Ennenno Janmala Bandham January 25 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో భర్తకి ఫోన్ చేసి విన్నీ వచ్చాడు అప్పుడు ఎలాగ ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు అంటుంది వేద. అప్పుడేనా ఇప్పుడైనా ఆ పెడతా మొహమే కదా అనుకుంటాడు యష్. మిమ్మల్ని అడుగుతున్నాడు, మిమ్మల్ని కలవాలని చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాడు అంటుంది వేద. నెక్స్ట్ వీక్ లో కలుద్దాం అని యష్ అంటే అంత లేట్ ఎందుకు ఈ రోజు కలుద్దాం అంటుంది వేద.

భర్తని బ్రతిమాలుకుంటున్న వేద..

ఇప్పటికిప్పుడు అంటే అవ్వదు నేను చాలా బిజీ అంటాడు యష్. మన పనులు ఎప్పుడూ ఉండేవే, తను చాలా అభిమానంగా పిలిచాడు కదా నీ పని తగ్గించుకొని వస్తే బాగుంటుంది కదా అంటూ రిక్వెస్ట్ చేస్తుంది వేద. మీరు ఎప్పుడైనా అడిగితే నేను కాదన్నానా, నేను అక్కడక్కడ అడుగుతుంటే ఏంటండీ మరీను, నేను ఎప్పుడైనా మిమ్మల్ని ఉంచి ఏమైనా ఆశించేనా కనీసం కొంచెం ప్రేమ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంటుంది వేద.

నేను వినికి మీ గురించి గొప్పగా చెప్పాను తను మీ గురించి అలాగే అనుకుంటున్నాడు. మిమ్మల్ని విన్నికి ఇంట్రడ్యూస్ చేయాలని చాలా ఎక్సైజ్మెంట్తో ఉన్నాను. నన్ను డిసప్పాయింట్ చేయడం మీకు తప్పని అనిపించడం లేదా అని వేద అడిగితే, నాకు ఏమీ కనిపించడం లేదు ఇప్పుడు నీ ఫ్రెండ్ అని కలవకపోతే పంపలేవీ మునిగిపోవు అంటాడు యష్. నేను ఇప్పుడు విన్నీకి ఏమని చెప్పాలి అని వేద అడిగితే ఇట్స్ యువర్ ప్రాబ్లం అంటూ ఫోన్ పెట్టేస్తాడు యష్. ఎంత ఫ్రూట్ గా బిహేవ్ చేశారు తను నన్ను అస్సలు కాకర చేయడం లేదు అనుకుంటూ బాధపడుతుంది వేద.

భార్యాభర్తల మధ్య ఇవన్నీ సహజం అంటున్న విన్ని..

ఫోన్ పెట్టేసిన యష్ నా ప్రేమని కోరుకోవట్లేదట నేనేదో తన ప్రేమ కోసం పాకులాడుతున్నట్లు అనుకుంటాడు యష్. వేద దగ్గరికి వచ్చిన విన్నీ మీ హస్బెండ్ తో మాట్లాడావా అని అడుగుతాడు విన్ని. వేద ఏమీ మాట్లాడకపోవడంతో నాకు అర్థమైంది నీ ఫ్రెండ్ నువ్వే వెళ్ళు అని ఉంటాడు అంతేనా అంటాడు విన్ని. హస్బెండ్ అంటే వైఫ్ మధ్య ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సర్దుకుపోవాలి మ్యారేజ్ కి ఉన్న ఇంకొక పేరు మేనేజ్ అంటాడు విన్ని. నీలో నాకు నచ్చేది ఇదే, పరిస్థితులకు తగ్గట్టుగా నీకు నువ్వే ఎంత బాగా ఎడ్జస్ట్ అవుతావు.

ఆల్వేస్ స్మైలీ అందరూ నీలాగా ఎందుకు ఉండరు అంటుంది వేద. ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని వేద అంటే, నాకు నచ్చిన నేను మెచ్చిన అమ్మాయిని ఆ దేవుడు ఇంకా రాయలేదు, నువ్వు ఎక్కవలసిన రైలు జీవితకాలం లేట్ అని ఎవరో కవి రాసినట్లుగా, ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నకి కూడా జీవితకాలం లేట్ అంటాడు విన్నీ. ఏమైనా నన్ను భరించడం కష్టం నేను మూడీ కదా అంటాడు విన్ని. నువ్వు మీ ఆయన గురించి చెప్తూ ఉంటే ఆయన్ని కలవాలనిపిస్తుంది అంటాడు విన్నీ. అయితే భోగి పండుగకి వచ్చేయ్ అంటూ ఇన్వైట్ చేస్తుంది వేద.

పెద్దమ్మ చెప్తేనే వింటాను అంటున్న చిత్ర..

ఓకే చెప్తాడు విన్ని. మరోవైపు ముగ్గుల పోటీకి ప్రిపేర్ అవుతున్న చిత్ర దగ్గరికి వచ్చిన వసంత్ నువ్వు ఇంటర్వ్యూ కి ప్రిపేర్ అవ్వాలి ఇప్పుడు ఈ ముగ్గులు నీకు అవసరమా అని అడుగుతాడు. అవసరమే అయినా నువ్వు నాకు చెప్పడం ఏంటి అంటుంది చిత్ర. నీకు కాబోయే మొగుడిని నేను చెప్పిన మాట వినవా అంటాడు వసంత్. నువ్వు చెప్పిన మాట వినను మా పెద్దమ్మ చెప్తేనే వింటాను అంటుంది చిత్ర. అక్కడికి వచ్చిన సులోచన నీకు ఈ ముగ్గులు పోటీ అవసరమా రేపు మీకు పెద్ద ఉద్యోగం వస్తుంది పెద్ద జీతం పొందుకుంటావు అంటుంది.

నేను వద్దనే చెప్పాను పెద్దమ్మ కానీ ఈ వసంతే వినట్లేదు ఈ ముగ్గులు పోటీలో పార్టిసిపేట్ చేయకపోతే నాకు ముగ్గులు రావని నువ్వు నాకు సరిగ్గా నేర్పించలేదని, కాబోయే అత్తగారిని ఏమైనా అంటే తనకే బాధని అంటూ వసంత్ మీద తోసేస్తుంది చిత్ర. ఆ మాటలు విన్న సులోచన మా పెద్దల్లుడు యశోదరే బంగారం అనుకున్నాను చిన్నల్లుడు వసంత్ కూడా బంగారమే అంటూ ఎమోషనల్ అయిపోతుంది. నువ్వు ముగ్గుల పోటీలో పాటిస్పేట్ చెయ్యు ఏ అడ్డ గాడిద వద్దన్నా వినొద్దు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

వేద కి ఇగో ఎక్కువ అంటున్న యష్..

విన్నారా అడ్డగాడిద గారు అంటూ వసంత్ ని ఆటపట్టిస్తుంది చిత్ర. మరోవైపు హర్శ్ గా ఫోన్ పెట్టేసి తప్పు చేశానా, అయినా తనైనా రిక్వెస్ట్ చేయొచ్చు కదా మీరు లేకపోతే నేను వెళ్ళను అంటూ మరొకసారి బ్రతిమాలొచ్చు కదా, తనకి బాగా ఇగో నేను కాబట్టి భరిస్తున్నాను అనుకుంటాడు యష్. అంతలో ఫోన్ రావడంతో తనే ఫోన్ చేసి ఉంటుంది ఈసారి రిక్వెస్ట్ చేస్తే ఒప్పుకోవాలి అనుకొని లిఫ్ట్ చేస్తాడు. తీరా అది మిస్డ్ కాల్ అవుతుంది. అవతలి వాళ్ళని తిట్టుకుంటూ ఫోన్ పెట్టేసిన ఎస్ కి వాల్ పేపర్ మీద వేద, ఖుషి ఫోటో కనిపిస్తుంది.

వేద ఫోటోని చూసినా యష్ పర్వాలేదు మిసెస్ న్యూసెన్స్ చూడ్డానికి బాగుంటుంది అనుకుంటాడు. ఫోన్ ని అక్కడే వదిలేసి ఏదో పనిమీద బయటికి వెళ్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన వేద తన ఫోటోలు చూసి తనకి నేనంటే ఇష్టమే కానీ బయటపడట్లేదు. భార్య దగ్గర భర్తకి ఈగో అవసరమా అనుకుంటుంది. తన ఫోటోని చూసి మురిసిపోతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన ఎస్ నా ఫోను ఎందుకు చెక్ చేస్తున్నావ్ ఇది బాడ్ మేనేర్స్ అంటాడు. నేను ఫోటో చూస్తున్నాను చాలా బాగుంది అంటుంది వేద.

విన్ని ముందు ఇవన్నీ వద్దు అంటున్న వేద..

ఎందుకు బాగోదు షీ ఇస్ బ్యూటిఫుల్ తనకి నా లైఫ్ లో ఒక ఇంపార్టెంట్ ప్లేస్ ఉంది అంటాడు. థాంక్స్ అంటుంది వేద. నువ్వెందుకు థాంక్స్ చెప్పాలి నేను మాట్లాడుతున్నది నా బంగారు తల్లి ఖుషి గురించి అంటాడు యష్. కానీ పక్కన నా ఫోటో కూడా ఉంది కదా అంటూ మురిసిపోతుంది వేద. నీ ఫోటో పెట్టాలనిపిస్తే ఇది కాదు అంటూ డైనోసార్ ఫోటో చూపిస్తాడు. అంటే నేను డైనోసార్ లాగా కనిపిస్తున్నానా అని వేద అంటే కాదు అదే నీలాగా కనిపిస్తుంది అంటూ తనని ఆటపట్టిస్తాడు యష్. రేపు విని మన ఇంటికి వస్తాడు అతని ఎదురుగుండా ఇలాంటి టామ్ అండ్ జెర్రీ ఫైటింగ్స్ వద్దు అంటుంది వేద.

అతను ఎప్పుడు వస్తాడు చెప్పు ఆ టైం కి నేను బయటికి వెళ్లిపోతాను అంటాడు యష్. ఆ పని చేయొద్దు అతనితో కాస్త ప్లజంట్ గా ఉండండి అంటుంది వేద. రాణి చూద్దాం అనుకుంటాడు యష్. మరో వైపు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న బ్రమరాంబిక నా గదిలో టీవీ తీసేయమంటూ కైలాష్ తో చెప్తుంది. ఏమైంది అని కైలాష్ అడిగితే చండాలమైన న్యూస్లు వినలేకపోతున్నాను ఎవరితో ఒక ఇద్దరు పిల్లలు తల్లి వేరే వాడిని నమ్మి వచ్చేసింది వాడు వాడుకున్నంత కాలం వాడుకొని వదిలేస్తే పిచ్చెక్కి రోడ్డుమీద తిరుగుతుంది. ఇలాంటి ఆడవాళ్ళ వల్ల మొత్తం ఆడదానికే అవమానం అంటూ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది భ్రమరాంబిక.

ఆస్కార్ లెవెల్లో నటిస్తున్న అభి..

ఆ మాటలు విన్న కైలాష్ అభి తో నాకు ఒక డౌట్ మీ అక్క ఏదో విషయాన్ని దృష్టిలో పెట్టుకొని టీవీ వంకతో మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తుంది అంటాడు కైలాష్. అయితే ఏమంటావు అని అభి అంటే మీ మధ్య ఉన్న విషయం తెలిసిపోయిందేమో అంటాడు కైలాష్. తెలిస్తే ఏంటంట అయినా తప్పంతా నీదే అభి ఈ ముసుగులో గుద్దులాట ఎన్నాళ్ళు నిజం చెప్పొచ్చు కదా అంటుంది మాళవిక. దానికి టైం కావాలి అంటాడు అభి. టైం గాడిది గుడ్డ నేను విను స్ట్రైట్ గా ఒక ప్రశ్న అడుగుతున్నాను నన్ను గాని మీ అక్కను గాని ఎవరినో ఒకరిని తేల్చుకోమంటే నువ్వు ఎవరిని తేల్చుకుంటావ్ అని అడుగుతుంది.

గుండె లబ్దం అని కొట్టుకుంటుంది నువ్వు ఒక్కదాన్నే ఎంచుకోమంటే నువ్వు దేన్నీ ఎంచుకుంటావు అంటాడు అభి. దానికి దీనికి ఏంటి సంబంధం నేను నిన్ను సూటిగా ప్రశ్న అడిగాను నువ్వు నాకు సూటిగా సమాధానం చెప్పు అంటుంది మాళవిక. నేను మంగళ సూత్రం కట్టేటప్పుడు నీ జడ ఎత్తి పెట్టుకునేది ఎవరో తెలుసా మీ వదిన అంటాడు అభి. ఆ మాటలకి ఆనందంతో ఐయామ్ హ్యాపీ అంటుంది మాళవిక. వీడి యాక్టింగ్ కి ఆస్కార్ కూడా సరిపోదు అనుకుంటాడు కైలాష్.

Ennenno Janmala Bandham January 25 Today Episode: మా అమ్మ ఏది చెప్తే అది చేస్తాను అంటున్న ఖుషి..

మరోవైపు ఖుషికి తను తెచ్చిన డ్రెస్ వేయాలంటే తను తెచ్చిన డ్రెస్ వేయాలి అంటూ వియ్యపురాళ్ళు ఇద్దరూ మళ్లీ గొడవపడతారు. ఇందులో గొడవపడడానికి ఏముంది ఒక పూట ఒకరు ఒక ఫోటో ఒకరు వెయ్యండి అని సలహా ఇస్తారు వాళ్ళ భర్తలు. అలా ఎలా కుదురుతుంది అంటూ అప్పుడే వచ్చిన ఖుషి ని నా డ్రెస్ వేసుకో అంటే నా డ్రెస్ వేసుకో అంటూ సతాయిస్తారు. అమ్మ ఏ డ్రెస్ వేసుకొని అంటే అదే వేసుకుంటాను అంటుంది ఖుషి. నా కూతురు నేను తెచ్చిన డ్రెస్ సెలక్ట్ చేస్తుంది అని సులోచన అంటే నా కోడలు నేను తెచ్చిన డ్రెస్ సెలెక్ట్ చేస్తుంది అంటూ మాలిని అంటుంది. భోగి ఎలాగ చేస్తారో చెప్తుంది సులోచన.

ఈలోపు ఖుషి ని తన ఫ్రెండ్స్ ఆడుకోడానికి పిలిస్తే తను వెళ్ళిపోతుంది. తరువాయి భాగంలో కుటుంబమంతా భోగి సంబరాలు చేసుకుంటారు.వేద, విన్నిని యష్ కి పరిచయం చేస్తుంది. ఒకరిని ఒకరు చూసుకొని ఇద్దరు షాక్ అవుతారు. ఏంటి మీ ఇద్దరికీ ముందే పరిచయం ఉందా అంటుంది వేద.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జనవరి 25, 2023 at 10:14 ఉద.