Ennenno Janmala Bandham January 5 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో కంగారుపడుతున్న వేదని నన్ను ఏమైనా అడగాలా అని బుజ్జగిస్తుంది రాణి. అర్థమైంది నీ బాధంతా నీ భర్త గురించే కదా తనకి ఏదో చెప్పాలనుకుంటున్నావ్ అతను ఏదో చెప్తే వినాలి అనుకుంటున్నావు. కానీ ఏదో తెలియని వీడియో అంతేనా అంటుంది రాణి. ఈ బిడియం ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకి కూడా ఉంటుంది.
మనవరాల్ని తగ్గమంటున్న రాణి..
కానీ వాళ్ళు బయటపడరు అంతే అంటుంది రాణి. మీ తాతయ్య కూడా అంతే అయినా నేనే చొరవ తీసుకొని అడిగేదాన్ని. చాలా సందర్భాల్లో మనమే దూసుకుపోవాలి, సముదాయించాలి, నీ భర్తే కదా తగ్గితే తప్పేంటి, ఒక భార్యలో ఒక తల్లి కూడా ఉండాలి. మన బిడ్డని ఎలాగైతే బొజ్జగిస్తామో,భర్తని కూడా అలాగే బుజ్జగించాలి. బిడ్డ దగ్గర లేని భర్త దగ్గర ఎందుకు.
భార్య భర్త కి ఎడమవైపు ఉండాలి అంటారు ఎందుకో తెలుసా ఆ గుండె చప్పుడు వినేది భార్య కాబట్టి, చాలామంది భార్యాభర్తలకి పెద్దపెద్ద గొడవలు ఉండవు, చిన్న చిన్న మనస్ఫూర్తిగా ఉంటాయి నాలాగా అంటుంది రాణి. దాంపత్యంలో ఒకరికి ఒకరు ఓటమి ఉండదు ఇద్దరూ సమానమే. కాపురంలో ఉండవలసింది ఓర్పు, నువ్వే ఒక మెట్టు దిగు, తను నీ భర్త ఏ కదా నువ్వు చెప్పాలనుకున్నది చెప్పు.
చాలా థ్రిల్లింగ్ గా ఉంది అంటున్న వేద..
నువ్వు మనసు విప్పి మాట్లాడితే వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేం అది నీకే సొంతం అంటూ మనవరాలికి హితబోధ చేస్తుంది రాణి. సీన్ కట్ చేస్తే తన భర్తకి లవ్ లెటర్ రాయడానికి ప్రయత్నిస్తూ చాలా సిగ్గు పడిపోతుంది వేద. చాలా గమ్మత్తుగా థ్రిల్లింగ్ గా ఉంది అనుకుంటుంది. ఈ లవ్ లెటర్ చదివితే ఆయన కూడా ఇలాగే ఫీలవుతారేమో అనుకుంటుంది. అయినా తను లవ్ లెటర్ రాయడం ఏంటి అనుకుంటుంది.
మళ్ళీ తనలో తానే రాస్తే తప్పేంటి తను నా భర్త నా సొంతం అనుకుంటుంది. మనం పెళ్లి చేసుకునేటప్పుడు ఒప్పందం ఓకే కానీ ఇప్పుడు చాలడం లేదు, అంతకుమించి ఏదో కావాలనిపిస్తుంది. నాకు ఇప్పుడు తల్లి స్థానం మాత్రమే కాదు భార్య స్థానం కూడా కావాలి. దంపతులుగా మనిద్దరం ఒకటి కావాలి అంటూ రాస్తుంది. కానీ అలా రాసినందుకు చాలా ఎగ్జైట్ అయిపోతుంటుంది.
అయోమయంలో పడ్డ వేద..
అది సిగ్గో, సంతోషమో తెలియక కన్ఫ్యూజ్ అవుతుంది. అసలు ఈ మాట మీరు చెప్పాలి నేను వినాలి కానీ మనలో ఎవరు చెప్తే ఏంటి, మన ఇద్దరిలో మీరు కొంచెం ఎక్కువ సమానం అంట మా అమ్మమ్మ అక్క చెప్పారు. మన గతాన్ని పక్కన పెడదాం. మా అక్క అన్న ఒక మాట నాకు నచ్చింది. ఒక కొత్త బంగారులోకం లోకి వెళ్దాం. అలా వెళ్తే బాగుంటుంది కదా అంటూ లెటర్ రాసి చెప్పాలనుకున్నది చెప్పేసాను అంటూ రిలాక్స్ ఫీల్ అవుతుంది వేద.
మళ్లీ తనలో తానే ఏదో మిస్ అయింది ఇంకా రాయవలసిందేదో రాయలేదు అనిపిస్తుంది ఏంటది అని అనుకుంటుంది వేద. అదేంటో గుర్తొచ్చిన వేద అసలు లవ్ లెటర్ లో రాయవలసినది రాయలేదు అంటూ తనని తానే తిట్టుకొని లెటర్ చివరన ఐ లవ్ యు రాస్తుంది. లెటర్ రాయడం పూర్తయిన తర్వాత ఆనందంతో జంతువులు వేస్తుంది వేద. లెటర్ ని కంప్లైంట్ బాక్స్ లో వేస్తూ ఈ లెటర్ చదివి ఆనందంతో పొంగిపోతారు.
ఊహల్లో తేలిపోతున్న వేద..
ఆనందంతో నన్ను ఎత్తుకొని గిరగిరా తిప్పుతారు అంటూ సంతోష పడుతుంది వేద. అంతలోనే రావడం గమనించి ఆ లెటర్ ఆ బాక్స్ లో వేసేసి వెళ్ళిపోతుంది. తను రాసిన లెటర్ ని తీసుకుంటాడు యష్. బయట వేద ఈపాటికి ఆయన నా లెటర్ చదివి ఉంటారు హ్యాపీ ఉంటారు నీది నాది సేమ్ ఫీలింగ్ అని తన సంతోషాన్ని నాతో షేర్ చేసుకుంటారు. లోపల యష్ ఆ లెటర్ తీసి చదివిలోపు ఏదో ఫోన్ వస్తుంది.
ఆ లెటర్ ని అక్కడే పెట్టేసి ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్లిపోతాడు యష్. బయట వేద మాత్రం చాలా హ్యాపీగా యష్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. బయటికి వచ్చిన యష్, వేద చూసి తన దగ్గరికి వస్తాడు. ఇప్పుడు నీతో పాటు మీ అమ్మమ్మ తాతయ్య కూడా హ్యాపీ ఏ కదా అంటాడు. అవునండి చాలా హ్యాపీ అంటుంది వేద. అప్పుడే అటువైపుగా వచ్చిన రాజా రాణి అని పిలిచి వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో చూడు అంటాడు.
Ennenno Janmala Bandham January 5 Today Episode: యష్ మాటలకి షాక్ తిన్న వృద్ధ దంపతులు..
నాకు మీ అమ్మమ్మ వాళ్ళు బాగా నచ్చారు ఈ వయసులో వాళ్ళు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు అంటాడు యష్. వాళ్ళిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటాడు. అవును నాకు కూడా అలాగే మేడ్ ఫర్ ఈచ్ అదర్ కావాలని ఆశ అని మనసులో అనుకుంటుంది వేద. తరువాయి భాగంలో నేను నువ్వు కోరుకున్నట్లే యాక్ట్ చేశాను కదా అంటాడు యష్.
మీ అమ్మమ్మ తాతయ్య వాళ్ళ దగ్గర ఫుల్ మార్క్స్ కొట్టేసానని నాకు నమ్మకం వచ్చింది అంటాడు యష్.ఆ మాటలకి వేదతో పాటు వెనుకను ఉన్న రాజా దంపతులు కూడా షాక్ అవుతారు. నేను ఈ యాక్టింగ్ అంత చేశాను అంటే కేవలం నీకోసమే అంటాడు యష్.