Ennenno Janmala Bandham January 26 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో భోగిమంట వేసుకొని కుటుంబ సభ్యులందరూ అక్కడ కూర్చుంటారు. భోజనం అంట ఎందుకు వేస్తారు అని అడుగుతుంది ఖుషి. నేను చెప్తాను ఇలా రా అంటూ సులోచన చెప్పడం మొదలు పెడుతుంది రైతులకి పంట చేతికి వచ్చి భోగభాగ్యాలు చేతికి అందిస్తుంది కాబట్టి దీన్ని భోగి అంటారు. దక్షిణాయనికి ఈరోజు చివరి రోజు అని కొందరు, గోదాదేవి స్వామివారిలో ఐక్యమైన రోజు ఇదేనని, ఇంద్రుడి గర్వభంగాన్ని శ్రీకృష్ణుడు అణిచివేసిన రోజుకి గుర్తుగా భోగిని కొంతమంది చేసుకుంటారు అంటూ చెప్తుంది.
తల్లిదండ్రులకి సలహా ఇచ్చిన ఖుషి..
నాకు ఏమీ అర్థం కాలేదు అంటుంది ఖుషి. మీ అమ్మమ్మ ఎప్పుడు అంతే స్మాల్ క్వశ్చన్స్ కి కాంప్లికేట్ ఆన్సర్స్ ఇస్తుంది నేను సింపుల్ గా చెప్తాను ఇలా రా అని తన దగ్గరికి పిలుస్తుంది మాలిని. మీ స్కూలు రీఓపెనింగ్ రోజు ఎలాగైతే కొత్త బట్టలు కొత్త పుస్తకాలతోటి వెళ్తావో అలాగే భోగి రోజు కూడా పాత చెత్తంతా మంటలు వేసేసి రేపు సంక్రాంతి రోజు నుంచి అంతా ఫ్రెష్ గా స్టార్ట్ చేయాలి అంటే రేపటి నుంచి అన్ని ఫ్రెష్ అన్నమాట అంటుంది ఖుషి.
నువ్వు చెప్పింది అర్థమైంది అంటూ తల్లిదండ్రులకు దగ్గరికి వెళ్లి నాకు భోగి గురించి చాలా బాగా చెప్పారు ఇప్పుడు నేను చెప్తాను నేను చెప్పినట్లే మీరు వినాలి అంటుంది ఖుషి. నువ్వు నాన్న మీద చిరాకు పడతావు కదా ఈరోజు భోగి పండుగ కదా కోపాలు మీ చిరాకులు అన్నీ ఈ భోగి మంటలు వేసేయండి. రేపు సంక్రాంతి కదా నువ్వు కొత్తగా అలుగు అమ్మ, నాన్న కొత్తగా కోప్పడతారు అప్డేట్ అవ్వండి అంటూ తల్లిదండ్రులకు చెప్తుంది ఖుషి.
నాకు జ్ఞానోదయం అయింది అంటున్న వసంత్..
ఆ మాటలకి అందరూ నవ్వుకుంటారు. నీకు లాగా ముద్దపప్పు కాదు సులోచన అంటుంది మాలిని. అవును పెద్దయ్యాక మీకులాగే పెద్ద గయ్యాళి గంప అవుతుంది అంటూ చురక అంటిస్తుంది సులోచన. మరోవైపు చదువుకుంటున్న చిత్ర దగ్గరికి వచ్చిన వసంత్ నన్ను చూడాలని రమ్మన్నావు కదా అని అడుగుతాడు. అంతా శీను లేదు నాకు నిద్ర రాకుండా గంటకి కాఫీ పెట్టి ఇవ్వాలి, కూర్చొని కూర్చొని కాళ్లు లాగేస్తే నా కాళ్లు నొక్కాలి అర్థమైందా అంటుంది చిత్ర.
నాకు జ్ఞానోదయం అయింది అంటాడు వసంత్. ఏంటి అని చిత్ర అంటే పెత్తనం చేసేదాన్ని పెళ్ళాం అంటారు పడుండేవాడిని పెనిమిటి అంటారు అంటూ నవ్వుతాడు వసంత్. మరోవైపు కుటుంబ సభ్యులు అందరూ భోగిమంట చుట్టూ గొబ్బిళ్ళు ఆడుతూ ఆనందంగా గడుపుతారు. సులోచన మాలిని వాళ్ళ వాళ్ళ చిన్నప్పటి భోగి పండుగ కబుర్లు చెప్తారు. అటు ఇటు చూస్తున్న వేదని ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావు అని అడుగుతాడు రత్నం. మా ఫ్రెండు విని అమెరికన్ నుంచి వచ్చాడని చెప్పాను కదా మావయ్య, ఇక్కడికి ఇన్వైట్ చేశాను వస్తానన్నాడు ఇంకా రాలేదు అంటూ వెయిట్ చేస్తుంది వేద.
విన్నిని తిట్టుకుంటున్న యష్..
వాడిని రిసీవ్ చేసుకోవడానికి ఈ మిసెస్ న్యూసెన్స్ వెయిట్ చేయటం, రాకరాక తన ఫ్రెండు ఇప్పుడే యూఎస్ నుంచి ఊడిపడాలా టార్చర్ కాకపోతే అనుకుంటాడు యష్. అంతలోని అక్కడికి వచ్చిన విన్నిని నీకోసం చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను అంటూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పరిచయం చేస్తుంది. తనకి పరిచయం చేయకుండానే అందరి పేర్లు టకటక చెప్పేస్తాడు విన్ని. మా అందరి గురించి నీకు ఎలా తెలుసు అని మాలిని అడిగితే మీ అందరి గురించి లేదు నాకు ఎప్పుడో చెప్పింది అంటాడు విన్ని.
మీరు నాకు బాగా నచ్చేసారు అంకుల్ అని ఖుషి అంటే నన్ను అంకుల్ అనొద్దు కాల్ మీ విన్ని అంటూ తనకి చాక్లెట్ గిఫ్ట్ గా ఇస్తాడు విన్నీ. చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు అంటారు చిత్ర వసంత్. ఈ అబ్బాయి మొదటి నుంచి ఇంతే చిన్నప్పటినుంచి వేదకి, ఇతనికి మంచి స్నేహం అంటుంది సులోచన. కానీ ఇప్పటికీ బ్రహ్మచారి అని వేద తండ్రి అంటే ఏమి భగ్న ప్రేమికుడా అని అడుగుతాడు రత్నం. ఏమో మరి బయటపడడు చాలా లోతు మనిషి అంటూ నవ్వుతాడు వేద తండ్రి. వేదం విని తీసుకొని యష్ దగ్గరికి వెళ్తుంది.
ఒకరిని చూసి ఒకరు షాక్ అయిన యష్, విన్ని..
నా ఫ్రెండ్ విన్నీ వచ్చాడు వెనక్కి చూడండి అంటుంది. వెనక్కి తిరిగేసరికి ఎదురుగా ఉన్న విని చూసి షాక్ అవుతాడు సేమ్ పొజిషన్లో విన్ని కూడా ఉంటాడు. నువ్వా అంటే నువ్వా అనుకుంటారు. ఇద్దరు ముందే తెలుసా నాకు చెప్పనేలేదు అంటుంది వేద. వెల్కమ్ హోటల్ దగ్గర అంటాడు యష్. కలవడం అంటే మామూలుగా కాదు పెద్ద గొడవ జరిగింది అంటాడు విన్ని. మీ ఇద్దరూ ఫైట్ చేసుకోవడం ఏంటి అంటూ షాక్ అవుతుంది. విన్నీ తరుపున వినికి తనే సారీ చెప్తుంది వేద. తన కంగారుని చూసి నేను సరదాగా జోక్ చేశాను అంటాడు విన్ని, యష్ కూడా అలాగే చెప్తాడు.
హమ్మయ్య ఎంత టెన్షన్ పడ్డానో అంటుంది వేద. డోంట్ వర్రీ నేను ఉండగా నిన్ను టెన్షన్ పడనిస్తానా అంటూ యష్ ని కొత్తగా పరిచయం చేసుకుంటాడు విన్ని. అదే టైంలో పిన్నికి కాల్ రావడంతో పక్కకి వెళ్తాడు. అప్పుడు వేదం అయితే మీరు హోటల్ కి వచ్చారు అన్నమాట, నాతో రానని చెప్పారు కదా ఎందుకు వచ్చారు వచ్చినవారు లోపలకి నన్ను ఎందుకు కలవలేదు అంటూ నిలదీస్తుంది. సమాధానం చెప్పలేక అక్కడ నుంచి వెళ్ళిపోతాడు యష్. పైకి విన్నీ అంటే ఇంట్రెస్ట్ లేనట్టుగా నటిస్తూ ఫాలో అవుతున్నారన్నమాట. ఇదేదో బాగుంది దోబూచులాట అంటూ నవ్వుకుంటుంది వేద.
భర్త జెలస్ ని చూసి నవ్వుకుంటున్న వేద..
మిస్టర్ ఆరోగెంట్ కి జెలస్ అన్నమాట బట్ క్యూట్ జలస్ మీ పని చెప్తా అనుకుంటూ నవ్వుకుంటుంది వేద. మరోవైపు మాళవికను నిద్ర లేపుతాడు కైలాష్. ఏంటి కైలాష్ పొద్దున్నే నిద్ర లేపుతావు బుద్ధి లేదా అంటూ కసురుకుంటుంది. పొద్దున్నే అంటావేంటి సిస్టర్ అవతల నీ సీటు చిరిగిపోయేలాగా ఉంది అంటూ తనని కంగారుగా బయటికి తీసుకొస్తాడు కైలాష్. బయట ముగ్గు వేస్తున్న భ్రమరాంబిక అని చూసి సారీ వదినా నిద్రపట్టేసింది మెలకువ రాలేదు అంటుంది మాళవిక.
పరవాలేదు బంగారం ఒక్కొక్కసారి అలసిపోతే అంతే మెలకువ రాదు మరి కాసేపు పడుకోలేక పోయావా నిద్ర లేపాడు అంటూ తనని తిడుతుంది భ్రమరాంబిక. నేను టూ మినిట్స్ లో రెడీ అయి వచ్చేస్తాను అని లోపలికి వెళ్ళిపోతుంది మాళవిక. ఈ భ్రమరాంబిక ది ఇంత ఓవరాక్షనా అంటూ ఆశ్చర్యపోతాడు. ఏంటి ఆలోచిస్తున్నావు కైలాష్ నీకు ఏమీ అర్థం కాలేదని నాకు అర్థమైంది అంటూ చెప్పడం మొదలుపెడుతుంది భ్రమరాంబిక.
బ్రమరాంబిక నటనకు ఫిదా అయిన కైలాష్..
గొర్రె ఒక్కసారి వాడిని నమ్ముతుంది ఎందుకో తెలుసా అని అడుగుతుంది భ్రమరాంబిక.ఎందుకంటే వాడు దానికి బాగా తిండి పెట్టి బిడ్డలాగా బాగా చూసుకుంటాడు అందుకు అంటాడు కైలాష్. గొర్రె ని ఎంత బాగా నమ్మిస్తే నరకడానికి అంత బాగా పనికొస్తుంది భ్రమరాంబిక. నాకు బాగా అర్థమైంది మేడం ఒకసారి మీ కాళ్ళకి దండం పెట్టుకోవచ్చా అని కైలాష్ అడిగితే ఏం నీకు గొర్రె ని అవుదామని ఉందా అంటూ అక్కడినుంచి వెళ్ళిపోతుంది భ్రమరాంబిక.
సీన్ కట్ చేస్తే నలుగురితో కలిసిపోయి సరదాగా మాట్లాడుతున్న విన్నీని అందరూ మెచ్చుకుంటారు. ఏంటి బ్రో నా జోక్స్ నీకు నచ్చలేదా అంటూ యష్ అడుగుతాడు విన్నీ. అలాంటిదేమీ లేదు అంటాడు యష్. అప్పుడే కాఫీలు తీసుకొచ్చిన వేదతో విని అంకుల్ మమ్మల్ని బాగా నవ్విస్తున్నారు అని చెప్తుంది ఖుషి. సడన్గా సీరియస్ అయినా విని నేను అమెరికా నుంచి ఎందుకు వచ్చాను తెలుసా అంటాడు.
Ennenno Janmala Bandham January 26 Today Episodeనిజం చెప్పి నవ్వించిన విన్నీ..
ఆ మాటకి అందరూ షాక్ అవుతారు. ఎందుకో తెలుసా లేదు చేతి ఫిల్టర్ కాఫీ తాగడానికి అంటూ పెద్దగా నవ్వుతాడు విన్ని.దాంతో అందరూ ఒక్కసారిగా నవ్వుతారు. యష్ జలస్గా ఫీల్ అవ్వడాన్ని గమనిస్తుంది వేద. తరువాయి భాగంలో అందంగా ముస్తాబయి వచ్చిన వేద ఎలా ఉంది అంటూ విన్నీ ని అడుగుతుంది. విన్నీ వేద కి రోజ్ ఫ్లవర్ ఇస్తాడు.