికి వచ్చిన మేనేజర్ మీరు ఈ డ్రింక్ తీసుకోవాలి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని వెన్ని గారి హోటల్స్ ఆయన ఏ నిమిషంలో నైనా రావచ్చు అని చెప్తాడు.
నాకు విన్నీ విషయంలో నచ్చేది ఇదే తను వచ్చేలోపు నాకోసం ఎంత కేరింగ్ తీసుకుంటున్నాడు అనుకుంటుంది వేద. ఇదంతా గమనిస్తున్న యష్, వేద బెస్ట్ ఫ్రెండ్ కి పంచువాలిటీ లేదన్నమాట కాస్త త్వరగా రావచ్చు కదా అనుకుంటాడు. అంతలో అక్కడికి ఒక గుండు అతను బొకే తీసుకొని వస్తాడు. వేదకి బొకే ఇచ్చి నేను విన్ని గారి పిఏ ని ఆయన మీటింగ్లో ఇరుక్కుపోయారు అంతవరకు నన్ను మేనేజ్ చేయమన్నారు అంటాడు అతను. సరే కూర్చోండి అంటూ ఇద్దరూ కబుర్లలొ పడతారు.
తనని తానే పొగుడుకుంటున్న యష్..
వాడిని చూసిన యష్ అతనే విన్నీ అనుకొని వీడి గురించా ఇంతలాగా చెప్పింది వేద, పిడత మొహం గాడు వేస్ట్ ఫెలో అనుకుంటాడు. దేవుడు నీకు ఇంత గ్లామర్ ఇచ్చేసాడు కానీ ఈ విషయం మిస్సెస్ న్యూసెన్స్ గుర్తించడం లేదు. అయినా ఇప్పుడు నేను ఈ బఫూన్ గాడిని కలవటం అవసరమా ఎలాగో నేను వచ్చినట్లు వేదకి తెలియదు సైలెంట్ గా వెళ్ళిపోవాలి అని నవ్వుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు యష్.
బయటికి వచ్చిన యష్, ఈ వేద విన్ని,విన్ని కాలేజ్ మెట్టు, క్లాస్మేట్ అంటుంటే ఎవడో ఏంటో ఎలా ఉంటాడో అంటూ నేను కూడా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను. తెర చూస్తే సర్కస్ లో బఫూన్ లాగా ఉన్నాడు. అయినా ఈ మిస్సెస్ న్యూసెన్స్ ఫ్రెండ్ అంటే ఇంతకన్నా గొప్పగా ఏమి ఉంటాడు అనుకుంటాడు. అయినా నేనంటే నా స్టేటస్ ఏంటి, బెస్ట్ సీఈఓ ని నేను జలస్ గా ఫీల్ అవ్వటం ఏంటి, అయినా ఆ బఫూన్ కి నాకు పోలిక ఏంటి అని అక్కడ నుంచి వెళ్ళిపోబోతు ఒక వ్యక్తిని గుద్దేసి పడిపోబోతాడు.
మిమ్మల్ని భరించడం చాలా కష్టం అంటున్న ఆ వ్యక్తి..
ఆ వ్యక్తి యష్ ని పట్టుకుంటాడు. కళ్ళు కనిపించడం లేదా అని అడిగితే హర్రీలో ఉన్నాను చూసుకోలేదు అంటాడు ఆ వ్యక్తి. పడిపోయి ఉంటే ఏం చేసే వాడివి అని యష్ అడిగితే పట్టుకున్నాను కదా అయినా సారీ చెప్పాను కదా అంటాడు ఆ వ్యక్తి. అలా అలా ఆ ఆర్గ్యుమెంట్ సీరియస్గా మారిపోతుంది. మిమ్మల్ని భరించడం చాలా కష్టం టాటా బై బై అని అక్కడి నుంచి వెళ్ళిపోతున్న ఆ వ్యక్తిని ఆపి నిన్ను మళ్ళీ లైఫ్ లో కలవాలనుకోవట్లేదు అంటాడు యష్.
నాది కూడా సేమ్ ఫీలింగ్ కానీ మీ భార్య ఎవరో కానీ మహాతల్లి మిమ్మల్ని భరిస్తుంది ఆవిడకి హ్యాట్సాఫ్ చెప్పాలి ఆవిడకి నా సానుభూతిని తెలియజేయండి అంటూ లోపలికి వెళ్లిపోతాడు ఆ వ్యక్తి. యష్ కూడా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు ముగ్గుల పోటీ లో జడ్జి కోసం డిస్కషన్ చేస్తూ ఉంటారు మాలిని దంపతులు, సులోచన దంపతులు. సులోచన ఒక జడ్జిని ప్రిఫర్ చేస్తే మాలిని మరొక జడ్జిని ప్రిఫర్ చేస్తుంది. మళ్లీ ఇద్దరి మధ్య గలాటా ప్రారంభం అవుతుంది. వాళ్ళిద్దర్నీ వారించబోయిన భర్తలు ఇద్దరికీ చివాట్లు పెడతారు మాలిని,సులోచన.
మళ్లీ గలాటా ప్రారంభించిన వియ్యపురాళ్ళు..
మన సర్కిల్లో మనకి పరిచయం ఉన్నవాళ్లు కాకుండా ఒక కొత్త వ్యక్తిని జడ్జిగా నియమిద్దాం అంటాడుసులోచన భర్త. మంచి ఆలోచన వీలైతే ఈ సిటీలో ఉండే మనిషిని కాకుండా వేరే మనిషిని జడ్జిగా పెడదాం అంటాడు రత్నం. రేపు రంగోలి కాంపిటీషన్లో గెలిచేది నేనే అంటూ నేనే అని మళ్లీ గొడవ ప్రారంభిస్తారు. మాకు గాని కాలిందంటే మీ ఇద్దరినీ ముగ్గుల పోటీ నుంచి బ్యాన్ చేసేస్తాం అంటాడు రత్నం. ఆ మాటలకి అందరూ నవ్వుకుంటారు.
మరోవైపు ఏంటి విన్నీ ఎంత లేట్ చేస్తున్నాడు అనేసరికి వెనకనుంచి పండితారాధ్యుల వేదాశ్విని గారు హాయ్ అంటూ పలకరిస్తాడు ఇందాక గొడవ పడిన వ్యక్తి. వీరమాచినేని వెంకట వినయ్ కుమార్ గారు హాయ్ అంటూ షేక్ ఆండ్ ఇచ్చుకుంటారు ఇద్దరు. వేదాస్విని ని వెయిట్ చేయించినందుకు సారీ అంటూ ఇద్దరూ కబుర్లలో పడతారు. నువ్వు ఎలా ఉన్నావు అని విన్ని ని అడుగుతుంది వేద. ఐదు నిమిషాలు ముందు వరకు బాగానే ఉన్నాను అంటూ జరిగిందంతా చెప్తాడు విన్నీ.
మొత్తానికి కలుసుకున్న విన్ని, వేద..
కొందరు అంతే సందు దొరికితే గొడవ పెట్టుకుందామని చూస్తారు. ఎవరితో ఎప్పుడూ గొడవ పెట్టుకుందామా అని రెడీగా ఉన్నట్టున్నాడు వేరే పని లేనట్టుంది. ఎంత నచ్చ చెప్పిన వినిపించుకోలేదు ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని అనిపించింది అంటాడు విన్నీ. ఎందుకు ఉండరు విని చాలామంది ఉంటారు అని బయటికి అని మా మిస్టర్ ఆరోగెంట్ ఉన్నాడుగా అని మనసులో అనుకుంటుంది వేద. నాకు మాత్రం అపరిచితుడు భార్యని ఒక్కసారి అయినా చూడాలని ఉంది 2 మినిట్స్ లో టార్చర్ మొత్తం చూపించాడు అంటాడు విన్ని.
ఓకే కూల్ అవ్వు కొంచెం కాఫీ తాగుతావా అంటే స్ట్రాంగ్ కాఫీ పడాల్సిందే అంటూ కాఫీ ఆర్డర్ చేస్తాడు విన్ని. నువ్వు అప్పుడు ఎలాగున్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు అంటుంది వేద. కానీ నువ్వు మాత్రం అప్పట్లా లేవు, ఇంకా జాబ్ చేస్తూ గా ఉన్నావు మీ సౌందర్య రహస్యం ఏంటి అని అడుగుతాడు విన్ని. ఓన్లీ బికాజ్ ఆఫ్ మై హ్యాపీనెస్ అప్పటికన్నా ఇప్పుడు చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నాను అందుకు కారణం ఖుషి. లోకంలో గొప్ప అందం ఎవరిదో తెలుసా విన్ని, పెళ్లి కానీ అమ్మాయిల్లోనూ పెళ్లి అయిన భార్యలోనూ కాదు బిడ్డలు ఉన్న అమ్మల్లో ఉంటుంది.
భర్తని వెనకేసుకొస్తున్న వేద..
నేను అమ్మని నాకు ఒక కూతురు ఉంది. ఐ యాం వెరీ హ్యాపీ అంటూ కన్నీరు తుడుచుకుంటుంది వేద. ఇంతకీ నీ భర్త ఏరి తనని కూడా తీసుకొస్తాను అన్నావు కదా అంటాడు విన్నీ. రావలసింది కానీ ఆఫీసులో అర్జెంట్ వర్క్ అందుకే రావడం కుదరలేదు అంటుంది వేద. అంతేనా లేకపోతే నన్ను కలవడానికి ఎస్టేట్ అయ్యారా బికాస్ ఐ యాం మోర్ హ్యాండ్సమ్ అండ్ మోర్ డాషింగ్ కదా అంటాడు విన్ని. హి ఈజ్ మోర్ దేన్ హాండ్సం అండ్ డాషింగ్ దెన్ యు అంటుంది వేద.
Ennenno Janmala Bandham January 24 Today Episode
అబ్బో భర్తని వెనకేసుకొస్తున్నావు అంటాడు విన్నీ. వై నాట్ హి ఈజ్ మై డియర్ హస్బెండ్ అంటూ నవ్వుతుంది వేద.బై ద వే ఒక గుడ్ న్యూస్ మా కంపెనీ ఒక పెద్ద కాంట్రాక్టు సాయం చేసింది, మా ఇంట్లో పార్టీ ఇస్తున్నాను నువ్వు మీ హస్బెండ్ తప్పకుండా రావాలి అంటూ ఇన్వైట్ చేస్తాడు విన్నీ. ఆయనకి కుదురుతుందో లేదో అని వేద అంటే కాల్ చేసి అడుగు నేను ఇన్వైట్ చేశానని చెప్పు అంటాడు విన్ని. ఇంతలో తనకి ఒక ఇంపార్టెంట్ కాల్ రావడంతో మాట్లాడడానికి వెళ్తాడు.నేను వచ్చే లోపల నీ హస్బెండ్ కి కాల్ చేసి అడుగు అంటూ కాల్ మాట్లాడ్డానికి వెళ్ళిపోతాడు విన్ని.
వస్తాడో,రాడో అనుకుంటూ యష్ కి ఫోన్ చేస్తుంది వేద. తను ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసింది, అక్కడ విన్ని గాడితో ఫుల్ బిజీగా ఉండాలి కదా మధ్యలో మొగుడెందుకు గుర్తొచ్చాడు అంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు యష్. విన్నీ వచ్చాడు అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు చాలా సంవత్సరాల తర్వాత కలిసాం కదా అంటూ చెప్తుంది. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.