Ennenno Janmala Bandham January 4 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో ఆర్ యు హ్యాపీ విత్ మీ అని అడుగుతాడు యష్. చాలా చాలా హ్యాపీ,మీతో పెళ్లి నాకు ఒక కొత్త జన్మ. నేను నా లైఫ్ లో చాలా డిస్టర్బ్ అయ్యాను ప్రేమించిన వాడు వదిలేసి వెళ్ళిపోయాడు పెళ్లి నిశ్చితార్థం వరకు వచ్చి ఆగిపోయింది అన్నిటికీ మించి నేను తల్లిని అవ్వలేనన్న వార్త నన్ను కృంగదీసింది.

బాగా ఎమోషనల్ అవుతున్న యష్..

అయినా నేను ఆగిపోలేదు, నన్ను నేనే ఓదార్చుకొని కొత్త జీవితం వైపు అడుగులు వేసాను ఎవరైనా అనాధ బిడ్డని దత్తత తీసుకోవాలని డిసైడ్ అయ్యాను. అదే సమయంలో ఖుషి, మీరు నా లైఫ్ లోకి వచ్చారు. మీ ఇద్దరితో నేను మోర్ దెన్ హ్యాపీ అంటూ ఎమోషనల్ అయిపోతుంది వేద. ఇప్పుడు నేను అడుగుతున్నాను ఆర్ యు హ్యాపీ విత్ మీ అని అడుగుతుంది వేద.

నేను హ్యాపీ, నా లైఫ్ లోకి హ్యాపీ నెస్ వచ్చింది అంటే కారణం నువ్వే నాకు నీ వల్ల ఎలాంటి సమస్య లేదు నాకు నేనే సమస్య అంటాడు యష్. నా లోపలి ప్రపంచంతో నేను యుద్ధం చేస్తున్నాను గతం తాలూకా గాయాలు నన్ను ఇంకా బాధ పెడుతూనే ఉన్నాయి. నువ్వు గత నుంచి బయటపడినట్లుగా నేను బయటపడలేక పోతున్నాను అంటూ ఎమోషనల్ అయిపోతాడు.

భర్తకి ధైర్యం చెబుతున్న వేద..

అన్ని తలుపులు మూసేస్తే చిన్న కిటికీ ద్వారా అయినా వెలుగు వస్తుంది అంటారు కానీ నాకు అన్ని తలుపులు తెరిచే ఉన్నాయి అయినా మూసి ఉన్న చిన్న కిటికీ ద్వారా నన్ను చీకట్లోకి లాగేస్తుంది అంటూ ఎమోషనల్ అయిపోయి పక్కకు తిరిగి పడుకుంటాడు యష్. అతన్ని తన వైపు తిప్పుకొని మీరు పడి లేచారు నేను మళ్లీ మిమ్మల్ని పడిపోనివ్వను మీకు నేను తోడుంటాను అంటూ ధైర్యం చెప్తుంది వేద.

మన మధ్యలో ఖుషీ లేదు అందుకే మనిద్దరికీ నిద్ర పట్టడం లేదు అంటుంది వేద. మన ఇంట్లో ఉంటే తను మన మధ్యన పడుకొని మన రెండు చేతుల్ని తను పట్టుకొని తను పడుకుంటుంది మనల్ని నిద్రపుచ్చుతుంది. మన ఇద్దరినీ కలిపిన బంధం తనే, మన మధ్యన ఖుషి ఉందని కళ్ళు మూసుకొని పడుకుందాం నిద్ర పట్టేస్తుంది అంటూ భర్తని కళ్ళు మూసుకో మంటుంది వేద. మెలకువ వచ్చిన వేద నిద్రపోతున్న యష్ ని చూసి మురిసిపోతుంది.

మన మధ్యన ఉన్న అడ్డుతెరని తొలగించాలంటున్న వేద..

మన పెళ్లయిన ఇన్నాళ్ళకి మనసు విప్పి మాట్లాడుకున్నాం నా గురించి చెప్పాను మీ గురించి విన్నాను. భార్య భర్తలు అంటే ఒకరికొకరు బాధ్యత. మీరేమో ఒక పట్టాన పూర్తిగా బయటపడరు. మీలో మీకే తెలియని ఒక అలజడి ఉంది. మన ఇద్దరి మధ్య కనపడని ఒక అడ్డు కూడా ఉంది దాన్ని తీసేయడం ఎలా అంటూ ఆలోచిస్తుంది వేద. నిద్రపోవడం కాదు కాస్తయినా ఆలోచించండి అంటూ నిద్రపోతున్న భర్తని అంటుంది వేద.

యష్ ని చూస్తూ మురిసిపోతూ అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతుంది వేద. దోబూచులు ఆడుకుంటున్న ముత్యాలు దంపతుల్ని చూసి షాక్ అవుతుంది వేద. రాత్రి కొట్టుకున్నారు కదా అంటూ ఆ సంగతి గుర్తు చేసుకుంటుంది. బంగారం ముత్యాలు జడలో పూలు పెడతాడు. ముత్యాలు, బంగారం కోసం పాయసం చేసి తెచ్చి తినిపిస్తుంది. వాళ్లు ఇద్దరూ అలా తినిపించుకుంటూ ముత్యాలు మీకు నా మీద ప్రేమ ఉన్నా,కోపం ఉన్నా బయటికి చెప్పు అంటాడు బంగారం.

వాళ్లకు ఉన్న అన్యోన్యత మాకు లేదనుకుంటున్న వేద..

నువ్వు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది అంటాడు. చెప్పాలనే ఉంటుంది కానీ చెప్తే నువ్వు ఏమనుకుంటావో అని చిన్న భయం అంటుంది ముత్యాలు. వాళ్ళిద్దర్నీ చూసి ఆ జంటకి ఉన్న అన్యోన్యత మాకు ఎందుకు లేదు మేమిద్దరం బాగా చదువుకున్నాం, గొప్ప స్థాయిలో ఉన్నాం కానీ ఒక మనసు ఒకరు అర్థం చేసుకోలేకపోతున్నాం, మా ఇద్దరినీ ఏదో తెలియని ఫీలింగ్ ఆపుతుంది. నా ఈ ఫీలింగ్స్ ని ఎవరితో షేర్ చేసుకోవాలి, ఎందుకు ఆయనకి దగ్గర ఇవ్వలేకపోతున్నాను.

నేనే చొరవ తీసుకోవాలి కదా అనుకుంటుంది వేద. ఇదంతా సుహాసిని అక్కకి చెబుదాం ఎందుకంటే అక్కైనా ఫ్రెండ్ అయినా తనే కదా అక్క బావ అన్యోన్యత చాలా బాగుంటుంది అనుకుంటుంది వేద. సీన్ కట్ చేస్తే టిఫిన్ చేయకుండా ఆఫీస్ కి వెళ్ళిపోతున్న భర్తకి టిఫిన్ తినిపిస్తుంది సుహాసిని. భర్తని ఆఫీస్ కి పంపించటానికి అతన్ని చిన్న పిల్లాడిని రెడీ చేసినట్లుగా చేస్తుంది సుహాసిని. అంతలోనే వేద ఫోన్ చేస్తుండడంతో మీరు ఆఫీస్ కి వెళ్ళాక నేను తనకి చేస్తాను లెండి అంటూ జాగ్రత్తలు చెప్పి భర్తని పంపిస్తుంది సుహాసిని.

చెల్లెలికి సలహాలిస్తున్న సుహాసిని..

భర్త వెళ్లిపోయిన తర్వాత చెల్లెలికి ఫోన్ చేస్తుంది సుహాసిని. కొంచెం బిజీగా ఉండి నీ ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయాను అంటుంది సుహాసిని. ఏంటి అంత బిజీ అని అడుగుతుంది వేద. నాకు ఇంకేం బిజీగా ఉంటుంది మీ బావగారిని రెడీ చేసి ఆఫీస్ కి పంపించే వరకు క్షణం తీరిక ఉండదు సుహాసిని. ఆయన్ని నువ్వు రెడీ చేయడమేంటి ఆయన ఏమైనా చిన్నపిల్లడా అంటుంది వేద. ఒకరకంగా చిన్న పిల్లోడే బ్రష్ మీద పేస్ట్ వేయడం నుంచి అన్ని నేనే చేయాలి.

మన చేత సేవలు చేయించుకోవడం వాళ్లకు సరదా వాళ్లకు సేవలు చేయడం మనకు సరదా అంటూ నవ్వుతుంది సుహాసిని. నా సంగతి తర్వాత ముందు నీ సంగతి చెప్పు బాగా ఎంజాయ్ చేస్తున్నారా అంటుంది సుహాసిని. నీ గురించి చాలాసార్లు అనుకున్నాం అక్క అంటే మరోసారి వచ్చినప్పుడు కలిసి వెళ్దాంలే కానీ ఈసారి మాత్రం మీకోసమే ప్లాన్ చేసింది కదా ఏమైనా వర్కౌట్ అవుతుందా, ఒప్పందాలు, షరతులు పక్కన పెట్టి ఇద్దరు దగ్గరయ్యారా,లేదా అని అడుగుతుంది సుహాసిని.

నువ్వే చొరవ చేయాలంటున్న సుహాసిని..

అతను ఇంకా పాత జ్ఞాపకాలు నుంచి బయటపడలేకపోతున్నారు అంటుంది వేద. ఇది నీ జీవితం నీ కాపురం నువ్వే చొరవ చేయాలి. మాళవిక చేసిన గాయాన్ని నువ్వే మాన్పించాలి. ఖుషి కోసమే ఈ పెళ్లి చేసుకున్నాను అనే భావన ముందు నీ మనసులోంచి తీసేయ్, తర్వాత యశోదర్ ని బయటకు తీసుకురా, నీ మనసు, శరీరం భార్యగా మార్చేసుకో. నువ్వు మా భార్యగా మారిపోయిన సంగతి ముందుగా నీ భర్తకి తెలియజేయు.

Ennenno Janmala Bandham January 4 Today Episode

ఇప్పటిదాకా మీ ఇద్దరూ కృషి పేరెంట్స్ కానీ ఇప్పుడు మీరిద్దరూ ఒకరికి ఒకరు. భార్య గా మారవే నా బంగారు చెల్లి కొత్త బంగారులోకం మీకోసం వెయిట్ చేస్తుంది అని నవ్వుతూ ఫోన్ పెట్టేస్తుంది సుహాసిని. ఫోన్ పెట్టేసిన లేదా రాణి అని పిలుస్తుంది. ఏం కావాలి అబ్బాయి ఏమైనా అడిగాడా అని అడుగుతుంది రాణి. ఏమి చెప్పలేక అమ్మమ్మని హత్తుకుంటుంది వేద.

ఆమె కంగారుని అర్థం చేసుకున్న రాణి అర్థమైంది అబ్బాయి గురించే కదా అంటుంది. తరువాయి భాగంలో నువ్వు చెప్పినట్టే యాక్ట్ చేసాను కదా అంటాడు యష్. యాక్టింగ్ ఏంటండీ అంటుంది వేద. ఈ యాక్టింగ్ ఈ చీటింగ్ ఇవన్నీ చేశాను అంటే కేవలం నీకోసమే అంటాడు యశ్. ఆ మాటలన్నీ వెనకనుంచి రాజా దంపతులు విని షాక్ అవుతారు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జనవరి 4, 2023 at 12:46 సా.