Ennenno Janmala Bandham March 3 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో నువ్వు మంచి కిస్ మిస్ అయిపోయావు ఏమి పర్వాలేదులే నిన్ను మిస్సయిన కిస్ వెతుక్కుంటూ వచ్చేస్తుందిలే అంటుంది సుహాసిని. మా ఆయన ఉన్నారు నాకు ఒంట్లో బాగోలేనప్పుడు ఎప్పుడూ కిస్ చేయలేదు అంటుంది సుహాసిని. నాకు మొన్న జలుబు చేసినప్పుడు ఎందుకు తీసి పెట్టలేదు అంటూ వసంత్ ని గిచ్చుతుంది చిత్ర. వెంకి పెళ్లి చావుకు వచ్చిందంట అంటాడు శర్మ.

తండ్రి ప్రాబ్లం సాల్వ్ చేస్తానంటున్న ఖుషి..

ఆ మాటలకి అందరూ నవ్వుకుంటారు. మరోవైపు తన గదిలో సిస్టర్ కి ముద్దు పెట్టినందుకు గిల్టీగా ఫీల్ అవుతుంటాడు యష్. వేదని ముద్దు పెట్టుకోవడానికి ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నాను తను నా భార్యే కదా, పెళ్లయి ఎందుకు నాకు ఈ సంకోచం. కిస్ చేయకపోతే నేను ఓడిపోయినట్లా అనుకుంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన ఖుషి ఏంటి టెన్షన్ గా ఉన్నారు నాకు చెప్తే చిటికెలో సాల్వ్ చేస్తాను అంటుంది.

ఇదేదో బాగున్నట్లుగా ఉంది అనుకొని మీ డాడీ తో ఎవరు కిస్ చేయాలని చేశారు ఇంట్లో లేడీస్ అందర్నీ కిస్ చేయాలంట అంటాడు యష్. చేసేయ్ అంటుంది ఖుషి. అయితే అందరికంటే నువ్వే నాకు ఇంపార్టెంట్ కదా అందుకని నీతోనే స్టార్ట్ చేస్తాను అని చెప్పి ఖుషి కి ముద్దు పెడతాడు యష్. ఖుషి కూడా ముద్దు పెట్టి లవ్ యు చెప్తుంది. ఇప్పుడు మీ తర్వాత మీ ఇంట్లో నాకు అంతా ఇంపార్టెంట్ అయిన పర్సెంట్ ఎవరున్నారో వాళ్ళని తీసుకొని రా అంటాడు యష్.

యష్ ప్రవర్తనికి షాకైన అతని అక్క..

ఎవరు నాకు తెలుసు నేను తీసుకొస్తాను అనుకుంటూ వెళ్ళిపోతుంది ఖుషి. తను రాగానే గట్టిగా కిస్ చేయాలి అనుకుంటాడు యష్. గదిలోకి వచ్చిన ఖుషి యష్ని పిలుస్తుంది వేదని తీసుకొచ్చినట్లుగా ఉంది అని వెనక్కి తిరిగేసరికి అక్క కనిపిస్తుంది. షాక్ అయిన యష్ ఏం చేయాలో తెలియక ఆమెకు కూడా ముద్దు పెడతాడు. యష్ ని వింతగా చూస్తూ నువ్వు తేడాగా కనపడుతున్నావు ఒంట్లో బానే ఉంది కదా అంటుంది ఆమె. బానే ఉన్నాను నువ్వు అయితే పనిలో ఉన్నట్టున్నావు వెళ్లి చూసుకో అంటాడు యష్.

అత్తయ్యని కిస్ చేసేసాను కదా నానమ్మ ఇంట్లో లేదు ఇప్పుడు ఇంట్లో మనిద్దరికీ ఇష్టమైన వ్యక్తి ఎవరు అంటే మమ్మీ ఉంటుంది ఖుషి. కరెక్ట్ వెళ్లి మమ్మీని తీసుకురా అంటాడు. ఖుషి వెళ్లి మమ్మీ డాడీ నిన్ను పిలుస్తున్నాడు అంటే అదిగో పిలుపు వచ్చేసింది కిస్ ఇస్ వెయిటింగ్ ఫర్ యు అని ఆట పట్టిస్తారు వేద సిస్టర్స్. గదిలోకి వచ్చిన తర్వాత ఎందుకు నన్ను తీసుకువచ్చావు అంటే డాడీ నేను తీసుకు రమ్మన్నాడు నీకు కిస్ పెడతాడంట అంటుంది ఖుషి. అదేం లేదు అంటూ తడబడతాడు యష్.

ఛాలెంజ్ లో గెలిచి తీరాలి అంటున్న ఖుషి..

డాడీ కిస్ చాలెంజ్ లో ఉన్నాడు అందరికీ కిస్ పెడుతున్నాడు అంటుంది ఖుషి. నువ్వంటే ఓకే కానీ నేను అవసరమా అంటుంది వేద. ఉంది, లేదు అంటూ తడబడతాడు యష్. నువ్వు కిస్ చేసి తీరాలి నువ్వు ఛాలెంజ్ లో గెలవాలి అని పట్టు పడుతుంది ఖుషి. యష్ కిస్ చేస్తాడు. ఆనందంతో చప్పట్లు కొడుతూ ఈ విషయాన్ని ఇంట్లో అందరికీ చెప్పాలి అనుకుంటూ వెళ్ళిపోతుంది ఖుషి.

మరోవైపు ఇంట్లో అందరూ కూర్చోనుంటే ఏంటి విశేషం అందర్నీ ఎందుకు రమ్మన్నావు అని వసంత్ ని అడుగుతాడు రత్నం. ఇంకేం విశేషాలు ఉంటుంది పెళ్లి ఎప్పుడు ఎంగేజ్మెంట్ చేశారు ఇంకా పెళ్లి చేయరా అని మనకి గుర్తు చేస్తున్నారు అంటుంది సులోచన. అవునా అంటూ వాళ్ళిద్దర్నీ ఆటపట్టిస్తారు ఇంట్లో వాళ్ళందరు. మీ అభిప్రాయం చెప్పండి డెస్టినేషన్ మేనేజర్ మేనేజర్ అని అడుగుతారు ఇంట్లో వాళ్ళు. రిజిస్టర్ మ్యారేజ్ అంటాడు వసంత్.

బాగా ఎమోషనల్ అవుతున్న చిత్ర..

ఆ మాటకి అందరూ షాక్ అవుతారు. మేము కొంతమందిని ఉండగా రిజిస్టర్ మేరేజ్ చేసుకోవాల్సిన అవసరం ఏమి వచ్చింది అంటుంది సులోచన. నేను ఎప్పటినుంచో చెప్పాలనుకుంటున్నా నిజం ఇప్పుడు కూడా చెప్పకపోతే నా మనసు ఒప్పుకోదు. అనాధనైనా నన్ను పెద్దమ్మ, పెదనాన్న నన్ను చేరదీసి వాళ్ళ ఇద్దరు కూతుర్లతో పాటు మూడో కూతురుగా మంచి స్థానాన్ని ఇచ్చారు. నన్ను లోకం ఎక్కడ అనాధ అంటుందో అని చెల్లెలు బిడ్డ స్థానం ఇచ్చి పెంచి పెద్ద చేశారు అంటుంది చిత్ర.

నాకు ఇద్దరు కాదు ముగ్గురు కూతుర్లు. నువ్వు మా ముద్దుల మూడో కూతురివి అంటారు శర్మ దంపతులు. మీరందరూ ఆదరించి ఎంతో చక్కగా చూసుకుంటున్నారు నా అదృష్టం అందరికీ ఉండకపోవచ్చు అందుకే పెళ్లికి ఆర్భాటం చేయకుండా ఆ డబ్బుతో ఏదైనా అనాధాశ్రమానికి డొనేట్ చేయాలనుకుంటున్నాను అంటుంది చిత్ర. నాక్కూడా చెప్పింది నేను కూడా యాక్సెప్ట్ చేశాను అంటాడు వసంత్. అందరూ వాళ్ళని అప్రిషియేట్ చేస్తారు. తను చెప్పాల్సిందంతా చెప్పేసింది నువ్వు చెప్పాల్సింది ఏమైనా ఉందా అని వసంత్ ని అడుగుతాడు విన్ని.

Ennenno Janmala Bandham March 3 Today Episode నిజం చెప్పొద్దంటున్న యష్..

నువ్వు కొత్తగా ఏం చెప్తావు వాళ్లకి నీ గురించి తెలియనిది ఏముంది, నీ గురించి మాట్లాడటానికి మేమున్నాం కదా అంటాడు యష్. వసంత్ ఏదో మాట్లాడబోతుంటే నువ్వు సైలెంట్ గా ఉండు మెల్లగా వసంత్ తో కోప్పడుతున్నట్లుగా చెప్తాడు. వేద కన్ఫ్యూజ్డ్ గా మొహం పెడుతుంది. నువ్వు చెప్పు చిత్ర అంటాడు యష్. మరి సిస్టర్ మ్యారేజ్ కి మీరందరూ ఒప్పుకున్నట్లే కదా అంటుంది చిత్ర. పెళ్ళి వరకు మీ ఇష్టం కానీ రిసెప్షన్ గ్రాండ్ గా మేము ఇస్తాము ఇది మా ఇష్టం అంటుంది వేద.

అవును కరెక్ట్ గా చెప్పావు పెళ్లికి ముందు వెనక అరేంజ్మెంట్స్ అన్నీ మావే అంటుంది సుహాసిని. అరేంజ్మెంట్ సంగతి నాకు వదిలేయండి అదరగొట్టేస్తాను అంటాడు విన్ని. భాజా భజంత్రీలతో గ్రాండ్ గా రిజిస్టర్ ఆఫీస్ కి వస్తారు వేద ఫ్యామిలి. తరువాయి భాగంలో వీళ్ళకి పెళ్లికి లేదు అబ్జెక్షన్ ఏమి లేవు కదా అని అడుగుతాడు రిజిస్టార్. లేవు అని చెప్తాడు అసలు అతని అసిస్టెంట్. కానీ లీగల్ అధ్యక్షుడు ఉంది అంటూ ఒక లాయర్ అక్కడికి వస్తాడు. లీగల్ అబ్జెక్షన్ పెట్టింది ఎవరు అని అడుగుతాడు యష్. బయట ఉన్నారు అంటాడు అతను.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on మార్చి 3, 2023 at 11:19 ఉద.