Ennenno Janmala Bandham January 30 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో విక్కీ, వేదకి రెడ్ రోజుకి ఇస్తుంటే ఇంకా చాలు అంత ఓవరాక్షన్ అవసరమా అంటాడు యష్. అసలు ఏమిటి ఈమె గొప్పతనం, మలయాళీ అమ్మాయి లాగా రెడీ అయిపోతే సరిపోతుందా మలయాళీ తెలిసి ఉండాలి కదా అసలు మలయాళీ అమ్మాయిలు గలగల మలయాళం లో మాట్లాడుతుంటే అందమే వేరు అంటూ పొసెసివ్గా మాట్లాడుతాడు యష్.

వేదని చూసి నోరెళ్లబెట్టిన యష్..

అప్పుడు వేద మలయాళం లో మాట్లాడి యష్కి నోరు మూయిస్తుంది. వేద మలయాళం లో మాట్లాడుతూ ఉంటే యష్ నోరేళ్ల పెడతాడు. ఆమెని అందరూ మెచ్చుకుంటారు. విన్ని,వేద కోసం వాటర్ బాటిల్ తీసుకొని వస్తాడు. ఆ బాటిల్ తీసుకొని ఇప్పుడు నా కన్నా మీకే అవసరం తీసుకోండి అంటూ యష్ కి ఆ బాటిల్ ని ఇస్తుంది వేద. ఇన్ని సంవత్సరాల్లో ఏ పండగకి వేసుకోలేదు ఎందుకు ఈ సంవత్సరమే మా కోడలు మలయాళీ గెటప్ వేసుకుంది అంటాడు రత్నం.

నాకు అదే అనుమానంగా ఉంది ఈ ఐడియా వేదకే వచ్చిందా లేకపోతే ఎవరైనా చెప్పి ఉంటారా అంటాడు వేద తండ్రి. ఇట్స్ మీ అంటూ అక్కడికి వస్తాడు విన్ని. అవునత్తయ్య నాకు ఈ ఐడియా విన్నీనే ఇచ్చాడు అంటూ విన్నీకి థాంక్స్ చెప్తుంది వేద. సో స్వీట్ అంటూ మెచ్చుకుంటుంది మాలిని. నీకు హ్యాపీగా లేదా అంటూ యష్ ని అడుగుతాడు విన్ని. ఐ యాం వెరీ హ్యాపీ అంటూ వెటకారంగా చెప్తాడు యష్. అతను అలా ఉడుక్కోవడం చూసి నవ్వుకుంటుంది వేద.

ఇరకాటంలో పడ్డ మాళవిక..

మరోవైపు ముగ్గల పోటీకి ఎవరిని ఆహ్వానించారు అంటూ కాలనీలో వాళ్ళని అడుగుతుంది మాలిని. ఆవిడ చాలా పాపులర్,విఐపి పెర్సన్ అమెరికాలో ఉమెన్స్ అసోసియేషన్ కి చైర్మన్. అక్కడ ముగ్గుల పోటీని ప్రారంభించింది ఈవిడగారే అంటారు వాళ్ళు. ఇంతకీ ఆవిడ పేరు ఏంటి అని అడుగుతుంది సులోచన. పేరు చెప్పబోయే అంతలో బ్రమరాంబిక అక్కడికి వస్తుంది. ఆవిడకి అందరూ బొకేలు ఇచ్చి గ్రాండ్ వెల్కమ్ చెప్తారు.

బ్రమరాంబిక కి మాలిని వాళ్ళని పరిచయం చేస్తారు కాలనీ వాళ్ళు. అక్కడ మాలిని వాళ్ళని చూసి షాక్ అవుతుంది మాళవిక. ఇదేంటి ఇక్కడికి తీసుకు వచ్చింది అనుకుంటుంది. కారులోంచి దిగిన మాళవికని చూసి ఈవిడొచ్చిందేంటి అంటుంది సులోచన. వదిన అంటుంది అంటే ఈవిడ అభివాళ్ళ సిస్టర్ అయి ఉంటుంది అంటుంది మాలిని. అదేంటి అలాగా చూసుకుంటున్నారు మీకు మీకు ముందే పరిచయాలు ఉన్నాయా అంటుంది భ్రమరాంబిక.

కొన్నింటిని వదిలించుకుంటేనే మంచిది అంటున్న మాలిని..

అలాంటిదేమీ లేదు ఇదే మొదటిసారి కలవటం అంటుంది మాళవిక. అదేంటి అలా అనేసింది అంటుంది సులోచన. అలా చెప్పి మన నెత్తిన పాలు పోసింది. వదిలించుకున్న దరిద్రం కోసం కొత్తగా డిస్కషన్ ఎందుకు మన దృష్టిలో తను జడ్జికి మరదలు మాత్రమే అంటుంది మాలిని. ఏంటి మీలో మీరే డిస్కషన్స్ పెట్టుకుంటున్నారు అంటుంది భ్రమరాంబిక. అలాంటిదేమీ లేదండి మీ గెటప్ సూపర్ అనుకుంటున్నాము అంటుంది మాలిని.

మీరు మా కాలనీకి జడ్జిగా రావడం చాలా సంతోషంగా ఉంది అంటుంది సులోచన. అవును నాకు కూడా చాలా సంతోషంగా ఉంది రావాలని వచ్చాను చేయాల్సింది చేసే పోతాను అంటుంది బ్రమరాంబిక. నన్నే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు నా గెస్ట్ ని వదిలేస్తున్నారు అంటుంది భ్రమరాంబిక. కొన్నింటిని వదిలించుకుంటేనే మంచిది భోగి మంటలు వేసి తగలేసిన తప్పులేదు అంటుంది మాలిని. బ్రమరాంబికా వాళ్ళు అక్కడినుంచి వెళ్ళిపోయాక ఏ మొహం పెట్టుకొని వచ్చావు అంటూ మాళవిక ని అడుగుతుంది మాలిని.

ఏం జరుగుతుందో అని భయపడుతున్న సులోచన..

తెలియకుండా ఎక్కడికి వచ్చాను కానీ నేనేంటో తెలియజేసే వెళ్తాను అంటుంది మాళవిక. పండగ పూట ఏం రాద్ధాంతం చేస్తుందో అంటూ కంగారుపడుతుంది సులోచన. ఆ అవకాశం మనం దానికి ఇవ్వద్దు మన జాగ్రత్తలో మనం ఉందాం అంటుంది మాలిని. మరోవైపు ఈ పండగని బాగా ఎంజాయ్ చేస్తూ ఫోటోలని వాళ్ళ యూఎస్ గ్రూపులో పోస్ట్ చేస్తుంటాడు విన్ని. మాట్లాడుకుంటూ ఉన్న వేద దంపతులని మీరు కూడా మాతో జాయిన్ అవ్వండి అంటాడు విన్ని.

ఇప్పుడే వస్తున్నాము అని విన్నీ తో చెప్పి, పండగపూట ఈ పాత డ్రెస్ ఏంటండీ అమ్మ వాళ్ళు కొన్న కొత్త డ్రెస్ వేసుకోండి విన్ని చూడండి ఎంత చక్కగా రెడీ అయ్యాడో అంటుంది వేద.అయితే నువ్వు కూడా అక్కడికి వెళ్లి జాయింట్ గా మెరిసిపోండి అంటూ వెటకారంగా మాట్లాడుతాడు యష్. అంతలోనే మాలిని భ్రమరాంబికని పరిచయం చేస్తుంది. పక్కనే ఉన్న మాళవికని చూసి షాక్ అవుతారు వేద దంపతులు. బ్రమరాంబిక కి యష్ వాళ్ళని పరిచయం చేస్తుంది మాలిని.

అందరూ ఆస్కార్ స్తాయి నటులే అనుకుంటున్న బ్రమరాంబిక..

అలాగే పక్కనే ఉన్న మాళవిక ని కూడా బ్రమరాంబిక గారి గెస్ట్ అంటూ కొత్తగా పరిచయం చేస్తుంది. మాలిని కనుసైగ అర్థం చేసుకున్న వేద అవునా అన్నట్లుగా మాళవిక ని విష్ చేస్తుంది. ఎవరికి ఎవరు ఏమి తెలియనట్లు ఎంత బాగా నటించేస్తున్నారో అందరూ ఆస్కార్ స్థాయి నటులే అంటూ నవ్వుకుంటుంది భ్రమరాంబిక. వేద దగ్గరికి వెళ్లి ఇది ఎంత మంచి పేరు ఎంత పవిత్రంగా ఉంది ఐ యాం ఇంప్రెస్డ్ అంటూ వేదని మెచ్చుకుంటుంది భ్రమరాంబిక. నువ్వు చాలా లక్కీ అంటూ యష్ తో చెప్తుంది. ఐ యాం వెరీ ప్రౌడ్ అఫ్ మై వైఫ్ అంటూ వేదని దగ్గరికి తీసుకుంటాడు.

ఐ యామ్ ఆల్సో వెరీ ప్రౌడ్ అఫ్ మై హస్బెండ్ అంటుంది వేద. మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగ ఉన్నారు కదా మాళవిక ఏమీ మాట్లాడవేమీ మౌనవ్రతమా అంటుంది భ్రమరాంబిక. అలాంటిదేమీ లేదు అంటుంది మాళవిక. భార్య అంటే ఇలాగే ఉండాలి కథ మాళవిక అంటూ వేదని చూపిస్తుంది బ్రమరాంబిక. నిజమే భార్య అంటే మా వేద లాగానే ఉండాలి కొందరు ఉంటారు మొగుణ్ణి వదిలేసి బరితెగించి రోడ్డుమీద పడతారు. కడుపుని పెట్టన్నా పిల్లల్ని కూడా కాదనుకుంటారు కొందరు, ఎందుకో పాపిష్టి జన్మలు అంటూ తిడుతుంది సులోచన.

Ennenno Janmala Bandham January 30 Today Episode కక్కలేక,మింగలేక అవస్థ పడుతున్న మాళవిక..

మీరేమీ ఫీల్ అవ్వట్లేదు కదా అని ఇద్దరూ బ్రమరాంబికని అడుగుతారు. నేనెందుకు ఫీలవుతాను మీరు ఏమైనా మా మాళవిక ని ఉద్దేశించి అన్నారా అంటే వెటకారంగా ఉంటుంది. అన్ని బాగానే ఉన్నాయి కానీ మీ డ్రెస్సే బాగాలేదు మీరు కూడా మీ వైఫ్ లాగా ట్రెడిషనల్ గా రెడీ అవ్వచ్చు కదా అంటుంది భ్రమరాంబిక. ఎనీవే ముగ్గుల పోటీకి టైం అవుతుంది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు అందరూ. బయటి వాళ్ళ చేతి కూడా చెప్పించుకోవటం అవసరమాకు వెళ్లి డ్రెస్ మార్చుకోవచ్చు కదా అంటుంది వేద.

మార్చుకోను గాక మార్చుకోను అంటాడు యష్. మరోవైపు ముగ్గుల పోటీకి వాళ్ల,వాళ్ల పేర్లు ఇమ్మంటూ వాళ్ళ భర్తలకి చెప్తారు మాలిని, సులోచన. వేదని కూడా పేరు ఇమ్మంటే తను ఇవ్వను అంటుంది. నువ్వు ఇలా చేస్తే యష్ భాదపడతాడు అంటాడు రత్నం. అమ్మ బెట్టి చేస్తుంది మా డాడీ వచ్చి బ్రతిమాలితే అమ్మ ఒప్పుకుంటుంది అంటుంది ఖుషీ. అంతలోనే ట్రెడిషనల్ గా రెడీ అయి వస్తాడు యష్.

తరువాయి భాగంలో ముగ్గులు వేస్తున్న వేదకి ఫోటోలు తీస్తూ ఉంటాడు విన్ని. ఎవడు విన్నీ అంట కదా వేదతో రాసుకొని పూసుకొని తిరుగుతుంటే ఎంత అసహ్యంగా ఉందో రియల్లీ ఐ పి టి యు అంటూ యష్ తో చెప్తుంది మాళవిక.