Ennenno Janmala Bandham January 3 Today Episode: రోజు ఎపిసోడ్ లో శ్రీవారు నా మీద రాసిన కంప్లైంట్ ఏంటో అనుకుంటూ ఆ కంప్లైంట్ ని చదువుతుంది వేద. నువ్వు బెడ్ రూమ్ లోకి రాగానే కాల్ పట్టీలు చేతి గాజులు తీసి పక్కన పెట్టేస్తున్నావ్ అంటాడు యష్.
ఈ అలవాటు చిన్నప్పటిది అంటున్న వేద..
అయితే మీకేంటి ప్రాబ్లం, పడుకునేటప్పుడు గాజులు పట్టీలు సౌండ్ మాకు డిస్టబెన్స్ గా ఉంటుంది అందుకే తీసేస్తాం. అది నిన్న ఈరోజు కాదు నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. అయినా నేను డాక్టర్ని కదా ఆపరేషన్ చేసేటప్పుడు అవేవీ ఉండకూడదు సో అదే అలవాటైపోయింది. అయినా నేను గాజులు పట్టీలు తీసేస్తే నీకేంటి ప్రాబ్లం నా గాజులు, నా పట్టీలు, నా ఇష్టం,నా కంఫర్ట్ అనుకుంటుంది వేద. ఎంతసేపు నీ గోలేనా నేను చెప్పింది వినిపించుకోవా అంటాడు యష్.
గాజుల సౌండ్ ని పట్టీల సౌండ్ వినిపిస్తుంటే నాకు హాయిగా అనిపిస్తుంది కాబట్టి నువ్వు బెడ్ రూమ్ లోకి రాగానే వాటిని తీసేయొద్దు ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తాడు యష్. మీరు అడిగితే నేను ఒప్పేసుకోవాలా స్లో ప్లీజ్ అంటుంది వేద. గాజులు పట్టీలు వేసుకుంటే నువ్వు ఎలా ఉంటావో తెలుసా గజ్జల గుర్రంలా ఉంటావు అంటాడు యశ్, ఆ మాటకి ఉడుక్కున్న వేద నన్ను గజ్జల గుర్రం అంటావా, నన్ను గజ్జల గుర్రం అనటానికి నీకు ఎంత ధైర్యం, నీ సంగతి తేలుస్తాను.
భర్త సంగతి తెలుస్తానన్న వేద..
మీకోసం నేను పట్టీలు పెట్టుకొని గాజులు వేసుకొని రావాలా మీ సంగతి తేలుస్తాను అనుకుంటుంది. అంతలోనే అక్కడికి వచ్చిన ముత్యాలు అమ్మ మీకోసం పెద్దమ్మ గారు ఆరు బయట మంచం వేయించారు అంటుంది. అందుకు సిగ్గుపడిన వేద మాకు బెడ్ రూమ్ లోనే కంఫర్ట్ గా ఉంది బయట వద్దు అంటుంది. పల్లెటూర్లో ఆరు బయట పండు వెన్నెల్లో, భర్తతో పడుకుంటే ఆ హాయే వేరు అంటుంది ముత్యాలు. సిగ్గుపడిన వేద వద్దులే అంటుంది.
అలా వీల్లేదు పెద్దమ్మ గారు వాళ్ళు మీకోసం పడక ఏర్పాటు చేశారు మీ ఇద్దరికీ వెన్నెల రాత్రి అంటూ తను కూడా మెలికలు తిరిగిపోతుంది ముత్యాలు. మరోవైపు గదిలోకి వచ్చిన రాణిని చూసి మొదటి రాత్రి గదిలోకి వచ్చిన జ్ఞాపకాలు ఇప్పటికీ గుర్తుకొస్తున్నాయి అంటాడు రాజా. నీకు వయసు వచ్చిన వయసు మాత్రం యవ్వనంలో ఉండిపోయింది అంటుంది రాణి. వయసు శరీరానికి కానీ వయసుకు కాదు అంటాడు రాజా. మనం ముసలి వాళ్ళం అయిపోయాం అంటుంది రాణి.
ఈ రోజుని జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు అంటున్న రాజా..
మన పెళ్లయినప్పుడు మన ఇద్దరికి వైస్ తేడా నాలుగేళ్లు ఇప్పటికీ కూడా వయసు తేడా నాలుగేళ్లే చూసావా వయసులో తేడా లేదు అంటూ నవ్వుతాడు రాజా. అది సరే కానీ పిల్లలిద్దరికీ ఆరుబయట పక్కా ఏర్పాటు చేశాను. వాళ్లకి నచ్చుతుందంటావా అంటుంది రాణి. ఎందుకు నాకు చదువు సిటీలో ఇరుకు గదిలో ప్రకృతిని సరిగ్గా ఆస్వాదించలేరు. జీవితాంతం పండు వెన్నెల ఈ రాత్రిని గుర్తుపెట్టుకుంటారు.
మరోవైపు ఆరుబయట పడుకున్న యష్, సిటీలో ఫ్రెండ్స్ అందరూ అత్తారింటికి వెళ్లడానికి ఎందుకు ఉత్సాహం చూపిస్తారో అనుకునేవాడిని, కానీ ఇక్కడికి వచ్చాక వేద వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు చేసిన పిండి వంటలు చూపించిన ఆప్యాయత చేస్తున్న మర్యాదలు చూస్తుంటే మళ్ళీ మళ్ళీ ఎప్పుడు ఇక్కడికి వద్దాము అనిపిస్తుంది. ఈ ఆరుబయట వెన్నెల్లో ఇలా పడుకుంటే అద్భుతంగా ఉంది. ఈ మెసేజ్ న్యూసెన్స్ ఏంటి ఇంకా రాలేదు అనుకుంటాడు యష్.
భార్యను చూసి మైమరిచిపోయిన యష్..
అంతలోనే కాళ్ళు పట్టీలు సౌండ్ విని తిరిగి చూస్తాడు. అందంగా ముస్తాబై వస్తున్న వేదని చూసి ఆమెని అలా చూస్తూనే ఉండిపోతాడు. బాపు గారి బొమ్మల చక్కగా ఉన్నావ్ రోజు ఇలాగే తయారవ్వచ్చు కదా ఉంటాడు యష్. ఇలా రెడీ అవ్వాలంటే ఎంత కష్టమో తెలుసా అంటుంది వేద. ఈ భూమ్మీద దేవుడు మీద అద్భుత సృష్టి మీ ఆడాళ్లు అంటాడు యష్. ఆ మాటలకి నవ్వుతుంది వేద. అందుకేనా నీ మగవాళ్ళు జలస్ ఫీల్ అయ్యి ఆడవాళ్ళ మీద కోపం చూపిస్తారు అంటుంది వేద.
ప్రతి మగవాడి కోపం వెనుక ప్రేమ ఉంటుంది తెలుసా అంటాడు యష్. ఏమో నాకు తెలిసి మగవాడు కోపం వెనుక కోపమే ఉంటుంది అంటూ యష్ వైపు చూస్తుంది వేద. సరేగాని గోరువెచ్చని పాలు అమ్మమ్మ పంపించింది ఇది తాగితే బాగా నిద్ర పడుతుంది అంట అంటూ భర్తకి ఇస్తుంది ఆ గ్లాస్. తను తాగి మిగతా సగం భార్యకిస్తాడు యష్. ఈ రాత్రి, ఈ మంచం ఈ చల్లగాలి చాలా ఆహ్లాదకరంగా ఉంది. అందుకే రాత్రంతా మీ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉండిపోవాలని ఉంది అంటాడు యష్.
భార్య మాటకి కంగారు పడిన యష్..
నిజమే మనం సిటీ లైఫ్ లో దేనికోసం పరిగెడుతున్నాము తెలియకుండానే బ్రతికేస్తాం కానీ ఆ పరుగు ఆపి ఒక్కసారి గమనిస్తే మన పక్కనే ఎంత ఆనందంగా ఉందో ఎన్ని అద్భుతాలు ఉన్నాయో కనిపిస్తాయి అంటుంది వేద. అయితే మనం కూడా ముసలయ్యాక మీ అమ్మమ్మ తాతయ్య లాగా ఈ పల్లెటూరికి వచ్చేస్తే సంతోషంగా జీవించవచ్చు. ఇప్పుడు నీ కోరిక తీరుతుంది నాకు కూడా ప్రశాంతంగా ఉంటుంది అంటాడు యష్. ఇక్కడ ఒకటే మంచం ఉంది ఇద్దరం ఎలా పడుకుంటాం అంటాడు యష్.
ఇందులోనే ఇద్దరం పడుకోవాలి అంటుంది వేద. ఇది ఆరు బయట మన ఇంట్లో లాగా సోఫాలు మంచాలు లేవు మీరు వెళ్లి సపరేట్గా పడుకోవడానికి అంటుంది వేద. ఓకే ఇక్కడ అడ్జస్ట్ అవుదాం అంటాడు యష్. ఒక పని చేద్దాం నువ్వు మంచం మీద ఒక చివరి వైపు పడుకో, నేను మరో చివరి వైపు పడుకుంటాను అంటాడు యష్. ఈ టైంలో ఖుషి ఉంటే బాగుండేది మనిద్దరి మధ్యలో పడుకునేది నాకు సేఫ్టీ గా ఉండేది అంటుంది.
భర్త మాటలకి మూతి ముడుచుకున్న వేద..
ఖుషి ఉంటే నాకు ఈ బాధే ఉండేది కాదు అంటాడు యష్. అంటే నాతో బెడ్ షేర్ చేసుకోవడం మీకు బాధా అంటూ మూతి ముడుచుకుంటుంది వేద. ఒక రాత్రి గడిచిపోతే చాలు అని వేద అంటే నాది కూడా సేమ్ ఫీలింగ్ అంటాడు యష్. మంచం మీద చెరో వైపు తిరిగి పడుకుంటారు యష్,వేదలు. కళ్ళు మూసుకున్న వేదాన్ని పడుకున్నావా అని అడుగుతాడు యష్. అవును అంటుంది వేద.
పడుకుంటే ఎలా సమాధానం చెప్పావ్ అంటాడు యష్. మీరు ప్రశ్న అడగకముందు తెలిసిందని బెస్ట్ సీఈఓ గారికి అంటూ మూతి తిప్పుకుంటుంది వేద. నిద్ర పట్టని యష్ వేదని డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం చీకట్లో ఉన్నామా వెలుతురులో ఉన్నామా అని అడుగుతాడు. వెన్నెల్లో ఉన్నట్లు అంటుంది వేద. అర్థమైంది చీకట్లో వెలుగంటే వెన్నెలే కదా అంటాడు యష్. గుడ్ నైట్ నాకు నిద్ర వస్తుంది వేద.
Ennenno Janmala Bandham January 3 Today Episode: భార్యని ఇరిటేట్ చేస్తున్న యష్..
నాకు నిద్ర రావట్లేదు కబుర్లు చెప్పొచ్చు కదా అంటాడు యష్. నువ్వు ఈరోజు కొత్తగా కనిపిస్తున్నావు అంటాడు యష్. నాకు కూడా నేను కొత్తగా అనిపిస్తున్నాను అంటుంది వేద. కానీ హ్యాపీ అంటాడు యష్. చాలా హ్యాపీ మనం ఈ పల్లెటూరి చాలా బాగా ఎంజాయ్ చేశాను కదా అంటుంది వేద. నేను మాట్లాడేది దాని గురించి కాదు మన మ్యారేజ్ లైఫ్ గురించి హౌ ఆర్ యు హ్యాపీ విత్ మీ అని అడుగుతాడు.
తరువాయి భాగంలో నాకు ఇప్పుడు తల్లి స్థానం మాత్రమే కాదు భార్య స్థానం కూడా కావాలి, భర్తగా మీ ప్రేమ కావాలి ఇట్లు ప్రేమతో మీ వేద యశోదర్ అంటూ లెటర్ రాసి కంప్లైంట్ బాక్స్ లో వేస్తుంది. అది చదివిన యష్ ని ఫీలింగ్స్ నాకు తెలుసు ఇదే కదా నువ్వు నాకు నుంచి ఆశిస్తుంది అంటాడు.