Ennenno Janmala Bandham : ఒకరిపై ఒకరికి అభిమానం ఉన్నా దాన్ని వ్యక్తపరచుకోలేని పరిస్థితులలో కొట్టుమిట్టాడుతున్న ఒక దంపతుల కథ ఈ ఎన్నెన్నో జన్మల బంధం.

విన్నితో వేద క్లోజ్ గా ఉండడాన్ని భరించలేక పోతాడు యష్. అతని పోసెసివ్నెస్ కి నవ్వుకుంటుంది వేద. మలయాళీ అమ్మాయి లాగా ఉంటే సరిపోతుందా అంటూ మలయాళీ అమ్మాయిల్ని పొగుడుతాడు యష్. మలయాళం లో మాట్లాడి యష్ నోరు మూయిస్తుంది వేద. మరోవైపు ముగ్గుల పోటీకి బ్రమరాంబిక తో పాటు వచ్చిన మాళవిక అక్కడ మాలిని వాళ్ళందరిని చూసి కంగారుపడుతుంది.

మరోవైపు మాలిని వాళ్ళు కూడా ఇది ఎందుకు వచ్చింది అనుకుంటూ చిరాకు పడతారు. వేద ముగ్గుల పోటీలో గెలవకూడదన్న ఉద్దేశంతో ఖుషి ని పడిపోయేలాగా చేస్తుంది మాళవిక. అది చూసిన సులోచన మాళవిక కి చివాట్లు పెడుతుంది. లేదా అయితే చెంప మీద కొట్టి నా బిడ్డ జోలికి వస్తే ఊరుకునేది లేదు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. నీ బిడ్డ ఏంటి నా బిడ్డ అని మాళవిక అంటే ఆ మాటలకి షాక్ అవుతుంది భ్రమరాంబిక.

బ్రమరాంబిక కూడా మాళవిక ని మందలించకపోతే అసలు ఇదంతా నీ వల్లే అంటూ ఆమెను కూడా నానా మాటలు అంటుంది. వేద కూడా ఊరుకోకుండా కష్టం సుఖం మనం మర్యాద అన్ని ఆడదాని చేతిలోనే ఉంటాయి అవన్నీ నువ్వు జారవిడుచుకున్నావు దిగజారిపోయావు, జీవించే శవానివి నువ్వు అంటూ మాళవిక ని అక్కడినుంచి వెళ్ళిపోమంటుంది. విన్నీతో వేద క్లోజ్ గా ఉండడం గురించి అసహ్యంగా మాట్లాడుతుంది మాళవిక.

తన గురించి మాట్లాడే అర్హత నీకు లేదు అంటూ వేద గురించి గొప్పగా మాట్లాడుతాడు యష్. మరోవైపు బ్రమరాంబిక, మాళవిక కలిసి ఫంక్షన్ కి వెళ్లారు అంటే అక్కడ ఏదో భూకంపం సృష్టిస్తారు అని భయపడతాడు కైలాష్. బయటికి వెళ్తున్న అభిని ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతాడు కైలాష్. బయటికి వెళ్తున్నాను ఏమైంది అని అభి అడిగితే ఈ ఇంట్లో రాత్రి రెండు హత్యలు జరగబోతున్నాయి అంటూ టెన్షన్ గా చెప్తాడు. ఎందుకు అని అడిగితే భ్రమరాంబ గారు నిద్ర మాత్రలు తెమ్మన్నారు మాళవిక సిస్టర్ మిషన్ తెమ్మంది అంటూ వాళ్ళ ప్లాన్లు అభీతో చెప్తాడు.

దానికి పెద్దగా నవ్వుతాడు అభి. ఇద్దరూ నిన్నే కదా తెమ్మని చెప్పారు అలాంటిది నువ్వే ఇక్కడ లేకపోతే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అంటూ కైలాష్ ని కూడా తన వెంట తీసుకొని వెళ్ళిపోతాడు అభి. మరోవైపు ముగ్గులు పోటీలో వేదకి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. ఇందులో పార్టిసిపేట్ చేయటానికి నన్ను ఇన్స్పైర్ చేసింది నా బెస్ట్ ఫ్రెండ్ విని అంటూ అనౌన్స్ చేస్తుంది. నన్ను అంతగా ఇన్స్పైర్ చేసిన ముగ్గు పేరు అమ్మ తను అమ్మ తను అంటే నాకు చాలా ఇష్టం అప్పట్లో అది నేను కోరుకున్న అదృష్టం ఇప్పుడు నేను అందుకున్న అదృష్టం అంటూ ఖుషి ని చూపిస్తుంది వేద.

ఆ భగవంతుడు జీవితంలో నాకు ఇచ్చిన గొప్ప వరం అంటూ కూతుర్ని దగ్గరికి తీసుకొని కన్నీరు పెట్టుకుంటుంది. భర్తకి భోజనం తినిపిస్తున్న వేద ఏంటి అలా చూస్తున్నారు అని అడిగితే నువ్వు తప్పు చేశావు నా లైఫ్ లోకి లేటుగా వచ్చావు అంటాడు యష్. మరోవైపు బీరువాలో పెట్టిన డబ్బులు కనిపించకపోవడంతో కంగారుపడుతుంది వేద. ఆ డబ్బులు నేనే తీశాను అంటాడు యష్. నా డబ్బులు మీరెందుకు తీశారు అంటే నేనే ఇచ్చాను కదా అందుకే నేనే తీసుకుంటున్నాను ఇవి నావి అంటాడు.

ఆ డబ్బులు వేదకి ఇవ్వు అని రత్నం అంటే భార్య డబ్బులు వేరు బర్తడే డబ్బులు వేరు నా అయినా ఆడవాళ్ళ చేతిలో డబ్బు ఉంటే షాపింగులుకి ఖర్చు పెట్టేస్తారు అంటాడు యష్. యష్ దగ్గర డబ్బులు లాక్కొని వేద చేతిలో పెడుతుంది మాలిని. ఎప్పుడు వెళ్దాము అని మాలిని అంటే కాదత్తయ్య ఇది మన అపార్ట్మెంట్ బయట ఉన్న అనాధ పిల్లలకి చిన్న చిన్న గిఫ్ట్ లవి కొనడం కోసం ఈ డబ్బులు వాడుతున్నాను ఈ ఐడియా ఖుషి ఇచ్చింది అంటుంది వేద.

పెద్దవాళ్లందరూ అప్రిషియేట్ చేస్తారు. మరోవైపు పార్టీలో జరిగిన గొడవకి కోపంతో రగిలిపోతూ ఉంటారు మాళవిక, భ్రమరాంబిక. ఇంటికి వచ్చిన దగ్గరనుంచి వీళ్ళు కోపంతో రగిలిపోతున్నారు అక్కడ ఏదో జరిగింది, ఇప్పుడు వీళ్ళు ఏదో సునామి సృష్టించేలాగా ఉన్నారు అని భయపడతాడు కైలాష్. అదే సమయంలో బ్రమరాంబిక,అభిని పిలిచి నువ్వు నా తమ్ముడువి కోట్ల ఆస్తికి వారసుడివి అలాంటిది ఇద్దరు పిల్లల తల్లిని చేసుకోవలసిన కర్మ నీకేంటి.

దానికి మింగడానికి మెతుకు లేకపోయినా ఒళ్లంతా పొగరే, వచ్చే మాఘ మాసం పంచమి రోజు నీ పెళ్లి నా చేతుల మీదుగా జరిపించి నా ఆస్తి మొత్తం మీ చేతిలో పెట్టేస్తాను. మన ఆస్తికి సరిపడే అమ్మాయి, అందము అనకుగా ఉన్న అమ్మాయి కావాలో లేకపోతే మొగుణ్ణి వదిలేసిన ఇద్దరూ పిల్లల తల్లి అయినా ఈ మాళవిక కావాలో నువ్వే తెలుసుకో నీదే అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది బ్రమరాంబిక. ఆ మాటలకి అభి షాక్ అవుతాడు.

లోపల నుంచి ఈ మాటలు విన్న మాళవిక టెన్షన్ పడుతుంది. మరోవైపు పండగ పూట బాగా అలసిపోయాము రిలాక్స్ అవ్వాలి అంటూ విన్నీతో సహా రత్నం,శర్మ హాల్లోనే సిట్టింగ్ వేస్తారు. అది చూసిన మాలిని, సులోచన వాళ్ళని మందలిస్తే విన్నీ రిక్వెస్ట్ చేస్తాడు. వేద కూడా మరీ అంత స్ట్రిక్ పనికిరాదు అంటూ అమ్మని అతని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది. మరోవైపు ఆలోచనలో ఉన్న మాలిని దగ్గరికి వస్తుంది సులోచన.

ఎందుకు అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు ఏమైనా సమస్య అని అడిగితే కాదు వేద లాంటి కూతుర్ని కన్నందుకు నిన్ను చూస్తే అసూయగా ఉంది అలాంటి కూతుర్ని నేను కనలేదు అని బాధగా ఉంది అంటుంది మాలిని. పుణ్యం కొద్ది పురుషులు దానం కొద్ది బిడ్డలు అంటారు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుందో నా బిడ్డకి ఇలాంటి భర్త దొరికాడు అంటుంది సులోచన. వాళ్ళ ముగ్గురు కలిసి ఉండటం కన్నా మనకి కావలసింది ఏముంది వాళ్లది ఎన్నెన్నో జన్మల బంధం అంటుంది సులోచన.

వాళ్లదే కాదు మనది కూడా ఎన్నెన్నో జన్మల బంధమే ఎందుకంటే నీలాంటి ముద్దపప్పు దొరకడం నా అదృష్టం అని మాలిని అంటే, మీలాంటి గయ్యాళి గంప నాకు వియ్యపురాలుగా దొరకడం సామాన్యమైన విషయమా అంటూ మళ్ళీ సరదాగా గొడవకి దిగుతారు ఇద్దరు. మరోవైపు తనని ఇంకా భోజనానికి పిలవకుండా పట్టించుకోవట్లేదు అని కోపంతో మంచం ఎక్కేస్తాడు యష్. భోజనానికి రమ్మంటే నేను రాను అంటూ బెట్టు చేస్తాడు.

నీకు ఇష్టమని స్పెషల్ ఐటెం చేశాను అంటూ టెంప్ట్ చేస్తుంది వేద. ఏంటది అని అడిగితే బిర్యాని చేశాను పోనీలెండి మీరు తినకపోతే రేపు పనిమనిషికి ఇచ్చేస్తాను అంటుంది. నువ్వు నాకోసం కష్టపడి చేశావు కదా తినకపోతే మళ్లీ బాధపడతావు, నీకోసం కొంచెం తింటాను అంటూ డైనింగ్ రూమ్ కి వస్తాడు యష్. లేదా తనకి భోజనం వడ్డిస్తే నువ్వు భోజనం చేసావా అని అడుగుతాడు యష్. లేదు అంటే నువ్వు కూడా కూర్చో నేను వడ్డిస్తాను అని ఇద్దరు సంతోషంగా భోజనం చేస్తారు.

యష్ వేద కి థాంక్స్ చెప్తే ఎందుకు అని అడుగుతుంది వేద. ఫర్ ఎవరీ థింగ్ అంటాడు యష్. మరోవైపు భ్రమరాంబిక మాటలని తలుచుకొని కంగారుపడుతుంటుంది మాళవిక. ఏమైంది అని అభి అడిగితే నన్ను చంపేయి మీకోసం నేను నా భర్తని పిల్లల్ని అన్నింటినీ వదిలేసి వచ్చేసాను అలాంటిది నా ప్రాణాల్ని వదిలేయలేనా ఏడుస్తుంది. నేను చంపటానికి రెడీ కానీ నిన్ను కాదు మనిద్దరికీ మధ్య ఎవరైనా వస్తే వాళ్లని, అలాగే చావడానికి కూడా రెడీ నీతో లైఫ్ని షేర్ చేసుకోలేనప్పుడు.

నువ్వు నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నావు అని అభి అంటే నేను కాదు మన ప్రేమని అనురాగాన్ని మీ అక్క తక్కువ అంచనా వేస్తుంది అంటుంది మాళవిక. ఏనుగుని యుద్ధం చేసి గెలవలేము అంకుశంతోనే అదుపులో పెట్టాలి నేను చూసుకుంటాను అంటూ ధైర్యం చెప్తాడు అభి. మరోవైపు విన్నీ ఫోన్ చేసి తను ఇవ్వబోయే పార్టీకి వేద దంపతులు ఇద్దరినీ ఇన్వైట్ చేస్తాడు. నువ్వు పిలవటము మేము రాకపోవడం తప్పకుండా వస్తాము అంటూ ఫోన్ పెట్టేస్తుంది. అదే విషయాన్ని యష్ తో చెప్తే వెళ్ళు అంటూ ఆల్ ద బెస్ట్ చెప్తాడు.

వెళ్లి మిమ్మల్ని కూడా తీసుకొని రమ్మన్నాడు ఎల్లుండి ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేయండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వేద. మరోవైపు ఆఫీస్ కి టైం అయిపోతుంది అని హడావుడిగా రెడీ అవుతూ ఉంటాడు యష్. ఆ హడావుడిని చూసినా లేదా ఎందుకు అంతా కంగారు పడటం ప్రోగ్రాం ఏదో ముందు నాకు చెప్తే నేను అన్ని చూసుకుంటాను కదా కానీ ఏది చెప్పరు చివర్లో ఇలా హడావిడిగా కంగారు పడతారు అనుకుంటుంది వేద.

ఈయనకి మంచి డ్రెస్సు సెలెక్ట్ చేయాలి అనుకొని ఒక డ్రెస్ సెలెక్ట్ చేస్తుంది వేదం కానీ ఇదే వేసుకోమని చెప్తే ఈయన వేసుకోరు అంటూ రివర్స్ ట్రీట్మెంట్ అంటూ తనకి నచ్చని సూట్ తో కలిపి రెండు అక్కడ పెడుతుంది. ఇది బాగుంది ఇది వేసుకోండి అని భర్తతో చెప్తే నాకు అదే నచ్చింది అంటూ వేద సెలెక్ట్ చేసింది వేసుకుంటాడు. ఆ మాటలకి నవ్వుకుంటున్న వేదతో ఎందుకు నవ్వుతున్నావు అంటే తన రివర్స్ ట్రీట్మెంట్ గురించి చెప్తుంది వేద. ఇది చీటింగ్ అంటాడు యష్.

Ennenno Janmala Bandham  కథ మొత్తం అక్కడికక్కడే తిరుగుతుంది ముందుకి సాగడం లేదు, అందుకే రేటింగ్ లో కూడా వెనకబడిపోతుంది అంటున్న ప్రేక్షకులు..

నేను బట్టలు వేసుకోవాలి అని వేదని బయటికి వెళ్లిపోమంటాడు. ఆ తరువాత ఏదైనా తన టేస్ట్ నా టేస్ట్ కన్నా తన టేస్ట్ బెస్ట్ కానీ బయటపడకూడదు బెట్టుగా ఉండాలి అనుకుంటాడు. తను నామీద చాలా కేర్ తీసుకుంటుంది శ్రద్ధగా ఉంటుంది నా విషయంలో అన్ని తను అనుకున్నట్లే జరగాలి అనుకుంటుంది కానీ చివరికి ఓన్లీ ఫర్ ఖుషి అంటుంది. తనని ఎలా అర్థం చేసుకోవటం. ప్రతి ప్రశ్నకి ఒక సమాధానం ఉంటుంది అలాగే మా ప్రయాణానికి కూడా ఒక గమ్యం ఉండే ఉంటుంది అనుకుంటాడు యష్. యష్ భార్యతో పార్టీకి వెళ్తాడా? అభి మాళవిక ని పెళ్లి చేసుకుంటాడా? ఇవన్నీ తెలియాలంటే వచ్చేవారం వరకు ఆగాల్సిందే.